టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు! | Kerala TTE Pushed To Death By Passenger On Moving Train | Sakshi
Sakshi News home page

Kerala: టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు!

Published Wed, Apr 3 2024 7:01 AM | Last Updated on Wed, Apr 3 2024 8:55 AM

Kerala TTE Ernakulam Patna Express Passenger Pushed Death - Sakshi

కేరళలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ములంగున్నాతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్‌ల మధ్య వెలప్పయ్య త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది.  

ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో టీటీఈ వినోద్ ప్రయాణికుల టిక్కెట్ల తనిఖీలో భాగంగా ఒక ప్రయాణికుడిని టిక్కెట్‌ చూపించమని అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఆ ప్రయాణికుడు టీటీఈని వేగంగా వెళుతున్న రైలు నుండి కిందకు తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే  మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళ రైల్వే పోలీసులు మీడియాకు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుడు రజనీకాంత్‌ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. ఇంతలో టీటీఈ వినోద్  అతనిని టిక్కెట్‌ అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో డోర్‌ దగ్గర నిలుచున్న ప్రయాణికుడు టీటీఈ వినోద్‌ను కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసివేశాడు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు ఆ టీటీఈని ఢీకొంది. దీంతో టీటీఈ అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికుడు రజనీకాంత్‌ను పాలక్కడ్‌లో అరెస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement