న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 341 కొత్త కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన ముగ్గురు కేరళకు చెందిన వారే. దేశంలో ప్రస్తుతం 2311 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఒక్క కేరళలోనే 2041 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ జేఎన్1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం(డిసెంబర్ 20) కరోనా కేసులు పెరుగుతండడంపై ఉన్నతస్థాయి సమీక్షనిర్వహించనుంది. ఈ సమీక్ష అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు కొత్త వేరియెంట్ వ్యాప్తిపై మరిన్ని వెల్లడించే అవకాశం ఉంది.
ఇదీచదవండి..ఈ ఏడాది ఈమె టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment