
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–కోచివేలి ప్రత్యేక రైలు (07115) ఆగస్టు 4, 11, 18, 25వ తేదీల్లో, సెప్టెంబర్ 1, 8, 15, 22, 29న రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది.
కోచివేలి–హైదరాబాద్ రైలు (07116) ఆగస్టు 6, 13, 20, 27వ తేదీల్లో, సెప్టెంబర్ 3, 10,1 7, 24, అక్టోబర్ 1వ తేదీల్లో ఉదయం 7.45కు కోచివేలిలో బయలుదేరుతుంది. హైదరాబాద్–ఎర్నాకుళం ప్రత్యేక రైలు (07117) ఆగస్టు 1, 8, 15, 22, 29వ తేదీల్లో, సెప్టెంబర్ 5, 12,19, 26న మధ్యాహ్నాం 12.50కు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది.
ఎర్నాకుళం–హైదరాబాద్ రైలు (07118) ఆగస్టు 2, 9, 16, 23, 30వ తేదీల్లో, సెప్టెంబర్ 6, 13, 20, 27న రాత్రి 9.45కు ఎర్నాకుళంలో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రాజశేఖర్ కోరారు.