రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నవంబర్ రెండు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు.
తిరుపతి–ఔరంగాబాద్ (07637) నవంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం, ఔరంగాబాద్–తిరుపతి (07638) నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–అకోలా (07605) నవంబర్ 4 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి శుక్రవారం, అకోలా–తిరుపతి (07606) నవంబర్ 6 నుంచి 2023 జనవరి ఒకటి వరకు ప్రతి ఆదివారం, హైదరాబాద్–తిరుపతి (07643) నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) నవంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం, విజయవాడ–నాగర్‌సోల్ (07698) నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి శుక్రవారం, నాగర్‌సోల్–విజయవాడ (07699) నవంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు తెలిపారు.
కాకినాడ టౌన్–లింగంపల్లి (07141) నవంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, లింగంపల్లి–కాకినాడ టౌన్ (07142) నవంబర్ 3 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వివరించారు. కాజీపేట–తిరుపతి (07091), తిరుపతి–కాజీపేట(07092) రైళ్లు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం, మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185), సికింద్రాబాద్–మచిలీపట్నం (07186) రైళ్లు నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు.
విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు
Published Wed, Oct 26 2022 3:38 AM | Last Updated on Wed, Oct 26 2022 3:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment