మణికొండ: హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్ తెలిపిన మేరకు.. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు (పీవై 05 ఎ 1999) గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ వైపు వెళుతోంది.
నార్సింగి వద్ద అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్‌ను ఢీ కొని పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ బస్సు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతురాలు ఒంగోలుకు చెందిన మమత(33) అని, ఆమె ఉప్పల్‌లో ఉంటుందని తెలిసిందన్నారు. బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు. బస్సు బోల్తా కొట్టడంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకు పోయిన వారిని బయటకు తీశారు. ఇదిలా ఉండగా బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానం రావటంతో అతన్ని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరి కొందరికి స్వల్ప గాయాలు కావటంతో వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామన్నారు. ఔటర్‌రింగ్ రోడ్డుపై బోల్తా కొట్టిన బస్సును రెండు క్రేన్‌ల సహాయంతో పక్కకు తప్పించి రెండు గంటల అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment