విశాఖ: విశాఖ జిల్లాలోని కశింకోట మండలం ఒగ్గుపాలెం వద్ద శనివారం రాత్రి యాపిల్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. యాపిల్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్వల్పంగా గాయపడిన బస్సు డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.