
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందితకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డారు. మంగళవారం నల్లగొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై సాయంత్రం నగరానికి తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో నల్లగొండ పట్టణానికి సమీపంలోని చర్లపల్లి వద్ద ఎమ్మెల్యే లాస్య ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. దీంతో కారు ముందు సీటులో ఉన్న ఆమె ఒక్కసారిగా ముందుకు పడిపోవడంతో తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం నగరానికి బయలుదేరారు. ప్రమాద సమయంలో కారులో ఎమ్మె ల్యే లాస్యతో పాటు ఆమె సోదరి నివేదిత, డ్రైవరు, ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment