ernakulam
-
టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు!
కేరళలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ములంగున్నాతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్ల మధ్య వెలప్పయ్య త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో టీటీఈ వినోద్ ప్రయాణికుల టిక్కెట్ల తనిఖీలో భాగంగా ఒక ప్రయాణికుడిని టిక్కెట్ చూపించమని అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఆ ప్రయాణికుడు టీటీఈని వేగంగా వెళుతున్న రైలు నుండి కిందకు తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళ రైల్వే పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుడు రజనీకాంత్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. ఇంతలో టీటీఈ వినోద్ అతనిని టిక్కెట్ అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో డోర్ దగ్గర నిలుచున్న ప్రయాణికుడు టీటీఈ వినోద్‌ను కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసివేశాడు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు ఆ టీటీఈని ఢీకొంది. దీంతో టీటీఈ అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికుడు రజనీకాంత్‌ను పాలక్కడ్‌లో అరెస్టు చేశారు. -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు
కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు ఆదివారం ఉదయం వందలాది మంది ‘జెహోవా’ క్రైస్తవులు తరలివచ్చారు. అందరూ ప్రార్థనల్లో ఉండగా, ఉదయం 9.40 గంటలకు హఠాత్తుగా పేలుడు జరిగింది. కొద్దిసేపటికే మరోరెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో జనమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మంది రక్తమోడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మొదటి రెండు పేలుళ్లు శక్తివంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగిన పేలుడుగా పోలీసులు గుర్తించారు. పేలుళ్ల కోసం దుండగులు ఐఈడీ ఉపయోగించినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పేలుళ్లకు కారణమైన ముష్కరులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని డీజీపీ స్పష్టంచేశారు. పేలుళ్ల సమాచారం తెలియగానే కేరళ రాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కేరళ గవర్నర్ దిగ్భ్రాంతి క్రైస్తవుల మత ప్రార్థనల్లో పేలుళ్లు జరగడం పట్ల కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుళ్ల ఘటన అత్యంత దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. పేలుళ్లకు తానే కారణం అంటూ వ్యక్తి లొంగుబాటు కలామాస్సెరీలో తానే వరుస పేలుళ్లకు పాల్పడ్డానంటూ ఓ వ్యక్తి ఆదివారం కేరళలోని త్రిసూర్ జిల్లా కొడాకర పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తాను కూడా ‘జెనోవా’ సభ్యుడినేనని చెప్పారు. లొంగిపోయిన వ్యక్తి పేరు డొమినిక్ మార్టిన్ అని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు తానే కారణం అంటూ కొన్ని ఆధారాలు చూపించాడని వెల్లడించారు. అతడు చెప్పేది నిజమేనా? అనేది క్షుణ్నంగా విచారిస్తున్నామని అన్నారు. కళ్ల ముందు అగ్నిగోళం కనిపించింది కలామస్సెరీలో మత ప్రార్థనల్లో జరిగిన పేలుళ్లను తల్చుకొని ప్రత్యక్ష సాక్షులు బెంబేలెత్తిపోతున్నారు. తాను కళ్లు మూసుకొని పార్థన చేస్తున్నానని, హఠాత్తుగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ఓ మహిళ చెప్పారు. వెంటనే ఉలిక్కిపడి కళ్లు తెరిచానని అన్నారు. కళ్ల ముందు భగభగ మండుతున్న ఒక అగి్నగోళం కనిపించిందని పేర్కొన్నారు. -
మహిళా పోలీసాఫీసర్‌కు 300 కాల్స్!
క్రైమ్: ఆమె ఒక మహిళా పోలీస్ అధికారి. ‘అయితే ఏంటి..’ అనుకుని వెంటపడ్డాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఓ అడుగు ముందుకు వేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. చివరకు.. ఖాకీ పవర్ ధాటికి ఆ ఆకతాయి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కేరళ కొచ్చికి చెందిన ఓ వ్యక్తి.. వనితా పోలీస్ స్టేషన్లో పని చేసే ఓ అధికారిణిని చాలా కాలం నుంచి వెంబడిస్తున్నాడట. ఈ క్రమంలో ఏకంగా 300 ఫోన్ కాల్స్ చేసి.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై సీరియస్‌గా దృష్టి సారించిన ఆమె.. రూట్ మార్చింది. తేనె పలుకులు పలికి ట్రాప్ చేసి మరీ అరెస్ట్ చేసింది. నిందితుడ్ని మంగళవారం ఎర్నాకులం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై మోపబడిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించింది. పదే పదే ఫోన్లు చేసి ఆమెతో పాటు స్టేషన్ సిబ్బందిని కూడా వేధించాడతను. తద్వారా వాళ్ల విధులకు విఘాతం కలిగించాడు. ఓ అధికారిణి వెంటపడడం, లైంగికంగా వేధించడం లాంటి నేరాల కింద ఐపీసీ శిక్షా స్మృతులతో పాటు కేరళ పోలీస్ యాక్ట్ ప్రకారం అతనికి శిక్ష విధిస్తున్నట్లు ఎర్నాకులం కోర్టు తీర్పు వెల్లడించింది. ఆ ఆకతాయికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15వేల జరిమానా విధించింది న్యాయస్థానం. ఇదీ చదవండి: బట్టలు చింపేస్తుంటే.. వీడియోలు తీశారు! -
అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన!
నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్న సంఘటన స్థానికంగా వివాదస్పమైంది. వివరాలు.. కేరళలోని ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర మతస్తులకు అనుమతి ఉండదు. ఈ క్రమంలో రీసెంట్గా తన స్నేహితులతో అమలాపాల్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎర్నాకుళం ఆలయానికి వెళ్లింది. క్రిస్టయన్ మతస్తురాలైన అమలాను అక్కడ ఆలయ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చదవండి: అరుదైన వ్యాధి.. పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు దీంతో నిరాశ చెందిన ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్లో నోట్ రాసింది. ‘అన్యమతస్థురాలిని అని నాకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదు. నేను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించాను. అమ్మవారి శక్తిని ఫీల్ అయ్యాను. కానీ నన్ను ఆలయంలోకి అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ వివక్షలో త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం రావాలని కోరుకుంటున్నా’ అని అమలా పేర్కొంది. చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా వివాదస్పదంగా మారింది. దీనిపై పలు సామాజికి సంఘాలు, ప్రముఖుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ప్రసూన్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న ప్రోట్‌కాల్‌ను మాత్రమే మేం పాటిస్తున్నామన్నారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చింది ఒక సెలబ్రెటి కాబట్టి ఇది వివాదస్పదం అయ్యింది’ అని అన్నారు. -
కేరళ నరబలి కేసు: పోర్న్ సినిమాల్లో నటిస్తే రూ.10 లక్షలు!
కేరళలోని పతనంతిట్ట ఎలంతూరు నరబలి ఉదంతంలో.. వెన్నులో వణుకుపుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను ప్రేరేపించడంతో పాటు బాధితులకు డబ్బు ఆశతో ఎర చూపించడం, ఆపై వాళ్లను తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా బలి ఇవ్వడం.. ఇలా దాదాపు ప్రతీ దాంట్లోనూ మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అంతేకాదు స్థానికంగా 12 మంది మహిళల మిస్సింగ్ కేసుకు.. వీళ్లకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేరళ జంట నరబలి కేసులో షఫీ(52) ఆకృత్యాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతారని షఫీ చెప్పిన మాయమాటలతో తాము ఎలా నేరం చేశామన్నది భగవల్ సింగ్- లైలా దంపతులు పోలీసులకు వివరించారు. ఈ వివరాలను, దర్యాప్తులో వెలుగు చూసిన మరిన్ని విషయాలను పోలీసులు మీడియాకు తాజాగా వివరించారు. ఈ ఉదంతం కంటే ముందే షఫీపై కొన్ని కేసులు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో ఆమెను లైంగికంగా హింసించగా.. అదే ఆనవాలు ఇప్పుడు రోసిలీ, పద్మమ్ ఒంటిపై అయిన గాయాల్లోనూ కనిపించాయి. నిందితులు భగవల్ సింగ్, అతని భార్య లైలా షఫీ ఓ సైకోపాత్. కేరళ ఎర్నాకులం జిల్లా పెరుంబవూరులో పుట్టిపెరిగాడు. ఆరో తరగతి దాకా చదువుకున్న అతనికి వివాహం కూడా అయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడేళ్ల మనవరాలు కూడా ఉంది. డ్రైవర్ నుంచి మెకానిక్ వరకు చాలా ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం కొచ్చిలో ఒక చిన్న హోటల్ని నడుపుతున్నాడు. బాధితులిద్దరూ తరచూ ఈ హోటల్‌కు వెళ్తుండేవాళ్లని, ఈ క్రమంలో వాళ్ల మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. హోటల్‌కు వచ్చే మహిళల్లో కుటుంబాలకు దూరంగా, బాధల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని తన సైకో గుణం బయటపెట్టేవాడని పోలీసులు వివరించారు. అయితే షఫీ కుటుంబం మాత్రం అతనిలో ఏనాడూ తమకు ఎలాంటి సైకో గుణం కనిపించేది కాదని అంటోంది. భగవల్ సింగ్ ఇంటి బయట గుమిగూడిన జనం పైశాచిక ఆనందం కోసమే.. లైంగిక ఆనందం కోసం షఫీ ఎక్కడిదాకా అయినా వెళ్తాడు. చంపేందుకు కూడా వెనకాడడు. ఈ క్రమంలో గతంలో కొందరు సెక్స్ వర్కర్లపై అతను దాడి కూడా చేసినట్లు తేలింది. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్లను ట్రాప్ చేసేందుకు ఫేస్బుక్లో డాక్టర్ శ్రీదేవి అనే పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్‌ను తెరిచాడు. ఈ అకౌంట్ ద్వారానే ఆర్థికంగా చితికిపోయి ఉన్న భగవల్ సింగ్ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. భగవల్ సింగ్ ఓ ట్రెడిషినల్ హీలర్.. మసాజ్ థెరపిస్ట్. మూడేళ్ల పాటు ఆ పరిచయం కొనసాగి.. చివరకు తనను తాను మంత్రగాడిగా చెప్పుకుని.. కష్టాలు తొలగిస్తానని వాళ్లను నమ్మబలికాడు. అలా ఈ జంట ద్వారా ఇతరులను వేధించి.. మానసిక ఆనందం పొందాలని యత్నించాడు. కనిపించకుండా పోయిన రోజు సీసీ ఫుటేజ్‌లో పద్మమ్ పోర్న్ సినిమాల ఆఫర్‌తో.. భర్తకు దూరంగా ఉంటూ.. లాటరీ టికెట్లు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్న రోసిలీని మొదట టార్గెట్ చేశాడు షఫీ. పోర్న్ చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. దీంతో డబ్బు కోసం ఆమె ఆ పనికి సిద్ధపడింది. జూన్ 6వ తేదీన ఆమె షఫీ వెంట వెళ్లగా.. తిరిగి రాలేదు. ఒంటరి మహిళ కావడంతో ఆమె అదృశ్యం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పద్మమ్ను అదే తరహాలో టార్గెట్ చేశాడు షఫీ. తనకు పడక సుఖం అందిస్తే.. రూ.15 వేలు ఇస్తానని ఆశ పెట్టాడు. నమ్మి వెంట వెళ్లిన ఆమె కూడా తిరిగి రాలేదు. పద్మమ్ కుటుంబం ఫిర్యాదు చేయడంతో.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసును చేధించగలిగారు పోలీసులు. ఆపై నరబలి ఉదంతం, షఫీ రాక్షసత్వం ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. నిందితులు లైలా, షఫీ, భగవల్ సింగ్(ఎడమ నుంచి కుడి) క్లోజ్ ఫ్రెండ్‌నే ఇరికించే డ్రామా ఈ కేసులో రెండో నిందితురాలు.. భగవల్ సింగ్ భార్య అయిన లైలా సైతం షఫీతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో హత్యల గురించిన సమాచారాన్ని లీక్ చేస్తారనే భయంతో సింగ్‌ని తొలగించడానికి షఫీ, లైలా ప్లాన్ చేశారని తెలిసింది. మరోవైపు షఫీ తన స్నేహితుడు, ఆటో డ్రైవర్ ముహమ్మద్ బిలాల్‌ను ఈ కేసులో ఇరికించే యత్నం చేశాడు. తన స్కార్పియోను బిలాల్ వాడుకున్నాడని, కిడ్నాప్ వెనుక అతని హస్తం కూడా ఉందని షఫీ చెప్పడంతో.. రెండు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. చివరికి అతని ప్రమేయం లేదని నిర్ధారించుకుని పోలీసులు వదిలేశారు. నరబలి జరిగింది ఇదే ఇంట్లో.. వండుకుని తిన్నది నిజమేనా? కేరళ ఎలంతూరు నరబలి కేసును చేధించిన కొచ్చి డీసీపీ శశిధరన్ ఆధ్వర్యంలోనే ప్రత్యేక విచారణ బృందం(సిట్)కే ఈ కేసును అప్పజెప్పింది కేరళ హోం శాఖ. పోర్న్ సినిమాల్లో నటించాలని, పడక సుఖం అందించాలని డబ్బు ఆశజూపి బాధితులిద్దరినీ షఫీనే ట్రాప్ చేసి.. చంపినట్లు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో డబ్బు ఆశతోనే భగవల్ సింగ్, లైలాలను షఫీ లోబర్చుకుని.. ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో షఫీని ప్రధాన నిందితుడిగా, ఆ జంటను సహనిందితులుగా పేర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు వివరాల్ని వెల్లడిస్తున్న కొచ్చి పోలీస్ కమిషనర్ నాగరాజు బాధితులిద్దరినీ ఒకే రీతిలో బలి ఇచ్చినట్లు లైలా-భగవల్లు అంగీకరించారు. అయితే మంచానికి కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కేసి.. ఆపై ప్రైవేట్ భాగాలపై కత్తితో గాయాలు చేసి.. వక్షోజాలను కోసేసి.. చివరికి గొంతు కోసి షఫీనే చంపాడని ఆ దంపతులు చెప్తున్నారు. తాము నర బలికి సహకరించామని, ఆపై ముక్కలుగా నరికి.. పాతేశామని వెల్లడించారు. అయితే.. శరీర భాగాలను వండుకుని తిన్నారనే అనుమానాలు ఉన్నా.. అందుకు సంబంధించిన నిర్ధారణ ఇంకా కాలేదని పోలీసులు వెల్లడించారు. వీళ్ల రక్త చరిత్ర ఇది మాత్రమే అయ్యి ఉండదని, మరో 12 మంది మహిళల మిస్సింగ్ కేసులతో సంబంధం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ ముగ్గురిని విచారించేందుకు మరో రెండు వారాల కస్టడీకి కోర్టును అనుమతి కోరారు. రాజకీయ విమర్శలు ఇక ఈ కేసులో భగవల్ సింగ్‌ను తప్పించే యత్నం జరుగుతోందని బీజేపీ విమర్శిస్తోంది. అధికార పార్టీ మద్దతుదారుడు కావడంతోనే షఫీని హైలైట్ చేసి.. భగవల్ను తప్పించాలని చూస్తున్నారంటూ పోలీస్ శాఖపై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అధికార పార్టీ ఖండిస్తోంది. ఇదీ చదవండి: విద్యార్థినిపై హత్యాచారం.. ఆపై యాక్టింగ్! -
నరబలి ఉదంతం: చంపేసి ముక్కలు చేసి తిన్నారా?
తిరువనంతపురం: కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేసి.. పాతేసి ఉంటారని అనుమానించారు. అయితే.. కాల్చేసిన, పాతేసిన ఆనవాలు ఎక్కడా దొరక్కపోవడంతో.. క్లూస్ టీమ్‌కు సైతం ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో తినేసి ఉంటారని భావిస్తున్నారు. రెస్లీని 56 ముక్కలు, పద్మను 5 ముక్కలుగా చేసినట్లుగా నిందితులు(దంపతులు భగవంత్ సింగ్, లైలా.. స్నేహితుడు షఫీ).. అంగీకరించారు. బహుశా తర్వాత ఆ భాగాలను తినేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైలా ఈ మేరకు వాంగ్మూలం ఇవ్వగా.. భగవంత్ సింగ్ మాత్రం నోరు మెదపలేదు. దీంతో ఈ విషయంపై ధృవీకరణ కోసం.. ముగ్గురు నిందితులను మరోసారి విచారించాలని భావిస్తున్నారు. తాంత్రికుడు చెప్పాడని.. జూన్ 8, సెప్టెంబర్ 26వ తేదీల్లో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆ ఇద్దరినీ నర బలి ఇచ్చినట్లు విచారణలో తేలింది. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎర్నాకుళం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక నిందితుల కస్టడీ కొరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. భగవంత్ సింగ్ మసాజ్ థెరపిస్ట్. దీంతో డబ్బు ఆశతో పాటు నిందితుల లైంగిక ఆనందం, తాంత్రిక పూజల కోణంలోనూ ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. రోజెలిన్, పద్మను కట్టేసి.. ఆపై క్రూరంగా చంపి.. ఆపై ముక్కలు చేసినట్లు తెలుస్తోంది. రోజెలిన్ జూన్ నుంచి కనిపించకుండా పోగా.. కడవంతర(ఎర్నాకుళం)కు చెందిన పద్మ సెప్టెంబర్ నుంచి అదృశ్యం అయ్యింది. పద్మ మిస్సింగ్ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు.. ఈ నరబలి వ్యవహారం చిక్కింది. షఫీ వాళ్లను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. సీఎం పినరయి విజయన్ స్పందన ఇక భగవంత్ సింగ్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, అధికార పార్టీ మూలాలు ఉండడంతో.. బీజేపీ విమర్శలకు దిగింది. దీంతో ఈ ఉదంతంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కేసును త్వరగా చేధించిన పోలీసులను అభినందిస్తూ.. సిట్ బృందం ద్వారా విచారణ కూడా అంతే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నరబలి రాకెట్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారాయన. జబ్బుపడిన మనస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కార్యకలాపాల్లో మునిగిపోతారని, ఇలాంటి ఆచారాలు నాగరిక సమాజానికి సవాలుగా పరిణమిస్తాయని విజయన్ పేర్కొన్నారు. సంబంధిత వార్త: మహిళల బలి.. తల నరికి, నాలుక కోసి.. -
కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. అత్యంత క్రూరంగా..
కొచ్చి: కేరళలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనే మూఢ నమ్మకంతో దంపతులు ఏకంగా ఇద్దరు మహిళలను బలిచ్చారు. ఈ ఘటన పత్తినంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది. కోచిలోని కడవంతర, సమీపంలోని కాలడికి చెందిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుని పొట్టపోసుకునేవారు. వీరిలో ఒకరు జూన్, మరొకరు సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు. వారి సెల్ నంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలిద్దరినీ పత్తనంతిట్ట జిల్లా తిరువల్లలో ఉండే మసాజ్ థెరపిస్ట్ భగావల్ సింగ్, అతడి భార్య లైలా బలి ఇచ్చినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపన్నులు కావాలంటే నరబలి తప్పదని వారి మిత్రుడైన పెరుంబవరూర్‌కు చెందిన రషీద్ అలియాస్ ముహమ్మద్ షఫీ సలహా ఇచ్చాడు. ఇతడే బాధిత మహిళలకు డబ్బు ఆశ చూపి భగావల్ సింగ్ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లోనే మంత్రాలు చేసి, ఒకరిని జూన్‌లో మరొకరిని సెప్టెంబర్‌లో గొంతుకోసి చంపారు. అనంతరం షఫీ సాయంతో మృతదేహాలను ముక్కలుగా నరికి సొంతింటి ఆవరణలో, ఇలాంతూర్‌లో పాతిపెట్టారు. సింగ్ దంపతులతోపాటు షఫీని మంగళవారం కస్టడీలోకి తీసుకున్నట్లు కోచి నగర పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం పీటీఐకి చెప్పారు. కాలడికి చెందిన మహిళ ఆచూకీ తెలుసుకునే క్రమంలోనే రెండో ఘటన వెలుగు చూసిందన్నారు. వీటిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీ పి.ప్రకాశ్ అన్నారు. స్థానికంగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే భగావల్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డానే విషయం నమ్మలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు. అధికార సీపీఎంకు చెందిన భగావల్ సింగ్ మహిళలను బలి ఇవ్వడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. చదవండి: లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్ Kerala | Three people arrested for killing two people in 'human sacrifice' ritual. The incident happened in the Pathanamthitta district. The deceased women used to sell lottery tickets. The bodies were buried at a house in the district: Kochi City Police Commissioner, CH Nagaraju pic.twitter.com/mt3kqaOs1j — ANI (@ANI) October 11, 2022 -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్‌కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్‌కు హోల్‌సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
30 నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు తీసుకున్న 84 ఏళ్ల బామ్మ
తిరువనంతపురం: భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. అక్టోబరు నాటికి 100 కోట్ల డోసులు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం శుక్రవారం రోజే రెండు కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. అయితే కొన్నిచోట్ల వివిధ కారణాలతో వ్యాక్సినేషన్లో పలు తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఆరోగ్య అధికారి తప్పిదం కారణంగా అరగంట వ్యవధిలోనే మహిళకు రెండు డోసుల వ్యాక్సిన్ వేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తండమ్మ పప్పు అనే 84 ఏళ్ల బామ్మ 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకుంది. రెండు సార్లూ ఆమె కోవీషీల్డ్ తీసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు వ్యాక్సిన్ కోసం తన కొడుకుతో కలిసి ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ కుమారుడితో ఓ గదిలోకి వెళ్లి మొదట టీకా వేసుకుంది. తిరిగి వస్తుండగా గదిలో చెప్పులు మరిచిపోయినట్లు ఆమెకు గుర్తొచ్చింది. ఈ విషయం కొడుకుతో చెప్పి చెప్పులు తీసుకొచ్చేందుకు వెళ్లింది. ఇంతలో ఓ మహిళా అధికారి వచ్చి తనను లోపలికి తీసుకెళ్లింది. తాను చెప్పేది వినకుండ కుర్చీలో కూర్చోమని చెప్పింది మరోవైపు ఓ నర్సు వచ్చి తనకు మళ్లీ టీకా వేసింది. అయితే ఆమె అరగంట వ్యవధిలోనే రెండు టీకాలు తీసుకున్నానని ఆరోగ్య సిబ్బందికి పదేపదే చెప్పడంతో తండమ్మను గంటపాటు గదిలో కూర్చోమని చెప్పారు. ఆమె క్షేమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బామ్మ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: బెంగళూరులో సామూహిక ఆత్మహత్యల కలకలం సీపీ అంజనీ కుమార్‌ను బెదిరించిన వ్యక్తి ఆ రాష్ట్రంలోనే -
కాఫీ క్యాప్సూల్: ఇక పర్సులో కూడా కాఫీ తీసుకెళ్లొచ్చు
తిరువంతనపురం: ప్రస్తుత విద్యా విధానాన్ని యాంత్రికతతో పోల్చుతుంటారు. ఇది ఏ మాత్రం సృజన లేని విధానం వైపుగా వెళుతోందని, పిల్లలు కీ ఇచ్చే బొమ్మల్లా తయారవుతున్నారని వాపోయే వారూ ఉన్నారు. అలాంటిది కేరళ ఎర్నాకుళంలోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాల 12వ తరగతి విద్యార్థినులు నలుగురు కలిసి ఫిల్టర్ కాఫీ క్యాప్సుల్‌ను తయారు చేసి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. సౌందర్య లక్ష్మి, ఎలిషా అనోరీ కడుతోస్, దింపాల్, శివనందన్.. ఈ నలుగురు అమ్మాయిలు కాఫీ షాపులకు కూడా వెళ్లలేదు కానీ, కాఫీ ప్రేమికులు తమ అభిమాన పానీయాన్ని సేవించడానికి, ఆ ఆస్వాదనలో మునిగిపోవడానికి సహాయపడే విధంగా ఒక కొత్త ఉత్పత్తిని తీసుకు వచ్చి, కాఫీ ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నారు. తేయాకుతో ప్రయోగాలు ‘అమెరికాలో జరిగే టై గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార పరిధిని పెంచే విషయంలో కొత్త కొత్త ఆహ్వానాలు కోరింది. మన దేశం నుంచి వచ్చిన వాటిలో ఎనిమిది ఐడియాలను తీసుకుంది. వాటిలో ఈ స్కూల్ విద్యార్థుల బృందం చేసిన ఉత్పత్తి ఫిల్టర్ కాఫీ క్యాప్సూల్. ఈ విద్యార్థులు అందించిన ‘కాఫీ పిల్’ కు మంచి ఆదరణ లభించింది. ఇది ఫిల్టర్ కాఫీని క్యాప్సూల్‌లో ప్యాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీని ఉత్పత్తికి, రూపకల్పనకు చేసిన కృషిని ఈ బృంద నాయకురాలు సౌందర్య వివరిస్తూ ‘మా స్కూల్ వద్ద ఓ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, కొత్త ఐడియాలు కోరారు. అయితే, అంతకుముందే మా సొంత వ్యాపారంతో ముందుకు రావాలన్న ఆలోచనలో ఉన్న మేము తేయాకులతో రకరకాల ప్రయోగాలు చేశాం. ముందు ఒక చిన్న బంతిలో టీ ఆకులను జొప్పించి, కప్పు నీళ్లతో టీని తయారు చేశాం’ అని సగర్వంగా చెబుతోంది. సేంద్రియ పద్ధతిలో కాఫీ ‘ఇది పూర్తిగా సేంద్రియ పద్ధతి. కాగితం లేదా ఇతర హానికారక పదార్థాలేవీ ఉపయోగించలేదు. మా పరిశోధన చాలా విస్తృతంగా జరిగింది. బంతి పరిమాణం నుంచి సాచెట్లోకి తీసుకువచ్చాం. ఆ తర్వాత క్యాప్సూల్ అయితే ఉపయోగకరంగా ఉంటుందని, పర్స్‌లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు అనే ఆలోచనకు వచ్చాం. ఈ క్యాప్సూల్‌ని వేడినీటిలో వేసినప్పుడు కరిగిపోయి, డికాషన్ తయారవుతుంది. ఈ విధానం వల్ల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే సమస్యే తలెత్తదు. ఇది మంచి వ్యాపార ఆలోచనగా గుర్తించాం’ అని తెలియజేసే ఈ పరిశోధక బృందం తమ ప్రొడక్ట్‌కు లోగోను కూడా జోడించి ట్రేడ్‌మార్క్ లైసెన్స్ కి సబ్మిట్ చేశారు. ‘12 వ తరగతి పూర్తి చేసిన తర్వాత మేం మా వ్యాపార ఆలోచనను పూర్తిస్థాయి వెంచర్‌గా మారుస్తాం’ అని ఈ బృందం సంతోషంగా తమ సృజన గురించి వివరిస్తోంది. -
నెల రోజుల అమ్మ
స్త్రీ అమ్మగా మారడానికి రోజులు అక్కర్లేదు. ఒక్క నిమిషం చాలు. పసిబిడ్డ గుండెలకు తాకిన మరుక్షణమే ఏ స్త్రీ అయినా తల్లిలా మారిపోతుంది. మేరి అనిత కూడా అలా మారింది. కాని ఆమె షించాల్సిన పాత్ర నెలరోజులు మాత్రమే అనే వాస్తవం ఉద్వేగభరితమైనది. జూన్ 14, 2020. ఎర్నాకులంలోని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఒక ఫోన్ వచ్చింది. షీనా అనే మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఆమెకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడని, ఆ పసివాణ్ణి చూసుకోవడానికి మనిషి కావాలని. కాని ఎవరూ లేరు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి పని చేస్తున్నడా. మేరీ అనితకు ఈ సంగతి తెలిసింది. ఆమె క్లినికల్ సైకాలజిస్ట్. స్పెషల్ చిల్డ్రన్ కోసం ఒక కేంద్రం నడుపుతోందామె. ‘ఎవరూ లేరు. కాని నేను ఆ పసివాడికి తల్లినవుతాను’ అంది మేరీ. కోవిడ్ వచ్చిన తల్లిదండ్రులు ఆ పసివాడి పేరు ఉన్నికుట్టన్. తల్లిదండ్రులు నర్సులుగా హర్యానా వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అక్కడ మొదట తండ్రికి కరోనా వచ్చింది. అతడు అక్కడే క్వారంటైన్లోకి వెళ్లగా తల్లి బాబును తీసుకొని కేరళలోని సొంత ప్రాంతమైన ఎర్నాకులం