outer ring road
-
ఔటర్ చుట్టూ హౌసింగ్ కాలనీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం అందుబాటు ధరల్లో ఉండే గృహాలను నిర్మించేందుకు గృహనిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) సిద్ధమైంది. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా కేపీహెచ్‌బీ వంటి భారీ హౌసింగ్ కాలనీలను రూపొందించిన బోర్డు.. ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ కాలనీలు నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి ఏపీ సమయంలో 2013లో హైదరాబాద్ శివార్లలోని రావిర్యాలలో విల్లాల నిర్మాణమే హౌసింగ్ బోర్డు చివరి ప్రాజెక్టు కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. సుమారు పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడుతోంది. హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించేందుకు పాలసీని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పాలసీ ఎలా ఉండాలి, తక్కువ ధరలో ఇళ్లు అందుబాటులో ఉంచేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇళ్ల నమూనాలు, ఖర్చును తగ్గిస్తూ మన్నికను పెంచేందుకు వినియోగించే ఆధునిక పరిజ్ఞానం తదితర అంశాలపై సూచనల కోసం కన్సల్టెన్సీని నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ బోర్డు బుధవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28న టెక్నికల్ బిడ్లు, మార్చి 3న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనుంది. సిటీలో భూములు అమ్మి.. హైదరాబాద్ నగరంలోపల కాలనీలను నిర్మించాలంటే భారీ వ్యయం అవుతుంది. ఇళ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనితో అందుబాటులో ఇళ్ల ధరలు ఉండేలా.. ఔటర్ రింగురోడ్డు చుట్టూ కాలనీలు నిర్మించాలని, అవి శాటిలైట్ టౌన్‌షిప్‌ల తరహాలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో వందల ఎకరాల స్థలాలు ఉన్నాయి. కానీ వాటిలో దాదాపు 1,200 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు కూడా బోర్డు ఆ«దీనంలో ఉన్నాయి. ఇందులో ఖరీదైన ప్రాంతాల్లోని భూములను వేలం వేసి, ఆ నిధులతో శివార్లలో భూములు సేకరించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి.. ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు అమలు చేసిన విధానాలు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. పలు రాష్ట్రాలు వీటిని అనుసరించాయి కూడా. అయితే అనంతర కాలంలో రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు నామమాత్రంగా మారగా.. ఇతర రాష్ట్రాల్లో పురోగతి సాధించాయి. ఈ క్రమంలో కన్సల్టెన్సీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి, అనుసరించదగిన అంశాలను సూచించనుంది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు వద్ద నిధులు లేవు. అయితే వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నందున.. వాటిని తనఖా పెట్టి హడ్కో వంటి సంస్థల నుంచి రుణం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ నిధులతో కాలనీల నిర్మాణం చేపట్టనుంది. అపార్ట్మెంట్ల నిర్మాణానికి చాన్స్.. గతంలో హౌసింగ్ బోర్డు రూపొందించిన కాలనీల్లో 80శాతం వ్యక్తిగత ఇళ్లే. అప్పట్లో వాటికే డిమాండ్ ఉండటంతో అవే నిర్మించింది. ఎల్ఐజీ కేటగిరీలో మాత్రం అల్పాదాయ వర్గాల కోసం క్వార్టర్ల రూపంలో ఇళ్లను నిర్మించింది. ఇప్పుడు భూముల ధరలు అధికంగా ఉన్నందున వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం కాకుండా.. విస్తృత స్థాయిలో అపార్ట్మెంట్లనే నిర్మించే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే.. ఔటర్ రింగు రోడ్డును నిర్మించిన తర్వాత దాని చుట్టూ శాటిలైట్ టౌన్íÙప్స్ నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ నగరంపై జనాభా ఒత్తిడి తగ్గుతుందని భావించి, టౌన్íÙప్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఆయన అకాల మరణంతో అమల్లోకి రాలేదు, తర్వాతి ప్రభుత్వాలేవీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఆలోచనతో కసరత్తు ప్రారంభించింది. -
ఓఆర్ఆర్.. నేరాలకు అడ్డా
మేడ్చల్‌రూరల్: హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు( Outer Ring Road) నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ ఇరువైపులా దాని పరిధిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. దీనికితోడూ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లులో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రుల్లో చీకటిగా ఉండడంతో ఇదే అదునుగా కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. కానరానీ సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు.. ⇒ ఓఆర్ఆర్ ప్రధాన రహదారిలో ప్రభుత్వం విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసింది. కానీ సర్వీస్‌రోడ్డులో మాత్రం చిన్నపాటి లైట్లు కూడా లేవు. దీంతో పాదచారులు, సమీప గ్రామాల వారు రాత్రి వేళల్లో సర్వీస్‌రోడ్డు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ అండర్ పాస్ బ్రిడ్జిల కింద ప్రేమికులు, వివాహేతర సంబంధాలు గల వారు రాత్రి వేళల్లో ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్స్టేషన్ల పరిధిలో సర్వీస్‌రోడ్డు ఉండడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైతం నిఘా పెట్టకపోవడంతో వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. ⇒ గతంలో మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ చౌరస్తా సమీపంలోని సర్వీస్‌రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు పెరిగి నిర్మానుష్య ప్రదేశంగా మారడంతో కొందరు వ్యభిచారులు పట్టపగలే చెట్లపొదల చాటున తమ దందా సాగించారు. ఇదే విషయమై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించగా పోలీసులు వాటికి అడ్డుకట్ట వేశారు. కొన్ని నెలల పాటు పెట్రోలింగ్ చేయడంతో ఆగినా.. ప్రస్తుతం సర్వీస్ రోడ్డులో పోలీసుల లేకపోవడంతో పోకిరీలు మళ్లీ రెచ్చిపోతున్నారు.సీసీ కెమెరాలు లేక నానాతంటాలు..మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఒక్క చోట కూడా సీసీ కెమెరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సరీ్వస్ రోడ్డులో ఏ ప్రమాదం, నేరాలు జరిగినా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు దర్యాప్తులో కీలంగా వ్యవహరించే సీసీ కెమెరాలు లేక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈనెల 24న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు పక్కన కల్వర్టు కింద జరిగిన దారుణ హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు మూడు రోజుల పాటు శ్రమించాల్సి వచి్చంది. చివరకు హత్యకు గురైన మహిళ చేతిపై పచ్చబొట్టుతో వేయించుకున్న పేర్లు, ఇతర ఫొటోలతో పాటు జిల్లాల్లో లుక్అవుట్ నోటీసులు అంటించగా వాటిని చూసిన మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయిస్తేనే హత్య కేసు నిందితుడిని పట్టుకోగలిగారు. -
ఔటర్ రింగురోడ్డుపై కారు దగ్ధం
-
హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు పూర్తిస్థాయి స్వేచ్ఛ కలి్పస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూలి్చవేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌పై కమిటీ ‘ఓఆర్ఆర్కు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించాం. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై హైడ్రాలో నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 12 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ కనీ్వనర్‌గా ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఐదారు జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ఆథారిటీ, జియోలాజికల్ విభాగాల అధికారులు ఉంటారు..’ అని పొంగులేటి తెలిపారు. 8 కొత్త వైద్య కళాశాలలకు 3 వేల పైచిలుకు పోస్టులు ‘హైదరాబాద్ నగరం కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించాం.తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు గాను 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించాం. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని రెవెన్యూ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయనున్నాం. ములుగు జిల్లా ఏటూరునాగారం ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బందిని మంజూరు చేశాం. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 వైద్య కళాశాలలకు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 3 వేల పైచిలుకు పోస్టులను మంజూరు చేశాం. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ, హకీంపేటకు జూనియర్ కళాశాల మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం..’ అని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యం: కోమటిరెడ్డి ‘కాంగ్రెస్ పారీ్టకి, తనకు పేరు వస్తుందనే అక్కసుతో కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. నల్లగొండ జిల్లాలో రూ.6 వేల కోట్ల మిషన్ భగీరథ పనులు జరిగితే, రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగింది. నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి ఫ్లోరైడ్ తీవ్రత పెరిగినట్టు కేంద్రం నివేదిక ఇచి్చంది..’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.2027 నాటికి ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి: ఉత్తమ్ ‘ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి 2027 సెపె్టంబర్‌లోగా ప్రారంభిస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించాం.డిండి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతుల సాధనకు, మిగిలి న 5 శాతం పనుల పూర్తికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఖరీఫ్‌లో సన్నాలను పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయి లో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుంది. వచ్చే నెలలో కొత్త తెల్లరేషన్ కార్డుల జారీని ప్రారంభిస్తాం. జనవరి నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తాం.. అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు.బిల్లులు రావట్లేదు సార్ కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం తాము మంజూరు చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదని పలువురు మంత్రులు..సీఎం రేవంత్ దృష్టికి తెచి్చనట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఆయా బిల్లులు త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
Ananthagiri Hills: కూల్ వెదర్..హాట్ స్పాట్..
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగర ప్రజలు, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, ఫైర్ క్యాంప్, అడ్వెంచర్ గేమ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇటువంటి సందర్భాల్లో హిల్ స్టేషన్లలో ఫైర్ క్యాంప్‌తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లు రిస్సార్ట్స్, హోటల్ యాజమాన్యాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. రానున్నది శీతాకాలం. కాబట్టి ఫిబ్రవరి వరకూ ఈ క్యాంపులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.ఔటర్ చుట్టూ.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో ఫాం హౌస్‌లు, పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. రానున్న శీతాకాలంలో సాయంత్రం మంచు కురిసే వేళలో వెచ్చగా ఫైర్ క్యాంప్ కల్చర్ వచ్చే ఐదు నెలలపాటు కొనసాగుతుంది. దీనికి తోడు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర ఫంక్షన్లు వంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎత్తైన హిల్ స్టేషన్లలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, వాయు, శబ్ధ కాలుష్యాలకు దూరంగా, ఇతర ఆటంకాలు ఉండని చోటు కోరుకుంటున్నారు. చల్లని వాతావరణంలో.. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలికాచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమొరీస్‌ను పదిలం చేసుకుంటున్నారు.ఆకర్షణగా అనంతగిరి హిల్స్.. హైదరాబాద్ సమీపంలో హిల్ స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్. పాల నురగలు కక్కుతూ జాలువారే వాటర్ ఫాల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఆ పక్కనే పదుల సంఖ్యలో అత్యాధునిక వసతులతో కూడిన రిసార్ట్స్. ఉదయం లేత సూర్యకిరణాలు తాకుతున్న వేళ ట్రెక్కింగ్, సాయంత్రం చల్లని వాతావరణంలో వెచ్చగా ఫైర్ క్యాంపు, ఆపై రెయిన్ డ్యాన్స్‌లు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అనంతగిరి హిల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిసార్ట్స్‌కు రోజుకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారాంతపు డెస్టినేషన్ హిల్ స్టేషన్‌గా అనంతగిరి వెలుగొందుతోంది.రెండు సీజన్లలో క్యాంప్ ఫైర్.. రానున్న శీతాకాలం ఎక్కువ మంది క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అడుగుతుంటారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, అడ్వెంచర్ గేమ్స్, రోప్ వే సంబంధిత కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్యాకేజీలు మారుతుంటాయి. వేసవిలో వాటర్ స్పోర్ట్స్, రెయిన్ డ్యాన్స్, వర్షాకాలం, శీతాకాలంలో క్యాంప్ ఫైర్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. – పీ.గంగాథర్ రావు, హరివిల్లు రిస్సార్ట్స్ నిర్వాహకులు, వికారాబాద్ఆ వాతావరణం ఇష్టం..చల్లనివాతావరణంలో వెచ్చగా మంట కాగుతూ, పాటలు పాడుకుంటూ డ్సాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కొడైకెనాల్, కూర్గ్, వయనాడ్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి రిసార్ట్స్ యజమానులే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసేవారు. బయటకు వెళ్లినప్పుడు ఒత్తిడిని మర్చిపోయి, హాయిగా గడపాలని అనుకుంటాం. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో రాత్రి వేళ చుక్కలను చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణంలో మనసుకు హాయిగా ఉంటుంది. – జి.సిద్ధార్థ, ఉప్పల్ -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని మారుతి బెలెనో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అవ్వగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.ఇందులో మూసీ రివర్ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్లో కేవలం హైదరాబాద్ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.అటవీశాఖకు రూ.1,063 కోట్లుహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్ ఫండ్ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.ఇంధన శాఖకు రూ.16,410 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.ఉదయ్ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. -
చర్లపల్లి టెర్మినల్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రయాణికులకు సకల సదుపాయాలతో ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి టెర్మినల్‌ను తీర్చిదిద్దారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడిని తగ్గించేందుకు నాలుగో టెర్మినల్‌గా దక్షిణమధ్య రైల్వే చర్లపల్లి పునరి్నర్మాణం చేపట్టింది. సుమారు రూ.434 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయినట్లు స్వయంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే దీన్ని వినియోగంలోకి తేవాలని భావించినప్పటికీ అప్పట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడం వల్ల సాధ్యం కాలేదు. ఆ తరువాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. ప్రస్తుతం దాదాపుగా పనులన్నీ పూర్తి కావడంతోనే త్వరలోనే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.రోజుకి 50 రైళ్ల రాకపోకలకు అవకాశంసికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న దృష్ట్యా ప్రస్తుతం సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగిస్తున్న కొన్ని రైళ్లను త్వరలో చర్లపల్లి నుంచి నడుపనున్నారు. 9 ప్లాట్‌ఫామ్‌లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి నుంచి రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 30 రైళ్లతో (15 జతలు) చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తేనున్నారు. మొదట 25 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నారు. రైళ్లు పెరిగే కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరగనుంది.ఔటర్‌కు చేరువలో...⇒ ఔటర్‌రింగ్ రోడ్డుకు చేరువలో ఉన్న చర్లపల్లి స్టేషన్‌కు నగరవాసులు వివిధ ప్రాంతాల నుంచి ఔటర్ మీదుగా చేరుకొనేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలో విస్తరించిన సికింద్రాబాద్–ఘట్కేసర్ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయి.⇒ దీంతో ప్రయాణికులు నగరానికి పడమటి నుంచి తూర్పు వైపు తేలిగ్గా రాకపోకలు సాగించవచ్చు. ⇒ ప్రయాణికుల సదుపాయాల్లో భాగంగా 5 లిఫ్టులు, 9 ఎస్కలేటర్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టారు. ⇒ ప్రయాణికుల రాకపోకల కోసం రెండు సబ్‌వేలను నిర్మించారు. అలాగే రహదారులను విస్తరించారు. సుమారు 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకర్లను సిద్ధం చేశారు.చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ⇒ షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046),. ⇒ చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604) ⇒ గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. ⇒ హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), ⇒ గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్.. ⇒ విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. ⇒ మొత్తంగా మొదట 15 జతల రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్నాయి. -
ఔటర్‌పై కార్లు, ఇతర వాహనాలకు వేర్వేరు మార్గాలు
మణికొండ: ఔటర్ రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్‌తో టోల్గేట్ల వద్ద వాహనదారుల పడిగాపులు పెరిగిపోతున్నాయి. వాటిని నివారించే ఉద్దేశంతో అధిక రద్దీ ఉండే పుప్పాలగూడ టోల్గేట్ వద్ద నిర్వాహకులు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి రద్దీ నివారణ చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఉన్న మూడు టోల్ వసూలు కౌంటర్లలోకి కార్లను మాత్రమే అనుమతించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో కార్లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనదారులే ప్రవేశించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా ఆయా మార్గాల్లోకి ప్రవేశిస్తే చెల్లించాల్సిన డబ్బుకు రెండితలు వసూలు చేస్తున్నామని టోల్గేట్ నిర్వాహకులు తెలిపారు. ఫాస్టాగ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గాల్లోకి ఇతర వాహనదారులు రావొద్దని బోర్డులు ఏర్పాటు చేసినా వారు ప్రవేశించి నగదు రూపంలో టోల్ చెల్లిస్తుండటంతో రద్దీ పెరిగిపోతోందన్నారు. అందుకే కచ్చితంగా ఫాస్టాగ్ ఉన్న కార్లను ఆయా మార్గాల్లో.. మిగతా వాహనాలను ఇతర కౌంటర్లలోకి అనుమతిస్తున్నామన్నారు. దాంతో ఆదివారం ఎక్కువగా ట్రాఫిక్ స్తంభించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో అధిక రద్దీ ఉండే మరిన్ని టోల్ కేంద్రాల వద్ద ఇలాంటి ఏర్పాట్లను చేస్తామని వారు తెలిపారు. -
తిరగబడ్డ దోపిడీ దొంగలు.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు
హైదరాబాద్, సాక్షి: పెద్ద అంబర్‌పేటలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. చోరీ చేసి పారిపోతున్న దోపిడీ ముఠాను పట్టుకునే నల్లగొండ పోలీసులు ఛేజింగ్‌కు దిగారు. ఈ క్రమంలో ఆ దొంగలు పోలీసులపైకి కత్తులు దూశారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. నల్లగొండలో చోరీలు చేసిన ఓ ముఠా పారిపోతుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాళ్లను వెంబడి అడ్డగించారు. ఆ టైంలో పోలీసులపై దుండగులు కత్తులు దూశారు. దీంతో వాళ్లను అదుపు చేసేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు గ్యాంగ్ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వీళ్లను పార్థీ(పార్థ) గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్య వరుసగా పోలీస్ ఫైరింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్‌లో చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే తాజా ఘటన మాత్రం నగర శివారులో చోటు చేసుకుంది. -
ORR: ఔటర్‌పై ప్రైవేటు బస్సు బోల్తా
మణికొండ: హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్ తెలిపిన మేరకు.. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు (పీవై 05 ఎ 1999) గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ వైపు వెళుతోంది. నార్సింగి వద్ద అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్‌ను ఢీ కొని పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ బస్సు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతురాలు ఒంగోలుకు చెందిన మమత(33) అని, ఆమె ఉప్పల్‌లో ఉంటుందని తెలిసిందన్నారు. బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు. బస్సు బోల్తా కొట్టడంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకు పోయిన వారిని బయటకు తీశారు. ఇదిలా ఉండగా బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానం రావటంతో అతన్ని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరి కొందరికి స్వల్ప గాయాలు కావటంతో వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామన్నారు. ఔటర్‌రింగ్ రోడ్డుపై బోల్తా కొట్టిన బస్సును రెండు క్రేన్ల సహాయంతో పక్కకు తప్పించి రెండు గంటల అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. -
ఓఆర్ఆర్ యూనిట్‌గా విపత్తు నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు యూనిట్‌గా తీసుకొని విపత్తు నిర్వహణ జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. వానల వల్ల తలెత్తే సమస్యల పట్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్య లు తీసుకుంటున్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిజికల్ పోలీసింగ్ విధా నం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చరపట్టాలని సూచించారు.ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్మెంట్ చేపట్టాలని కూడా ఆదేశించారు. జంటనగరాల్లో ఇప్పటికే వరద తీవ్ర త ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించామ ని, వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు సీఎంకు వివరించారు. నీరు వచ్చి చేరే ప్రాంతాల నుంచి వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
‘మహా’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర విస్తరణ, అభివృద్ధికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు హెచ్ఎండీఏలోని వివిధ విభాగాలను బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో సుమారు 7,200 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ సేవలు విస్తరించి ఉన్నాయి.ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరిగితే ఇది 10 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం, ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను కూడా పెంచవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట కీలకమైన సంస్థ ప్రణాళికా విభాగాన్ని విస్తరించడం ద్వారా సేవలను మరింత పారదర్శకం చేయనున్నారు. ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో శంకర్పల్లి, ఘటకేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులన్నీ ఈ నాలుగు జోన్ల నుంచే లభిస్తాయి.వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధి గతంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది. కానీ ఇందుకనుగుణంగా జోన్లు, ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో అధికారులపై పని ఒత్తిడి బాగా ఎక్కువైంది. వందల కొద్దీ ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. టీజీబీపాస్ (తెలంగాణ బిల్డింగ్ పరి్మషన్ అండ్ సెల్ఫ్ సరి్టఫికేషన్ సిస్టమ్) ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న 4 జోన్లను 8కి పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. నలువైపులా అభివృద్ధి పడమటి హైదరాబాద్‌కు దీటుగా తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాబోయే రోజుల్లో సుమారు 3 కోట్ల జనాభా అవసరాలకు నగరం సరిపోతుందని అంచనా. ఈ క్రమంలో హెచ్ఎండీఏ బాధ్యతలు మరింత పెరగనునున్నాయి. టౌన్íÙప్ల కోసం ప్రణాళికలను రూ పొందించడం, రోడ్డు, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. అన్ని వైపులా టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నగర అభివృద్ధి సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏలో ప్రణాళికా విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ‘అధికారు లు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సేవల్లో పారదర్శకతను పెంచాల్సి ఉంది. అప్పు డే ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించగలం..’అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.జోన్ల విస్తరణ ఇలా..ప్రస్తుతం ఉన్న ఘట్కేసర్ జోన్లో మరో కొత్త జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్ జోన్లను కూడా రెండు చొప్పున విభజించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 జోన్లను ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన.. మొదట 6 వరకు ఆ తర్వాత 8కి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను ఇక నుంచి పూర్తిగా ఆన్లైన్లో టీజీ బీపాస్ ద్వారానే ఇవ్వనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి చేసే లే అవుట్లు, భవనాలకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా కూడా అనుమతులను ఇస్తున్నారు. ఈ నెలాఖరుతో డీపీఎంఎస్ సేవలను నిలిపివేయనున్నారు. హెచ్ఎండీఏలోని 7 జిల్లాల్లో ఉన్న 70 మండలాలు, సుమారు 1,032 గ్రామాల్లో టీజీబీపాస్ ద్వారానే అనుమతులు లభించనున్నాయి. -
ఔటర్‌పై నేటి నుంచి పెరగనున్న టోల్ చార్జీలు
లక్డీకాపూల్: ఔటర్ రింగ్ రోడ్‌పై టోల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. సోమవారం నుంచి పెంచిన టోల్ చార్జీలు 5 శాతం అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్లకు ప్రతి కిలోమీటర్‌కి రూ.2.34 పైసలు, ఎల్‌సివి, మినీ బస్‌లకు రూ.3.77, బస్, 2–యాగ్జిల్ ట్రక్‌లకు రూ.6.69, భారీ నిర్మాణ మెషినరీ, ఎర్త్ మూ వింగ్ ఎక్విప్మెంట్లకు రూ.12.40, ఓవర్సైజ్డ్ వాహనాలకు రూ.15.09 చొప్పున టోల్ చార్జీలు పెరగనున్నాయి.కొత్త టోల్ రేట్లు, రో జువారీ పాసులు, నెలవారీ పాసులు తదితరాలకు హెచ్ఎండిఏ వైబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా ఐఆర్బి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ సంస్ధ నిర్వాహకులు సూచించారు. -
ఔటర్ రింగ్ రోడ్డుపై హైడ్రామా
-
హిట్ అండ్ రన్.. బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
హైదరాబాద్: కోకాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. వేగంగా వచ్చిన ఆటో ఓ బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో బైక్ పై ఉన్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. అయితే పుట్టెడు శోకంలోనూ.. బ్రెయిన్ డెడ్ అయిన ఆ విద్యార్థి అవయవదానానికి అతని తల్లిదండ్రులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి హైదరాబాద్ కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ పై వస్తున్నాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఆటో ప్రభాస్ ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే విద్యార్థిని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. బిస్వాల్ ప్రభాస్ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. లివర్, కిడ్నీలు దానం చేస్తున్నట్టు తెలిపారు. అవయవ దానం చేసిన బిస్వాల్ ప్రభాస్ కు సెల్యూట్ చేస్తూ ఆస్పత్రి సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నార్సింగీ హిట్ అండ్ రన్ కేసుపై అనుమానాలు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగీలో సోమవారం మరో హిట్ అండ్ రన్ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ప్రమాద సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ అయిన వాహనాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. యువకుడిని ఢీకొట్టి పరారైంది రెడీ మిక్సర్ వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుమానం.. రోడ్డు ప్రమాదంలో మృతుడిని ఆర్మీ సైనికుడిగా గుర్తించారు. గోల్కొండ ఆర్టలరీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ కులాన్గా గుర్తించారు. హింట్ అండ్ రన్ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు అసలు ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు ప్రమాద స్థలానికి భారీగా చేరుకున్నారు. -
ఐఆర్బీ టెండర్లపై సీఎం రేవంత్ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు టెండర్లలో అక్రమాలపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో ఔటర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఔటర్ టోల్ లీజులో అక్రమాలకు బాధ్యులైన అధికారురులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఔటర్ లీజు వ్యవహారంపైన పూర్తి వివరాలను అందజేయాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 158 కిలోమీటర్ల మార్గంలో టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఔటర్ రింగ్‌రోడ్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఐఆర్బీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు, పీసీసీ చీఫ్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. కనీస ధర వెల్లడించకపోవడంతో ఔటర్లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలపైన అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆయనపైన పరువునష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆయన హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఓటీ పద్ధతిలో ఔటర్ లీజు... కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ (టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు 2022 ఆగస్టు11వ తేదీన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదే సంవత్సరం నవంబర్ 9వ తేదీన అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహా్వనించింది. గత సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 11 బిడ్డర్లు ఆసక్తిని ప్రదర్శించారు. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా మూడుసార్లు బిడ్ గడువును పొడిగించారు. 30 ఏళ్ల లీజుపైన బేస్ ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ వెల్లడించారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన బేస్ప్రైస్పైన మాత్రం గోప్యతను పాటించడంతో ఈ లీజు వ్యవహారం వివాదాస్పదమైంది. మొదట్లో 11 సంస్థలు పోటీ చేయగా, చివరకు 4 సంస్థలు మాత్రమే పోటీలో మిగిలాయి. ఆ నాలుగింటిలోనూ ఐఆర్బీ ఎక్కువమొత్తంలో బిడ్ వేసి లీజును దక్కించుకుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో ప్రతి రోజు 1.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అప్పట్లో గత ప్రభుత్వం నిర్దేశించిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో ఐఆర్బీ సంస్థకు టోల్ ఆదాయం లభిస్తున్నట్లు అధికారవర్గాల అంచనా. మరోవైపు ఏటా సుమారు రూ.550 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కామధేనువు వంటి ఔటర్‌ను ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం పట్ల ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడువు కంటే ముందే రూ.7380 కోట్లు చెల్లించిన ఐఆర్బీ... ఇలా వివాదాల నడుమ ఔటర్ టెండర్‌ను దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ నిర్ణీత 120 రోజుల గడువు కంటే ముందే రూ.7380 కోట్ల లీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించింది..దీంతో 2008 నుంచి 2023 వరకు వరకు సుమారు 15 సంవత్సరాల పాటు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు మొట్టమొదటిసారి ప్రైవేట్ సంస్థ నిర్వహణలోకి వెళ్లిపోయింది. నిబంధనల మేరకు రానున్న 30 ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగవలసి ఉంటుంది. 8 వరుస లేన్లతో (1264 లేన్ కి.మీలు) కూడిన 158 కి.మీల ఔటర్ రింగ్రోడ్డుపైన ఉన్న సుమారు 120కి పైగా టోల్గేట్ల వద్ద ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థ టోల్ వసూళ్లను కొనసాగిస్తోంది. ఔటర్ రింగురోడ్డు నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తదితర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను కూడా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే చేపట్టవలసి ఉంటుంది. హెచ్‌జీసీఎల్ ఔటర్‌ను ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్‌ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితమైంది. -
HMDA: ఆమ్రపాలికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సమీక్ష జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్ సోదాలు! -
HYD : ఓఆర్ఆర్ వద్ద మూటలో మృతదేహం కలకలం
హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డు వద్ద మూటలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల పరిధి బ్రహ్మణపల్లి సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు పడేశారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
3 క్లస్టర్లుగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందడానికి వీలుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కొత్త విధానంలో తెలంగాణను మొత్తం మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2050 నాటికి హైదరాబాద్ తరహాలో తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నది తమ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో స్నేహపూర్వకంగా మెలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు శనివారం సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అత్యున్నత అభివృద్ధి సాధనే లక్ష్యం పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని తీసుకుని వస్తామ సీఎం చెప్పారు. తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో అత్యున్నత అభివృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే వాదనలకు భిన్నంగా తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తాము తెచ్చే కొత్త పారిశ్రామిక విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఫార్మా విలేజీల అభివృద్ధి ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఫార్మా సిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్య రహితంగా, పరిశ్రమలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలతో వీటిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. రక్షణ, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులను గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించటం లేదని సీఎం స్పష్టం చేశారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా చూస్తామని, యువతీ యువకులకు అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, సీఐఐ ప్రతినిధులు సి.శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుచిత్రా కె.ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్ సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్, వై.హరీశ్చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షేక్ షమియుద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఔటర్‌పై టోల్ తీస్తున్నారు!
హైదరాబాద్‌కు చెందిన ఓ వాహనదారుడు మూడు రోజుల క్రితం గచ్చిబౌలి నుంచి ఔటర్ మీదుగా టీఎస్పీఏ (అప్పా) వరకు వెళ్లారు. నిబంధనల మేరకు ఈ రూట్లో ఒకసారి వెళితే రూ.20, వెళ్లివస్తే రూ.30 చెల్లించాలి. కానీ సదరు వాహనదారుడి ఖాతా నుంచి ఏకంగా రూ.80 కోత పడింది. దీనిపై సంస్థ ప్రతినిధులను నిలదీయగా ‘సారీ’ అంటూ చేతులు దులిపేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం మరో వాహనదారుడు గౌరెల్లి నుంచి ఘట్కేసర్ వరకు వెళ్లాడు. నిబంధనల మేరకు రూ.20 తీసుకున్నారు. కానీ తిరిగి అదేరోజు ఘట్కేసర్ నుంచి గౌరెల్లికి తిరిగి రాగా ఏకంగా రూ.115 వసూలు చేశారు. నిబంధనల మేరకు రిటర్న్ జర్నీకి రూ.10 చార్జీ చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత సమయం మించితే వన్‌వే జర్నీ కింద రూ.20 తీసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ట్యాక్స్ దోపిడీ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా టోల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా వాహనదారుల ఖాతాల్లోంచి కొట్టేస్తున్నట్లు నిర్వహణ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గట్టిగా నిలదీసిన వాళ్లకు 25 రోజుల గడువులోపు తిరిగి చెల్లిస్తామంటున్నారు.. కానీ సకాలంలో ఖాతాలో జమ కావడంలేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 158 కి.మీ. ఔటర్ మార్గంలో రోజూ వేలాది మంది వాహనదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అధికంగా వసూలు చేసినట్లు గుర్తించిన వాహనదారులకు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెబుతున్నారు. కానీచాలామంది తమకు తెలియకుండానే మోసపోతున్నారు. హెచ్ఎండీఏ నియంత్రణ ఏమైనట్లు.. జాతీయ రహదారులపై విధించే టోల్ చార్జీల నిబంధనలే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్‌కు వర్తిస్తాయి. ఔటర్‌పై ప్రస్తుతం 21 ఇంటర్‌ఛేంజ్‌ల నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రింగ్‌రోడ్డును ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు ప్రభుత్వం టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 ఏళ్ల లీజుకిచి్చంది. ఐఆర్బీ అనుబంధ సంస్థ అయిన ఐఆర్బీ గోల్కొండ సంస్థ టోల్ చార్జీలను వసూలు చేస్తోంది. నిబంధనల మేరకు హెచ్ఎండీఏ అనుమతితోనే టోల్ చార్జీలను పెంచుకొనేందుకు ఐఆర్బీకి అవకాశం ఉన్నా సొంతంగా పెంచేందుకు అవకాశం లేదు. ఐఆర్బీ అడ్డగోలుగా టోల్ వసూలు చేస్తున్నప్పటికీ హెచ్ఎండీఏ చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారిస్తాం ఔటర్‌పై అధికంగా టోల్ వసూలు చేయడానికి వీల్లేదు. వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారిస్తాం. ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి. – బీఎల్ఎన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్, హెచ్ఎండీఏ టోల్ దోపిడీ దారుణం టోల్ ట్యాక్స్ దోపిడీ దారుణంగా ఉంది. అవకతవకలను వాహనదారులు గుర్తించినప్పుడు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – కేతిరెడ్డి కరుణాకర్‌రెడ్డి దేశాయ్, వాహనదారుడు -
కారులోనే యువకుడి సజీవ దహనం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్ధరాత్రి ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధమై యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. సూర్యపేట జిల్లా జ్యోతినగర్, నాయనగర్ ప్రాంతానికి చెందిన బడుగుల వెంకటేశ్ (25) శనివారం సాయంత్రం సూర్యపేట నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడకు కారులో బయలుదేరాడు. బొంగ్లూర్ సమీపంలోని శ్రీశ్రీ ఎరోలైట్స్ వద్దకు రాగానే కారు ఆపి సీటు వెనక్కి తీసుకొని నిద్రిస్తున్నాడు. అంతలోనే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్పటికే నిద్రలో ఉన్న వెంకటేశ్ కారులోనే ఉండిపోయాడు. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయని అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులో ఉన్న వెంకటేశ్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. క్లూస్ టీం సహకారంతో కారు నంబర్ గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్నది బడుగుల వెంకటేశ్(25)గా నిర్ధారించారు. వెంకటేశ్ కొద్ది రోజుల్లో ఉన్నత చదువుల నిమిత్తం కెనడాకు వెళ్లనున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పినట్లు వెల్లడించారు. -
శామీర్‌పేట్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓఆర్ఆర్పై వేగంగా వచ్చిన ఇనోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని వెనుకను నుంచి ఢీ కొట్టింది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇనోవా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను కుత్బుల్లాపూర్‌కు చెందిన డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు శామీర్ పేట పోలీసులు పేర్కొన్నారు. బిజినెస్‌లో భాగస్వామ్యులు అయిన నలుగురు కలిసి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని ఇన్నోవా కారులో తిరి ప్రయాణమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోపే ఈ ప్రమాదం సంభవించింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు షామీర్పేట్ ఓఆర్ఆర్పై అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని వెనక నుంచి గుద్దుకుంది. దైవ దర్శనానికి వెళ్లి ఇద్దరు మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
తిరుమలలో 13 కాటేజీల పునర్నిర్మాణం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేసే కార్మికులకు లబ్ధి కలిగించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి టీటీడీ చైర్మన్ భూమన మీడియాకు వివరించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కింద ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పైగా పెంచేందుకు ఆమోదం. శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న దాదాపు 6,600 మంది ఉద్యోగులకు ఇకపై ఏటా 3 శాతం వేతనం పెంపుదల. టీటీడీలో వివిధ సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్లోకి మారిన ఉద్యోగులకు గత సేవల్ని గుర్తించి ప్రతి రెండేళ్లకు 3 శాతం ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయం. కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అకాల మరణం పొందితే రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదం. శ్రీలక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు దాదాపు 1500 మందికి హెల్త్ స్కీమ్ వర్తింప చేసేందుకు ఆమోదం. -
Hyderabad:: హైటెక్సైకిల్ ట్రాక్‌ను చూసి వావ్ అనాల్సిందే!
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో రూ.100 కోట్లతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రతిష్టాత్మక సైకిల్ ట్రాక్‌ను ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దక్షిణ కొరియాలో ఉన్న సైకిల్ ట్రాక్ తరహాలో దేశంలోనే ఆ స్థాయిలో తొలి సైకిల్ ట్రాక్‌ను నగరంలో ఏర్పాటు చేయడం విశేషం. కొల్లూరు నుంచి నార్సింగి వరకూ, నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకూ మొత్తం 23 కి.మీ మార్గంలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్ పొడవునా సోలార్ రూఫ్ టాప్ సైతం ఏర్పాటు చేశారు. సోలార్ పలకల నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్‌ను ట్రాక్ అవసరాల కోసం వినియోగిస్తారు. ట్రాక్ పొడవునా అద్దె సైకిళ్లు, సైకిల్ రిపేరింగ్ కేంద్రాలు కూడా నెలకొల్పారు. రైడర్లు విశ్రాంతి తీసుకునేందుకు కెఫెటేరియా వంటి వసతులు కూడా అందుబాటులోకి తెచ్చారు. -
ఓఆర్ఆర్ లీజుపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్‌ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్ కంపెనీకి అప్పగింత, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు చెందిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం.. తుది ఉత్తర్వుల మేరకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంపిల్ దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ (ఇనీషియల్ ఎస్టిమేటెడ్ కన్సెషన్ వాల్యూ) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్ఎండీఏ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల బదిలీ చట్టవిరుద్ధమన్న పిటిషనర్ న్యాయవాది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవా ది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రాథమిక అంచనా విలువను ప్రకటించకుండానే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌కు ఓఆర్ఆర్ను 30 ఏళ్లు అప్పగించారని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను హెచ్ఎండీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా ఏప్రిల్ 27న జీవో తీసుకొచ్చిందని.. ఈ జీవో హెచ్ఎండీఏ చట్టంలోని సెక్షన్ 40(1)(సీ)కి విరుద్ధమని వాదించారు. హెచ్ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులకు మాత్రమే ఆఆదాయాన్ని వెచ్చించాల్సి ఉందని వెల్ల డించారు. ఇప్పటికే రూ.7 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసిందని, వాటిని ఖర్చు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్ వద్ద డబ్బు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. -
హైదరాబాద్ ORRపై కొత్త రూల్స్.. బీఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది సైబరాబాద్ పోలీస్ శాఖ. పైగా కొత్త రూల్స్ నేటి నుంచి(జులై 31వ తేదీ నుంచి) అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. లైన్ 1 అండ్ 2ల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లొచ్చు. ఆ మధ్య స్పీడ్ లిమిట్‌ని అనుమతిస్తారు. ఈ లైన్లలో కనిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల చొప్పున ఉండొచ్చు. అలాగే.. లైన్ 3 అండ్ 4 లో గరిష్టంగా గంటకు 80, కనిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ORRలో కనీస వేగం గంటకు 40 కి.మీ. ఇంతకన్నా తక్కువ వాహనాలను ఓఆర్ఆర్పైకి అనుమతించరు. 🛣️ ఇక.. లేన్ల మధ్య వాహనాల జిగ్-జాగ్ కదలిక అనుమతించబడదు. 🛣️ పై వేగం ప్రకారం లేన్లను మార్చాలనుకునే అన్ని వాహనాలు ఇండికేటర్ లైట్లను ఉపయోగించిన తర్వాత మాత్రమే చేయాలి. 🛣️ అలాగే.. లేన్లను మార్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 🛣️ ఓఆర్ఆర్లోని నాలుగు లేన్లలో ఏ వాహనం కూడా ఆగకూడదు. 🛣️ ఏ ప్రయాణీకుల వాహనాలు ORRలో ఆపి ప్రయాణికులను ఎక్కించకూడదు. 🛣️ ORRపై టూవీలర్స్, అలాగే పాదచారులకు అనుమతి లేదు ORRలో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు లక్ష్యం పెట్టుకుంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. కొత్త నియమాలు డ్రైవింగ్ క్రమశిక్షణను తీసుకువస్తాయని, అలాగే.. గందరగోళాన్ని తగ్గిస్తాయని, పైగా.. ORRలో ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆ నోటిఫికేషన్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్లలో వాళ్లకు నో ఎంట్రీ -
ఔటర్ చుట్టూ మెట్రో !
-
సూపర్‌గా ఔటర్‌రింగ్ రోడ్డు.. ఐటీ కారిడార్ పరిధిలో..
హైదరాబాద్: ఐటీ కారిడార్ పరిధిలోని ఔటర్‌రింగ్ రోడ్డు ఆధునిక హంగులను సంతరించుకుంటోంది. ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ, కార్పొరేట్ సంస్థలు శరవేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఔటర్ మీదుగా ఐటీ కారిడార్లలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే నార్సింగ్ వద్ద కొత్తగా ఒక ఇంటర్‌చేంజ్‌ను ఏర్పాటు చేయగా, ఐటీ సంస్థలు, ఉద్యోగుల రాకపోకల కోసం మరో రెండు చోట్ల ఇంటర్‌చేంజ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ. 29.50 కోట్లతో చేపట్టిన నార్సింగ్ ఇంటర్‌చేంజ్‌ను ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది వినియోగంలోకి రావడంతో వాహనాల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాలతో పాటు లంగర్ హౌస్, శంకర్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కోకాపేట్, మల్లంపేట్‌లో ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఔటర్ మీదుగా కోకాపేట్‌కు చేరుకోవడం ఎంతో సులువవుతుంది. ఈ రెండు చోట్ల వినియోగంలోకి వస్తే 158 కిలోమీటర్ల ఔటర్ మార్గంలో మొత్తం 22 ఇంటర్‌చేంజ్‌లు ఉంటాయి. సర్వీస్‌రోడ్ల విస్తరణ... ► మరోవైపు ఐటీకారిడార్‌లకు ఈజీగా రాకపోకలు సాగించేందుకు హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున సర్వీస్‌రోడ్ల విస్తరణ చేపట్టింది. ► సుమారు 24 కిలోమీటర్ల మార్గంలో రెండు లైన్లు ఉన్న సర్వీస్ రోడ్లను 4 లైన్లకు విస్తరిస్తున్నారు. త్వరలోనే అదనపు రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. ► హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) సర్వీస్ రోడ్ల విస్తరణ చేపట్టింది. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 24 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్లను నాలుగు లైన్లకు పెంచుతున్నారు. సుమారు రూ.380 కోట్లతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15న సైకిల్ ట్రాక్ ప్రారంభం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన సైకిల్ ట్రాక్ ఆగస్టు 15వ తేదీ కానుకగా అందుబాటులోకి రానుంది. సుమారు రూ.100 కోట్ల అంచనాలతో నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మార్గంలో సైకిల్ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఇది 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లలో ఉంటుంది. ‘ఐటీ ఉద్యోగులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ట్రాక్‌ను వినియోగించుకోవచ్చు. అద్దె సైకిళ్లు లభిస్తాయి. ట్రాక్ పొడవునా రెస్ట్రూమ్లు, కెఫెటేరియాలు, బ్రేక్‌ఫాస్ట్ సెంటర్లు కూడా ఉంటాయి’. అని ఒక అధికారి వివరించారు. అలాగే సైకిళ్లకు పంక్చర్లయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరమ్మతులు చేస్తారని చెప్పారు. ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచునున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ట్రాక్‌పై కప్పు కోసం ఏర్పాటు చేసిన సౌరఫలకల వల్ల 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, -
ఔటర్‌పై నేటి నుంచి నార్సింగి ఇంటర్చేంజ్
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద సుమారు రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఇంటర్ చేంజ్ వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాలతో పాటు లంగర్ హౌస్, శంకర్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఎంతో ప్రయోజనం లభించనుంది. ఔటర్‌పైన రాకపోకలు సాగించే వాహనదారులు నార్సింగి వద్ద ఎక్కేందుకు, దిగేందుకు అనుకూలంగా ర్యాంపులు, రోడ్లను నిర్మించారు. ఈ ఇంటర్చేంజ్ వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. ప్రస్తుతం శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనదారులు నార్సింగి వైపు వెళ్లేందుకు అవకాశం లేదు, అక్కడి నుంచి నానక్‌రాంగూడ టోల్‌ప్లాజా వరకు వెళ్లి వెనక్కి తిరిగి రావలసి వస్తుంది. దీంతో కనీస 5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. శనివారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్చేంజ్ వల్ల ఆ ఇబ్బంది తొలగనుంది. అలాగే మెహదీపట్నం నుంచి కోకాపేట్ వైపు వెళ్లే వాహనదారులకు కూడా దీనివల్ల ప్రయాణం సులువవుతుంది. ప్రస్తుతం 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో 19 చోట్ల ఇంటర్ చేంజ్‌లు ఉన్నాయి. నార్సింగితో ఈ సంఖ్య 20కి చేరింది. వీటితో మల్లంపేట్, కోకాపేట్ల వద్ద కూడా హెచ్ఎండీఏ ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఆ రెండు చోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఇవి కూడా పూర్తయితే ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల సంఖ్య 22కు చేరనుంది. భవిష్యత్‌లో వచ్చే డిమాండ్ మేరకు ఔటర్మార్గంలో అవసరమైన చోట్ల ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. నేడు కోకాపేట ఎస్టీపీ ప్రారంభం జలమండలి నూతనంగా నిర్మించిన కోకాపేట మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిని జలమండలి ఎండీ దానకిశోర్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. కోకాపేట ఎస్టీపీని ప్యాకేజీ–2 లో భాగంగా.. 15 ఎంఎల్డీల సామర్థ్యం, ఆధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో నిర్మించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని మురుగు శుద్ధి చేయవచ్చు. -
వాహనాదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్ఆర్ స్పీడ్ లిమిట్ పెంపు
సాక్షి, మైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ గంటకు 100 కి మీ ఉండగా దానిని120కి పెంచాలని నిర్ణయించింది. మేరకు పురపాలక, ఓఆర్ఆర్ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, దీనిని 120కి.మీకి పెంచుతున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్పై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే స్పీడ్ లిమిట్ పెంచిన నేపథ్యంలో వాహనాదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏను ఆదేశించారని అర్వింద్ కుమార్ తెలిపారు. ఓఆర్ఆర్ (కోకాపేట నుంచి ఘట్కేసర్ వరకు, తారామతిపేట – నానక్‌రామ్‌గూడ వరకు) ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు 1066, 105910 నంబర్లలో డయల్ చేయాలని హెచ్ఎండీఏ సూచించింది. చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ The maximum speed limit on #ORR is increased to a maximum of 120 kms/ hour from the present maximum limit of 100 kms/ hour In the review meeting held today, minister @KTRBRS reviewed the arrangements & has instructed @HMDA_Gov to ensure all safety protocols in place pic.twitter.com/yz5Wobsoq8 — Arvind Kumar (@arvindkumar_ias) June 27, 2023 -
ఓఆర్ఆర్ టెండర్‌పై రఘునందన్ సంచలన ఆరోపణలు, సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టెండర్ పైన సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు అప్పనంగా ఐఆర్బీ సంస్థకు టెండర్ అప్పగించారని దుయ్యబట్టారు. ఔటర్ రింగు రోడ్డు టెండర్ లో అవినీతి జరిగిందని గతంలోనే ఈడీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుషుల్నే లేకుండా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. (చదవండి: ప్రైవేటుకు ఓఆర్ఆర్!.. 30 ఏళ్లకు లీజుకిచ్చిన కేసీఆర్ సర్కార్) 'ఓఆర్ఆర్ టెండర్ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని ఇటీవల కొందరు విమర్శిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై మా పార్టీ చాలారోజులుగా ప్రశ్నిస్తోంది' అని రఘునందన్ రావు చెప్పారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ అనే సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్లో భారీ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని విమర్శిస్తున్నాయి. మరోవైపు పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. (చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) -
ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డును సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్ను తక్కువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరో దోపిడికి తెరతీసిందన్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన నెలరోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని.. రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెల్లించాల్సిన 10 శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని.. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. చదవండి: TS: బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్.. రంగంలోకి హైకమాండ్ సర్వేల ఆధారంగా టికెట్లు సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ నుంచి అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన టికెట్‌తో సహా ప్రతీ టికెట్ సర్వేనే ప్రామాణికమని తెలిపారు. కర్ణాటకలో సిద్దారామయ్యకు కూడా అడిగిన టికెట్ కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్ ఇచ్చారని తెలిపారు. పార్టీలో చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుందన్నారు.. ఇంఛార్జి ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారని తనకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీలో చేరిక ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చిస్తామని, ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తామని పేర్కొన్నారు. -
ఔటర్ లీజుపై రాష్ట్రపతికి లేఖ
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడాన్ని కట్టడి చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని, కోర్టుకు కూడా వెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓఆర్ఆర్ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి 30 ఏళ్ల పన్నులను ఒకేసారి తీసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి? రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భట్టి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగుతోంది. బుధవారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం గొల్లగుడెసెలు, దాతరుపల్లి గ్రామాల మీదుగా యాత్ర భువనగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న నృసింహసాగర్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలను ఆలకించారు. రిజర్వాయర్ కట్టపై మీడియాతో మాట్లాడుతూ ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎకరానికి రూ.50–60 లక్షల ధర ఉంటుందని పేర్కొన్న సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఎట్లా ఇస్తారని నిలదీశారు. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి కోటిన్నర పరిహారం ఇవ్వాలన్నారు. -
ఓఆర్ఆర్ లీజులో భారీ కుంభకోణం ఆరోపణలు.. పూర్తి వివరాలు ఇవిగో!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అంతా పారదర్శకమని, కేంద్రం ఆమోదంతో జాతీయ రహదారుల సంస్థ గుర్తించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానాన్ని పాటించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 30 ఏళ్ల లీజుపై తాము నిర్ణయించిన బేస్‌ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న నాలుగు సంస్థల్లో ఇదే ఎక్కువ మొత్తమని చెప్పారు. బేస్‌ప్రైస్ విషయంలో సాంకేతికంగానే గోప్యత పాటించినట్లు పేర్కొన్నారు. ఔటర్ లీజులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. బిడ్డింగ్‌లో లోపాల్లేవ్.. . ♦ జాతీయ రహదారుల సంస్థ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 బండిల్స్‌లో సుమారు 1600 కిలోమీటర్లను టీఓటీ ప్రాతిపదికన 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చిన పద్ధతినే ఔటర్ విషయంలో అనుసరించాం. రెవెన్యూ మ ల్టిఫుల్ పరంగా దేశంలోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన వాటిలో ఔటర్ లీజు అత్యుత్తమ బిడ్. ♦ హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం 2006లో ప్రారంభమైంది. 2012 నాటికి 79.45 కిలోమీటర్లు, 2018 నాటికి 158 కి.మీ పూర్తి చేశారు. 2012 నుంచే ఔటర్‌పై టోల్ వసూలు మొదలైంది. ఆ ఏడాది రూ.11.11 కోట్లు ఆదాయం లభించగా 2018 నాటికి రూ.340 కోట్లు, 2022 నాటికి రూ.542 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. జాతీయ రహదారుల సంస్థ 2008లో విధించిన నిబంధనల మేరకు టోల్ రుసుము నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోల్ రుసుముపై అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ♦ కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శించారు. బిడ్డింగ్‌లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకతను పాటించేందుకు 142 రోజుల వ్యవధి ఇచ్చాం. పదేళ్లకోసారి సమీక్ష... ♦ ఐఆర్బీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినప్పటికీ ప్రతి పదేళ్లకు ఒకసారి లీజును సమీక్షిస్తారు. రోడ్డు మరమ్మతులు, నిర్వహణ, టోల్ రుసుము, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయ,వ్యయాలు, తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ సమీక్షను నిర్వహిస్తారు. ♦ టోల్ పెంపు పైన ఐఆర్బీ చేసే ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు లోబడి ఉంటాయి. హెచ్ఎండీఏ ఆమోదంతోనే అవి అమలవుతాయి. ఔటర్‌పైన పచ్చదనం నిర్వహణ పూర్తిగా హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును ఐఆర్బీ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ట్రామాకేర్ సెంటర్లను ఐఆర్బీ నిర్వహించనుంది. ఐఆర్బీ సంస్థకు లీజు ఆమోదపత్రం అందజేశాం. 120 రోజుల్లోపు ఐఆర్బీ బిడ్డింగ్ మొత్తాన్ని (రూ.7380కోట్లు) ఏకమొత్తంలో చెల్లించిన అనంతరమే ఔటర్‌ను అప్పగిస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈగిల్ ఇన్ఫ్రా సంస్థే టోల్ వసూలు చేస్తుంది. ఎవరెంత బిడ్ వేశారంటే.. ♦ మొత్తం ఈ బిడ్డింగ్ ప్రక్రియలో 11 సంస్థల్లో చివరకు నాలుగు మాత్రమే అర్హత సాధించాయి. ‘ప్రస్తుతం టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్ఫ్రా సంస్థ 30 ఏళ్ల ఔటర్ లీజుపై రూ.5634 కోట్లు, గవార్ కన్స్ట్రక్షన్స్ రూ.6767 కోట్లు, దినేష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7007 కోట్లు చొప్పున బిడ్ వేశాయి. ఐఆర్బీ అత్యధికంగా రూ. 7380 కోట్లతో ముందుకు వచ్చింది. తాము నిర్ణయించిన బేస్ ప్రైస్ కంటే ఇది ఎక్కువగా ఉండడంతో ఐఆర్బీ హెచ్–1 కింద లీజు పొందింది. ♦ బేస్ ప్రైస్ ముందే నిర్ణయించినప్పటికీ ఎన్హెచ్ఏఐ నిబంధనలతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే లక్ష్యంతో బేస్ ప్రైస్‌ను గోప్యంగా ఉంచాం. ఓఆర్ఆర్పై వస్తున్న సుమారు రూ.541 కోట్ల ఆదాయాన్ని రెవెన్యూ మ ల్టిపుల్ ఫార్ములా (ఆర్‌ఎంఎఫ్) ప్రకారం లీజు మొత్తంతో హెచ్చించగా 30 ఏళ్లలో అది రూ.1.30 లక్షల కోట్లకు సమానమవుతుందన్నారు. ఔటర్ బిడ్డింగ్‌లో ఆర్‌ఎంఎఫ్ 13.64 వరకు వచ్చింది. టీఓటీ విధానంలో ఇది ఉత్తమ ఆర్‌ఎంఎఫ్. ప్రస్తుతం ఔటర్‌పై ప్రతి రోజు సగటున 1.6 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రూ.1.48 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. -
వేల కోట్ల ఆదాయం.. ఓఆర్ఆర్ను అమ్మాల్సిన అవసరం ఏంటి? రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మణిహారంగా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్డును అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ను కేటీఆర్ ప్రైవేటుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సూమారు 30వేల కోట్లు ఆదాయం వచ్చే సంపదను రూ. 7,380 కోట్లకే కారుచౌకగా ముంబై కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఇందులో రూ. 1,000 కోట్లు చేతులు మారాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని.. తాము మేం అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. చదవండి: కొత్త సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందన్నారు. ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 2018 నుంచి టోల్ వసూలు బాధ్యత ఎవరికి ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కానీ.. ఉన్న వాటిని తాకట్టు పెట్టడం కాదని హితవు పలికారు. చదవండి: హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత -
హైదరాబాద్ బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పులి కలకలం
-
ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు
హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లాంగ్ లీజుకు ఇవ్వడానికి 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ' (HMDA) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేందుకు నాలుగు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని కోసం బిడ్డింగ్ సుమారు రూ. 8,000 కోట్లు వరకు ఉంటుంది. ఈ రేసులో ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు తమ బిడ్లను ఇప్పటికే హెచ్ఎండీఏకి సమర్పించాయి. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎల్‌అండ్‌టి, క్యూబ్ హైవేస్ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం, కానీ బిడ్లలో ఈ సంస్థలు పాల్గొనలేదు. బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ కోసం హెచ్ఎండీఏ టెండర్లను పిలిచింది. ఇందులో ఎక్కువ సంస్థలు పాల్గొనటానికి గడువు కూడా రెండు రోజులు పొడిగించింది. కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ప్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే టెక్నీకల్ కమిటీ మంగళవారం నుంచి టెక్నికల్ బిడ్లను మూల్యాంకనం (Evaluating) చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఫైనాన్సియల్ బిడ్ ప్రారంభమవుతుంది. దీనికోసం పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి & ఓఆర్ఆర్ టోల్ డిమాండ్‌పై ఉన్న సందేహాల వల్ల ఇప్పటికి కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనటానికి ఆసక్తి చూపాయి. అయితే ఈ బీడ్ సొంతం చేసుకునే కంపెనీ నాలుగు నెలల్లో మొత్తం డబ్బుని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. బిడ్లలో అవసరమైన మొత్తం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ-టెండర్ ప్రకటించే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి హెచ్ఎండీఏ ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ నుంచి టోల్ ఫీజు సంవత్సరానికి రూ. 415 కోట్లు వసూలు చేస్తోంది. ఓఆర్ఆర్ ని టోల్ ఆపరేట్ ట్రాన్స్పర్పై 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నట్లయితే, బిడ్డర్ నుంచి మొత్తం డబ్బుని పొందుతుంది. అయితే ORRని నిర్వహించడానికి హెచ్ఎండీఏపై ఎటువంటి భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తమ రోడ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లాంగ్ లీజుపై 'టోల్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్' (TOT)ని స్వీకరించింది. -
HYD: ఔటర్ లీజుపై డౌట్!. ‘ఆశించిన ఆదాయం ఉండదేమో’
సాక్షి, హైదరాబాద్: ఔటర్‌రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం ద్వారా రూ.వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల నుంచి నిరాసక్తత వ్యక్తమవుతోంది.158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ మార్గాన్ని 30 ఏళ్లు పాటు లీజుకు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టిన విషయం విదితమే. టోల్–ఆపరేట్– ట్రాన్స్ఫర్ (టీఓటీ)పద్ధతిలో లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించింది. సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా లీజు ప్రక్రియలో భాగంగా గత నెలలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 12 దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. వివిధ అంశాలపై కొన్ని సంస్థలు తమ సందేహాలను వ్యక్తం చేశాయి. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)తో ఔటర్‌పై వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టవచ్చని పలు సంస్థలు సందేహం వ్యక్తం చేశాయి. దీనివల్ల తమ పెట్టుబడులకు తగిన ఆదాయం లభించకపోవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం సుమారు 80 శాతం వాణిజ్య వాహనాలు ఔటర్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. పెరిగిన వాహనాల రాకపోకలు... వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లారీలు, ట్రక్కులు వంటి వాణిజ్య వాహనాలతో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా ఔటర్ నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. శంషాబాద్, నానక్‌రాంగూడ, నార్సింగి, పటాన్చెరు, కండ్లకోయ, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట్‌ల మీదుగా మొత్తం 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్ మార్గంలో ప్రతి రోజు లక్షకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ టోల్ నిర్వహణ చేపట్టింది. దీనిద్వారా ప్రభుత్వానికి ఏటా కొంత మొత్తంలో ఆదాయం లభిస్తోంది. రహదారులు, విద్యుత్, పచ్చదనం తదితర నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. ఔటర్ మార్గాన్ని లీజుకు ఇవ్వడం వల్ల భారీ ఎత్తున ఆదాయం లభిస్తుందని ప్రభుత్వ అంచనా. ఈ మేరకు ప్రణాళికలను రూపొందించి కార్యాచరణ చేపట్టారు. ఇదీ రీజినల్ రోడ్డు మార్గం.. ►ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరం దిశలో సంగారెడ్డి, కంది, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, చౌటుప్పల్ మీదుగా చేపట్టనున్నారు. దక్షిణం దిశలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా సంగారెడ్డికి చేరుకుంటుంది. రీజినల్ రింగ్ రోడ్డు మొత్తం 340 కి.మీ. ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ చేపట్టింది. మొదట ఉత్తరం వైపు ఆర్ఆర్ఆర్ పూర్తి చేసి అనంతరం దక్షిణం వైపు చేపట్టనున్నారు. ఆర్ఆర్ఆర్తో నగరంలోనూ, ఔటర్‌పై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అంచనా . ►ఆర్ఆర్ఆర్ ప్రత్యామ్నాయం.. ►ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే బెంగళూరు జాతీయ రహదారి మీదుగా అంతర్రాష్ట్ర వాహనాలు షాద్‌నగర్ వద్ద ఆర్ఆర్ఆర్ మీదుగా కంది మార్గంలో ముంబైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వాహనాలు శంషాబాద్ వద్ద ఔటర్‌పైకి ప్రవేశించి పటాన్చెరు నుంచి ముంబై రూట్లో వెళ్తున్నాయి. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు– ముంబై మధ్య నడిచే వాహనాలకు చాలా వరకు దూరం తగ్గడమే కాకుండా సమయం కూడా కలిసి వస్తుంది. ►బెంగళూరు జాతీయ రహదారి నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు చౌటుప్పల్ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌పైకి ప్రవేశించి షాద్‌నగర్ వరకు వెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ వాహనాలు ఔటర్‌పై పెద్దఅంబర్‌పేట్–శంషాబాద్ మార్గంలో వెళ్తున్నాయి. ప్రస్తుతం ఓఆర్ఆర్పై 80 శాతం ఆదాయం భారీ కమర్షియల్ వాహనాల నుంచే లభిస్తోంది. కంటైనర్లు, లారీలు, ట్రక్కులు వంటివి సుమారు 1.06 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ఈ వాహనాలు భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ వైపు మళ్లే అవకాశం ఉంది. -
ఔటర్, హైవేలపై జాగ్రత్త.. పొగ మంచులో ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ, వారాంతం కలిసి రావటంతో నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తెల్లవారుజామున ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత సూర్యకాంతిలో ప్రయాణించడం శ్రేయస్కరమని సూచించారు. వ్యక్తిగత వాహనాల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఔటర్, హైవేలపై జాగ్రత్త.. దట్టమైన పొగమంచు కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు, రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రహదారులలో వాహనాలను నిలపకూడదు. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు ఏమాత్రం నలత అనిపించినా, నిద్ర వచ్చినా రోడ్డు మీద వాహనాన్ని క్యారేజ్‌పై నిలివేయకుండా రోడ్డు దిగి ఒక పక్కన లేదా కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. పొగ మంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించదు. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. బ్రేకులు వేసేటప్పుడు వెనకాల వస్తున్న వాహనాలను అద్దాల నుంచి చూసి మాత్రమే వేయాలి తప్ప అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, ఇతర వాహన డ్రైవర్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా బీమ్ హెడ్లైట్లను వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి ► ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించాలి. ► హజార్డ్ లైట్లను ఆన్ చేసి ఉంచాలి. ► సెల్ఫోన్లో మాట్లాడుతూ, కారులో అధిక శబ్ధం మ్యూజిక్‌తో ప్రయాణించకూడదు. వెనకాల వచ్చే వాహనాల హారన్ వినిపించదు. ► పొగమంచులో ఎదుటి వాహనాలు, పశువులు స్పష్టంగా కనిపించవు. అందుకే తరుచూ హారన్ కొడుతూ ప్రయాణించడం ఉత్తమం. ► లేన్ మారుతున్నప్పుడు లేదా మలుపుల సమయంలో కిటికీలను కిందికి దింపాలి. దీంతో వెనకాల వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా వినిపిస్తుంది. ► ఐదారు గంటల పాటు కంటిన్యూగా డ్రైవింగ్ చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. (క్లిక్ చేయండి: పండుగ ప్రయాణం.. నరకయాతన) -
హైదరాబాద్ వాసుల్లో న్యూ ఇయర్ జోష్.. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు పూర్తిస్థాయిలో జరగనున్నాయి. యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలు కుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తక్కువ ధరలో ఎంట్రీ.. నగరవాసుల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే భావనతో చాలా వరకూ న్యూ ఇయర్ ఈవెంట్లకు ధరలను కొంతవరకు అందుబాటులోనే నిర్ణయించారు. సూపర్ సోనిక్ టేకోవర్ పేరుతో నోవోటెల్ నిర్వహిస్తున్న ఈవెంట్‌కి రూ.999 ఆపై ధరలోనే ఎంట్రీ ఫీజు నిర్ణయించగా... తాజ్ డెక్కన్ ఎ నైట్ ఇన్ ప్యారిస్.. థీమ్ ఈవెంట్ కు బుకింగ్ ధర రూ. 1200తో ప్రారంభించింది. పార్క్ హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పారీ్టకి రూ.2,499 ధర నిర్ణయించారు. పార్టీ యానిమల్స్‌కు కేరాఫ్ లాంటి ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్‌లో ది ప్రిజ్మ్ సర్కస్ ఈవెంట్‌కు రూ.4వేల నుంచి ధర నిర్ణయించారు. ఓపెన్ ఆడిటోరియంలలో నిర్వహిస్తున్న చాలా ఈవెంట్లకు రూ.1000కు సమీపంలోనే ధరలు ఉన్నాయి. తరలివస్తున్న సంగీతం... నోవోటెల్లో ఆర్టిస్ట్ ఎమ్కెషిÙఫ్ట్... (ఎమ్కెఎస్హెచ్ఎఫ్టీ) పేరొందిన లైవ్బ్యాండ్తో కలిసి నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నో పాజ్ పారీట్ల డిజెషాన్, ఆర్యన్ గాలా, రికాయాలు పాల్గొంటున్నారు. ఓం కన్వెన్షన్ దర్శన్ రావల్‌తో వేడుక ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు పాప్/సినీ గాయకుడు రామ్ మిరియాల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో థండర్ స్టైక్ పార్క్ పాటలతో అలరించనున్నారు. కంట్రీక్లబ్‌లో నిర్వహిస్తున్న ఈవెంట్లో డిజె ఆసిఫ్ ఇక్బాల్, గాయని అలీషా చినాయ్, అభిజిత్ సావంత్, బాంబే వైకింగ్స్, సినీతార స్నేహగుప్తా తదితరులు పాల్గొంటున్నారు. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ మస్కిరాడె మిస్టరీ పార్టీ, ఏషియన్ ఫీస్టా థీమ్ పార్టీని నిర్వహిస్తోంది. డిజె షరాన్, అమీర్లు అతిథులను ఉత్సాహపరచనున్నారు. వండర్లాలో.. సన్‌బర్న్.. కొన్నేళ్లుగా నగరంలో అతిపెద్ద పార్టీ ఈవెంట్‌గా పేరొందిన సన్‌బర్న్ తిరిగొచ్చింది. సన్‌బర్న్ రీలోడ్ ఈవెంట్ నగరశివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని.. ఇందులో ఇటాలియన్ సెన్సేషన్ జియాన్ నోబిలీ, డైనమిక్ డీజె ఈడీఎం సంగీతానికి పేరొందిన జెఫిర్టోన్ – టీ–మ్యాటర్స్‌తో పాటుగా డీజె వివాన్‌లు అతిధుల్ని అలరిస్తారని నిర్వాహకులు వివరించారు. మందుబాబులూ.. పారాహుషార్ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే వేళ.. డ్రంకెన్ డ్రైవ్‌లు చేపట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టనున్నారు. బార్లు, పబ్‌లు, వినోద కేంద్రాలు ఉండే వాణిజ్య ప్రాంతాల్లోని మార్గాలలో ట్రై కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని బృందాలు 31న రోజంతా విధులు నిర్వర్తిస్తారు. బ్రీత్ అనలైజర్లు, బారికేడ్లు ఇతరత్రా ఉపకరణాలను సిద్ధం చేశారు. మహిళా డ్రైవర్లు, మద్యం తాగిన మహిళలను తనిఖీలు చేస్తున్న సమయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి డీడీ చెకింగ్ కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు విధులు కేటాయించామని ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్.. ► 31 రాత్రి నుంచి జనవరి 1న తెల్లవారు జాము వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగ్ రోడ్డులతో పాటు ఫ్లైఓవర్లు మూసివేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. ► మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్, బైక్‌లపై విన్యాసాలు చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
చిగురిస్తున్న మెట్రో ఆశలు.. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో హారం...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పలు మార్గాల్లో మెట్రో మార్గం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన నేపథ్యంలో.. తాజాగా పలు ప్రాంతాల నుంచి మెట్రో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అధికార, విపక్ష పార్టీలు, వివిధ వర్గాల వారు మద్దతునిస్తుండడంతో నూతనంగా చేపట్టాల్సిన మెట్రో మార్గాలపై అధ్యయనానికి హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరు మెట్రో పూర్తికి సుమారు రూ.300 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. ఈ స్థాయిలో నిధులు వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్న విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యం, లేదా కేంద్ర సహకారంతో పలు రూట్లలో ప్రాజెక్టులు చేపట్టడం.. తొలుత ప్రైవేటు సంస్థలు చేసే వ్యయంతో పూర్తిచేసి ఆ తర్వాత వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు వడ్డీతో సహా చెల్లించడం (హైబ్రిడ్ యాన్యుటీ ) తదితర విధానాలపై సర్కారు దృష్టి సారించడం విశేషం. (క్లిక్ చేయండి: ఇక ఈజీగా ఆధార్ అప్డేట్) ఔటర్ చుట్టూ మెట్రో హారం... మహానగరానికి మణిహారంలా 158 కి.మీ మేర విస్తరించిన ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు మెట్రో రూటు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ 189 కి.మీలతో..
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం 189.23 కి.మీ. నిడివితో నిర్మాణం కానుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన మూడు అలైన్మెంట్లలో 189.23 కి.మీ. నిడివి ఉన్న అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. దీనికి ఈ వారంలో అధికారిక ఆమోదం లభించనుంది. అనంతరం అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) రూపొందించనున్నారు. జలాశయాలు.. చెరువులు.. గుట్టలను తప్పిస్తూ.. రీజినల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం ఓ కన్సల్టెన్సీని నియమించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ప్రాథమికంగా 182 కి.మీ. నిడివితో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ఆ తర్వాత ప్రాజెక్టు కొంత డోలాయమానంలో పడింది. అంతగా వాహనాల రాకపోకలు లేని మార్గం కావటంతో దక్షిణ భాగానికి నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్ వే అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆ తర్వాత కేంద్రప్రభుత్వం దక్షిణ భాగానికి ఆమోదిస్తూ గత ఆగస్టులో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీని నియమించింది. ప్రాథమిక అలైన్మెంట్ ఆధారంగానే ఈ సంస్థ క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి మార్పుచేర్పులతో మూడు వేరు వేరు అలైన్మెంట్లను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న షాద్‌నగర్, కంది, ఆమన్‌గల్.. తదితర రోడ్లలో కొంత భాగాన్ని ఆర్ఆర్ఆర్లోకి చేరుస్తూ రెండు అలైన్మెంట్లను రూపొందించింది. పాత ఎన్సల్టెన్సీ సంస్థ ప్రాథమికంగా రూపొందించిన పూర్తి గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను సరిదిద్దుతూ మూడో అలైన్‌మెంటును సిద్ధం చేసింది. ప్రాథమిక అలైన్మెంట్ నిడివిని పెంచనప్పటికీ, దానికి అడ్డుగా ఉన్న చెరువులు, గుట్టలను తప్పిస్తూ మార్పులు చేశారు. భవిష్యత్తులో నిర్మించే పాలమూరు ప్రాజెక్టు కాలువలను దృష్టిలో పెట్టుకుని చిన్న, చిన్న మార్పులు చేశారు. దీంతో పాత అలైన్మెంట్ కంటే దాదాపు ఏడు కి.మీ. అదనపు నిడివితో కొత్త అలైన్మెంట్ ఏర్పడింది. పాత రోడ్లను జత చేస్తూ రూపొందించిన రెండు అలైన్మెంట్లు ఆచరణ సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ తిరస్కరించింది. పూర్తి గ్రీన్‌ఫీల్డ్ మార్గంగా ఏర్పడ్డ మూడో అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. రూ.15 వేల కోట్ల వ్యయం? ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్న ప్రాథమిక అంచనా ఉండగా, ఇటీవల కేంద్రం రూ.13 వేల కోట్లతో దానికి బడ్జెట్ రూపొందించింది. రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. ఈ లెక్కన దక్షిణ భాగానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారిక వర్గాల అంచనా. పూర్తిస్థాయి డీపీఆర్ రూపొందించాక స్పష్టత వచ్చే అవకాశముంది. సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించే దక్షిణ భాగాన్ని కేంద్రప్రభుత్వం భారత్‌మాల పరియోజన పథకం–2 కింద ఎంపిక చేసింది. -
శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్.. 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు
సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు రయ్.. రయ్‌మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్‌లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్‌గా శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు ఇలా.. ♦ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. ♦ ఫ్లై ఓవర్ ఎక్కిన వాహనాలు ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్ ద్వారా ఔటర్‌పై కూడా దిగవచ్చు. ♦ ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లోనూ ఫ్లై ఓవర్ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్లై ఓవర్ ముగియగానే, లెఫ్ట్ తీసుకొని డెలాయిట్ రోడ్డులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్‌పైకి చేరుకోవచ్చు. సాఫీగా ప్రయాణం.. సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45కు వెళతాయి. ♦ అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్ హోటల్ , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే శిల్ప లేఅవుట్లోని ఫ్లై ఓవర్ పై నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. ♦ జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్ విమానాశ్రయం, బెంగళూర్ జాతీయ రహదారితో పాటు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్లవచ్చు. ♦ ఫ్లైఓవర్ నుంచి ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. ♦ శంషాబాద్ విమానాశ్రయం, పటాన్చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. జంక్షన్లపై తగ్గనున్న ఒత్తిడి ♦ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్‌కు వెళుతుంటాయి. లేదా గచి్చ»ౌలి జంక్షన్ నుంచి అంజయ్యనగర్‌లో రైట్ టర్న్ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్ స్పేస్ ప్లై ఓవర్‌కు చేరుకునేవి. ♦ శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్ వైపు వెళ్లాల్సిన పని లేదు. ♦ దీంతో గచ్చిబౌలి జంక్షన్లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్‌లోనూ తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.466 కోట్లు ►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) ►లైన్లు నాలుగు లేన్ల బై డైవర్షనల్ ఫ్లై ఓవర్ ►మెయిన్ ఫ్లైఓవర్ 956 మీటర్లు ►ఎగువ ర్యాంప్ 456.64 మీటర్లు ►దిగువ ర్యాంప్ 399.95 మీటర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ
సాక్షి, హైదరాబాద్: శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయని, తుది మెరుగులు దిద్ది ఈ నెలాఖరులో ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక ఐటీ ప్రాంతానికి రాకపోకలు మరింత సులభం కానున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకపోగా, కొత్త ఫ్లై ఓవర్ అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సైతం సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు) దీనివల్ల జూబ్లీహిల్స్, పంజగుట్టల నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్చెరు కోకాపేట్, నార్సింగి, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్లేందుకు.. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుందని పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన నిద్రమత్తు.. ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీ కొట్టిన వింగర్
మేడ్చల్‌రూరల్: శ్రీశైలంలో వెళ్లి వస్తున్న భక్తులు మరో అరగంటలో తమ ఇళ్లకు చేరుకుంటామనుకునేలోపు డ్రైవర్ నిద్ర మత్తు ఘోర రోడ్డు ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్‌గుప్త, చిట్కూల్ గ్రామానికి చెందిన సురేశ్ గుప్త కుటుంబసమేతంగా ఆదివారం తెల్లవారుజామున గుమ్మడిదల నుంచి వింగర్ వాహనంలో డ్రైవర్ నర్సింహారెడ్డితో కలిసి మొత్తం 12 మంది శ్రీశైలం బయలుదేరారు. స్వామి వారి దర్శనం అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మరో అరగంటలో తమ ఇళ్లకు చేరకుంటామనుకునేలోగా వారు ప్రయాణిస్తున్న వింగర్ వాహనం డ్రైవర్ నర్సింహారెడ్డి నిద్రమత్తులో ఔటర్ రింగురోడ్డుపై మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కండ్లకోయ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. (చదవండి: 'నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు') ఈ ఘటనలో డ్రైవర్ నర్సింహారెడ్డి(28), శంకర్‌గుప్త(46), సురేశ్‌గుప్త(45) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న 9 మందిలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు సికింద్రాబాద్ య శోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో ఇద ్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు శంకర్ గుప్త భార్య కాలు విరగ్గా, కుమార్తె ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు సమాచారం. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ విశ్రాంతి లేకుండా వాహనం నడపడంతో నిద్రమత్తుకు గురికావడం, అతివేగం ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని సీఐ తెలిపారు. (చదవండి: పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలను కిడ్నాప్‌చేసి సహజీవనం) -
‘ఔటర్’కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును గెలుచుకుంది. శుక్రవారం దక్షిణ కొరియాలోని జెజు నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) కార్యక్రమంలో హైదరాబాద్‌కు ఈ అవార్డు లభించింది. ఆరు కేటగిరీల్లో వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డులను ప్రకటించగా 18 దేశాలకు చెందిన నగరాలు ఫైనల్‌కు ఎంపికయ్యాయి. మన దేశం నుంచి హైదరాబాద్ ఎంపికయ్యింది. హరితహారంలో భాగంగా ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పచ్చదనానికి ‘లివింగ్ గ్రీన్’ విభాగంలో అవార్డు లభించింది. ఆకుపచ్చ అందాలతో ఔటర్ రింగ్‌రోడ్డు తెలంగాణ రాష్ట్రానికే పచ్చల హారంలా (గ్రీన్ నెక్లెస్) ఉన్నట్లు ఏఐపీహెచ్ అభివర్ణించింది. నగరానికి ఈ అవార్డు లభించడం పట్ల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ అధికారుల కృషిని అభినందించారు. హరిత భారతం కోసం కృషి చేయాలి: కేసీఆర్ తెలంగాణను మరింత ఆకుపచ్చగా మార్చుతూ, హరిత భారతాన్ని రూపొందించేందుకు అందరూ కృషి చేయాలని సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు. హైదరబాద్ నగరానికి ప్రతిష్టాత్మక ‘వరల్డ్ గ్రీన్ సిటీ’అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) అందించిన ఈ అంతర్జాతీయ అవార్డు ప్రపంచ వేదికపై తెలంగాణతో పాటు దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసిందన్నారు. మనదేశం నుంచి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వించదగ్గ విషయమన్నారు. -
ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మణికొండ: ప్లైఓవర్‌పై నుంచి ఔటర్‌రింగ్ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా, మద్డూరు మండలం, చింతల్‌పేట్ గ్రామానికి చెందిన భీమప్ప(30) గత కొంత కాలంగా నార్సింగి మున్సిపల్ కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అతను స్థానిక ఫ్లై ఓవర్‌పై నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపైకి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రాణాలు తీసిన వేగం) -
ఓఆర్ఆర్పై కారు ప్రమాదం.. టీఆర్ఎస్ నేత కుమారుడు దుర్మరణం
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను హ్యుందాయ్ వెర్నా కారు బలంగా ఢీకొట్టింది. కారు బోల్తాపడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మాజీ ఎంపీపీ కొడుకు చనిపోయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా గుర్తించారు. దినేష్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కొడుకు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నల్లగొండలోనీ వీటి కాలనీలోని రేగట్టే స్వగృహానికి ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ టీఆర్ఎస్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి పరామర్శించారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ రద్దు
-
బొల్తాపడిన కూల్‌డ్రింక్స్ లారీ.. పండగ చేసుకున్న జనం
-
ఓఆర్ఆర్పై బోల్తాపడ్డ కూల్‌డ్రింక్స్ లారీ.. ఎగబడ్డ జనం..
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: కూల్‌డ్రింక్స్ లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడిన సంఘటన ఔటర్ రింగ్‌రోడ్డుపై చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ లారీలోంచి పడిన కూల్‌డ్రింక్స్ బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం ఎగపడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కూల్‌డ్రింక్స్ లోడుతో ఉన్న భారీ లారీ తుర్కయాంజాల్ వైపు నుంచి పెద్దఅంబర్‌పేట ఔటర్ మీదుగా ఘట్కేసర్ వైపుకు వెళ్తున్న క్రమంలో లారీ ముందు టైర్లు ప్రమాదవశాత్తు పేలగా లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న కూల్‌డ్రింక్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సమయంలో ఔటర్‌పై ప్రయాణిస్తున్న వాహనదారులు అక్కడ ఆగి రోడ్డుపై పడిన కూల్‌డ్రింక్స్ బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. దీంతో ఔటర్‌పై వాహనాలు భారీగా నిలిచిపోగా విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. చదవండి: ఈనెల 24న యువతి నిశ్చితార్థం.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని -
సడన్ బ్రేక్ వేసిన లారీ డ్రైవర్.. కిందకు దూసుకెళ్లిన కారు.. ఎస్ఐ మృతి
పహాడీషరీఫ్: ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్.. సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు, ముందున్న లారీ కిందకు దూసుకెళ్లి వాహనాన్ని నడుపుతున్న ఎస్ఐ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున జరిగింది. మహబూ బ్‌నగర్ జిల్లా ధర్మ పూర్ గ్రామానికి చెందిన పల్లె మాస య్యగౌడ్ కుమారుడు పల్లె రాఘవేందర్ (37) రైల్వే ఎస్ఐగా పని చేస్తు న్నారు. శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూ రులోని బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్టులో నివసించే స్నే హితుడు బాబురెడ్డిని కలిసేందుకు మహబూబ్‌నగర్ నుంచి తన స్విప్ట్ డిజైర్ కారులో బయ లుదేరారు. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకాల ఉన్న ఎస్ఐ రాఘవేందర్ తన కారును నియంత్రించ లేకపోవ డంతో ఒక్కసారిగా లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. -
ఆర్ఆర్ఆర్పై వాహనాల వేగం 120 కి.మీ. మలుపే లేకుండా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ రహదారులను 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి వీలుగా నిర్మిస్తున్నా ఆర్ఆర్ఆర్ను మాత్రం ఇంకో 20 కి.మీ. ఎక్కువ వేగంతో వెళ్లేలా నిర్మించనున్నారు. వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరిగే పరిస్థితి లేకుండా 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదుపుతప్పిన వాహనాలు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లకుండా సెంట్రల్ మీడియన్‌కు కూడా క్రాష్ బారియర్లు పెట్టనున్నారు. ఇలా సరికొత్త హంగులతో ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకోబోతోంది. మలుపుల ప్రభావం లేకుండా.. సాధారణంగా రోడ్డు మలుపులే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుంటాయి. ఇందుకే చాలా రోడ్లపై వెళ్లాల్సిన వేగం కన్నా తక్కువ వేగానికే పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై 80 కి.మీ. వేగ పరిమితి బోర్డులు కనిపిస్తుండటం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ పెట్టి మరీ వాహనదారులను నియంత్రిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఆర్ఆర్ఆర్ను డిజైన్ చేస్తున్నారు. జాతీయ రహదారులపై మలుపుల ప్రభావం లేకుండా 700 మీటర్ల ముందు నుంచే రోడ్డు మలుపునకు వీలుగా వాలు ఉండేలా చూడాలని ప్రమాణాలు నిర్ధారించారు. దీని వల్ల ఎక్కడా మలుపు ఉన్న భావన రాదు. ఎక్స్‌ప్రెస్ వేల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్కు 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంటే మలుపు ఉన్న ప్రాంతానికి 2.5 కి.మీ. ముందు నుంచే రోడ్డు డిజైన్ వాలుగా మారుతుంది. సాధారణంగా మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పకుండా రోడ్లపై ఔటర్ లైన్ ఎత్తుగా ఉంటుంది. ఇదీ కొన్ని వాహనాలకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆర్ఆర్ఆర్కు 2.5 కి.మీ. దూరం నుంచే మలుపు డిజైన్ చేస్తున్నందున ఔటర్ లైన్ సమతలంగానే ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పాత అలైన్మెంట్ సమయంలో కాళేశ్వరం కాలువలు నిర్మించలేదు. దీంతో కాలువలు, ఇతర జలాశయాలు, చానళ్లను తప్పిస్తూ రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను ఇటీవల ఖరారు చేశారు. వీటిని తప్పించాల్సి రావడంతో భారీ మలుపులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా, మలుపుల ప్రభావం లేకుండా రెండున్నర కిలోమీటర్ల నుంచి వాహనాలు మలిగేలా రోడ్డు నిర్మిస్తున్నారు. 4 వరుసల క్రాష్ బారియర్లు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులకుచివర్లలో ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు చివర్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు వరుసల్లో వీటిని ఆర్ఆర్ఆర్పై ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు చివర్లలో రెండు వైపులా రెండు వరుసలతో పాటు సెంట్రల్ మీడియన్ వైపు మరో వరుస చొప్పున మూడు అడుగుల ఎత్తులో వీటిని పెట్టనున్నారు. సాధారణంగా సెంట్రల్ మీడియన్‌లో డివైడర్ తరహాలో ఒక అడుగు ఎత్తుతో రాతి వరుస నిర్మించి మధ్యలో మట్టి నింపి మొక్కలుపెడతారు. కానీ చాలా చోట్ల వాహనాలు అదుపు తప్పినప్పుడు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లి ఎదురు వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఆర్ఆర్ఆర్లో సెంట్రల్ మీడియన్‌కు ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రాష్ బారియర్ ఉన్నందున ఎత్తుగా రాతి నిర్మాణం ఉండదు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..
శంషాబాద్ రూరల్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు. విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. (చదవండి: ‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!) రూ.6 కోట్లతో విస్తరణ పనులు.. ఎయిర్‌పోర్టు లోపల నుంచి కార్గో వాహనాల కోసం గొల్లపల్లి శివారు వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం ఇది వరకే పూర్తి చేశారు. శంషాబాద్ నుంచి గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వరకు ఉన్న రహదారితో ఎయిర్‌పోర్టు రోడ్డును గొల్లపల్లి వద్ద అనుసంధానం చేస్తున్నారు. దీంతో గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్ వరకు ఉన్న దారిని సుమారు రూ.6 కోట్లతో విస్తరిస్తున్నారు. 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ దారిని ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గం ఇలా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరానికి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి గొల్లపల్లి నుంచి ఔటర్ జంక్షన్ మీదుగా పీ– వన్ రోడ్డు మీదుగా చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంగా ఈ రహదారిని నిర్ణయించడంతో ఈ మార్గంలో మొక్కలు, అందమైన పూల మొక్కలను నాటుతున్నారు. పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వద్ద రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’) -
పెరుగుతున్న టోల్‌ప్లాజాల సంఖ్య..
సాక్షి, హైదరాబాద్: గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై 23 టోల్‌ప్లాజాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 27కు పెరిగింది. మరో నాలుగైదు రాబోతున్నాయి. గతంలో రాష్ట్ర రహదారులుగా ఉన్న రోడ్లను జాతీయ రహదారులుగా మారుస్తుండటంతో వాటిపై కొత్తగా టోల్గేట్లు ఏర్పాటవుతున్నాయి. కొత్తగా నగర శివారులోని ఔటర్ రింగు రోడ్డు నుంచి మెదక్ వరకు ఏర్పడ్డ జాతీయ రహదారిపై నర్సాపూర్ చేరువలోని గుమ్మడిదలలో టోల్గేట్ ఏర్పాటు చేశారు. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు కొత్తగా జాతీయ రహదారిని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిట్లంపల్లి వద్ద కొత్తగా టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఇక జడ్చర్ల–కల్వకుర్తి రోడ్డులో మున్ననూరు వద్ద, ములుగు–భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై జవహర్‌నగర్ వద్ద మరో టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఈ నాలుగింటి వల్ల కూడా టోల్ వసూళ్లు కొంతమేర పెరిగాయి. ఇక గత ఏడాది కాలంలో వాహనాల సంఖ్య కూడా కొంత పెరగటంతో ఆ మేరకు వసూళ్లు పెరిగాయి. -
లారీని ఢీకొన్న కారు..
-
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
సాక్షి, మేడ్చల్: కీసర: ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్ డివైడర్‌ను కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సతీమణితో పాటు సమీప బంధువులు ఉన్నారు. శుభకార్యం కోసం చీరాలకు... సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్న కార్యంపూడి వెంకట మురళీధర్ ప్రసాద్ తన కుటుంబంతో మూసాపేటలో నివాసముంటున్నారు. ఈయన భార్య శంకరమ్మ (48) ప్రభుత్వ టీచర్. శంకరమ్మతో పాటు ప్రసాద్ అన్న కుమారుడు కార్యంపూడి బాలకృష్ణమూర్తి (48), ఈయన భార్య రేణుక (42), కుమారుడు భాస్కర్లు (జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థి) ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరితో పాటు బాలకృష్ణమూర్తి సోదరుడు కూడా వీరితో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పుడే డ్రైవింగ్ అప్పగించిన భాస్కర్... చీరాల నుంచి పెద్ద అంబర్‌పేట వరకు ఈ వాహనాన్ని భాస్కర్ డ్రైవ్ చేశారు. అక్కడ ఎల్బీనగర్ వైపు వెళ్లాల్సి ఉండటంతో బాలకృష్ణ మూర్తి సోదరుడు దిగిపోయారు. ఆ తరువాత బాలకృష్ణమూర్తి డ్రైవింగ్ సీటులోకి వచ్చారు. ముందు సీట్లో భాస్కర్, వెనుక సీటులో శంకరమ్మ, రేణుక కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ వాహనం కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ దాటి యాద్గార్పల్లి వరకు వెళ్లింది. అక్కడ ఎదురుగా వెళ్తున్న లారీ మరో లైన్ నుంచి వీరు ప్రయాణిస్తున్న లైన్లోకి వచ్చింది. గమనించిన బాలకృష్ణమూర్తి ప్రమాదాన్ని తప్పించుకోవడానికి కుడి వైపునకు తిప్పారు. కారు వేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొంది. ఈ ప్రభావంతో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. వెనుక సీట్లలో కూర్చున్న శంకరమ్మ, రేణుకలు పైకి ఎగిరడంతో వారి తలలకు కారు టాప్ బలంగా తగిలింది. ఈ దుర్ఘటనలో వారిద్దరూ కారులోనే ప్రాణాలు వదిలారు. డ్రైవింగ్ చేస్తున్న బాలకృష్ణమూర్తి సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ స్టీరింగ్ బలంగా ముఖానికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న భాస్కర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మూసాపేట ఆంజనేయనగర్‌లో కేవీఎం ప్రసాద్ నివాసానికి తరలించారు. అక్కడకు వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీపీ షికా గోయల్, సంయుక్త సీపీ అవినాష్ మహంతి నివాళుల్పించారు. చదవండి: Khammam: చిన్నారిపై బాలుడు అఘాయిత్యం -
కీసర ఔటర్ రింగ్‌రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
-
ఆర్టీసీకి లాభాల రుచి చూపాలి
చమురు ధర రూపాయి పెరిగితే సాలీనా ఆర్టీసీపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతోంది. దీన్ని నివారించాలంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులను అంచనా వేసి ఆయిల్ ప్రైస్ హెడ్జింగ్ ద్వారా ముందుగానే చమురు ధరను కోట్ చేసి బల్క్‌గా ఆర్డరిస్తే భారీ ఆదా అవుతుంది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ డిపోల్లో సింహభాగం వాటిని ఖాళీ చేసి ఔటర్ రింగురోడ్డు చేరువలో కొత్త డిపోలు ఏర్పాటు చేసుకోవాలి. నగరంలోని స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తే ఆర్టీసీకి భారీగా ఆదాయం వస్తుంది. – సాక్షి, హైదరాబాద్ ఇవన్నీ ఆర్టీసీ అధికారుల ద్వారా వ్యక్తమైన కొన్ని సూచనలు. నష్టాలు, ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని రెండు, మూడేళ్లలో బ్రేక్ ఈవెన్ స్థాయికి తీసుకెళ్లి క్రమంగా లాభాల బాటన నడిపించేందుక సంస్థ ఎండీ సజ్జనార్ భారీ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా అధికారులతో మేధోమథన సదస్సు నిర్వహించారు. వీటిని ఫలప్రదం అయ్యేలా నిర్వహించటంలో అనుభవం ఉన్న హంస ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ సౌజన్యంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహించారు. బస్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రయంలో ఈడీలు, అన్ని విభాగాల అధిపతులు, కొందరు ఎంపిక చేసిన డీవీఎంలు, కొందరు డిపో మేనేజర్లు పాల్గొన్నారు. మూడు అంశాలు ప్రామాణికంగా.. ప్రయాణికుల సంతృప్తి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం.. ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవటం.. ఈ మూడు అంశాలు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు జరిగింది. పాల్గొన్న వారిని ఐదు సమూహాలుగా విభజించి, ప్రధాన ఎజెండాలోని మూడు అంశాలపై అంతర్గతంగా చర్చించుకుని సలహాలు ఆహ్వానించారు. వారి నుంచి వచ్చిన సూచనలపై చర్చిస్తూ సదస్సును నిర్వహించారు. కొంతకాలంగా ఆర్టీసీకి దూరమవుతున్న ప్రయాణికులను తిరిగి రప్పించటం, వారి సంఖ్యను మరింత పెంచుతూ ఆర్టీసీని ప్రజలకు చేరువ చేయాలంటే పాటించాల్సిన అంశాలు, ఉద్యోగుల సంక్షేమం విషయంలో చేయాల్సిన మార్పులు, ఆర్టీసీ, కార్గో లాంటి దాని అనుబంధ విభాగాల్లో ఖర్చు తగ్గించి ఆదాయం మరింత పెరగాలంటే చేయాల్సిన పనులు.. ఇలా ఎన్నో సూచనలు వచ్చాయి. వాటి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. నాలుగు బృందాలు.. నాలుగు సెమినార్లు.. ఇందులో వ్యక్తమైన అంశాలే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆలోచనలను ప్రోది చేసి వాటిని ప్రాక్టికల్‌గా అన్వయించుకోవటం, చేయాల్సిన మార్పులపై సూచనలు చేయటం కోసం ఈడీల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కొంతకాలం ఈ మేధోమధనంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మరో నాలుగు సెమినార్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తయ్యాక, అనుసంరించాల్సిన అంశాలపై ఓ స్పష్టత తెచ్చుకుని, ప్రాక్టికల్‌గా ఫలవంతమయ్యే వాటిని ఎంపిక చేసి అమలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇలా మరో రెండు నెలల తర్వాత అమలు కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించారు. సూచనలు ఇవీ.. ►బస్సులు శుభ్రంగా ఉండాలి, ఆకట్టుకునేలా సిబ్బంది యూనిఫాంలో కనిపించాలి. ప్రయాణికులతో స్నేహంగా మెలగాలి. ►బస్సులు వేళకు రావాలి. వాటి నిర్వహణ, సమయ పట్టిక పూర్తి శాస్త్రీయం గా ఉండాలి. బస్సులు ఎక్కడ ఉన్నాయో, ఎప్పుడు వస్తాయో ప్రయాణికులకు తెలిసేలా జీపీఎస్ ఆధారిత ఆధునిక, సులభ పరిజ్ఞానం అమలు చేయాలి. ►ఒకటో తేదీన తప్పకుండా జీతాలు ఇస్తూ, కార్మికులు చనిపోతే కనీసం రూ.10 లక్షలు చెల్లించే బీమా వసతి ఉండాలి. ►ఆర్టీసీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్)కి పూర్తి బకాయిలు చెల్లించి దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి దాని ద్వారా ఉద్యోగులు రుణాలు పొందే పరిస్థితి అవసరం. ►స్లీపర్ సర్వీసులను ఆర్టీసీలో ప్రారంభించాలి. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తి ప్పుతూ, రద్దీ అంతంత మాత్రంగా ఉ న్న ప్రాంతాల్లో ట్రిప్పుల సంఖ్య తగ్గించాలి. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించే వారికి రాయితీ ధరలు కల్పించాలి. -
ఔటర్‌పై కారు దగ్ధం ఒకరు సజీవ దహనం
శంషాబాద్ రూరల్: రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దగోల్కొండ సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న హోండా అమేజ్ (ఏపీ27–సీ0206) కారు నానక్‌రాంగూడ టోల్‌గేటు వద్ద రాత్రి 7.09 గంటలకు ప్రవే శించింది. అక్కడి నుంచి శంషాబాద్ మీదుగా పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే కారులో మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న వ్యక్తి కారును రోడ్డు పక్కకు పార్కు చేసేలోపే మంటలు పూర్తిగా వ్యాపించడంతో సజీవ దహనం అయ్యాడు. ఘటన సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియరాలే దు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లింక్ రోడ్డుపై ఏసీబీ విచారణ
మణికొండ: ఓ వైపు హైదరాబాద్ చుట్టూరా లింక్, స్లిప్ రోడ్లను అభివృద్ది చేసి ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాభివృద్ది శాఖలు ప్రయత్నిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా హెచ్ఎండీఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 2015లో భూసేకరణ చేసిన స్థలంలోనే ఏకంగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లకు 2017లో అనుమతులు జారీ చేసింది. దాంతో హైదరాబాద్ శివారు, ఐటీ జోన్‌కు పక్కనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల ప్రజలకు ఔటర్‌రింగ్ రోడ్డును కలుపుతూ అందుబాటులోకి రావాల్సిన లింక్ రోడ్డు రాకుండా పోయింది. అదే విషయాన్ని మార్చి 25న ‘సాక్షి’ దినపత్రిక మొదటి పేజీలో ‘రోడ్డెందుకు సన్నబడింది’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. దాంతో స్పందించిన మంత్రి కె.తారకరామారావు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్ అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. అదే కథనానికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిలు పట్ణణాభివృద్ది శాఖ మంత్రికి మాస్టర్ ప్లాన్‌లో చూపిన విధంగా అలకాపూర్ టౌన్షిప్ మీదుగా వంద అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అడ్డుగా వచ్చిన అపార్ట్మెంట్లను కూల్చాలని లేఖ రాశారు. అప్పట్లోనే ఓ స్థాయి విచారణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దానికి అంగీకరించని ప్రభుత్వం ఏకంగా ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ అధికారుల పరిశీలన నార్సింగ్, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అలకాపూర్ టౌన్షిప్ మీదుగా రేడియల్ రోడ్డు 4 నుంచి రేడియల్ రోడ్డు 5 వరకు నిర్మించాల్సిన వంద అడుగుల లింక్ రోడ్డును గురువారం ఏసీబీ, హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్, ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు పరిశీలించారు. రోడ్డు మధ్యల వరకు అపార్ట్మెంట్ల సముదాయానికి అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు కొలతలు, రోడ్డులోకి వచ్చిన భవనం కొలతలను తీసుకున్నారు. అనుమతులు జారీ చేసే సమయంలో రోడ్డు స్థలాన్ని ఎందుకు పట్టించుకోలేదని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. రోడ్డుకు చెందిన ఎంత స్థలం ఆక్రమణకు గురైందో మరింత లోతుగా సర్వే చేసి నివేదికను అందజేయాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. విచారణలో హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ అధికారులు కృష్ణకుమార్, నారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ దీపిక, స్థానిక టీపీఎస్ సంతోష్‌సింగ్, ఏసీబీ అధికారులు శరత్‌లతో పాటు మరికొంత మంది పాల్గొన్నారు. -
హైదరాబాద్: అప్పా జంక్షన్ సమీపంలో ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం
-
హైదరాబాద్ ఓఆర్ఆర్పై కారు బోల్తా
-
ఔటర్‌పై ఇక రైట్..రైట్..
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఎట్టకేలకు అన్ని వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. తాజా లాక్డౌన్ ఆదేశాల (జీవో 68) ప్రకారం 158 కిలోమీటర్ల రహదారిపై అనుమతి ఉన్న అన్ని వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు, భారీ వాహనాలకు మాత్రం 24 గంటల పాటు రాకపోకలు సాగించొచ్చని హెచ్ఎండీఏ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్త ఆదేశాలిచ్చారు. అయితే మంగళవారం నుంచే ఓఆర్ఆర్పై అన్ని వాహనాల రాకపోకలకు ఎంట్రీ ఇవ్వకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, నిర్ణయం తీసుకోవడంలో ఇరు ప్రభుత్వ విభాగాలు తాత్సారం చేస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ ‘ఔటర్‌పై డౌట్’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు అన్ని వాహన రాకపోకలకు బుధవారం రాత్రి 12 గంటల నుంచి అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయాన్ని సైబరాబాద్, రాచకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహన రాకపోకలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్యసేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేదని, ఇక నుంచి అన్ని వాహనాల రాకపోకలు సాగుతాయని, అయితే కొన్ని అంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. (చదవండి: ఔటర్‌పై డౌట్!) రాత్రిళ్లు అనుమతి లేదు.. రాజధానితో పాటు శివారు ప్రాంతాల రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఓఆర్ఆర్లో వాహన రాకపోకలను అనుమతిచ్చారు. అయితే చిన్న, తేలికపాటి వాహనాలు (కారులు, చిన్న సరుకు రవాణా వాహనాలు) కర్ఫ్యూ సమయమైన రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించరు. ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలు తక్కువ వేగంతో వెళ్లే వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉండటంతో రాత్రి సమయాల్లో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలను విశ్రాంతి కోసంఓఆర్ఆర్పై నిలిపేస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొడితే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉండటంతో చిన్న, తేలికపాటి వాహన రాకపోకలను రాత్రి పూట నిషేధించారు. నిబంధనలు పాటించాల్సిందే.. ఓఆర్ఆర్పై తొలి 2 లేన్లు (సెంట్రల్ మీడియన్‌కు పక్కనే ఉండే కుడివైపు లేన్లు) గంటకు 100 కిలోమీటర్ల వేగంతో, ఎడమవైపు లేన్లలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. ప్రయాణికులను తీసుకెళ్లే గూడ్స్ వెహికల్స్‌ను ఓఆర్ఆర్లో అనుమతించరు. అలాంటి వాటి వివరాలను టోల్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి అప్పజెప్పుతారు. ‘సురక్షితమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి. వేగ పరిమితి మించొద్దు. లేన్ రూల్స్ అనుసరించాలి. గతంలోలాగే స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో వాహనాలు వేగాన్ని పసిగట్టి ఈ–చలాన్లు జారీ చేస్తాం’అని సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు విజయ్‌కుమార్, దివ్యచరణ్రావు తెలిపారు. ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకే ప్రాధాన్యం ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్ టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్ఎండీఏ నిర్దేశించింది. ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలు చెల్లించాలని హెచ్ఎండీఏ సూచించింది. -
‘ఔటర్’పై రైట్ రైట్!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) మళ్లీ వాహనాల రాకపోకలతో కళకళలాడనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా అత్యవసర సేవలు, నిత్యావసర సరుకు వాహనాలు మినహా ఇతర వాహనాల రాకపోకల్ని నెలన్నర క్రితం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఓఆర్ఆర్ విభాగాధికారులు నిలిపివేశారు. తాజాగా ఐటీ విభాగ కంపెనీలకు 33 శాతం సిబ్బందితో పనిచేసే వెసులుబాటునివ్వడం, ఇతర వ్యాపార సంస్థల కార్యకలాపాలు మొదలుకావడంతో ఓఆర్ఆర్పై అన్ని వాహనాలకు అనుమతినిచ్చే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా వాహనాల రాకపోకలతో వచ్చే టోల్ఫీజుతో మరింత సమర్థంగా ఓఆర్ఆర్ను నిర్వహిస్తూ, వాహనాల రాకపోకలను సాఫీగా సాగేలా చూడాలని యోచిస్తున్నారు. శనివారం నుంచే వాహన రాకపోకలను అనుమతించాలనుకున్నా.. కేంద్రం లాక్డౌన్ నిబంధనల్లో ఇచ్చే సడలింపుల ఆధారంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారం కేంద్రం నిబంధనలు సడలించే అవకాశం ఉండడంతో వీలైతే సోమవారం నుంచే ఓఆర్ఆర్లో అన్ని వాహనాలకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా, 50 రోజుల లాక్‌డౌన్‌తో టోల్‌ఫీజు రూపేణా రూ.40 కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. నగరం, శివార్లలో ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట! లాక్‌డౌన్‌కు ముందు రోజూ ఓఆర్ఆర్పై లక్షా 30వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. లాక్డౌన్ సమయంలో మాత్రం రోజూ 3వేల వరకు తిరిగాయి. తాజాగా వాహనాలకు అనుమతిస్తే.. నగరం, శివార్లలో తలెత్తే ట్రాఫిక్ సమస్యలు కొంత తగ్గుతాయని ఆ విభాగాధికారులు చెబుతున్నారు. అలాగే, ఓఆర్ఆర్ వెంట వాహనదారులకు సకల సౌకర్యాలు కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇప్పటికే రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం కోసం తొలుత ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటును గాడిన పెడతామని అంటున్నారు. -
ఓఆర్ఆర్పై మృత్యు 'వలస'
సాక్షి, రంగారెడ్డి / శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ శివారులో ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్, యాద్గిర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు కుటుంబాలు తమ పిల్లలతో కలిసి సూర్యాపేటలో రహదారి పనులు చేయడానికి గత నెలలో వలస వచ్చాయి. లాక్డౌన్ కారణంగా అక్కడ పనులు నిలిచిపోవడంతో స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. దీంతో వారిని ఇక్కడ పనికి కుదిర్చిన మేస్త్రీ.. కర్ణాటకకు చెందిన బొలేరో ట్రక్కును రప్పించాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు వీరంతా ట్రక్కులో బయల్దేరారు. పెద్దఅంబర్‌పేట జంక్షన్ నుంచి ఔటర్ మీదుగా వీరి వాహనం పెద్దగోల్కొండ శివారుకు అర్ధరాత్రి చేరుకుంది. ట్రక్కులో పది మంది చిన్నారులతో కలిపి 28 మంది ఉన్నారు. లోడ్ ఎక్కువగా ఉండడంతో పాటు వెనక టైర్లో గాలి తగ్గిపోవడంతో వాహనం వేగం ఒక్కసారిగా తగ్గింది. అదే సమయంలో నూజివీడు నుంచి మామిడికాయల లోడుతో వస్తున్న లారీ వేగంగా వీరి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు వెనక భాగంలో కూర్చున్న వారు రెండు వాహనాల మధ్య ఇరుక్కున్నారు. కొందరు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఐదుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ ఇద్దరు మృతి చెందారు. మృతులు వీరే.. హుబ్లీ నివాసి బి.శెట్టి (45), రాయదుర్గం వాసులు రంగప్ప (32), శరణప్ప (30), శ్రీదేవి అలియాస్ సిరియమ్మ (8), కక్కెరకు చెందిన బసమ్మ(32), హనుమంతప్ప (2), అమ్రిశ్ (25). ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలించారు. కాగా, ప్రమాద బాధిత కుటుంబాలను పోలీసులు శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన షెల్టర్‌కు తరలించారు. 8 మంది చిన్నారులు, ముగ్గురు పురుషులు, ఆరుగురు మహిళలు ఇందులో ఉన్నారు. వీరికి కన్నడ తప్ప మరేమీ రాకపోవడంతో వివరాలు సేకరించడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం వీరిని ప్రత్యేక బస్సులో స్వస్థలాలకు పంపించారు. డీసీపీ ప్రకాష్‌రెడ్డి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఒకే కుటుంబంలో ముగ్గురు.. కర్ణాటక యాద్గిర్ జిల్లా కక్కెరకు చెందిన సోమన్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. పెద్ద కూతురు రేఖమ్మను ఇంటి వద్ద వదిలి భార్య బసమ్మ, ముగ్గురు పిల్లలతో పాటు తన తమ్ముడు బుడ్డప్ప, పూజమ్మ దంపతులు, మరో తమ్ముడు అమ్రేశ్‌తో కలిసి సూర్యాపేటకు ఉపాధి కోసం వచ్చారు. ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమన్న భార్య బసమ్మ, కొడుకు హన్మంతు, తమ్ముడు అమ్రేశ్ మృతి చెందారు. వీరితో పాటు పని కోసం వీరిని ఇక్కడకు రప్పించిన మేస్త్రీ కూడా చనిపోయాడు. ‘పనుల్లేకపోవడంతో అందరం ట్రక్కులో ఊరికి బయల్దేరాం. చిన్నపిల్లలు పెద్దల ఒడిలో నిద్రపోతున్నారు. అంతలో వెనక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. గాయాలైన నా భార్య, కొడుకు, తమ్ముడు మరికొందరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికేం జరిగిందో తెలియడం లేదు. చనిపోయినట్లు చెబుతున్నారు. మేమంతా ఇక్కడ రాత్రి నుంచి మా వారి క్షేమం కోసం దేవున్ని వేడుకుంటున్నాం’అని సోమన్న అనే బాధితుడు రోదిస్తూ చెప్పాడు. -
శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
-
‘దిశ’ ఘటన; అధికారుల దిద్దుబాటు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు తొండుపల్లి టోల్గేట్ ప్లాజా సర్వీసు రోడ్డు వద్ద ‘దిశ’పై గతేడాది నవంబర్ 27న అత్యాచారం, ఆపై చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద మృతదేహం కాల్చివేత ఘటనతో ఉలిక్కిపడిన హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగాధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఆ ఘటనలు జరిగిన సమయాల్లో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న వాదన రావడంతో హెచ్ఎండీఏ అనుబంధ విభాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఓఆర్ఆర్ విభాగాధికారులు మేల్కొన్నారు. అప్పటి హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిచందన దాసరి ఆదేశాలతో డిసెంబర్లో ఓఆర్ఆర్ అండర్‌పాస్‌లలో ఎల్ఈడీ, సౌర లైట్లు అమర్చేందుకు టెండర్లు పిలిచారు. 158 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓఆర్ఆర్కు ఉన్న 165 అండర్‌పాస్ వేలలో రూ.1.90 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. బుధవారం నుంచి అన్నిచోట్లా ఈ వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు చెబుతున్నా, కొన్నిచోట్లా మాత్రం ఇంకా పనులు పూర్తికాలేదని కిందిస్థాయి సిబ్బంది అంటున్నారు. ఏదేమైనా దిశ ఘటనతో అధికారులు మేల్కొని రాత్రివేళల్లో వెలుగులు ఉండేలా చూడటం శుభ పరిణామమని వాహ నదారులు అంటున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, మహిళల భద్రతకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. -
ఔటర్‌పై జర్నీ ఇక బేఫికర్
ఘట్కేసర్ నుంచి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మార్గమధ్యలో వెళ్తున్న కారును వెనక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి స్వల్ప గాయ మైంది. అదే మార్గంలో వెళ్తున్న మరో వాహనదారుడు ఈ ఘటన చూసి పోలీసు లకు సమాచారం అందిం చాలనుకున్నాడు. అయితే సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగాలేక కనెక్ట్ కాలేదు. ఆ వెంటనే అక్కడే మెయిన్ క్యారేజ్‌వేపై ఉన్న ఎమర్జెన్సీ కాల్బాక్స్ ద్వారా చేసిన కాల్ వారి ప్రాణాలను నిలుపగలిగింది. శంషాబాద్ విమానాశ్ర యానికి వెళ్లడం కోసం గచ్చిబౌలి నుంచి తన బంధు వులతో కలసి ఓ వ్యక్తి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 కావడంతో ఆ మార్గాన్ని పొగమంచు కప్పేసింది. అతడు ఆ పక్కనే ఉన్న భారీ స్క్రీన్‌ను చూశాడు. అక్కడ ‘మీ వాహన లైట్లు, ఇండికేటర్స్ వేసుకొని 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ముందుకెళ్లాలి అని డిస్ప్లే అవుతోంది. దీంతో సాఫీగా అతడి ప్రయాణం పూర్తయింది. సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు మార్గాన్ని ప్రమాద రహిత రహదారిగా మార్చేందుకు గాను అత్యాధునిక సాంకేతికతలో భాగంగా పలు సేవలను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జరుగుతున్న హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్‌టీఎంఎస్) సేవలను మరో 2 వారాల్లో వాహనదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు, వెరియబుల్ సైన్ బోర్డులు, మెటిరోలాజికల్ ఎక్విప్మెంట్లు, సీసీటీవీ కెమెరాలు, ఆటోమెటిక్ ట్రాఫిక్ కౌంటర్ కమ్ కాసిఫయర్స్ (ఏటీసీసీ)లు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని నానక్‌రామ్‌గూడలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులు అనుసంధానం చేస్తున్నారు. సైన్ స్క్రీన్‌లో సమాచారం.. 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్లో 19 ఇంటర్ఛేంజ్లున్నాయి.ఇంటర్‌ఛేంజ్‌లకు 1.3 కిలోమీటర్ల ముందు రెండు వైపులా వెరియబుల్ సైన్ స్క్రీన్ బోర్డులు 37 ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ హైవేతో అనుసంధానమయ్యే మార్గాల్లో 10 సైన్ స్క్రీన్ బోర్డులు అమర్చారు. మెటిరోలాజికల్ సెన్సార్స్, పొగమంచు, వెలుతురు మందగించడం, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, భారీ వర్షం కురిసినప్పుడు, ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడూ.. ఆయా సందర్భాల్లో వాహనచోదకులను అప్రమత్తం చేసేందుకు ఈ సైన్స్క్రీన్ బోర్డులపై ఆయా సమాచారాన్ని డిస్ప్లే చేస్తారు. ఆపదలో బటన్ నొక్కితే చాలు.. ఇప్పటివరకు ఓఆర్ఆర్లో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి గుర్తించినా ఆయా ప్రాంత్లాలో సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా పనిచేయక కొన్ని నిమిషాల పాటు ఇటు పోలీసులు, అటు అంబులెన్స్‌లకు ప్రయత్నించిన సందర్భా లున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌ను ప్రతి కి.మీ. కు మెయిన్ క్యారేజ్‌వే ఎడమ వైపు, కుడి వైపు ఏర్పాటు చేశారు. వాటిల్లోని బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్‌గా హెచ్ఎండీఏ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్‌కు కనెక్ట్ అవుతుంది. ఇంటర్‌ఛేంజ్‌లపై నిఘానేత్రం.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన 19 ఇంటర్‌ఛేంజ్‌లు అంటే వాహనం ఓఆర్ఆర్పైకి వచ్చే వద్ద దాదాపు 38 సీసీటీవీ కెమెరాలను బిగించారు. జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో మరో 3 సీసీటీవీలు అమర్చారు. ఈ ప్రాంతాల్లోని నిఘానేత్రాలు గొడవలు, ప్రమాదాలను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తాయి. ఓఆర్ఆర్పై ఇప్పటివరకు శామీర్‌పేట, రాజేంద్రనగర్, తుక్కుగూడ, సుల్తాన్పూర్ ప్రాంతాల్లో ఈ ఆధునిక పరికరాలను అమర్చారు. పక్కాగా వాహనాల లెక్క ఓఆర్ఆర్పై ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయనేది ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్ కమ్ క్లాషిఫయర్స్ (ఏటీసీసీ) తేల్చనుంది. వీటిని ప్రతి ఇంటర్‌ఛేంజ్‌కు ముందు సైన్ స్క్రీన్ బోర్డుల మాదిరిగానే 72 ఏర్పాటు చేశారు. ఇవి ఏ రోజుకారోజూ ఎన్ని వాహనాలు ప్రయాణం చేశాయి. ఏ రకమైన వాహనాలు ఉన్నాయనే వాటిని కంట్రోల్ సెంటర్‌కు చేరవేస్తుంది. దీనివల్ల టోల్ రుసుం వసూళ్లు మరింత పారదర్శకంగా జరగనున్నాయి. అలాగే నగరంలో ఏదైనా నేరం చేసి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే నిందితులు వాహనాన్ని సులువుగా గుర్తించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు - 158 ఇంటర్ ఛేంజ్‌లు - 19 సైన్స్క్రీన్ బోర్డులు- 47 ఏటీసీసీ పరికరాలు- 72 ఎమర్జెన్సీకాల్ బాక్స్ సెంటర్లు- 328 సీసీటీవీ కెమెరాలు- 41 మెటిరోలాజికల్ ఎక్విప్మెంట్ బోర్డులు- 4 -
శివార్లను పీల్చి.. సిటీకి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ శివార్లలో నీటివ్యాపారం కోట్లు దాటింది. చాలామంది రైతులు తమభూముల్లో బోరుబావులు తవ్వి నీటిని గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయం ‘నీరు’గారింది. నీటివ్యాపారం చేసే రైతులు, ట్యాంకర్ యజమానుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, రైతుల కంటే ట్యాంకర్ మాఫియాకు కోట్లాది రూపాయల లాభాలు సమకూరుతున్నాయని ఐఐటీ గౌహతి, నెదర్లాండ్స్‌కు చెందిన వేజ్ నింజెన్ వర్సిటీ నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ‘నీళ్లు ఎవరివి.. లాభాలు ఎవరికి’అన్న అంశంపై జరిగిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో వెలుగుచూసిన పలు అంశాలు ఇవీ.. తగ్గిన వ్యవసాయభూములు ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల రైతులు వ్యవసాయం కంటే ఇతర వృత్తులపైనే ఆధారపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ, బీపీవో, పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్కులు, ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించడంతో ఇక్కడ వ్యవసాయ భూముల సంఖ్య తగ్గింది. రైతులకు నష్టపరిహారంతోపాటు హెచ్ఎండీఏ లే అవుట్లలో నివాస స్థలాలు కేటాయించింది. ఆ ప్లాట్లలో ఇప్పుడు బోరుబావులు తవ్వి ఆ నీటిని ఫిల్టర్‌ప్లాంట్లు, ఇతర పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు రైతులు విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా కోకాపేట్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. విచక్షణా రహితంగా బోరుబావులు విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం కారణంగా శివార్లలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సరాసరిన 1,000–1,500 అడుగుల లోతుకుపైగా బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. వర్షపునీటి నిల్వ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార, రియల్టీ వర్గాలు చర్యలు తీసుకోవడంలేదు. నీటిలేమి కారణంగా చిన్న రైతులు వ్యవసాయం వీడి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. రైతులవి నీళ్లు..లాభాలు ట్యాంకర్ మాఫియాకు.. రైతులు నీటిని విక్రయిస్తే.. ఒక్కో ట్యాంకర్(ఐదువేల లీటర్లు)కు రూ.150 నుంచి రూ.200 వరకు మాత్రమే లభిస్తోంది. అదే నీటిని తీసుకెళ్లి వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, రిసార్ట్స్,కార్పొరేట్ కంపెనీలు, విద్యాసంస్థలకు విక్రయిస్తున్న ట్యాంకర్ యజమానులకు ఒక్కో ట్రిప్పునకు రూ.800 నుంచి రూ.1200 వరకు గిట్టుబాటవుతోంది. సాగు తగ్గడానికి కారణాలు.. - రైతులు తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగుచేస్తే వచ్చే దిగుబడులు ఆశాజనంగా లేకపోవడం - వర్షపాత లేమి , చీడపీడల నివారణకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుండడం - పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించకపోవడం -
ఒక్క నెల.. 4.8 కోట్లు..
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు.. ఖాళీగా కనిపిస్తే చాలు వాహనదారులు రయ్యిమంటూ దూసుకుపోతు న్నారు. జామ్.. జామ్.. అంటూ సాగిపోతున్నారు. కానీ రెండు మూడ్రోజులకు ఈ–చలాన్ వచ్చి చుక్కలు కనిపించేలా చేస్తుంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని లేజర్‌గన్ స్పీడ్ కెమెరాల ద్వారా క్లిక్‌మనిపించి ఇంటికే చలాన్లు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు చలాన్ల జారీని పరిశీలిస్తే.. ప్రతి నెలా రూ.4.8 కోట్లు ట్రాఫిక్ పోలీసు విభాగానికి వాహన దారులు చెల్లిస్తున్నారు. ఇరు కమిషనరేట్ల పోలీసులు కలసి తొమ్మిది లేజర్‌గన్ కెమెరాల ద్వారా వాహనదారుల అధిక వేగాన్ని నిర్ధారిస్తున్నారు. వేగం తగ్గించినా మారని తీరు... ఓఆర్ఆర్పై వాహనాల గరిష్ట వేగాన్ని 100 కిలో మీటర్లకు తగ్గించినా వాహనదారుల్లో స్పీడ్ జోష్ మాత్రం తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు తగ్గడంలేదు. ఈ ఏడాది జరిగిన 82 రోడ్డు ప్రమాదాల్లో 33 మంది మృతి చెందారు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా... ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం కొన్ని సందర్భాల్లో డ్రంకన్ డ్రైవ్ అని తేలడంతో సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 1,836 వరకు కేసులు నమోదు చేశారు. వీరిలో 430 మందికి ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. ఇతరులకు న్యాయస్థానం రూ.45 లక్షల వరకు జరిమానా విధించింది. అటు లేజర్ గన్ కెమరాలు, ఇటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ఓఆర్ఆర్ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చడంపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెబుతున్నారు. ఆటోమేటిక్‌తో ఈ–చలాన్.. ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు తాము ఎంచుకున్న ప్రాంతాల్లో లేజర్ గన్ కెమెరాతో వాహనదారుల స్పీడ్‌ను గమనిస్తున్నారు. ఇకపై ఈ వెతలు తీరున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్పై ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ కెమెరా రాడార్ల సాయంతో వాహనాల వేగాన్ని గుర్తించి చలాన్ జనరేట్ చేయనుంది. ఈ లేజర్ గన్ కెమెరా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సందర్శించి పనితీరు తెలుసుకున్నారు. ఇది విజయవంతమైతే ఓఆర్ఆర్ అంతటా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు. ఓఆర్ఆర్ విస్తీర్ణం : 158 కిలోమీటర్లు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 2,31,795 సైబరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులు : 1,569 జరిమానా : రూ.23,92,75,225 రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 96,628 జరిమానా : రూ.9,97,90,880 7 నెలల కాలంలో వాహనదారులకు అందిన ఈ–చలాన్ల మొత్తం : రూ. 34కోట్లు -
‘రియల్’ డబుల్!
గ్రేటర్ శివార్లలో రియల్ రంగం రయ్యిమని దూసుకుపోతోంది. ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నివాస భూముల ధర రెండేళ్లలోనే రెట్టింపు అయింది. నూతన ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల కార్యకలాపాలు పెరగడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొనడం, అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరగడం, ప్రధాన రహదారుల విస్తరణ, హరిత వాతావరణం, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు భారీగా వెలియడంతో ఆయా ప్రాంతాల్లో భూములకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కుష్మన్ వేక్ఫీల్డ్ అనే సంస్థ తాజాగా ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలపై చేసిన అధ్యయనం నిర్వహించి ఇందుకుగల కారణాలను విశ్లేషించింది. – సాక్షి, హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో భూములు బంగారం... గతంలో అభివృద్ధి ప్రధాన నగరంలోనే కేంద్రీకృతం కావడంతో భూముల ధరలు ఆయా ప్రాంతాల్లోనే అధికంగా ఉండేవి. ఇప్పుడు అభివృద్ధి గ్రేటర్ నలుచెరగులా విస్తరించడం, ఆయా ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణరంగ కార్యకలాపాలు గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరిగాయి. ప్రధానంగా పటాన్చెరు, నానక్‌రామ్‌గూడ, తెల్లాపూర్, మియాపూర్, అమీన్పూర్, కొల్లూర్, రాయదుర్గం, బాచుపల్లి, కూకట్పల్లి, పుప్పాల్‌గూడ, కొంపల్లి, మేడ్చల్, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో భూములకు డిమాండ్ భారీగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో నివాస భూముల కోసం కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక మంగల్‌పల్లి, బాటసింగారం ప్రాంతాలతోపాటు శంషాబాద్, పెద్ద అంబర్పేట్, మనోహరాబాద్, మియాపూర్‌లో ప్రభుత్వం లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. - గ్రేటర్ మధ్యభాగం: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. సంపన్నుల నివాసాలకు చిరునామాగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పుడు చదరపు గజం భూమి సైతం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు పైగానే పలుకుతోంది. ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ నిర్మాణరంగ కంపెనీలు విలాసవంతమైన ఫ్లాట్లు, భవనాలు, ఆఫీస్ స్పేస్ ఉండే వాణిజ్య భవంతులు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు భారీగా నిర్మిస్తుండటంతో భూమి బంగారాన్ని తలపిస్తోంది. ఏ దిక్కు చూసినా కోట్లే.. కుష్మన్ వేక్ఫీల్డ్ తమ అధ్యయనంలో గ్రేటర్ సిటీని నాలుగు భాగాలుగా విభజించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూముల ధరలను సుమారుగా లెక్కగట్టింది. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు బంగారం కావడానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే.. - గ్రేటర్ పడమర ప్రాంతం: రాయదుర్గం, పుప్పాల్‌గూడ, కొల్లూర్, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, తెల్లాపూర్, గోపన్‌పల్లి, కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి ప్రాంతాలున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఐటీ, బీపీఓ, కెపిఓ, బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థల ప్రధాన కార్యాలయాలు వేలాదిగా వెలిశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిసరాలకు క్యూ కడుతుండడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా ఔటర్‌కు సమీపంలో ఉండటంతో ప్రధాన నగరంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ బాగా పెరిగింది. మరోవైపు వ్యాపార, వాణిజ్య అవకాశాలు విస్తృతమయ్యాయి. సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు ఈ ప్రాంతాలు హబ్‌గా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తున్న వారితోపాటు విదేశీయులు సైతం వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్, నివాస సముదాయాలకు గిరాకీ బాగా పెరగి బహుళ అంతస్తుల భవంతులు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు భారీగా వెలుస్తున్నాయి. - గ్రేటర్ తూర్పు ప్రాంతం: ఉప్పల్, పోచారం ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉప్పల్‌లో మెట్రో డిపో ఏర్పాటు, కనెక్టివిటీ పెరగడం, హెచ్ఎండీఏ మెట్రో సిటీ లే అవుట్, శిల్పారామం ఏర్పాటు కావడంతోపాటు వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని ఈ ప్రాంతం అక్కున చేర్చుకుంటోంది. ప్రస్తుతం కోర్ సిటీకి దీటుగా పురోగమిస్తోంది. ఇక పోచారంలో ఇన్ఫోసిస్ సంస్థతోపాటు ఇతర ఐటీ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా వెలుస్తుండడంతో టెకీలు ఈ ప్రాంతంలో ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. - గ్రేటర్ ఉత్తర ప్రాంతం: మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు ద్రాక్ష తోటలతో కనిపించిన ఈ ప్రాంతాలు ఇప్పడు ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నివాస సముదాయాలు, ఫ్లాట్లు, ప్లాట్లతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా వాణిజ్య స్థలాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. -
కారులో కణతపై కాల్చుకొన్న ఫైజన్ మృతి
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై నిన్న ఆత్మహత్యకు యత్నించిన యువ వ్యాపారి ఫైజన్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కణతపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించిన అతడిని పోలీసులు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పాయింట్ బ్లాక్‌లో గన్ ఫైర్ కావడంతో బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయింది. కోమాలోకి వెళ్లిపోయన ఫైజన్‌ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చదవండి: కారులో కణతపై కాల్చుకొని... ఉస్మానియా మార్చరీకి మృతదేహం మరోవైపు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఆత్మహత్యకు ఫైజన్ వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు అక్రమ ఆయుధంగా నిర్ధారించారు. దీంతో ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా నార్సింగ్ ఇన్స్పెక్టర్ రమణ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతోనే ఫైజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. మృతుడు రూ.2కోట్ల 50 లక్షల బాకీ ఉన్నట్లు నిన్న నలుగురు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
కారులో కణతపై కాల్చుకొని...
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై కాల్పుల కలకలం చెలరేగింది. ఓఆర్ఆర్పై గురువారం ఓ యువ వ్యాపారి కణతపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కొనఊపిరితో కొట్టు మిట్టాడుతుండగా పోలీసులు ‘108’అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి చేరుకున్నాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఉన్న తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట ప్రెస్‌రోడ్‌కు చెందిన ఫైజన్ అహ్మద్ కొన్నేళ్ల క్రితం జ్యోతిషిని ప్రేమవివాహం చేసుకున్నాడు. తర్వాత తన మకాంను లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జలవాయు విహార్ అపార్ట్మెంట్లోకి మార్చాడు. అందులోని మొదటిబ్లాక్‌లో సఫిల్‌గూడకు చెందిన పీవీ సుబ్రమణియంకు చెందిన ఫ్లాట్ నంబర్ 206ను 2013 అక్టోబర్‌లో అద్దెకు తీసుకున్నాడు. భార్యతో కలసి అక్కడే ఉంటున్నాడు. ఫైజన్ కుటుంబం చుట్టుపక్కలవారికి దూరంగా ఉండేది. విదేశాలకు వెళ్లేవారికి వీసా ప్రాసెసింగ్ చేసేందుకు పంజగుట్టలో ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అందులో తీవ్ర నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఆరు నెలలుగా ఫ్లాట్ అద్దె, మూడు నెలలుగా అపార్ట్మెంట్ నిర్వహణ రుసుములు కూడా చెల్లించట్లేదు. ఈయన గత ఏడాది అక్టోబర్‌లో డ్రివెన్ బై యు మొబిలిటీ సంస్థ నుంచి బెంజ్ కారు(టీఎస్ 09 యూబీ 6040) అద్దెకు తీసుకున్నారు. పదిహేను రోజులకోసారి అద్దె చెల్లించేలా సంస్థ నిర్వాహకుడు ఎస్ఎం జైన్‌తో ఒప్పందం చేసుకున్నారు. జలవాయు విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్‌కు ఫైజన్ ఇచ్చిన పత్రాల్లో తమకు బైక్‌తోపాటు కారు ఉన్నట్లు పేర్కొన్నారు. అయినా అద్దె వాహనంలో ఎందుకు తిరుగుతున్నారో తేలాల్సి ఉంది. అద్దెకు తీసుకున్న బెంజ్ కారులో వెళ్లి... అద్దెకు తీసుకున్న బెంజ్ కారులో గురువారం శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు ఓఆర్ఆర్ మీదుగా ఫైజన్ బయలుదేరారు. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని మంచిరేవుల సమీపంలో ఓఆర్ఆర్ పక్కనే కారును ఆపి అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న నాటు పిస్టల్‌తో కుడి కణతపై కాల్చుకున్నారు. తలలోకి దూసుకుపోయిన తూటా బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది. ఓఆర్ఆర్పై విధులు నిర్వహిస్తున్న గచ్చిబౌలి ట్రాఫిక్ కానిస్టేబుల్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ వాహనాన్ని గమనించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆగి ఉన్న కారు వద్దకు వెళ్లి పరిశీలించారు. స్టీరింగ్ సీట్లో కూర్చొని ఉన్న ఫైజన్ రక్తపు ముద్దకావడం, చేతిలో తుపాకీ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు, ‘108’కు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ఫైజన్‌ను అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న సెల్‌ఫోన్‌తోపాటు నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ప్రాంతంలోని ఓఆర్ఆర్ వద్ద ఉన్న సీసీ పుటేజీని నార్సింగి పోలీసులు పరిశీలించారు. వాహనంలో ఫైజన్ ఒక్కడే ఉన్నట్లు, ఆ సమయంలో సిగరెట్ తాగుతూ డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్థిక సమస్యలు చెప్పేవాడు నా ఫ్లాట్‌ను 2013లో నెలకు రూ.12 వేల చొప్పున ఫైజన్‌కు అద్దెకు ఇచ్చాను. ఏనాడూ సకాలంలో అద్దె చెల్లించేవాడు కాదు. 9 నెలలకు, ఆరు నెలలకు, అతడి వద్ద డబ్బులు ఉన్నప్పుడు చెల్లించేవాడు. ఉద్యోగ రీత్యా మేము కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 6 నెలల అద్దె బకాయి ఉంది. ఎప్పుడు అడిగినా ఆర్థిక సమస్యలు చెబుతుండేవాడు. – సుబ్రమణియమ్, ఫ్లాట్ యజమాని అక్రమ ఆయుధంగా నిర్ధారణ... ఆత్మహత్యకు ఫైజన్ వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు అక్రమ ఆయుధంగా నిర్ధారించారు. దీంతో ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. ఫైజన్ కోలుకున్న తర్వాత అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫైజన్ అద్దెకు ఉంటున్న జలవాయు టవర్స్ సున్నిత ప్రాంతం కిందికి వస్తుంది. ఇందులో అనేకమంది మాజీ, ప్రస్తుత త్రివిధ దళాలకు చెందిన అధికారులు, డిఫెన్స్ సంస్థ ఉన్నతోద్యోగులు నివసిస్తుంటారు. అలాంటి నివాస సముదాయంలోకి ఫైజన్ ఓ నాటుతుపాకీతో వెళ్లి వచ్చాడనే అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది అపార్ట్‌మెంట్‌తోపాటు అందులో నివసిస్తున్నవారికీ ముప్పని, తీవ్రమైన భద్రతా లోపమని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఔటర్ రింగ్‌రోడ్‌పై కాల్పుల కలకలం
-
ఔటర్ రింగ్ రోడ్‌పై రోడ్డు ప్రమాదం
-
ఔటర్ రింగ్‌రోడ్డు పై కారు బీభత్సం