Asad
-
సిరియాతో టచ్‌లోనే అమెరికా.. బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు
జోర్డాన్: సిరియాలో తిరుగుబాటుదారుల మొహమ్మద్ అల్ బషీర్ ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. సిరియా ప్రజల కోసం ఇతర పార్టీలతో కూడా అమెరికా చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.ఆంటోని బ్లింకెన్ జోర్డాన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సిరియాతో కొత్త ప్రభుత్వంతో బైడెన్ టచ్‌లో ఉన్నారు. బషీర్ ప్రభుత్వం సహా ఇతర పార్టీలతో మేము చర్చలు జరుపుతున్నాం. సిరియా ప్రజలకు సాయం చేసేందుకు అమెరికా సిద్దంగా ఉంది. పాలనలో బషీర్ ప్రభుత్వం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. ఇదే సమయంలో తాము సిరియా అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.మరోవైపు.. జోర్డాన్ విదేశాంగ మంత్రి అమాన్ సఫాది మాట్లాడుతూ.. సిరియాలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం మాకు ఇష్టం లేదు. బషీర్ పాలనలో సిరియా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్.. దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అసద్ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్ సిరియాను వదిలివెళ్లిన తర్వాత అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం, తిరుగుబాటుదారుల మద్దతుతో అల్ బషీర్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. -
సిరియా సంక్షోభం..ఆర్మీకి ట్రంప్ కీలక సూచన
వాషింగ్టన్:సిరియా సంక్షోభంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిరియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఈ వ్యవహారానికి అమెరికా సైన్యం దూరంగా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో తాజాగా ఓ పోస్టు చేశారు.సిరియా అధ్యక్షుడు అసద్ అమెరికా సాయానికి అర్హుడు కాదని పేర్కొన్నారు. తాజాగా సిరియాలో సంకక్షోభం ముదిరి రెబెల్స్ అక్కడి కీలక హోమ్స్ నగరాన్ని ఆక్రమించారు. ఈ పరిణామంతో అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అసద్‌కు ఇరాన్, రష్యా మద్దతుండడం గమనార్హం.అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా సిరియా అంతర్యుద్ధంపై స్పందించారు. తమ ప్రభుత్వం సిరియా వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ శనివారం(డిసెంబర్ 8)నోట్రె డ్యామ్ చర్చి ప్రారంభానికి ప్యారిస్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సిరియాలో కల్లోలం దేశం వీడిన అధ్యక్షుడు -
కుమారుడి సమాధి పక్కనే అతీక్ ఖననం.. పటిష్ఠ భద్రతతో అంతిమయాత్ర
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని కసారి మసారి శ్మశాన వాటికలో ఇద్దరిని ఖననం చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ, అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసు, ఆర్‌ఎఎప్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే శ్మశాన వాటికలో అతీక్ కుమారుడు అసద్‌ను కూడా ఖననం చేశారు. ఆ సమాధి పక్కనే తండ్రిని ఖననం చేశారు. అతీక్ తల్లిదండ్రులను సమాధులు కూడా ఇదే శ్మశానవాటికలో ఉన్నాయి. Uttar Pradesh | Bodies of mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed brought to Kasari Masari burial ground in Prayagraj where they will be buried. They were shot dead yesterday, in Prayagraj, by three shooters while they were surrounded by bevy of police… pic.twitter.com/kqtaWfy9ir — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2023 శనివారం రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన అతీక్, అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా, పోలీసుల ఎదుటే ముగ్గురు యువకులు వీరిపై తుపాకులతో దాడి చేసి పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. అనంతరం ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా.. పేరు ప్రఖ్యాతుల కోసమే తాము అతీక్, అతని సోదరుడ్ని అందరిముందే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. వీరు ఏం పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసయల్యారని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
అసద్ అంత్యక్రియలు .. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియుల ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల అసద్‌ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఝాన్సీలో గురువారం ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని కూడా ఈ ఎన్కౌంటర్లో హతమార్చారు. అనంతరం అసద్ భౌతికకాయాన్ని పోలీసులే ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. అంత్యక్రియల్లో అతికొద్ది మంది బంధువులే పాల్గొన్నారు. కాగా.. తన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతిఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్ కోర్టును కోరగా అతనికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో కుమారుడిని కడసారి చూసుకోలేకపోయానని అతడు మనోవేధనకు గురైనట్లు తెలుస్తోంది. ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ 50 రోజులు పరారీరో ఉన్నాడు. అయితే తన తండ్రిని పోలీసులు అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ తరలిస్తున్నారని తెలిసి అతడ్ని తప్పించేందుకు ప్లాన్ చేసి దొరికాడు. ఈ క్రమంలో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా? -
తండ్రిని తప్పించేందుకు ప్లాన్ చేసి.. చావును కొనితెచ్చుకున్న అసద్..!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను యూపీ పోలీసులు గురువారం ఉదయం ఎన్కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తన తండ్రిని అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించే సమయంలో పోలీస్ కాన్వాయ్‌పై దాడి చేసి అతడ్ని తప్పించాలని అసద్ ప్లాన్ చేశాడని చెప్పారు. దీని కోసమే అతడు కొద్ది రోజులుగా ఝాన్సీలో మకాం వేసినట్లుపేర్కొన్నారు. అతిఖ్ గ్యాంగ్ పోలీస్ కాన్వాయ్‌పై దాడి చేసి అతడ్ని తప్పించవచ్చని నిఘా వర్గాలు కచ్చితమైన సమాచారం అందించాయని యూపీ అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అందుకే అతిఖ్‌ను తీసుకెళ్లే మార్గాన్ని జల్లెడపట్టినట్లు వివరించారు. తనను ఎన్కౌంటర్ చేస్తారేమోనని భయంగా ఉందని అతిఖ్ అహ్మద్ పదే పదే చెప్పడంతో తన తండ్రిని ఎలాగైనా తప్పించాలని అసద్ భావించాడని, అందుకే ఎంతటి చర్యకైనా పాల్పడేందుకు సిద్ధపడ్డాడని అధికారులు చెప్పారు. ఈ దాడికి పథకం పన్నేందుకు కాన్వాయ్ వెళ్లే మార్గంలో అసద్ ఝాన్సీలో రెక్కీ కూడా నిర్వహించాడని పేర్కొన్నారు. మార్చి చివర్లోనే ఝాన్సీలో అసద్ కదలికలను యూపీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పసిగట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వెంటనే ఆ జిల్లాకు వెళ్లి పలువురిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పాయి. గత వారం కూడా అసద్ ఝాన్సీలో ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం 50 రోజలకుపైగా గాలించారు. అయితే తండ్రిని కాపాడడం కోసం ప్రయత్నించి అతడు ఊహించని విధంగా పోలీసుల చేతికి చిక్కి ఎన్కౌంటర్లో హతమయ్యాడు. గురువారం ఉదయం అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. అతడ్ని కిలోమీటర్ పాటు వెంబడించిన అనంతరం పోలీసులపై కాల్పులకు పాల్పడటంతో షూట్ చేసి చంపారు. కుమారుడు ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలిసి తండ్రి అతిఖ్ అహ్మద్ కన్నీటిపర్యంతమయ్యాడు. తన వల్లే కొడుకు చనిపోయాడని వాపోయాడు. చదవండి: ఉత్తర ప్రదేశ్‌లో సంచలన ఎన్కౌంటర్: కోర్టుకు అతిఖ్.. అదే టైంలో కొడుకు ఎన్కౌంటర్ -
T20 WC: కల నెరవేరింది... భావోద్వేగానికి గురైన ఆటగాళ్లు...
PNG cricketers, support staff break down; ప్రపంచ వేదికపై మెరిసే అద్భుత క్షణాల కోసం ఎదురుచూసిన ఆ జట్టుకు ఎట్టకేలకు అవకాశం లభించింది... ఏళ్ల నాటి కల నేటితో నెరవేరింది. అందుకే మెగా టోర్నీలో తమ జాతీయ గీతం వినిపించగానే భావోద్వేగంతో అందరి కళ్లు చెమర్చాయి. క్రికెట్ పండుగ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగా... ఈ ఈవెంట్‌కు తొలిసారిగా అర్హత సాధించిన పపువా న్యూగినియా జట్టు, సిబ్బంది గురించే ఈ ప్రస్తావన. గ్రూపు-బీలో ఉన్న పపువా న్యూగినియా.. ఆదివారం మొదలైన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఒమన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలుత పపువా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. దీంతో... ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్... పపువాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కెప్టెన్ అసద్ వాలా(56) టోర్నీలో మొదటి అర్ధ శతకం సాధించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 : ఒమన్ జట్టులో హైదరాబాదీ క్రికెటర్.. -
వావ్.. వెడ్డింగ్...
సాక్షి, సిటీబ్యూరో: టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా పెళ్లి వేడుకలు ముగిసినా ఆ ఈవెంట్ పార్టీ ప్రియులకు హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ఈ వారంలోజరిగిన సిటీ పార్టీల్లో వీరి పెళ్లి సంబరాలే హైలెట్‌గా నిలిచాయి. మాజీ భారత క్రికెట్ కెప్టెన్అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో ఆనమ్ గత బుధవారం జోడి కట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గత వారం సిటీలోని పార్టీ సర్కిల్ మొత్తం ఈ పెళ్లి వేడుక విశేషాల గురించి ఆసక్తిగా చర్చించుకుంది. ఈ పెళ్లి సంబరాలలో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుకలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వధూవరులిద్దరూ నగరానికి చెందిన టాప్ స్పోర్ట్స్ సెలబ్రిటీల కుటుంబానికి చెందిన వారు కావడం, ఈ వేడుకకు సిటిజన్లు పెద్ద సంఖ్యలో హాజరవడం... వంటి కారణాలతో పాటు ఆనమ్ మీర్జా కూడా నగరంలోని పార్టీ సర్కిల్లో, ఎక్స్‌పోల నిర్వహణల ద్వారా తనదైన గుర్తింపు తెచ్చుకోవడం వంటివి కూడా ఈ పెళ్లి వేడుకపై ఆసక్తిని బాగా పెంచాయి. అంతేకాకుండా టెన్నిస్ స్టార్ సానియా సంగీత్ సందర్భంగా తను, తన కుటుంబసభ్యులకు సంబంధించి షేర్ చేసిన అదరిపోయే చిత్రాలు ఈ పెళ్లి వేడుకపై క్రేజ్‌ని అమాంతం ఆకాశానికి పెంచేశాయి. అలాగే గతంలో ఆనమ్ బాచిలర్ పార్టీ కూడా ఇచ్చారు. సోషల్‌లో హల్చల్... ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఆనమ్ అసద్‌ల పెళ్లి ఫొటోల షేరింగ్స్‌తో హోరెత్తింది. తాము సంప్రదాయబద్ధంగా వధూవరులమైనట్టు ప్రకటిస్తూ అంటూ ఆనమ్ తానే స్వయంగా ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో మిస్టర్ అండ్ మిస్ట్రెస్ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్లు లైక్స్, కంగ్రాట్స్ కురిపించారు. అలాగే అసద్ కూడా తమ ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తూ ఫైనల్లీ మ్యారీడ్ ది లవ్ ఆఫ్ మై లవ్ అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. ఈ పెళ్లికి అటెండ్ అయిన సిటీలోని ప్రముఖులు అందరూ పెళ్లి వేడుకలో తమ సందడి ఫొటోలను పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ అయిన సానియా మీర్జా తన సోదరి పెళ్లి తాలూకు ఫొటోలను ఇంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. స్టైల్స్...అదరహో... మరోవైపు ఈ వేడుకల్లో ఆనమ్ ధరించిన దుస్తులు, ఆభరణాలు స్టైల్స్‌కి కేరాఫ్‌గా ఉండడంతో మరింతగా ఈ వేడుక టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. బీగ్, గోల్డ్ షెర్వాణి తదితర దుస్తులతో అసద్, హెవీ ఎత్నిక్ దుస్తులు,పెళ్లి రోజున లావెండర్ అవుట్ ఫిట్. హవీ చోకర్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, మ్యాంగ్ టిక్కా తదితర వెరైటీ ఆభరణ శైలులతో ఆనమ్... నగరంలోని ఫ్యాషన్ ప్రియుల కంటికి, నోటికి పూర్తిగా పని కల్పించారు. -
వైభవంగా సానియా మీర్జా సోదరి వివాహం
-
‘ఆ దేవుడి దయతోనే ఇదంతా జరిగింది’
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహాం బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ టీమిండియా కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్‌తో ఆనం వివాహాం బుధవారం జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వంకాయ రంగు లెహెంగా ధరించిన ఆనం పక్కనే అసద్ బంగారు రంగు షెర్వానీ ధరించి నిలుచుని ఉన్న ఫోటోలను ఆనం తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. వారిద్దరు కలసి ఉన్న చిత్రానికి ‘మిస్టర్ అండ్ మిసెస్’ అంటూ హ్యష్ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్ చేశారు ఆనం మీర్జా. View this post on Instagram Mr and Mrs 🥳 #alhamdulillahforeverything #AbBasAnamHi 📷 @weddingsbykishor @daaemi A post shared by Anam Mirza (@anammirzaaa) on Dec 11, 2019 at 3:55pm PST ఇక ఆనం షేర్ చేసిన తన వివాహ వేడుక ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త జంటను చూసి నెటిజన్లంతా ఫిదా అవుతూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని ఇక పెళ్లి కూతురు డ్రెస్‌లో ఉన్న ఆనంను చూసి ‘చాలా అందంగా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే సానియా తన సోదరి మెహందీ, ప్రీ వెడ్డింగ్ వేడుక ఫోటోలను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. మెహందీ వేడుకలో సానియా నల్లటి, ఎరుపు రంగు దుస్తులను ధరించగా.. ఆమె సోదరి కలర్ ఫుల్ లెహెంగాలో కలిసి దిగిన ఫోటోలో వారిద్దరు అదంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాకిస్తాన్‌కు భారీ ఆధిక్యం
లండన్: బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడటంతో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధశతకాలు నమోదు చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 8 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉన్న పాక్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 50/1తో శుక్రవారం ఆట కొనసాగించిన పాక్‌కు హారిస్ సోహైల్ (39; 5 ఫోర్లు), అజహర్ అలీ (50; 6 ఫోర్లు), అసద్ షఫీక్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (68 రిటైర్డ్ హర్ట్; 10 ఫోర్లు) షాదాబ్ ఖాన్ (52; 6 ఫోర్లు), ఫహీమ్ అష్రఫ్ (37; 7 ఫోర్లు) భారీ స్కోరు అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్ మూడేసి వికెట్లు పడగొట్టారు. -
రుణదాతల నుంచి తప్పించుకోబోయి..
రుణదాతలు వెంటపడడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ప్రమాదానికి దారి తీసింది. అచ్చం సినీ ఫక్కీలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పాతబస్తీకి చెందిన అసద్, సాదిక్ బార్కాస్ నుంచి మెహదీపట్నవైపు వెళ్తున్నారు. దుర్గానగర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే వారిని చూసిన ఇద్దరు రుణదాతలు బైక్‌పై వెంబడించారు. దీంతో బైక్ వేగాన్ని పెంచిన యువకులు బాబుల్‌రెడ్డినగర్ గ్రాండ్ ఫంక్షన్‌హాల్ ముందు యూటర్న్ చేయబోతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ లారి కింద కు వెళ్లింది. కాగా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. -
బీజేపీతో ఎంఐఎం మిలాఖత్
టీపీసీసీ మైనారిటీ సమ్మేళనంలో దిగ్విజయ్‌సింగ్ మండిపాటు అసద్, అక్బర్.. మీరు మోదీతో చేతులు కలిపారా? మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటేయలేదు? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం మైనారిటీలకు రిజర్వేషన్ ఘనత వైఎస్సార్‌దే: కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హైదరాబాద్: ‘‘మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష రోజు ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అభ్యర్థులను వెదుకుతు న్నారు. ఎంఐఎం బీజేపీతో మిలాఖత్ అయ్యిం దా..? అసద్, అక్బర్.. మీరు మోదీతో చేతులు కలిపారా...’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్ర శ్నించారు. ఆదివారమిక్కడ టీపీసీసీ మైనారిటీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత మత తత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని చెప్పారు. ఎంఐ ఎంతో కొద్ది రోజులు కలసి ఉన్నా.. ఇప్పు డా పరిస్థితి లేదని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాం గ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించా రు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విషయంలో చొరవ తీసుకుని అన్ని డివిజన్లలో అభ్యర్థులను పోటీకి నిలపాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. డిసెంబర్ 9 నుంచి 16 దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని శ్రేణులకు సూచించారు. మైనారిటీలకు రిజర్వేషన్ ఘనత వైఎస్‌దే.. ‘‘మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చొరవ తీసుకున్నారు. వైఎస్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు మీరే మార్గదర్శకంగా నిలిచారు. ఈ దేశ హిందూ సోదరులే మనకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారన్న విషయం మరవకూడదు..’’ అని కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం మతతత్వ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం ముస్లింలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూశాయని, కాంగ్రెస్ అలా కాదని పేర్కొన్నారు. ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్ మాట్లాడుతూ.. పదేళ్ల యూపీఏ పాలనలో మైనారిటీల కోసం ఎంతో చేసిందన్నారు. ‘‘కాంగ్రెస్... పాముకు పాలు పోసి పెంచింది. కానీ అదే పాము మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్‌ను కాటేసింది..’’ అని ఎంఐఎం పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కింది స్థాయి వరకు తీసుకుపోలేక పోయామని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పేర్కొన్నారు. శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత డి.శ్రీనివాస్ ప్రసంగిస్తూ... ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ అంటున్నారని, కానీ అది సాధ్యం కాదని పేర్కొన్నారు. ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ ఎలా తీసేద్దామా అని మోదీ చూస్తున్నారని, 12 శాతం రిజర్వేషన్ అంటూ కేసీఆర్ ఇటు ముస్లింలను, అటు ఎస్టీలను ఇరికించారని విమర్శించారు. వైఎస్ వల్లే ఉన్నత చదువులు: ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు కావడం వల్లే ఉన్నత చదువులు సాధ్యమయ్యాయని, ఇది వైఎస్ పుణ్యమేనని పలువురు విద్యార్థులు మైనారిటీ సమ్మేళనంలో చెప్పారు. రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది, కాంగ్రెస్‌తో సంబంధం లేని విద్యార్థులతో ఈ సమ్మేళనంలో మాట్లాడించారు. షాదన్ కాలేజీలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన నజియా అనే విద్యార్థి మాట్లాడుతూ... మైనారిటీలకు రిజర్వేషన్ వైఎస్సార్ వల్లే సాధ్యమైందని పేర్కొనడంతో సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికే ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన నల్లగొండ జిల్లా వలిగొండకు చెందిన సలీం కూడా రిజర్వేషన్ వల్ల జరిగిన మేలును వివరించారు. ఆ తర్వాత ప్రసంగించిన ముఖ్య నేత లు కూడా వైఎస్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సిరాజుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ప్రసంగించారు. -
మేమంతా ఇక్కడి వారమే...
* పాకిస్థానీయులు అనడం సరైంది కాదు * గాజాపై ఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టాలి * హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్: ‘మేమంతా ఇక్కడి వారమే... మమ్మల్ని పాకిస్థానీయులు అనడం సరైంది కాదు... అసద్ పాకిస్థాన్‌కు వెళ్లూ అంటున్నారు బీజేపీ వారు... మా తాత ముత్తాతలు ఇక్కడి వారే... నేనెందుకు పాకిస్థాన్‌కు వెళ్తాను... ఈ దేశం బీజేపీ వారి జాగీరా... హమారా బాప్, దాదేకా జాగీర్ హై... అప్పట్లో పాకిస్థాన్‌కు వెళ్లిన వారు వెళ్లిపోయారు... ఉన్న వాళ్లంతా ఇక్కడి వారే... ముస్లింలపై కామెంట్ చేస్తున్న బీజేపీ ఎంపీలందరికి ట్రైనింగ్ ఇవ్వూ ప్రధాని నరేంద్ర మోడీ’... అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ, శివసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలోని ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని మక్కా మసీదులో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో యౌముల్ ఖురాన్ పఠన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ... పార్లమెంటులో తానెప్పుడు లేచి మాట్లాడానికి ప్రయత్నించినా బీజేపీ ఎంపీలు అడ్డుకొని ఏ పాకిస్థానీ బైఠో...(ఓ పాకిస్థానీ కూర్చో) అంటూ వెటకారం చేస్తారని... అందుకే వారికి కనువిప్పు కలిగే విధంగా జవాబు ఇస్తానన్నారు. అమెరికా ప్రోద్బలంతోనే ఇజ్రాయిల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోందని... దీనిని ప్రతి ముస్లిం ఖండించాల్సిన అవసరముందన్నారు.