ఘోరం | Travels bus accident | Sakshi
Sakshi News home page

ఘోరం

Published Sat, Apr 5 2014 1:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఘోరం - Sakshi

ఘోరం

  •   ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి
  •   30 మందికి గాయాలు    
  •   పునాదిపాడు వద్ద ఘటన
  •   భయానకంగా ప్రమాదస్థలం
  •   అతి వేగం, పొగమంచే కారణం!
  •  కంకిపాడు, న్యూస్‌లైన్ : అతివేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీకొట్టడంతో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. మరో 30 మందికి గాయాలయ్యాయి. మండలంలోని పునాదిపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం... కావేరీ ట్రావెల్స్‌కు చెందిన (ఏపీ 27వై 4577) నంబరు బస్సు హైదరాబాద్ నుంచి నర్సాపురానికి 37 మంది ప్రయాణికులతో బయల్దేరింది.

    విజయవాడలో పదిమంది దిగిపోగా, మరో ముగ్గురు బస్సెక్కారు. బస్సు కంకిపాడు సెంటరు నుంచి గన్నవరం రోడ్డు, పునాదిపాడు కాటన్ సర్కిల్ మీదుగా గుడివాడ రోడ్డులోకి వెళ్తుండగా మార్గంలో ఉన్న పెద్ద మలుపు వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. మలుపు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొడుతూ పక్కనే ఉన్న పంట బోదెలోకి బోల్తా పడింది. తెల్లవారుజామున 5.20 గంటలకు ఈ ఘటన జరిగింది. విజయవాడలో బస్సు ఎక్కిన భవానీపురం వాస్తవ్యుడు ఆరిపాక శ్రీనివాసరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు.

    బస్సులో ప్రయాణిస్తున్న మరో 30 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, కంకిపాడు, పెనమలూరు సీఐలు ఆర్‌జే రవికుమార్, మురళీకృష్ణ, కంకిపాడు, ఉయ్యూరు రూరల్ ఎస్‌ఐలు గుణరాము, కృష్ణమోహన్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు.

    డ్రైవరు అతి వేగం కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలుపు వద్ద గుడివాడ నుంచి కంకిపాడు వైపు వేగంగా కారు రావటంతో బస్సు అదుపుతప్పిందని బస్సు డ్రైవరు వేమూరి రవి పోలీసులకు వివరించాడు. బోల్తా పడ్డ బస్సును పొక్లెయిన్‌ల సహాయంతో ఆ ప్రాంతం నుంచి తరలించారు. గుడివాడ-కంకిపాడు మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
     
    భీతిల్లిన ప్రయాణికులు...
     
    అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఊహించని ప్రమాదంతో భీతిల్లిపోయారు. పల్టీలు కొడుతూ పంట బోదెలోకి బ్సు బోల్తా కొట్టడంతో కొద్దిసేపటి వరకు వారికి ఏంజరిగిందో అర్థం కాలేదు. ధ్వంసమైన ఇనుప ముక్కలు, పగిలిన అద్దాలు శరీర భాగాల్లో గుచ్చుకోవటంతో బస్సులో ప్రయాణిస్తున్న అందరూ గాయాలపాలయ్యారు. పగిలిన అద్దాల్లో నుంచి అష్టకష్టాలు పడి బయటికొచ్చారు.

    బస్సులో ఇరుక్కున్నవారిని తోటి ప్రయాణికులు, వాహనదారులు అతికష్టం మీద వెలికితీశారు. శరీరంలో గుచ్చుకున్న అద్దాలు, తెగిన ఇనుప రేకుల బాధకు ప్రయాణికులు విలవిలలాడారు. సాయం కోసం కేకలు వేశారు. వాహనదారులు అందించిన సమాచారం మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 అంబులెన్సుల్లో తీవ్రంగా గాయపడ్డ 12 మంది క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ఓ ప్రైవేటు ఆస్పత్రి,  బస్సు వేగంతో పాటు పొగమంచు దట్టంగా అలముకుని ఉండటం కూడా ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
     
    క్షతగాత్రుల వివరాలివీ...
     
    తీవ్ర గాయాలపాలైన వారిలో వేముల రవి (గుడివాడ) బస్సు డ్రైవరు, మరో డ్రైవరు చింతపల్లి వెంకట రమణ (40), క్లీనరు యార్లగడ్డ రమేష్ (19) రాజోలు, కట్టా ఫణికుమారి (28) ఎమ్మెస్సీ విద్యార్థిని (వేమవరం), జి.సత్యనారాయణ (40) పాలకొల్లు, మత్తి బాబ్జి (38) పాలకొల్లు, కొప్పినేని ఉమామహేశ్వరరావు (40) తూర్పుతాళ్లు -మొగల్తూరు ఏరియా, చింతపల్లి వెంకట రమణ (తోగొన్ని), యండమూరి సావిత్రి (52) సిద్దాపురం, గొడవ పెద్దింట్లు (60) పెదనిండ్రకొలను, అఖిలేష్‌కుమార్ (భాగల్పూర్, బీహార్), చల్లా శేఖర్ (26) సైనిక్‌పురి, హైదరాబాద్ వీరిని విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో బస్సు డ్రైవరు చింతపల్లి వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    గాయాలపాలైన వారిలో బి.ఏడుకొండలు (38) అంతర్వేదిపాలెం, కె.వెంకటేశ్వరరావు (31) చిట్టవరం, ముంగండ సుధీర్‌కుమార్ (28) పాలకొల్లు, కవులూరు జార్జి రాజు (42) కొప్పర్రు, దువ్వ వరలక్ష్మి (24),  దొడ్డిపట్ల, మేరా రామాంజనేయులు (32) కలవపూడి, రేకపల్లి ఆది వెంకట హనుమాన్ (27) నరసాపురం, గొడవ వెంకటేశ్వరరావు (45) పెదనిండ్రకొలను, బర్రి వెంకటేశ్వరమ్మ, శివరామకృష్ణ, ఎస్.సీతారామ్, వెంకట్రావ్ ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement