రుణదాతలు వెంటపడడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ప్రమాదానికి దారి తీసింది.
రుణదాతలు వెంటపడడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ప్రమాదానికి దారి తీసింది. అచ్చం సినీ ఫక్కీలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పాతబస్తీకి చెందిన అసద్, సాదిక్ బార్కాస్ నుంచి మెహదీపట్నవైపు వెళ్తున్నారు. దుర్గానగర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే వారిని చూసిన ఇద్దరు రుణదాతలు బైక్‌పై వెంబడించారు. దీంతో బైక్ వేగాన్ని పెంచిన యువకులు బాబుల్‌రెడ్డినగర్ గ్రాండ్ ఫంక్షన్‌హాల్ ముందు యూటర్న్ చేయబోతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ లారి కింద కు వెళ్లింది. కాగా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు.