20 కిలోల కొండచిలువను చుట్టి.. | Woman Captures Python In Kochi Netizens Applaud Her | Sakshi
Sakshi News home page

కొండచిలువను చుట్టి సంచీలో వేసిన మహిళ

Published Fri, Dec 13 2019 12:53 PM | Last Updated on Fri, Dec 13 2019 4:14 PM

Woman Captures Python In Kochi Netizens Applaud Her - Sakshi

తిరువనంతపురం: జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను ఓ మహిళ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని చుట్టి సంచీలో వేసి.. అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. విద్యా రాజు(60) అనే మహిళ వన్యప్రాణుల సంరక్షణా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్నాకుళంలోని తరంగిణి అపార్టుమెంటు వద్దకు కొండచిలువ చేరుకుందన్న వార్త తెలుసుకుని అక్కడకు వెళ్లారు. నలుగురు వ్యక్తుల సహాయంతో కొండచిలువను పట్టుకున్నారు. దానికి హాని కలగకుండా ఓ బ్యాగులో వేసి అడవిలో వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ క్రమంలో విద్యా రాజు ధైర్యసాహసాలు, దయాగుణంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా విద్యా రాజు భర్త నావికా దళ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గోవాలో విధులు నిర్వర్తిస్తున్న నాటి నుంచి విద్య.. వన్యప్రాణి సంరక్షకురాలిగా అవతారమెత్తారు. జవాసంలోకి వచ్చిన పాములను సంరక్షిస్తూ జంతువుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement