travels bus
-
ORR: ఔటర్‌పై ప్రైవేటు బస్సు బోల్తా
మణికొండ: హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్ తెలిపిన మేరకు.. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు (పీవై 05 ఎ 1999) గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ వైపు వెళుతోంది. నార్సింగి వద్ద అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్‌ను ఢీ కొని పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ బస్సు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతురాలు ఒంగోలుకు చెందిన మమత(33) అని, ఆమె ఉప్పల్‌లో ఉంటుందని తెలిసిందన్నారు. బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు. బస్సు బోల్తా కొట్టడంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకు పోయిన వారిని బయటకు తీశారు. ఇదిలా ఉండగా బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానం రావటంతో అతన్ని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరి కొందరికి స్వల్ప గాయాలు కావటంతో వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామన్నారు. ఔటర్‌రింగ్ రోడ్డుపై బోల్తా కొట్టిన బస్సును రెండు క్రేన్ల సహాయంతో పక్కకు తప్పించి రెండు గంటల అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. -
బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు
-
బస్సులో అయిదుగురు సజీవదహనం...
-
ప్రమాదవశాత్తు రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం
చివ్వెంల (సూర్యాపేట): సాంకేతిక లోపంతో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామ శివారులో ఆది వారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విజయ వాడ డిపోకు చెందిన వెన్నెల బస్సు 30 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివా రులోని సాయికృష్ణ హోటల్ వద్దకు రాగానే బస్సు లైట్లు ఫెయిల్ కావడంతో ప్రయాణికు లను వేరే బస్సుల్లో వారిని విజయవాడకు తరలించారు. విజయవాడకు చెందిన మరో అమరావతి బస్సును వెన్నెల బస్సు వద్దకు తీసుకువచ్చారు. మరమ్మతుకు గురైన బస్సు బ్యాటరీకి చార్జింగ్ ఎక్కించే క్రమంలో బ్యాటరీ వైర్లలో నుంచి మంటలు చెలరేగాయి. ఆర్టీసీ డ్రైవర్లు అగ్ని మాపక వాహనానికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకునే లోపు అమరావతి బస్సు పూర్తిగా కాలిపోగా, వెన్నెల బస్సు పాక్షికంగా కాలిపోయింది. -
జేఎన్టీయూ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూ వద్ద శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ మెట్రోస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రావెల్స్ బస్సు.. లారీ ఢీ
తోటచర్ల(పెనుగంచిప్రోలు): ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ దుర్మరణం చెందగా.. మరో 12 మంది గాయాలపాలయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు బయలుదేరింది. బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్దకు రాగానే జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న లారీకి సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఆ వెనుకే వేగంగా వస్తున్న బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. ప్రమాదంలో గన్నవరానికి చెందిన బస్ డ్రైవర్ షేక్ శివబాబు (37) క్యాబిన్‌లోనే ఇరుక్కుని మృతి చెందాడు. గంపలగూడెం మండలం ఊటుకూరుకు చెందిన బస్ క్లీనర్ సంగీతం రాఘవయ్య, ప్రయాణికులు కడపకు చెందిన బోయల శంకరరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన జలగం నరసింహారావు, బండారుపల్లి ఆదినారాయణ, నేరళ్ల నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బి.నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వరగు ప్రసన్న, బెంగళూరుకు చెందిన చెంబి ప్రశాంత్, విజయవాడకు చెందిన కోగంటి ముద్దుకుమార్, గన్నవరానికి చెందిన మేదరమెల్లి చెంచుకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన డి.మల్లేశ్వరి, రామకృష్ణారావు గాయపడ్డారు. వీరందరిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.కాగా, బస్సు ముందుభాగం ధ్వంసం కావడంతో అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను కిందకు దించారు. ఎస్ఐ ఎస్.హరిప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సులో అర కిలో బంగారం పట్టివేత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో అర కిలో బంగారు నగలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై సెబ్ సీఐ మంజుల, ఎస్ఐ గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాయదుర్గం వెళ్తున్న ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన రాజేష్ బ్యాగ్‌లో 544 గ్రాముల బంగారు వడ్డాణాలు, నెక్లెస్‌లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బళ్లారిలోని రాజ్‌మహల్ ఫ్యాన్సీ జ్యూవెలర్స్ షాపునకు చెందిన గుమస్తానని తెలిపిన రాజేష్ అందుకు ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లో నగలు చేయించి బళ్లారి తీసుకువెళ్తున్నట్లు తెలిపాడు. వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ కానీ చూపకపోవడంతో ఆభరణాలను స్వాధీనం చేసుకుని రవాణాదారునితో పాటు ఆభరణాలను తదుపరి చర్యల నిమిత్తం కర్నూలు అర్బన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చేసుకుంది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలించారు. -
ట్రావెల్ బస్సులో 4కిలోల బంగారం చోరీ
-
బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లిలో అద్దంకి రహదారిపై గాయత్రి ట్రావెల్స్‌కు చెందిన ప్రవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఏపీ 04 వై7191 బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
విషాద ప్రయాణం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు
-
విషాద యాత్ర
పన్నెండు రోజులు... కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం... అంతా సవ్యంగానే సాగింది. కాశీ వంటి తీర్థయాత్రలను విజయవంతంగా చేసుకుని వచ్చారు. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం నుంచి ఓ బస్సులో బయలుదేరిన వీరంతా బుధవారం ఉదయం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్దకు చేరుకున్నారు. సముద్రస్నానాలు చేశారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని చివరిగా సింహాద్రప్పన్నను దర్శించి ఇళ్లకు చేరాలనుకుని బయలుదేరారు. ఇన్నాళ్ల ప్రయాణం వల్ల వచ్చిన బడలిక... వాతావరణం చల్లగా ఉండటం... కాస్త కడుపులో ఆహారం పడటంతో... అంతా చిన్నగా కునుకు తీస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు ప్రయాణిస్తున్న బస్సు పల్టీ కొట్టింది. ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అంతా బస్సులోనే ఇరుక్కున్నారు. తేరుకుని చూసేసరికి గాయాలతో అందరి ఒళ్లూ రక్తసిక్తమై ఉంది. తమతో ప్రయాణిస్తున్న ఓ ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరో 46మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ యలమంచిలి వాసుల విషాద యాత్ర. భోగాపురం (విజయనగరం జిల్లా), యలమంచిలి రూరల్, మాకవరపాలెం : సుదీర్ఘ యాత్ర సవ్యంగా సాగింది. కానీ చివరికొచ్చేసరికి విషాదం నింపింది. తమతో ప్రయాణిస్తున్న ముగ్గురు బస్సులోనే ప్రాణాలు కోల్పోగా 46 మంది తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. ఐకమత్యంగా వెళ్లిన వారంతా... ఒక్క సంఘటనతో కకావికలమయ్యారు. ఇదీ బుధవారం మధ్యాహ్నం భోగాపురం మండలం జాతీయ రహదారి పోలిపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఫలితం. యలమంచిలి, ఎస్.రాయవరం, మాకవరపాలెం, చిన్నగుమ్ములూరు, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం, జి.కోడూరు గ్రామాలకు చెందిన 43 మంది తోడుగా ఇద్దరు వంటపనివారను తీసుకుని ఈ నెల రెండో తేదీన కాశీయాత్రకు ఎస్ఎస్ టీఆర్ ట్రావెల్స్ బస్సులో బయలు దేరారు. పది రోజులపాటు దిగ్విజయంగా యాత్రలు పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లారేసరికి పూసపాటిరేగ సమీపానికి చేరుకోగానే చింతపల్లి వద్ద సముద్రంలో స్నానాలు చేసుకున్నారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే వంటలు పూర్తి చేసుకుని భోజనాలు చేసి అక్కడినుంచి సింహాచలం వెళ్లి వరాహనర్సింహస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు పోలిపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ వద్ద ఒక్కసారిగా యూ టర్న్ తీసుకునేందుకు ఆగగా... దాని వెనుక వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఆ ధాటికి అదుపు తప్పిన లారీ ఎదురుగా యాత్రికులతో వస్తున్న బస్సును ఢీకొంది. బస్సు రెండు పల్టీలు కొట్టి తలకిందులైంది. అనుకోని సంఘటనతో యాత్రికులంతా ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ప్రమాదం వార్త తెలుసుకున్న సీఐ రఘువీర్ విష్ణు, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవే విస్తరణ పనులు చేపడుతున్న వారికి సమాచారం అందించి మూడు జేసీబీలను తీసుకువచ్చి లారీలో, బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు సీట్లలో ఇరుక్కుపోయి ఊపిరాడక పోతిరెడ్డి పాలేనికి చెందిన కరణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి(52)లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా ఎస్పీ పాలరాజు ప్రమాద స్థలానికి చేరుకుని హైవే పెట్రోలింగ్, అంబులెన్స్, బొలెరో ఇలా అన్ని వాహనాల్లో క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. తగరపువలస ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 28 మందిని, విశాఖ కేజీహెచ్‌లో 9మందిని, విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 7గురిని తరలిం చారు. వారంతా ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వెల్లకట్టలేని గ్రామీణుల సేవలు ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లా పాపలతో హాహాకారాలు చేస్తున్న యాత్రికులను స్థానిక యువకులు బస్సులోంచి బయటకు తీసుకువచ్చారు. వెంటనే గ్రామంలో ఉన్న పీహెచ్‌సీకి సమాచారం అందడంతో వైద్యాధికారి సునీల్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని గాయాలపాలై రక్తం కారుతూ ఉన్న వారికి ప్రథమ చికిత్స చేశారు. వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు నుంచి సిబ్బంది వచ్చి కట్టర్ల ద్వారా బస్ సీట్లను, బాడీని కట్ చేసి ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయ ధర్మకర్త కర్రోతు పైడిరాజు విద్యుత్ సరఫరాను అందించారు. స్థానికులు జనరేటర్ తీసుకువచ్చి, రోడ్డుపైన పడిఉన్న క్షతగాత్రులకు ఫ్యాను సౌకర్యం కలగజేసి ఉపశమనాన్ని అందించారు. -
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం
భోగాపురం(నెల్లిమర్ల): కాశీ యాత్ర ముగించుకుని వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నుంచి ఈ నెల 2న 45 మంది ట్రావెల్స్ బస్సులో కాశీ యాత్రకు బయల్దేరారు. వారంతా యలమంచిలి, ఎస్.రాయవరం, జి.కోడూరు, మాకవరం, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం గ్రామాలకు చెందినవారు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో వారంతా బుధవారం తెల్లవారుజామున పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్ద సముద్ర స్నానాలు చేసి, గోవిందపురం వద్ద ఆలయాలు దర్శించుకుని భోజనం ముగించుకుని బయల్దేరారు. పోలిపల్లి వద్దకు వచ్చేసరికి విశాఖ నుంచి వస్తున్న లారీ అక్కడి కూడలి వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. దీంతో యూ టర్న్ తీసుకుంటున్న లారీ ఎదురుగా వెళ్తున్న యాత్రికుల బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు పల్టీకొట్టి బోల్తాపడింది. ఘటనలో బస్సులో ఉన్న యలమంచిలికి చెందిన కర్ణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి (52) అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సీఐ రఘువీర్ విష్ణు, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది సహా సంఘటనా స్థలానికి చేరుకుని హైవే సిబ్బంది సహకారంతో జేసీబీలతో బస్సు, లారీలో చిక్కుకున్న క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీశారు. గాయపడ్డ వారిలో 28 మందిని తగరపువలస సమీపంలోని ఎన్నారై ఆస్పత్రికి, 9 మందిని విశాఖ కేజీహెచ్‌కు, మరో ఏడుగురిని విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
డివైడర్‌ను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
ట్రావెల్స్ బస్సులో పొగలు..తప్పిన ప్రమాదం
సాక్షి, మహానంది : గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రయివేట్ బస్సు ఇంజన్ వెనుక మంటలు వ్యాపించాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకొంది. గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మేఘన ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరబాద్‌కు బయలుదేరింది. ఈ బస్సులో గిద్దలూరు నుంచి హైదరబాద్‌కు సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్లమల ఘాట్‌లోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద ఆగి భోజనాలు చేసీ బయల్దేరారు. అనంతరం గాజులపల్లె సమీపంలోకి చేరగానే బస్సులోని ఎయిర్ కంప్రెషర్ వద్ద మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు వెంటనే గుర్తించి డ్రైవర్ శివ దృష్టికి తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఇంజన్ వెనక మంటలు వ్యాపించడంతో బస్సును గాజులపల్లె మెట్ట వద్ద నిలిపి మంటలను ఆర్పేశారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. -
బస్సులో చెలరేగిన మంటలు
-
యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
-
యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఏ.పి.లింగోటం వద్ద హైవేపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను యాత్రా జెనీ వోల్వో బస్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 39 ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తప్పించారు. -
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు
సాక్షి, గుంటూరు: అతి వేగంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఒకే ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఈ సంఘటనల్లో మొత్తం 15 మందికి పైగా తీవ్రగాయాలు అవ్వగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు అతి సమీపంలో జరిగి ప్రమాదంలో మార్నింగ్ స్టార్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డిపాలెం వద్ద లారీని తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. అదే ట్రావెల్స్ మరో చోట: గుంటూరు జిల్లాలోనే మార్నింగ్ స్టార్‌కు చెందిన మరో బస్సు రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యింది. బాపట్లకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఎదరుగా వస్తున్న ఆటోను మార్నింగ్‌స్టార్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ప్రైవేటు బస్సు, లారీ ఢీ
-
ప్రైవేటు బస్సు, లారీ ఢీ
పశ్చిమగోదావరి: జిల్లాలోని పెంటపాడు మండలంలోని ఆలంపురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
లారీ-బస్సు ఢీ, 15 మందికి గాయాలు
విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలైన సంఘటన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం పిసినకాడ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
-
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ట్రాక్టర్, బస్సు ఢీ.. ముగ్గురికి గాయాలు
-
ట్రాక్టర్, బస్సు ఢీ.. ముగ్గురికి గాయాలు
మునగాల(నల్గొండ): మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభ్సతం సృష్టించింది. వడ్ల లోడుతో ముందుగా సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను గౌతమి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
-
ట్రావెల్స్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: శంషాబాద్‌లో మదనపల్లి సమీపంలోని బెంగుళూరు వెళ్లే జాతీయరహదారిపై మురళీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బస్సు నంబర్ ఏపీ 28డీ 4844 గా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రైవేట్ బస్సులో 6కిలోల బంగారం చోరీ
నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ దొంగతనం జరిగింది. చెన్నైకి చెందిన ఓ బంగారు ఆభరణాల సంస్థలో పనిచేస్తున్న సెంథిల్, మహేందర్ అనే వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 14 కిలోల బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు వచ్చారు. పని ముగించుకుని కొంత బంగారం తీసుకుని వారు బుధవారం రాత్రి కేశినేని ట్రావెల్స్ బస్సులో చెన్నై బయలు దేరారు. గురువారం ఉదయం ఆ బస్సు నెల్లూరు జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో టిఫన్ కోసం బస్సు ఆగింది. అనంతరం తిరిగి బస్సు బయలుదేరుతుండగా సెంథిల్, మహేందర్ తమ బ్యాగ్ ఒకటి కనిపించటం లేదని బస్సు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. కనిపించకుండా పోయిన బ్యాగులో ఆరు కిలోల బంగారు ఆభరణాలున్నాయని సెంథిల్, మహేందర్ చెబుతున్నారు. సరిగ్గా బస్సు బయలుదేరే సమయానికి ఒక వ్యక్తి హడావిడిగా ఓ బ్యాగుతో బస్సు దిగి, కారులో వెళ్లిపోయాడని బస్సు క్లీనర్ పోలీసులకు తెలిపాడు. బస్సులోని ప్రయాణికుల వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. -
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం
ఏలూరు: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిధిలోని అమ్మపాలెం పెట్రోలుబంకు వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
యాపిల్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
విశాఖ: విశాఖ జిల్లాలోని కశింకోట మండలం ఒగ్గుపాలెం వద్ద శనివారం రాత్రి యాపిల్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. యాపిల్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్వల్పంగా గాయపడిన బస్సు డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీఏ దాడులు: 9 బస్సులు సీజ్
విజయవాడ : నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. కృష్ణా జిల్లాలో మంగళవారం ఉదయం అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ముడిగామ్ సమీపంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా నడుస్తున్న నాలుగు స్కూల్ వ్యాన్లతో పాటు, 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్టీఏ అధికారులు హెచ్చరించారు. -
ఘోరం
ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి 30 మందికి గాయాలు పునాదిపాడు వద్ద ఘటన భయానకంగా ప్రమాదస్థలం అతి వేగం, పొగమంచే కారణం! కంకిపాడు, న్యూస్‌లైన్ : అతివేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీకొట్టడంతో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. మరో 30 మందికి గాయాలయ్యాయి. మండలంలోని పునాదిపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కావేరీ ట్రావెల్స్‌కు చెందిన (ఏపీ 27వై 4577) నంబరు బస్సు హైదరాబాద్ నుంచి నర్సాపురానికి 37 మంది ప్రయాణికులతో బయల్దేరింది. విజయవాడలో పదిమంది దిగిపోగా, మరో ముగ్గురు బస్సెక్కారు. బస్సు కంకిపాడు సెంటరు నుంచి గన్నవరం రోడ్డు, పునాదిపాడు కాటన్ సర్కిల్ మీదుగా గుడివాడ రోడ్డులోకి వెళ్తుండగా మార్గంలో ఉన్న పెద్ద మలుపు వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. మలుపు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొడుతూ పక్కనే ఉన్న పంట బోదెలోకి బోల్తా పడింది. తెల్లవారుజామున 5.20 గంటలకు ఈ ఘటన జరిగింది. విజయవాడలో బస్సు ఎక్కిన భవానీపురం వాస్తవ్యుడు ఆరిపాక శ్రీనివాసరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 30 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, కంకిపాడు, పెనమలూరు సీఐలు ఆర్జే రవికుమార్, మురళీకృష్ణ, కంకిపాడు, ఉయ్యూరు రూరల్ ఎస్ఐలు గుణరాము, కృష్ణమోహన్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు. డ్రైవరు అతి వేగం కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలుపు వద్ద గుడివాడ నుంచి కంకిపాడు వైపు వేగంగా కారు రావటంతో బస్సు అదుపుతప్పిందని బస్సు డ్రైవరు వేమూరి రవి పోలీసులకు వివరించాడు. బోల్తా పడ్డ బస్సును పొక్లెయిన్ల సహాయంతో ఆ ప్రాంతం నుంచి తరలించారు. గుడివాడ-కంకిపాడు మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. భీతిల్లిన ప్రయాణికులు... అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఊహించని ప్రమాదంతో భీతిల్లిపోయారు. పల్టీలు కొడుతూ పంట బోదెలోకి బ్సు బోల్తా కొట్టడంతో కొద్దిసేపటి వరకు వారికి ఏంజరిగిందో అర్థం కాలేదు. ధ్వంసమైన ఇనుప ముక్కలు, పగిలిన అద్దాలు శరీర భాగాల్లో గుచ్చుకోవటంతో బస్సులో ప్రయాణిస్తున్న అందరూ గాయాలపాలయ్యారు. పగిలిన అద్దాల్లో నుంచి అష్టకష్టాలు పడి బయటికొచ్చారు. బస్సులో ఇరుక్కున్నవారిని తోటి ప్రయాణికులు, వాహనదారులు అతికష్టం మీద వెలికితీశారు. శరీరంలో గుచ్చుకున్న అద్దాలు, తెగిన ఇనుప రేకుల బాధకు ప్రయాణికులు విలవిలలాడారు. సాయం కోసం కేకలు వేశారు. వాహనదారులు అందించిన సమాచారం మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 అంబులెన్సుల్లో తీవ్రంగా గాయపడ్డ 12 మంది క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ఓ ప్రైవేటు ఆస్పత్రి, బస్సు వేగంతో పాటు పొగమంచు దట్టంగా అలముకుని ఉండటం కూడా ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలివీ... తీవ్ర గాయాలపాలైన వారిలో వేముల రవి (గుడివాడ) బస్సు డ్రైవరు, మరో డ్రైవరు చింతపల్లి వెంకట రమణ (40), క్లీనరు యార్లగడ్డ రమేష్ (19) రాజోలు, కట్టా ఫణికుమారి (28) ఎమ్మెస్సీ విద్యార్థిని (వేమవరం), జి.సత్యనారాయణ (40) పాలకొల్లు, మత్తి బాబ్జి (38) పాలకొల్లు, కొప్పినేని ఉమామహేశ్వరరావు (40) తూర్పుతాళ్లు -మొగల్తూరు ఏరియా, చింతపల్లి వెంకట రమణ (తోగొన్ని), యండమూరి సావిత్రి (52) సిద్దాపురం, గొడవ పెద్దింట్లు (60) పెదనిండ్రకొలను, అఖిలేష్‌కుమార్ (భాగల్పూర్, బీహార్), చల్లా శేఖర్ (26) సైనిక్‌పురి, హైదరాబాద్ వీరిని విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో బస్సు డ్రైవరు చింతపల్లి వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయాలపాలైన వారిలో బి.ఏడుకొండలు (38) అంతర్వేదిపాలెం, కె.వెంకటేశ్వరరావు (31) చిట్టవరం, ముంగండ సుధీర్‌కుమార్ (28) పాలకొల్లు, కవులూరు జార్జి రాజు (42) కొప్పర్రు, దువ్వ వరలక్ష్మి (24), దొడ్డిపట్ల, మేరా రామాంజనేయులు (32) కలవపూడి, రేకపల్లి ఆది వెంకట హనుమాన్ (27) నరసాపురం, గొడవ వెంకటేశ్వరరావు (45) పెదనిండ్రకొలను, బర్రి వెంకటేశ్వరమ్మ, శివరామకృష్ణ, ఎస్.సీతారామ్, వెంకట్రావ్ ఉన్నారు. -
‘ట్రావెల్స్’ బస్సు, లారీ ఢీ
ఈతకోట(రావులపాలెం), న్యూస్‌లైన్ :జాతీయ రహదారిపై మండలంలోని ఈతకోట సెంటర్ సమీపంలో శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లోడ్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, బస్సులో ఉన్న ముగ్గురితో పాటు లారీ క్లీనర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.విజయవాడలోని రామలింగేశ్వర నగర్‌కు చెందిన పోతన శ్రీనివాసరావు(48) డ్రైవర్ అండ్ ఓనర్‌గా ఏసయ్య లారీ సర్వీసును నడుపుతున్నాడు. విజయవాడకు చెందిన క్లీనర్ నాగిరి ఏసుతో కలిసి ఈతకోటలోని ఓ రైస్ మిల్లుకు లోడ్‌తో వచ్చాడు. సరుకును అక్కడ దించి వేసి, అనంతరం తిరిగివెళ్లేందుకు జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ దాటేందుకు శ్రీనివాసరావు రాంగ్ రూట్లో ఈతకోట సెంటర్‌కు రావులపాలెం వైపు వస్తున్నాడు. ఇదే రూట్లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చింది. ఈతకోట సెంటర్ సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న లారీని గమనించని బస్సు డ్రైవర్.. వేగంగా లారీని ఢీ కొట్టాడు. ప్రమాద సమయంలో లారీలో ఇద్దరు, బస్సులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. బస్సులో అంతగా ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లారీని బస్సు వేగంగా ఢీకొనడంతో లారీ క్యాబిన్లో ఇరుక్కున్న శ్రీనివాసరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. లారీ క్లీనర్ ఏసుకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్.. ముందు అద్దం పగులగొట్టుకుంటూ రోడ్డుపై పడ్డారు. సమాచారం అందుకున్న 108, హైవే అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగ్రాతులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించాయి. రావులపాలెం ఎస్సై ఆర్.గోవిందరాజు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో వాహనాలను తొలగించారు. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకుతీసి, పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఉన్నారు. రాజోలుకు చెందిన డ్రైవర్ చెల్లుబోయిన శ్రీను బస్సును నడుపుతున్నాడు. ఇతడికి ప్రమాదంలో చెయ్యి, తలకు గాయాలయ్యాయి. మురమళ్లకు చెందిన మరో డ్రైవర్ పి.శ్రీనివాస్(సత్తిబాబు) వెనుక సీటులో నిద్రిస్తున్నాడు. అతడికి కూడా తలు, చెయ్యికి గాయలయ్యాయి, అదే గ్రామానికి చెందిన క్లీనర్ వి.ప్రసాద్ కాలికి గాయమైంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతివేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, తొందరపాటుతో లారీ డ్రైవర్ రాంగ్‌రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. -
సమైక్య సమర వత్సవం 2013
సమైక్య సమర వత్సరంగా 2013 ఉద్యమస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమై చరిత్రపుటగా మారుతోంది. ఊరూరా.. ఇంటింటా.. గుండెగుండెలో సమైక్య పతాకై ఎగిరింది.. ఎగిసింది.. రహదారుల రక్తదాహానికి మాయని మరకైంది. ప్రకృతి ప్రకోపానికి, రైతన్నల కష్టనష్టాలకు మౌన సాక్షిగా నిలిచింది. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే పార్టీ వైఎస్సార్సీపీనే అని చాటింది. జననేత జగన్ మాట, బాటలోనే జిల్లా జనం కదులుతున్నారని నిరూపించింది. జనవరి సంక్రాంతి పండుగరోజే నగరంలో ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు ఫుట్‌పాత్‌మీద నిద్రిస్తున్న వలసకూలీలపైకి దూసుకెళ్లి ఐదుగుర్ని పొట్టనబెట్టుకుంది. ప్రజలు కావాలా, అధిష్ఠానం కావాలా తేల్చుకోవాలని సమైక్యాంధ్ర ప్రదేశ్ సదస్సులో ప్రజాప్రతినిధులను ఉద్యోగ జేఏసీ నిలదీసింది. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మహాసభలను జస్టిస్ చలమేశ్వర్ ప్రారంభించారు. చంద్రబాబు ‘వస్తున్నా..మీ కోసం’ పాదయాత్ర చేశారు. బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య వైఎస్సార్సీపీలో చేరారు. తొలివిడత సహకార ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి తెలుగు భాషా, చరిత్రలపై లోతైన పరిశోధన చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహాన్ని ఆయన సొంతూరు పెదకళ్లేపల్లిలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఆవిష్కరించారు. సహకార ఎన్నికల్లో కేడీసీసీబీ చైర్మన్‌గా పిన్నమనేని వెంకటేశ్వరరావు గెలుపొందారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా కంచి రామారావు ఎన్నికయ్యారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణను అన్ని పక్షాలు అడ్డుకున్నాయి. రాఘవులతో సహా పలువురు అరెస్టయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఎన్నార్ గెలుపొందారు. భారీ వర్షాలు జిల్లా రైతులను నట్టేట ముంచారుు. మార్చి వైఎస్ తనయ షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. మార్క్‌ఫెడ్ పదవి ‘కంచి’ని వరించింది. ఎడాపెడా విద్యుత్తు కోతలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, లాంతర్ల ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, సభకు గైర్హాజరైన చిన్నం రామకోటయ్యకు స్పీకర్ నోటీసులు జారీచేశారు. కేంద్ర హోంమంత్రి షిండే జిల్లాకు విచ్చేశారు. విజయవాడలో మహాలక్ష్మి యాగం అత్యంత వైభవంగా జరిగింది. ఏప్రిల్ విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెసేతర పక్షాలన్నీ ఒకరోజు బంద్ విజయవంతంగా నిర్వహించాయి. జిల్లాలో 27రోజుల పాటు జరిగిన షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ విజయవంతంగా ముగిసింది. లయోలా కళాశాల వజ్రోత్సవాలు, ఎన్టీఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగాయి. గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విజయవాడ నుంచి రాత్రివేళ పునాదిపాడు వెళుతున్న అన్నా చెల్లెలిపై ఆకతాయిల దాష్టీకానికి దళిత యువకుడు రవితేజ బలైపోయాడు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మే 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 45,17,398 అని అధికారికంగా ప్రకటించారు. మండు వేసవిలో గాలివాన బీభత్సంతో మామిడి, మొక్కజొన్న రైతుకు అపార నష్టం కలిగింది. ఈ వేసవిలో అత్యధికంగా 48 డి గ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగన్ అక్రమ నిర్బంధం ఏడాదైన సందర్భంగా ప్రజాశ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు.టెన్త్ ఫలితాల్లో పదోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొండపల్లిలో జరిగిన పురా శంకుస్థాపన సభలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నగర సీపీగా బి.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. జూన్ ఉత్తర కాశీ జలబీభత్సంలో జిల్లావాసులు చిక్కుకుపోయారు. మొత్తం పద్నాలుగు మంది గల్లంతయ్యారు. ఇద్దరు చనిపోయారు. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్ర జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్సీపీ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు విజయవాడలో జరిగింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరై దిశానిర్దేశం చేశారు. ఉత్తర కాశీ బాధితులను, వారి కుటుంబాలను ఆమె ఓదార్చారు. పారిశ్రామిక రారాజు సిరీస్ రాజు కన్నుమూశారు. ఇదే నెలలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మకు వజ్రకిరీటం అలంకరించారు. జూలై మద్యం నూతన విధానం, కాలువలకు నీటి విడుదల జాప్యంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఉడా చైర్మన్‌గా వణుకూరి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. జి.కొండూరులో సీఐ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ పాటించారు. పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వెంపటి చినసత్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా నగరంలో 150మంది ‘బ్రహ్మాంజలి’ నృత్య ప్రదర్శనిచ్చి అంజలి ఘటించారు. 30వ తేదీ రాత్రి రాష్ట్ర విభజన ప్రకటించడంతో సమైక్యవాదులు ఉద్యమబాట పట్టారు. ఆగస్టు సమైక్య ఉద్యమంతో జిల్లాలో పాలన స్తంభించింది. ఆర్టీసీ సమ్మె బాట పట్టింది. అన్ని వర్గాల ప్రజలు దీక్షలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తంచేశారు. జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. అవనిగడ్డ శాసనసభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్ గెలుపొందారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నేత వేజెండ్ల శివశంకర్ కన్నుమూశారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ తనను వేధిస్తున్నారంటూ ఆయన భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబరు సమైక్య గర్జనలతో జిల్లా మార్మోగింది. నగరంలో జోరు వర్షంలో కూడా ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతమైంది. జేఏసీ పిలుపు మేరకు 48గంటల బంద్ జరిపారు. షర్మిల సమైక్య శంఖారావం బస్ యాత్ర, చంద్రబాబు తెలుగు ఆత్మగౌరవ యాత్ర జిల్లాలో జరిగాయి. విద్యుత్తు ఉద్యోగులు 72గంటల సమ్మెచేశారు. వైఎస్ జగన్‌కు కోర్టు బెయిల్ ఇవ్వడంతో జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు విజయోత్సవాలు జరిపారు. నగరానికి చెందిన నీనా మిస్ అమెరికాగా నిలవడం, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరికి నగరంలో సన్మానం మరపురాని ఘట్టాలు. అక్టోబర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా ఏసీఏ ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజు నియమితులయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం, వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఉదయభాను, వంగవీటి రాధా, గౌతంరెడ్డి నిరవధిక దీక్షలు చేశారు. పై-లీన్ తుపాన్ వల్ల కురిసిన వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. పంటలు దెబ్బతిన్న రైతులను కిరణ్‌కుమార్‌రెడ్డి, విజయమ్మ, చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ నగర ప్రథమ మేయర్ టి.వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కలెక్టర్‌గా రఘునందనరావు బాధ్యతలు చేపట్టారు. మహబూబ్‌నగర్‌లో వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో మచిలీపట్నానికి చెందిన టక్కెళ్ల సురేష్‌బాబు మృతి చెందారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగారుు. విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌గా హరికిరణ్ నియమితులయ్యారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని వసతి గృహంలో విషాహారం తిని 26మంది బాలికలు అస్వస్థతకు గురయ్యూరు. నవంబర్ రామవరప్పాడు రింగ్ బస్టాండు వద్ద ఉన్నవారిపైకి ఓ కారు దూసుకువెళ్లింది. ఓ వైద్యుడు, ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు మరణించారు. పోలీసు పహరాలో రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. చిల్లకల్లు రచ్చబండలో సీఎం పాల్గొన్నారు. సమైక్య ఉద్యమం వందరోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. రైలులో వివాహితపై లైంగికదాడి కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీ నేత కె.నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. హెలెన్, లెహెర్ తుపాన్లు జిల్లాను భయపెట్టాయి. డిసెంబర్ కృష్ణానది జల వివాదంపై బ్రిజేష్ కుమార్ తీర్పును వ్యతిరేకిస్తూ పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు ధర్నా చేశారు. విజయవాడలో భవనం కూలి ముగ్గురు మృతిచెందారు. పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నగరంలో బహిరంగ సభ జరిపారు. ఇన్నర్‌రింగ్ రోడ్డులో భాగంగా రామవరప్పాడు రింగ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. లాయర్ల సమైక్య శంఖారావం సభ జరిగింది. కూచిపూడిలో తానీషా నృత్యోత్సవాలు జరిగాయి. -
ఆర్టీఏ అధికారుల దాడులు
కడప అర్బన్, న్యూస్‌లైన్ : నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సుల యాజ మాన్యాలపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝళిపించి 8 బస్సులను సీజ్ చేశారు. కలెక్టర్ శశిధర్ సూచించిన నిబంధనలను పాటించలేదని, స్టేజి క్యారియర్లను నిర్వహిస్తున్నార నే సమాచారంతో మంగళవారం ఎంవీఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో నగర శివార్లలో ట్రావెల్స్ బస్సులను, రికార్డులను పరిశీలించారు. బస్సుల్లో స్మోక్ డిటెక్టర్స్, అగ్నిమాపక నివారణ పరికరం, కనీసం రెండు సుత్తులు (హ్యామర్స్) అమర్చుకోలేదని గమనించారు. 8బస్సులను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. వాటనన్నింటిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలు కోర్టు ద్వారానే బస్సులను విడుదల చేసుకోవాల్సి ఉంది. ఈనెల 16వ తేదీన ఏఎంవీఐ హేమకుమార్ ఆధ్వర్యంలో రెండు బస్సులను సీజ్ చేశారు. వీటిని కడప డిపో ఆవరణలో ఉంచారు. ఎంవీఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలను పాటించాలని, లేకుంటే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.