
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూ వద్ద శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ మెట్రోస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.