వచ్చింది. వచ్చాక ఆమెకు కోవిడ్ పాజిటివ్ తేలింది. అదృష్టవశాత్తు పసివాడికి నెగెటివ్ వచ్చింది. తల్లి వైద్యానికి ఆస్పత్రిలో ఉంటే పసివాణ్ణి ఎవరు చూసుకోవాలనే సమస్య వచ్చింది. షీనా బంధువులు కాని ముసలి తల్లిదండ్రులు కాని సాయం చేసే స్థితిలో లేరు. ఆ సమయంలో మేరీ అనిత ముందుకు వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అడ్వకేట్‌గా పని చేస్తున్నాడు. వారిని సలహా అడిగితే వారంతా మనస్ఫూర్తిగా పసివాడికి సాయం చేయమన్నారు. పిల్లవాడికి ఏ క్షణమైనా కోవిడ్ వచ్చే అవకాశం ఉండటంతో మేరి అనిత వాణ్ణి తీసుకొని పక్కనే ఉన్న ఒక ఖాళీ ఫ్లాట్‌లోకి మారి క్వారంటైన్లోకి వెళ్లింది. నెల రోజులుగా బాబుకు అమ్మలా మారి బాగోగులు చూసుకుంది. నెల రోజుల తల్లి ఉన్నికుట్టన్‌కు అమ్మపాలు అలవాటు. కాని మేరి అనిత మెల్లగా పోతపాలలోకి మార్చగలిగింది. మెల్లమెల్లగా పసివాడు మేరిలోనే తల్లిని చూసుకోసాగాడు. ఈ నెలరోజులు వారి మధ్యగట్టి బంధం ఏర్పడిపోయింది. తండ్రి హర్యానా నుంచి తిరిగి రాగా, తల్లి కోవిడ్ నుంచి బయట పడగా రెండు రోజుల క్రితం మేరి ఆ పసివాణ్ణి సొంత తల్లిదండ్రులకు అధికారుల సమక్షంలో అప్పజెప్పింది. ఉన్నికుట్టన్ తల్లిని గుర్తుపట్టి మెల్లగా నవ్వాడు. కాని పసివాణ్ణి తిరిగి ఇస్తూ మేరి కంట నీరు పెట్టుకుంది. ‘ఆమె దేవతలా నా బిడ్డను కాపాడింది’ అని షీనా అంది. మేరి ఉండే అపార్ట్మెంట్లోని వారంతా వచ్చి ఉన్నికుట్టన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే తన ఇల్లు చేరుకున్నాక ఉన్ని కుట్టన్ మేరి కోసం ఏడుపు మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి షీనా వెంటనే మేరికి కాల్ చేసింది. ‘ఒకసారి వీడియోకాల్ చేస్తాను. మాట్లాడండి’ అని ప్రాధేయపడింది. మేరి అనిత ఆ విన్నపాన్ని మన్నించలేదు. ‘వద్దు. మీ ప్రేమతో వాణ్ణి నన్ను మరిపించండి’ అని మెల్లగా ఫోన్ పెట్టేసింది. పాశం పెంచుకునే సందర్భాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో తుంచుకునే క్షణాలు అంత బాధను మిగులుస్తాయి. కరోనా నమోదు చేసిన లీలల్లో ఇది ఒకటి. -
బ్యాంకు అద్దాల తలుపు తగిలి మహిళ మృతి
ఎర్నాకులం : పని మీద బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళ అనుకోకుండా అద్దాల తలుపులకు(గ్లాస్ డోర్) తగిలి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకు సీసీటీవీలో రికార్డయ్యాయి. కేరళ, ఎర్నాకులంలోని పెరుంబవూర్‌కు చెందిన బీనా (46) పనిమీద సోమవారం నగరంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుకు వెళ్లారు. అక్కడ లావాదేవీలు పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. వాహనం కీని మర్చిపోవడంతో దానికి తీసుకునేందకు మళ్లీ ఆమె బ్యాంకులోకి వెళ్లారు. కీని తీసుకొని తిరిగివెళ్లే క్రమంలో అనుకోకుండా ఆమె గ్లాస్ డోర్‌కు తగిలారు. దీంతో ఆ గ్లాస్ డోర్ పగిలి పదునైన అద్దం ముక్క ఒకటి ఆమె కడుపులో గుచ్చుకుంది. తీవ్ర రక్తస్త్రావం కావడంతో బ్యాంకు సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎర్నాకులం మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేయసిని పెళ్లాడిన నటుడు
తిరువనంతపురం: మలయాళ నటుడు గోకులన్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు ధన్యను గురువారం వివాహమాడాడు. స్వస్థలం ఎర్నాకుళంలోని ఓ గుడిలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ జంట పెళ్లి జరిగింది. గోకులన్ తెలుపు రంగు షర్టు, దోవతి ధరించగా... ధన్య ఎరుపు రంగు చీర కట్టుకుని ముస్తాబయ్యారు. ఇక ఇద్దరు తమ దుస్తులకు మ్యాచ్ అయ్యే మాస్కులు ధరించడం విశేషం. (నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి) ఇక అత్యంత నిరాడంబరంగా జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను నటుడు జయసూర్య ఫేస్బుక్లో షేర్ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గోకులన్- ధన్యను అభిమానులు విష్ చేస్తున్నారు. కాగా థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించిన గోకులన్ లాల్ బహదూర్ శాస్త్రి, సప్తమాశ్రీ తస్కరహ, రమంతే ఎదన్తోట్టం వంటి సినిమాల్లో నటించాడు. పున్యలన్ అగర్బత్తీస్ సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. (జోయాపై ఆదిత్య ఠాక్రే ప్రశంసలు!) -
కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!
కొచ్చి: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడికి చేసేందుకు కేరళ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ట్యాక్సీలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల్లో తిరిగి వస్తున్న వారిని తరలించేందుకు ఈ ట్యాక్సీలను వినియోగించనున్నారు. కారు లోపల ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య ప్లాస్టిక్ షీట్లతో పారదర్శక విభజన ఏర్పాటు చేశారు. పారదర్శక విభజనలతో కారు లోపల భౌతిక దూరం పెరగడంతో పాటు తుమ్మినా, దగ్గినా మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఎర్నాకుళలం జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు పారదర్శక విభజనలు ఏర్పాటు చేసినట్టు ఎంజీఎస్ లాజిస్టిక్స్ సంస్థ వెల్లడించింది. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..) కాగా, పటిష్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తిని కేరళ సమర్థవంతంగా కట్టడి చేస్తోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణింకాల ప్రకారం కేరళలో ఇప్పటివరకు 512 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా, నలుగురు చనిపోయారు. కోవిడ్-19 నుంచి 489 మంది కోలుకున్నారు. (కరోనాను అడ్డుపెట్టుకుని అణచివేస్తారా?) -
కొండచిలువను చుట్టి సంచీలో వేసిన మహిళ
-
20 కిలోల కొండచిలువను చుట్టి..
తిరువనంతపురం: జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను ఓ మహిళ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని చుట్టి సంచీలో వేసి.. అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. విద్యా రాజు(60) అనే మహిళ వన్యప్రాణుల సంరక్షణా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్నాకుళంలోని తరంగిణి అపార్టుమెంటు వద్దకు కొండచిలువ చేరుకుందన్న వార్త తెలుసుకుని అక్కడకు వెళ్లారు. నలుగురు వ్యక్తుల సహాయంతో కొండచిలువను పట్టుకున్నారు. దానికి హాని కలగకుండా ఓ బ్యాగులో వేసి అడవిలో వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో విద్యా రాజు ధైర్యసాహసాలు, దయాగుణంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా విద్యా రాజు భర్త నావికా దళ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గోవాలో విధులు నిర్వర్తిస్తున్న నాటి నుంచి విద్య.. వన్యప్రాణి సంరక్షకురాలిగా అవతారమెత్తారు. జవాసంలోకి వచ్చిన పాములను సంరక్షిస్తూ జంతువుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. -
ఎంపీ భార్య వేసిన ఆ జోక్ చెత్తగా ఉంది!
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకులం ఎంపీ హిబీ ఈడెన్ భార్య ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. విధిని అత్యచారంతో పోలుస్తూ.. మంగళవారం ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ‘విధి అత్యాచారం వంటిది, మీరు దానిని అడ్డుకోలేకపోతే.. ఆస్వాదించడానికి ప్రయత్నించండి' అంటూ ఆమె వేసిన జోక్ చెత్తగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పోస్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎంపీ భార్య తన వివాదాస్పద పోస్టును తొలగించారు. అంతేగాక తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. మలయాళంలో క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులం ఎంపీ భార్య అన్నా లిండా ఈడెన్.. కుండపోత వర్షాలు కొచ్చిని ముంచెత్తుతున్న తరుణంలో తమ పిల్లాడు ఇంట్లో సురక్షితంగా ఉన్నాడన్న వీడియోతో పాటు.. భర్త హిబీ ఈడెన్ డెజర్ట్ ఆస్వాదిస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లకు ఆమె జత చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో అన్నా చేసిన పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. రేప్ జోక్‌లు వద్దని, ఇటువంటి వ్యాఖ్యలు అత్యాచార బాధితులు, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చురకలు అంటించారు. దీంతో తన పోస్టును వెనక్కు తీసుకున్న ఆమె.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తాను చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. -
భారీ వర్ష సూచన.. రెడ్అలర్ట్ ప్రకటన
తిరువనంతపురం: భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు ముందుస్తు జాగ్రత్తగా హైఅలర్ట్ ప్రకటించారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించిన వరద బీభత్సం.. ఎంతో మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులంతా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. అలాగే ఇడుక్కి, వయనాడ్, కానూర్, ఎర్నాకులం, త్రిసూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం. కాగా వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది కేరళను వరదలు ముంచెత్తిన విషయం విదితమే. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–కొచ్చివేలి ప్రత్యేక రైలు (07115) జూలై 6, 13, 20, 27, ఆగస్టు 3, 10, 17, 24, 31వ తేదీల్లో రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.20కి కొచ్చివేలి చేరుకుంటుంది. కొచ్చివేలి–హైదరాబాద్ రైలు (07116) జూలై 8, 15, 22, 29, ఆగస్టు 5, 12, 19, 26, సెప్టెంబర్ 2వ తేదీల్లో ఉదయం 7.45 గంటలకు కొచ్చివేలిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–ఎర్నాకుళం ప్రత్యేక రైలు (07117) జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో, ఆగస్టు 7, 14, 21, 28వ తేదీల్లో మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. ఎర్నాకుళం–హైదరాబాద్ రైలు (07118) జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30కు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.55కు హైదరాబాద్ చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్–సంత్రాగచి రైలు (06058) జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో మధ్యాహ్నం 3.15కు చెన్నైలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.00 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. సంత్రాగచి – చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు (06057) జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1వ తేదీల్లో రాత్రి 11.50కు సంత్రాగచిలో బయల్దేరి రెండో రోజు ఉదయం 5.30కు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. పుదుచ్చేరి –సంత్రాగచి రైలు (06010) జూలై 6, 13, 20, 27వ తేదీల్లో సాయంత్రం 6.45కు పుదుచ్చేరిలో బయలుదేరి రెండో రోజు తెల్లవారుజామున 4.30కు సంత్రాగచి చేరుకుంటుంది. సంత్రాగచి–పుదుచ్చేరి ప్రత్యేక రైలు (06009) జూలై 8, 15, 22, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2.10కు సంత్రాగచిలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 9.45కు పుదుచ్చేరి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయని,ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రప్రసాద్ కోరారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–కోచివేలి ప్రత్యేక రైలు (07115) ఆగస్టు 4, 11, 18, 25వ తేదీల్లో, సెప్టెంబర్ 1, 8, 15, 22, 29న రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. కోచివేలి–హైదరాబాద్ రైలు (07116) ఆగస్టు 6, 13, 20, 27వ తేదీల్లో, సెప్టెంబర్ 3, 10,1 7, 24, అక్టోబర్ 1వ తేదీల్లో ఉదయం 7.45కు కోచివేలిలో బయలుదేరుతుంది. హైదరాబాద్–ఎర్నాకుళం ప్రత్యేక రైలు (07117) ఆగస్టు 1, 8, 15, 22, 29వ తేదీల్లో, సెప్టెంబర్ 5, 12,19, 26న మధ్యాహ్నాం 12.50కు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. ఎర్నాకుళం–హైదరాబాద్ రైలు (07118) ఆగస్టు 2, 9, 16, 23, 30వ తేదీల్లో, సెప్టెంబర్ 6, 13, 20, 27న రాత్రి 9.45కు ఎర్నాకుళంలో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రాజశేఖర్ కోరారు. -
క్యాంపస్‌లో ఘర్షణ.. ఎస్ఎఫ్ఐ విద్యార్థి హత్య
తిరువనంతపురం : రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి నేత హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులం మహారాజ్ కాలేజీలో సోమవారం చోటుచేసుకుంది. ఫ్రెషర్స్ డే సందర్భంగా సీపీఎంకు చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) విద్యార్థులు కాలేజీ ఆవరణలో పోస్టర్ పెట్టినందుకు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఎస్ఎఫ్ఐకు చెందిన విద్యార్థినేత అభిమన్యు కత్తిపోట్లకు గురై మృతి చెందగా, ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), క్యాంపస్ ఫ్రెంట్‌కు చెందిన వ్యక్తులే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే కాలేజీకి చెందిన వారని, మిగిలిన వారంతా బయటి వ్యక్తులుగా గుర్తించామని తెలిపారు. ఘటనను కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు పీ. రాజీవ్ తీవ్రంగా ఖండించారు. ప్రగతిశీల వాదులంతా ఇలాంటి ఘటనలను ఖండించాలని కోరారు. విద్యార్థి నేత హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంఘాల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. -
ఫ్రీ వైఫై.. జీవితాన్ని మలుపు తిప్పింది
తిరువనంతపురం: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ చుట్టూ పుస్తకాలు వేసుకుని గంటల తరబడి కుస్తీ పట్టడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ యువకుడు ఫ్రీ వైఫై సాయంతో తన తలరాతను మార్చుకున్నాడు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల రాత పరీక్షలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన ఓ రైల్వే కూలీ స్టోరీ ఇది. మున్నార్‌కు చెందిన శ్రీనాథ్ పదో తరగతి పాసయ్యాడు. కుటుంబ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవటంతో చదువుకు స్వస్తి చెప్పి ఐదేళ్ల క్రితం ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిలో చేరాడు. ఓవైపు కుటుంబానికి సాయంగా ఉంటూనే.. మరోపక్క ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని భావించాడు. అయితే అందుకు అవసరమైన మెటీరియల్ కొనుక్కునేందుకు అతని దగ్గర డబ్బులేదు. అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి రెండుసార్లు పరీక్షలు రాశాడు. అలాంటి సమయంలోనే రైల్వే స్టేషన్లో ప్రవేశపెట్టిన ఫ్రీ వైఫై అతని జీవితాన్ని మలుపు తిప్పింది. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను వైఫై వాడటాన్ని గమనించిన శ్రీనాథ్‌కు ఓ ఆలోచన తట్టింది. బంధువుల దగ్గర అప్పు చేసి ఓ స్మార్ట్ ఫోన్ కొనుకున్నాడు. దాని ద్వారానే పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుకోవటం ప్రారంభించాడు. ఓవైపు లగేజీ మోస్తూనే.. మరోవైపు ఇయర్ ఫోన్స్ ద్వారా ఫోన్లో ఆడియో పాఠాలు విన్నాడు. తెలిసిన కొందరు లెక్చరర్ల సాయంతో ఫోన్ కాల్ ద్వారా పాఠాలు చెప్పించుకున్నాడు. రాత్రిపూట ఆ పాఠాలను రివిజన్ వేసుకుంటూ కష్టపడ్డాడు. చివరకు ఈ మధ్యే కేపీఎస్సీ, విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించాడు. త్వరలోనే శ్రీనాథ్ ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్నాడు. అందులో విజయం సాధిస్తే అతని కష్టాలు తీరినట్లే. ‘పరిస్థితులను మనకు అనుకూలంగా మల్చుకుంటే ఎతంటి కష్టానైనా అధిగమించొచ్చు’ అని శ్రీనాథ్ చెబుతున్నాడు. -
కొడుకును ‘నీట్’కు పంపి.. కుప్పకూలిన తండ్రి
సాక్షి, తిరువనంతపురం : కేరళలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడిని సీబీఎస్ఈ నిర్వహించే నీట్ పరీక్షకు పంపిన మరుక్షణమే గుండె పోటుతో ఓ తండ్రి హఠాన్మరణానికి గురయ్యారు. ఎర్నాకుళంలో ఆదివారం ఉదయం తమిళనాడులోని తిరువూరు జిల్లాకు చెందిన కృష్ణస్వామి తన కుమారుడు కస్తూరి మహాలింగంను తాము బసచేసిన హోటల్ నుంచి ఆటోలో పరీక్షా కేంద్రానికి పంపారు. వెనువెంటనే తనకు అస్వస్థతగా ఉందని, ఆస్పత్రికి తీసుకువెళ్లాలని హోటల్ సిబ్బందికి తెలుపగా వారు సిటీ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8.20 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న కృష్ణస్వామి స్పృహలోనే ఉన్నారని, ఆయన షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే హఠాత్తుగా కుప్పకూలిన ఆయన తీవ్ర గుండెపోటుతో మరణించారని వెల్లడించాయి. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి తమిళనాడు సీఎం కే పళనిస్వామి రూ 3 లక్షల పరిహారం ప్రకటించారు. -
జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు