![Telangana: Short Circuit Caught Fire, Two Bus Burnt Near Suryapet - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/26/bus.jpg.webp?itok=inbZbLIl)
చివ్వెంల (సూర్యాపేట): సాంకేతిక లోపంతో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామ శివారులో ఆది వారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విజయ వాడ డిపోకు చెందిన వెన్నెల బస్సు 30 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివా రులోని సాయికృష్ణ హోటల్ వద్దకు రాగానే బస్సు లైట్లు ఫెయిల్ కావడంతో ప్రయాణికు లను వేరే బస్సుల్లో వారిని విజయవాడకు తరలించారు.
విజయవాడకు చెందిన మరో అమరావతి బస్సును వెన్నెల బస్సు వద్దకు తీసుకువచ్చారు. మరమ్మతుకు గురైన బస్సు బ్యాటరీకి చార్జింగ్ ఎక్కించే క్రమంలో బ్యాటరీ వైర్లలో నుంచి మంటలు చెలరేగాయి. ఆర్టీసీ డ్రైవర్లు అగ్ని మాపక వాహనానికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకునే లోపు అమరావతి బస్సు పూర్తిగా కాలిపోగా, వెన్నెల బస్సు పాక్షికంగా కాలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment