వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న హ్యూండై ఎక్సెంట్ కారు(టీఎస్ 07 యూసీ 3905) అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వచ్చే వాహనాల మధ్యలో ఎగిరి పడింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.