
నల్గొండ: నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లిలో అద్దంకి రహదారిపై గాయత్రి ట్రావెల్స్‌కు చెందిన ప్రవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఏపీ 04 వై7191 బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.