Express
-
ప్రయాణం ఫ్రీనే.. బస్సే లేదు
సిరిసిల్ల: అది రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ స్టేజీ.. అక్కడి నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర అడవి తప్ప ఒక్క ఊరు ఉండదు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాతిక మంది ప్రయాణికులు... అందులోనూ మహిళలు బస్సు(bus) కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. వీరంతా దమ్మన్నపేట, నాగంపేట, ముచ్చర్ల, సమీపంలోని గిరిజన తండాలకు చెందిన వారు. పెద్దమ్మ స్టేజీ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మూడున్నర గంటల వరకూ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఎండలో గొంతులెండి అలమటించారు. ఒక్క బస్సు కూడా రాకపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కొందరైతే ప్రయాణం మానుకుని వెనుదిరిగారు. ఉచిత ప్రయాణం అనుకుంటే ఉన్న బస్సులు కూడా రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఆర్డీనరీ బస్సుల బాట: కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి నిడివి 98 కిలోమీటర్లు. ఆర్డినరీ బస్సులు తప్ప ఒక్క ఎక్స్‌ప్రెస్ కూడా ఈ మార్గంలో లేవు. ఈ మార్గంలో సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ పుణ్యక్షేత్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట మండలాలు, అనేక గ్రామాలున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు అరకొరగా ఆర్డినరీ బస్సులతో నెట్టుకొస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆ రూట్ మా పరిధిలో లేదుఆ రూట్ మా పరిధిలో లేదు. కామారెడ్డి–కరీంనగర్ రూట్‌ను కరీంనగర్–1, కామారెడ్డి డిపోలు పర్యవేక్షిస్తాయి. బస్సులు రాకపోవడం, లేకపోవడంపై నాకు సమాచారం లేదు. ఆ రెండు డిపోల అధికారులను సంప్రదిస్తే కారణాలు తెలుస్తాయి. – ప్రకాశ్‌రావు, సిరిసిల్ల డిపో మేనేజర్. Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు -
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శీతాకాల షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల నుంచి వారానికి 173 విమాన సర్వీసులు నడుస్తుండగా, 250కు (45 శాతం అధికం) పెంచుతున్నట్టు తెలిపింది.విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్‌తో హైదరాబాద్‌కు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసులు పెరగనున్నట్టు ప్రకటించింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి వారం 200 సర్వీసులతో తమ నెట్ వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు చెప్పారు.హైదరాబాద్ నుంచి నేరుగా 17 దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లకు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ శీతాకాల సీజన్లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించింది. -
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్
గువహాటి: అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తలా నుంచి ముంబయికి బయలుదేరిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అస్సాంలోని దిబలోంగ్ స్టేషన్ సమీపంలో ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదం మధ్యాహ్నం 3.55 గంటలకు జరగ్గా, సమాచారం అందగానే సహాయక బృందాలు చేరుకున్నాయి. ప్రమాదం కారణంగా లుమ్డింగ్-బాదర్పూర్ సింగిల్-లైన్ హిల్ సెక్షన్లో రైళ్ల రాకపోకలు నిలివేశారు.ఇదీ చదవండి: వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని.. -
యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం
లక్నో: యూపీలోని లక్నోలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత ఆగస్టులో ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసులను రైలు నుంచి తోసి, హత్య చేసిన కేసులో నిందితునిగా ఉన్న జాహిద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతనిపై పోలీసులు రూ. రూ.లక్ష రివార్డు ప్రకటించారు. నిందితుడు జాహిద్ మద్యాన్ని రైలులో అక్రమంగా రవాణా చేస్తుండగా, ఇద్దరు ఆర్పీఎఫ్ జవానులు అడ్డుకున్నారు. అయితే నిందితుడు జాహిద్ వారిని రైలు నుంచి తోసివేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు.వివరాల్లోకి వెళితే గత నెల ఆగస్టు 19న రాత్రి బార్మర్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితుడు జాహిద్ రైలు నుంచి కిందకు నెట్టివేశాడు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు నిందితుడు జాహిద్‌ను ఎన్కౌంటర్ చేశారు. ఘాజీపూర్‌లోని దిల్దార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన స్థితిలో నిందితుడు జాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతను చనిపోయినట్లు ప్రకటించారు. నిందితుడు పట్నాలోని మన్సూర్ గాలి పెదిమా బజార్‌కు చెందినవాడు. నిందితునిపై గతంలో కిడ్నాప్, దాడి, మద్యం స్మగ్లింగ్ తదితర కేసులు నమోదయ్యాయి. STF यूनिट नोएडा कोतवाली गहमर व GRP दिलदारनगर पुलिस की संयुक्त टीम द्वारा आरपीएफ जवानों की हत्या में शामिल 100000/- रुपये के इनामिया बदमाश के साथ थाना दिलदारनगर क्षेत्रान्तर्गत हुई मुठभेड़ के संबंध में #spgzr महोदय की बाइट(1)@Uppolice @IgRangeVaranasi @adgzonevaranasi pic.twitter.com/lCHVw8Z1In— Ghazipur Police (@ghazipurpolice) September 23, 2024ఇది కూడా చదవండి: మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన సమయంలో మహాబోధి ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుండి బీహార్‌లోని గయకు వెళుతోంది.ఈ రాళ్లదాడిలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి యమునా బ్రిడ్జి సమీపంలో ఈ రాళ్లదాడి జరిగింది. మిర్జాపూర్ స్టేషన్లో రైలును నిలిపివేసి, గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందించారు. అలాగే దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ రైలుపై రాళ్లు రువ్విన ఐదుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్టు చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (మహాసముంద్) ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సింగ్ ధాకడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రైలు విశాఖపట్నం నుండి దుర్గ్‌కు తిరిగి వస్తుండగా బాగ్బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. రైలు దుర్గ్ నుండి ట్రయల్ రన్ కోసం బయలుదేరిందని, రాయ్‌పూర్ గుండా మహాసముంద్ చేరుకుందని ధాకడ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే -
Uttar Pradesh: రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్.. తప్పిన ముప్పు
ఉత్తరప్రదేశ్‌లో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు వెళుతున్న అభ్యర్థులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు.కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిరోజ్‌పూర్ నుండి ధన్‌బాద్ వెళ్తోంది. ఈ రైలు బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. అకస్మాత్తుగా దాని కప్లింగ్ విరిగిపోయింది. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా, వాటిలో ఎనిమిది కోచ్‌లు వేరయ్యాయి. స్టేషన్ నుంచి రైలు కొంత దూరం వెళ్లిన తరువాత వెనుకనున్న ఎనిమిది బోగీలు విడిపోయాయని అధికారులు తెలిపారు. రైలులో కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన మరవకముందే ఈ రైలు ప్రమాదం చోటుచేసుకోవడం రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. -
‘అమర్కంటక్’లో మంటలు... తప్పిన ముప్పు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మిస్రోడ్- మందీదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు ఈ విషయాన్ని వెంటనే రైల్వే అధికారులకు తెలియజేశారు. బీ-3, బీ-4 ఏసీ కోచ్‌ల కింద మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు అగ్ని నిరోధక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఉదంతంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అమర్‌కాంత్ ఎక్స్‌ప్రెస్ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు 27 హాల్ట్‌లు ఉన్నాయి. -
జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించిన రెండు వారాలలోపే మరో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా డిపార్చర్ల సంఖ్య తగ్గడం క్యాబిన్ సిబ్బంది జీతాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యూనియన్ పేర్కొంది.ఎయిర్పోర్ట్ ప్రవేశ పాస్‌లు లేకపోవడంతో 100 మందికి పైగా క్యాబిన్ సిబ్బంది గత రెండు నెలలుగా ఫ్లైయింగ్ డ్యూటీలు లేకుండా ఖాళీగా కూర్చున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) పేర్కొంది. ఈ యూనియన్ ఎయిర్‌లైన్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలో మే 9న చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఏర్పాటు చేసిన యూనియన్, విమానయాన సంస్థ ప్రతినిధుల సమావేశం తర్వాత క్యాబిన్ క్రూ సమ్మె విరమించింది. ఎయిన్లైన్ యాజమాన్య వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ సమ్మె కారణంగా విమాన సర్వీసులకు అంతరాయాలు ఏర్పడ్డాయి.ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ విభాగం కొత్త సాఫ్ట్‌వేర్‌కు మారుతున్న క్రమంలో క్యాబిన్ సిబ్బంది డేటా తొలగిపోయిందని తాజాగా చీఫ్ లేబర్ కమిషనర్‌కు రాసిన లేఖలో యూనియన్ పేర్కొంది. విమానాల రద్దు, ఆలస్యాలను కవర్ చేయడానికి క్యాబిన్ సిబ్బంది బేస్ వారీగా షెడ్యూలింగ్ విభాగానికి మాన్యువల్‌గా సహాయం చేస్తున్నారని యూనియన్ చెబుతోంది.డిపార్చర్ల సంఖ్య తగ్గడం వల్ల క్యాబిన్ సిబ్బంది జీతాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని, ఈ విషయంలో కమిషనర్ తక్షణ జోక్యాన్ని యూనియన్ కోరుతోంది. క్యాబిన్ సిబ్బంది ఫ్లైయింగ్ హవర్స్‌తో జీతాలు కూడా ముడిపడి ఉంటాయి. అయితే ఈ అంశంపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక ప్రతినిధి నుంచి ఎటువంటి స్పందనా లేదు. -
టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు!
కేరళలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ములంగున్నాతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్ల మధ్య వెలప్పయ్య త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో టీటీఈ వినోద్ ప్రయాణికుల టిక్కెట్ల తనిఖీలో భాగంగా ఒక ప్రయాణికుడిని టిక్కెట్ చూపించమని అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఆ ప్రయాణికుడు టీటీఈని వేగంగా వెళుతున్న రైలు నుండి కిందకు తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళ రైల్వే పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుడు రజనీకాంత్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. ఇంతలో టీటీఈ వినోద్ అతనిని టిక్కెట్ అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో డోర్ దగ్గర నిలుచున్న ప్రయాణికుడు టీటీఈ వినోద్‌ను కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసివేశాడు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు ఆ టీటీఈని ఢీకొంది. దీంతో టీటీఈ అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికుడు రజనీకాంత్‌ను పాలక్కడ్‌లో అరెస్టు చేశారు. -
హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్‌కు చేరుకుంటుంది. గ్వాలియర్‌కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
‘దర్భంగా ఎక్స్‌ప్రెస్’ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న 12554 వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో క్లోన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్ పూజలో పాల్గొనేందుకు బీహార్, యూపీకి చెందిన పలువురు ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో తూర్పు యూపీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఒకరు ఉన్నారు. గాయపడిన 11 మంది రైల్వే ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులను డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్లో చేర్చారు. రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మైన్‌పురి ఔటర్ గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. కాగా బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
బుకింగ్‌లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
‘అమ్మ’కు అండగా..
సాక్షి, అమరావతి: మాతృత్వం మరో జన్మ. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం వారికి సకాలంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మందులు, పౌష్టికాహారం అందిస్తోంది. మరోవైపు ప్రసూతి మరణాలు మరింతగా తగ్గించడంపైనా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైరిస్క్ గర్భిణులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పింస్తోంది. రాష్ట్రంలో ఏటా 9 లక్షల ప్రసవాలు నమోదవుతుంటాయి. వీరిలో 28 శాతం మంది రక్తహీనత, ఇతరత్రా అనారోగ్య కారణాలతో బాధపడే హైరిస్క్ గర్భిణులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. వీరి ఆరోగ్యంపై నిరంతరం వాకబు చేస్తూ, తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగేలా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్ గర్భిణులను డెలివరీ తేదీకి ముందే ఆస్పత్రులకు తరలించి వైద్యుల సంరక్షణలో ఉంచుతున్నారు. దీంతోపాటు తీవ్ర రక్తహీనతతో బా«ధపడే గర్భిణులకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లడానికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తెచ్చారు. గుమ్మం వద్దకే వాహనం ఈ ఏడాది ఆగస్టు నుంచి హైరిస్క్ గర్భిణులను ప్రసవం, ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో తరలించడం ప్రారంభించారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్, ఆశా వర్కర్లు తమ పరిధిలో హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి తరలించాల్సి ఉన్నట్లయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ జిల్లా కో–ఆర్డినేటర్‌కు సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న 24 గంటల నుంచి 48 గంటల్లో వాహనం గర్భిణుల స్వగ్రామంలో వారి గుమ్మం వద్ద పికప్ చేసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్తుంది. తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి అనంతరం తిరిగి క్షేమంగా ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన వారికి ప్రసవానంతరం తల్లీబిడ్డ ఇద్దరినీ క్షేమంగా ఇంటికి తరలిస్తున్నారు. ఇలా ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 3,500 మంది గర్భిణులు సేవలు వినియోగించుకున్నారు. వీరిలో 2,300 మందికిపైగా రక్తహీనత సమస్య ఉండి ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు ఉన్నారు. గర్భిణులు ఇబ్బంది పడకుండా.. రక్తహీనతతో బాధపడే గర్భిణులు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఆస్పత్రులకు వెళ్లి రావాలంటే ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక మారు మూల గ్రామాల్లో అయితే ప్రయాణ ఇబ్బందులకు భయపడి గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లడం మానేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రవేశపెట్టింది. హైరిస్క్ గర్భిణులు ఈ సేవలు వినియోగించుకోవాలి. – డాక్టర్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ 3.27 లక్షల మంది బాలింతలు క్షేమంగా ఇంటికి.. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చడం కోసం ఏర్పాటుచేసిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వాహనాలను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 3,27,289 మంది బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చింది. ఈ సేవల కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాల రేటు(ఎంఎంఆర్) 45కు తగ్గింది. ఇదే జాతీయ స్థాయిలో పరిశీలించినట్లయితే ఎంఎంఆర్ 76గా ఉంది. -
అమ్మాయిలు ఎన్ని రోజులకు ఐ లవ్ యూ చెబుతారు? ఆశ్చర్యపరుస్తున్న రిపోర్టు!
గర్ల్‌ఫ్రెండ్ తనబాయ్ ఫ్రెండ్‌కు ఐ లవ్ యూ చెప్పడానికి ఎన్నిరోజులు పడుతుంది? శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడు దేశాలకు చెందిన యువకుల నుంచి సమాధానాలు సేకరించిన పరిశోధకులు పలు విస్తుపోయే వివరాలను వెల్లడించారు. ఎవరైనా యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఐ లవ్ యూ చెప్పేందుకు 122 రోజులు తీసుకుంటుందని పరిశోధకులు తెలిపారు. యువకులు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేస్తారన్నారు. ఈ పరిశోధనను స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ఎబర్ట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. ది బ్రిటీష్ సైకలాజికల్ సొసైటీ ద్వారా వెలువడిన ఈ రిపోర్టులో విభిన్న సంస్కృతులు కలిగిన పలుదేశాల్లోని యువకుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ బృందం ఆస్ట్రేలియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఫ్రాన్స్,పోలాండ్,యూకేలకు చెందిన 3,109 మంది యువతీయువకులను ఈ పరిశోధనలో భాగస్వాములను చేసింది. వీరిలో 70 శాతం మంది యువతులు, 30 శాతం మంది యువకులు ఉన్నారు. వారి ముందు కొన్ని ప్రశ్నలను ఉంచి, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే వారు భాగస్వామికి ఎన్ని రోజులకు ఐ లవ్ యూ చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 60 శాతం యువకులు తమ గర్ల్‌ప్రెండ్‌కు 69 రోజుల తరువాత ఐ లవ్ యూ చెప్పారని వెల్లడయ్యింది. యువతులతో పోలిస్తే యువకులు 15 రోజుల ముందుగానే తమ గర్ల్‌ఫ్రెండ్‌కు ఐ లవ్ యూ చెబుతుంటారని వెల్లడయ్యింది. యువతులు ఐ లవ్యూ చెప్పేందుకు కనీసంగా 77 రోజులు తీసుకుంటారని, గరిష్టంగా 122 రోజల సమయం తీసుకుంటారని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది కూడా చూడండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
స్టేషన్‌కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్‌ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్‌కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
ప్యాసింజర్ రైళ్లకు మంగళం
స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్‌గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది. ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్‌ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి. తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్‌ల మెయింట్‌నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటేనే గ్రీన్‌సిగ్నల్ పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్‌లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు -
సీఎం జగన్ పై తన అభిమానాన్ని చాటుకున్న రైతు
-
రైల్వే కోచ్ రెస్టారెంట్.. ఎంత బావుందో చూశారా!
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే తొలి వినూత్న ప్రయోగానికి గుంటూరు రైల్వేస్టేషన్ వేదికైంది. అధునాతన హంగులతో ఇక్కడ రైల్వే శాఖ ఫుడ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కోచ్ రెస్టారెంట్‌ను ముస్తాబు చేసింది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పరిధిలో దీనిని రైల్వే డీఆర్ఎం మోహన్‌రాజా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్‌రాజా మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ కోచ్ రెస్టారెంట్ ప్రయాణికులతోపాటు గుంటూరు ప్రజలకు మంచి అనుభూతినిస్తుందన్నారు. 24 గంటలూ రెస్టారెంట్ పనిచేస్తుందని, రుచికరమైన వేడివేడి వంటకాలు లభిస్తాయని చెప్పారు. ఈ రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను పాత అన్‌సర్వీస్‌బుల్ కోచ్‌ని ఉపయోగించడం ద్వారా రైలు ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి డివిజన్లో ఈ వినూత్న ఆలోచనను రూపొందించడం జరిగిదన్నారు. ఈ కోచ్‌ను రెస్టారెంట్ అవసరాలకు రీడిజైన్ చేసి లైసెన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ వినూత్న కాన్సెప్ట్ ద్వారా రైలు ప్రయాణికులు అందమైన ఇంటీరియర్స్‌తో పూర్తి ఎయిర్ కండిషన్డ్ మోడిఫైడ్ రైల్ కోచ్‌లో ప్రీమియం డైనింగ్ అనుభావాన్ని పొందుతారన్నారు. కార్యక్రమంలో డివిజన్ సీనియర్ డీసీఎం వి.ఆంజనేయులు, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ టి.హెచ్.ప్రసాదరావు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: విద్యార్థులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..) -
గేదెలను ఢీకొన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్
-
విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌కు మరో విస్టాడోమ్ కోచ్
సాక్షి, పాడేరు : ఆంధ్రా ఊటీ అరకులోయ రైల్వే ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రితో చర్చించి విజయవాడ రైల్వే డీసీఎంకు అదనపు విస్టాడోమ్ ఏర్పాటుపై ఎంపీ మాధవి లేఖ రాశారు. దీంతో త్వరలో అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులు, పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేలా అరకు రైల్వే స్టేషన్ సుందరీకరణ చేపడతామని వాల్తేర్ డివిజన్ డీసీఎం అరకు ఎంపీకి శుక్రవారం లేఖ ద్వారా తెలిపారు. అంతేకాకుండా స్టేషన్ భవనాలను శిల్పకళతో రూపొందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఆరు బోగీలు
-
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Bikaner Guwahati ExpressTrain Accident:పశ్చిమబెంగాల్లో బికనీర్–గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు బోల్తాపడ్డాయి. ఈ దుర్ఘటనలో 45 మందికి పైగా గాయపడ్డారు. జల్పాయ్గురి జిల్లాలోని దోమోహని సమీపంలో గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. భారీగా మంచు కురుస్తున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగాల్లో రైలు దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తంచేశారు. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి -
దూసుకొచ్చిన మహిళా ‘ఆక్సిజన్’ రైలు
బెంగళూరు: కరోనా వ్యాప్తి బాధితులకు అందించేందుకు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రాణవాయువు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్‌ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తాజాగా చేసిన ఆక్సిజన్ సరఫరా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపిన వారంతా మహిళలే. మహిళా పైలెట్లే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపి ప్రత్యేకత చాటారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటానగర్ నుంచి బయల్దేరిన 7వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కర్నాటకలోని బెంగళూరుకు చేరింది. ఆ రైల్లో సిబ్బందితో పాటు పైలెట్లంతా మహిళలు ఉండడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బెంగళూరు చేరుకుందని తెలిపారు. -
మెట్రో రైలు మహిళా లోకో పైలట్లతో నటుడు సందీప్ కిషన్ స్పెషల్ చిట్ చాట్
-
ఆగకుండా నాన్‌స్టాప్‌గా వెళ్లిన రైలు,కారణం?
భోపాల్: కిడ్నాప్‌కు గురైన ఒక బాలికను రక్షించడం కోసం మొదటిసారిగా రైలు లలిత్పూర్ నుంచి భోపాల్ వరకు నాన్‌స్టాప్‌గా ప్రయాణించింది. నిందితుడు రైలులో ఒక పాపను ఎత్తుకొని వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న పోలీసు విభాగం రైలును ఎక్కడ ఆపకుండా భోపాల్ వరకు నడపాలని డ్రైవర్‌ను కోరింది. దీంతో లలిత్పూర్ నుంచి రైలును ఎక్కడా ఆగకుండా భోపాల్ వరకు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే ఒక వ్యక్తి మూడేళ్ల చిన్నారిని అపహరించి భోపాల్‌కు వెళ్తున్న రాప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రైల్వే సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ పోలీసులు స్టేషన్ మాస్టర్‌తో, ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు ఎక్కడ ఆపకుండా భోపాల్ వరకు తీసుకువెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. రైలు భోపాల్ చేరేవరకు అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు నిందితుడిని గుర్తించి పాపను ఎత్తుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం -
తిరుపతి బండికి ఎగనామం
సాక్షి, మచిలీపట్నం: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి మచిలీపట్నం నుంచి గడిచిన పుష్కర కాలంగా నడుస్తున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ఆ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా బీదర్‌కు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, మచిలీట్నం–యశ్వంత్‌పూర్ మధ్య కొండవీడు ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం నుంచి వయా తిరుపతి మీదుగా ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రంపై తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా బీదర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ధర్మవరం ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బోర్డు నిర్ణయంతో ఇక నుంచి నర్సాపురం– ధర్మవరం మధ్య ఈ రైలును నడపనున్నారు. బందరు– గుడివాడ మధ్య తిరిగే లింక్ బండినొకదాన్ని ధర్మవరం ఎక్స్ ప్రెస్‌కు అనుసంధానం చేస్తారు. తిరుపతి వెళ్లాలనుకునే బందరు పరిసర వాసులు ఈ లింక్ ద్వారా గుడివాడ జంక్షన్‌కు చేరుకుని అక్కడ ధర్మవరం ట్రైన్ ఎక్కాల్సి ఉంది. ఎక్స్‌ప్రెస్ కానున్న విశాఖ పాసింజర్ ఇక నుంచి మచిలీపట్నం– విశాఖ పాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. నర్సాపురం నుంచి భీమవరం మధ్య నడిచే లింక్ ప్యాసింజర్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నారు.« విశాఖ ప్యాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్న బందరు వాసులు తిరుపతి మీదుగా నడిచే ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రద్దు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తా ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రద్దు చేయాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించేలా ఒత్తిడి తీసుకొస్తా. అవసరమైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతా. మచిలీపట్నం నుంచి ఈ ట్రై¯న్ రద్దు కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా. –వల్లభనేని బాలశౌరి, ఎంపీ, మచిలీపట్నం. చదవండి: జిల్లాలో చర్చనీయాంశంగా బ్రాస్లైట్ వ్యవహారం -
గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు
వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా)/రాజమహేంద్రవరం సిటీ: షాలిమార్ నుంచి నాగర్‌కోయిల్ అప్‌లైన్‌లో వెళుతున్న గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. ఎస్–5 బోగీలోని బ్రేక్ వీల్ యాక్సిల్‌లోకి ఎస్ఈజే (సెల్ఫ్ ఎడ్జస్టింగ్ జాయింట్), చెక్ రెయిల్ చొచ్చుకుపోవడంతో రైలు కదలికల్లో మార్పు వచ్చింది. దీన్ని గమనించిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కవిటగ్రహారం గేటు కీ ఉమన్ కె.రాధారాణి పూండి స్టేషన్ మాస్టర్‌కు సమాచారమిచ్చారు. ఆయన పూండికి అతి సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేటు 381 వద్ద అర్థాంతరంగా రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మూడు గంటలపాటు గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ పూండిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నౌపడ ఎస్ఎస్ఈ చంద్రశేఖరరావు, సీఎన్‌డబ్ల్యూ సిబ్బంది, రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పూండిలోని సంతోషిమాతా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని కర్ని గురు సహకారంతో చెక్ రైల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు. మరమ్మతుల అనంతరం రైలు విశాఖకు బయలుదేరింది. మళ్లీ విరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్ చెన్నై నుంచి హౌరా వెళ్లే కోరమండల్ (12842) ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్ మరోసారి విరగడంతో గురువారం రాత్రి గంటన్నర పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. రైలు స్టేషన్లోకి ప్రవేశిస్తుండగా ఎస్–9 కోచ్ బాలిస్టర్ స్ప్రింగ్ విరగడాన్ని సీనియర్ గ్రేడ్ టెక్నీషియన్ గుర్తించాడు. విషయాన్ని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సత్యనారాయణకు చెప్పడంతో అతడు తన సిబ్బందితో వచ్చి గంటన్నర పాటు శ్రమించి కొత్త స్ప్రింగ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం రైలు రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరింది. కాగా, ఇదే రైలుకి ఈ నెల 21న ఎస్–4 బోగీ కింద బాలిస్టర్ స్ప్రింగ్ విరిగిన సంగతి తెలిసిందే. -
బీహార్: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్
-
రైల్వే శాఖ తొలి వినూత్న ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీః రైలు ప్రయాణీకుల సౌకర్యార్ధం, రైల్వే శాఖ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కాఫీ, టీ తదితర వాటికోసం పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేసింది. ట్యాబ్లెట్ ఆధారంగా ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. తద్వారా రైలు ప్రయాణికులు తమకు అవసరమైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటి తినుబండారాలు, శీతల పానీయాలు, కాపీ, టీ, ప్రూట్ జ్యూస్ లను ఈ వెండింగ్ మెషిన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కోయంబత్తూరు-బెంగుళూరు మధ్య నడిచే ఉదయ్ (UDAY ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి) ఎక్స్ ప్రెస్ లోని మూడు బోగీల్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వెండింగ్ మెషిన్ వద్ద వున్న టాబ్లెట్ తో కాఫీ, టీ సహా తమకు కావాల్సిన పదార్ధాలను ఎంపిక చేసుకుని వాటికి సరిపడా నగదు చెల్లించాలి. ప్రస్తుతం నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో వుంది. First ever food vending machine in running train installed in- Coimbatore - Bengaluru UDAY Express over Southern Railway pic.twitter.com/1C2ezhxNiT — Ministry of Railways (@RailMinIndia) June 9, 2018 -
22 బోగీలు 13 కి.మీ... ఇంజిన్ లేకుండా
భువనేశ్వర్: ఒడిశాలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులతో ఉన్న 22 బోగీలు ఇంజిన్ లేకుండానే 13 కిలోమీటర్ల దూరం పరుగులు తీశాయి. ఈ ఘటనకు కారణమైన ఏడుగురు సిబ్బందిని రైల్వే శాఖ తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. అహ్మదాబాద్–పూరి ఎక్స్‌ప్రెస్‌కు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్లో ఇంజిన్‌ను మారుస్తున్న సమయంలో ఈ తప్పిదం చోటుచేసుకుంది. టిట్లాగఢ్ నుంచి కేసింగ స్టేషన్ వైపునకు ఉన్న రైల్వే మార్గం కొంత వాలుగా ఉంటుందనీ, స్కిడ్ బ్రేక్‌లను సరిగ్గా వేయకపోవటం వల్ల రైలు బోగీలు కదిలాయని తూర్పు కోస్తా రైల్వే అధికారి ఆదివారం చెప్పారు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది పట్టాలపై రాళ్లు పెట్టి రైలును ఆపి పెను ప్రమాదాన్ని నివారించారని వెల్లడించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
బీదర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
అనంతపురం టౌన్: బీదర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. ప్రయాణికులు త్వరగా అప్రమత్తం కావడంతో దొంగలు చైన్‌లాగి పారిపోయారు. అనంతపురం మండలం తాటిచెర్ల రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బీదర్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం తెల్లవారుజామున వస్తోంది. 3.40 గంటలకు తాటిచెర్ల రైల్వేస్టేషన్ దాటుతుందన్న సమయంలో రాయచోటికి చెందిన నారాయణ తన జేబులోని రూ.22వేల నగదు కనిపించకపోవడంతో ‘దొంగలు జేబును కత్తిరించేశారం’టూ గట్టిగా కేకలు వేశాడు. అంతవరకూ ప్రయాణికుల మధ్యే కలిసిపోయిన దొంగలు బోగిలోంచి చైన్‌లాగి ఒక్క ఉదుటున బయటకు పరుగులు తీశారు. స్టేషన్ ప్లాట్‌ఫాంపై విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వెంబడించారు. అయితే ట్రాక్‌పక్కనే ఉన్న ముళ్లపొదల్లో దాక్కున్న దొంగలు రాళ్లను పోలీసులపైకి రువ్వారు. పోలీసులు ఫైరింగ్ చేసినప్పటికీ ఆగకుండా మరోసారి రాళ్లు రువ్వి దుంగలు ఉడాయించారు. ఈ ఘటన నేపథ్యంలో బీదర్ ఎక్స్‌ప్రెస్ అరగంటపాటు అక్కడే నిలిచింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది హైదరాబాద్ దొంగలపనే! రైల్వే ప్రయాణికుడి వద్ద నగదు చోరీ చేసిన ఇద్దరు దొంగలు హిందీలో మాట్లాడారని, వారి యాసను బట్టి హైదరాబాద్‌కు చెందిన దొంగలుగా రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలకు పాల్పడతారన్నారు. తాటిచెర్ల రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన రైల్వే ఎస్పీ బీదర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న రైల్వే ఎస్పీ సుబ్బారావు, డీఎస్పీ పీఎన్‌బాబుతోపాటు సీఐ తబ్రేజ్‌లు బుధవారం ఉదయం తాటిచెర్ల రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించారు. రైలు ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బందూక్ ఉఠావ్.. గాడీ చలావ్ అనంతపురం సెంట్రల్: పోలీసులు కాల్పులు జరిపినా తప్పించుకుని పారిపోయిన దొంగలను పట్టుకునేం దుకు రైల్వే సీఐ వినోద్‌కుమార్‌మీనా హుటాహుటిన తన (ఏపీ29ఏఆర్7744) పల్సర్ బైక్‌లో అనంతపురం నుంచి తాటిచెర్ల రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. సోములదొడ్డి సమీపంలో రోడ్డుపక్కన ఇద్దరు వ్యక్తులు ఆనుమానాస్పదంగా నిలబడి ఉండడంతో వారి వివరాలు ఆరా తీసేందుకు బైక్ నిలిపారు. ఎవరు మీరు? ఇక్కడెందుకు ఉన్నారని ప్రశ్నించారు. సదరు వ్యక్తులు హిందీలో మాట్లాడారు. తాము పోలీసులమని చెప్పడంతో.. ఐడెంటిటీ కార్డులు చూపించాలని సీఐ ఆదేశించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయి ‘తూపాకీ తీసుకోరా.. కాల్చిపారేద్దాం’ అంటూ గద్దించడంతో సీఐ కాస్త వెనక్కు వెళ్లారు. అంతే పల్సర్ వాహనాన్ని తీసుకొని దుండగులు గుత్తివైపు ఉడాయించారు. జరిగిన ఘటనపై బాధిత సీఐ అనంతపురం రూరల్ సీఐ కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి మరో 3 రైళ్లలో ఆర్టీసీ టికెట్లు
తిరుపతి అర్బన్: తిరుమలకు రైళ్ల ద్వారా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం సోమవారం నుంచి మరో 3 రైళ్లలో ఆర్టీసీ టికెట్లు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రైల్వే డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్(సీసీఎం) గుణశేఖర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల యాత్రికుల కోసం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టీసీ సహకారంతో తిరుమలకు ప్రయాణ టికెట్లు ఇప్పిస్తున్నామన్నారు. ఇందులో రోజుకు సుమారు 170 మంది యాత్రికుల వరకు రైల్వే–ఆర్టీసీ సంయుక్త సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. తిరుమలకు రైళ్లలో వచ్చే యాత్రికుల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తమిళనాడులోని రామేశ్వరం వరకు నడుస్తున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌తో పాటు కొయంబత్తూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(మధ్యాహ్నం 1:30 గంటకు తిరుపతికి వచ్చే రైలు) రైళ్లలో ఆర్టీసీ సిబ్బంది యాత్రికులకు టికెట్లు అందజేస్తారన్నారు. యాత్రికులు రైల్వేస్టేషన్లో దిగగానే నేరుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
రేపల్లె ప్యాసింజర్ ఇక ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్: కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైలు వేగాన్ని కూడా పెంచింది. దీనివల్ల ప్రయాణికులు గతంలో కంటే గంట ముందుగానే గమ్యస్థానం చేరుకుంటారని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అక్టోబరు 19 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కాచిగూడ-రేపల్లె, తిరుగు ప్రయాణంలో రేపల్లె-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. ఈ రైలు కాచిగూడ(కొత్త నెం.17625) నుంచి ప్రతిరోజు రాత్రి 10.10 గంటలకు బయల్దేరి తెల్లవారుజామున 6.10కి రేపల్లె చేరుకుంటుంది. రేపల్లె(17626) నుంచి రాత్రి10.30కి బయల్దేరి ఉదయం 7.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
దివ్యాంగులకు ప్రయోజనకరం
పుట్టపర్తి టౌన్ : దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రాయితీ బస్సుపాసు సౌకర్యం కల్పిస్తోంది. వివిధ రకాల వైకల్యాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 50 శాతం రాయితీలో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ పుట్టపర్తి డిపో మేనేజర్ రమణయ్య గురువారం వివరించారు. ప్రత్యేకంగా దివ్యాంగ మేళాలను ఏర్పాటు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పాస్‌లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎములకల సంబంధిత వైకల్యం 40 శాతం, పోలియో, ఫెరాలసిస్కు సంబంధించి 40 శాతం, మూగ, చెవుడు, అంధత్వం 100 శాతం, బుద్ధి మ్యాంద్యం 50 శాతం కలిగిన వారికి ఆర్టీసీ 50 శాతం రాయితీతో బస్సు పాసులను అందజేస్తోంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ రాయితీ ద్వారా దివ్యాంగులు ప్రయాణించవచ్చు. ఇంటర్ స్టేట్ బస్సులు, ఆల్ట్రా లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు మాత్రం ఈ సౌకర్యం వర్తించదు. అంధత్వం ఉన్న వారికి, మరో సహాయకునికి కూడా 50 శాతం రాయితీని కల్పిస్తారు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే వారు తమ అంగవైకల్యం ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను ఆర్టీసీ అధికారులకు అందజేసి రాయితీ బస్సు పాసులు పొందవచ్చు. గతంలో డిపోల్లో మాత్రమే ఈ బస్సుపాసు కేంద్రాలను నిర్వహించిన సంస్థ, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రాయితీ బస్సు పాస్‌లను అందజేస్తోంది. దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సు పాసు సౌకర్యం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే ప్రత్యేక దివ్యాంగ మేళా ఏర్పాటు చేసి అర్హులందరికీ బస్సుపాసులు మంజూరు చేస్తాం. విద్యావంతులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తమ పరిసరాల్లోని దివ్యాంగులకు ఈ పథకంపై అవగాహన పెంపొందించాలి. – రమణయ్య, ఆర్టీసీ డీఎం, పుట్టపర్తి -
ఆదోని మీదుగా వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఆదోని రూరల్ : పట్టణంలో జరిగే విద్య, వ్యాపార పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఆదోని మీదుగా చెన్నై– అహ్మదాబాద్‌కు వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నం.06039 ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం ఉదయం 5.13 గంటలకు ఆదోని రైల్వే స్టేషన్‌కు వచ్చి రెండు నిముషాల అనంతరం రాయచూరు, యాదగిరి, వాడి, షోలాపూర్, పూనె, పాన్వెల్, వాసైరోడ్, సూరత్ మీదుగా అహ్మబాద్ చేరుతుందని తెలిపారు. అలాగే రైలు నం.09462 అహ్మదాబాద్–చెన్రైఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు ఆదోని రైల్వే స్టేషన్ చేరుకొని రెండు నిముషాల తర్వాత గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అర్కోణం మీదుగా చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. -
నిలిచిన గౌతమి ఎక్స్‌ప్రెస్
సామర్లకోట : కాకినాడ నుంచి బయలుదేరిన గౌతమి ఎక్్సప్రెస్ రైలు సర్పవరం వద్ద సుమారు అరగంటపాటు నిలిచిపోయింది. ఎస్–1 బోగీలో అంధకారం ఏర్పడడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక వారు అయోమయానికి గురై బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. స్థానిక రైల్వే గార్డు పరిశీలించగా ఎస్–1 బోగీ దిగువ భాగంలో ఉన్న డైనమెట్ బెల్ట్‌లు తెగిపోయినట్టు గుర్తించారు. దాంతో ఆ బోగీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడిందన్నారు. -
‘కృష్ణా’ ఎక్స్‌ప్రెస్
పుష్కరాలకు నాన్‌స్టాప్ రైళ్లు... హైదరాబాద్ నుంచి రోజూ రెండు స్పెషల్ ట్రెయిన్లు నాంపల్లి – గుంటూరు... గుంటూరు–నాంపల్లి సికింద్రాబాద్‌లో బయలుదేరితే ఆగేది వాడపల్లిలోనే.. రిజర్వేషన్ ఉండదు.. ఎవరైనా ఎక్కొచ్చు.. ఎనిమిది సాధారణ.. రెండు స్లీపర్ క్లాస్ బోగీల ఏర్పాటు ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరితే సాయంత్రానికి మళ్లీ వెళ్లేలా ఏర్పాట్లు వీటికి తోడు అదనంగా మరో నాలుగు సర్వీసులు ఇప్పటికే మూడు ఎక్స్‌ప్రెస్‌లకు విష్ణుపురంలో ఆగేందుకు అనుమతి పుష్కర భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు రైళ్లకు విష్ణుపురం (వాడపల్లి)లో ఆగేందుకు అనుమతిచ్చిన అధికారులు నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లకూ అవకాశం కల్పించారు. ఉదయం 5:40 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి)లో రైలు ఎక్కితే 9:18 కల్లా విష్ణుపురానికి రావొచ్చు.. అక్కడ పుష్కర స్నానమాచరించి మళ్లీ సాయంత్రం 3:40 గంటలకు రైలు ఎక్కితే 8:30 కల్లా హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే మరో అరగంట వెనుక ఎక్కవచ్చు.. ఓ అరగంట ముందే దిగిపోవచ్చు. అంటే.. ఉదయం బయలుదేరి పుష్కర స్నానం చేసుకుని సాయంత్రానికి హాయిగా రైలులో గమ్యస్థానానికి వెళ్లిపోవచ్చన్నమాట. మరో మాటండోయ్.. ఈ రైళ్లు ఎక్కడా ఆగవు.. సికింద్రాబాద్‌లో బయలుదేరితే మళ్లీ వాడపల్లిలోనే. ఇక్కడి నుంచి బయలుదేరితే సికింద్రాబాద్‌లోనే ఆగుతాయి. ఈ రైళ్లకు రిజర్వేషన్లు కూడా ఉండవు. ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ముందు వస్తే... ఏ బోగీలో కావాలంటే అందులో కూర్చోవచ్చు. హాయిగా హైదరాబాద్ నుంచి వాడపల్లికి రావచ్చు... వాడపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లొచ్చు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
భారత్ లో లగ్జరీ రైళ్ళకు కష్టకాలం!
భారత్ లో లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. రాజభోగాల్లాంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పలు రాష్ట్రాల్లో తిరుగుతున్న నాలుగు ట్రైన్లకు ఇక కాలం చెల్లనుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పర్యాటక ప్రియులకోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్ ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ప్రముఖమైన 'ప్యాలస్ ఆన్ వీల్స్' గతవారం తొలిసారిగా చక్రాలు నిలిచిపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రారంభించిన 34 ఏళ్ళలో ఎప్పుడూ ఆగని ఈ ట్రైన్.. ప్రయాణీకులు లేని కారణంతో నిలిచిపోవడం ఇప్పుడు లగ్జరీ ట్రైన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విలాసవంతమైన సౌకర్యాలకు అనుగుణంగానే లగ్జరీ ట్రైన్లలో ఉండే ఛార్జీలు కూడ సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న నాలుగు లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లు ప్రయాణికుల్లేక బోసిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు తలలు పట్టుకుంటున్నాయి. భవిష్యత్తు ఏమిటోనన్న అయోమయ స్థితిలో పడ్డాయి. ఇండియన్ రైల్వే మొదటిసారి ప్రవేశ పెట్టిన ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ 'ప్యాలెస్ ఆన్ వీల్స్' సహా మరో మూడు లగ్జరీ ట్రైన్లు... ప్రస్తుతం తక్కువ ఆక్యుపెన్సీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం 18 బుకింగ్స్ మాత్రమే జరగడంతో గతవారం ప్యాలెస్ ఆన్ వీల్స్ ను మొదటిసారి నిలిపివేశారు. అలాగే రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ కూడ పీక్ టూరిస్టు సీజన్ అయిన గత డిసెంబర్ లో బుకింగ్స్ లేక రెండు ట్రిప్ లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2014-15 లో 35 నుంచి 40 శాతం, అంతకు ముందు 2011-12 లో ఇంకా 60 శాతం వరకూ ప్రయాణీకుల సంఖ్య తగ్గి, ఆక్యుపెన్సీ సమస్య ఏర్పడటంతో అప్పట్లో కొన్ని ట్రిప్పులను కూడ కుదించేశారు. వాయువ్య, మధ్య భారతదేశంలోని 12 ప్రాంతాలను కవర్ చేసే అత్యంత విలాసవంతమైన మహారాజా ఎక్స్ ప్రెస్ లో మాత్రమే గత ఐదేళ్ళలో 15 శాతం వరకూ ప్రయాణీకుల స్థిరమైన పెరుగుదల కనిపించింది. 2011 నుంచి ఇప్పటివరకూ ఈ మహారాజా ఎక్స్ ప్రెస్ అనేక ట్రావెల్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ, సూపర్ రిచ్ ప్రాధాన్యతలున్న జాబితాలో మాహారాజా ఎక్స్ ప్రెస్ నాల్గవ స్థానంలో కూడ నిలిచింది. అలాగే లాటిన్ అమెరికాలో ఈ ఎక్స్ ప్రెస్ ను నడపాలంటూ మెక్సికో కూడ అభ్యర్థించింది. అత్యంత సంపన్నులైన వారికి అనువుగా.. ఖరీదైన, విలాసవంతమైన ఐదు రైళ్ళను అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టారు. ఒక్కరాత్రి ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి ఈ లగ్జరీ ట్రైన్లలో మార్గం, సీజన్, రైలును బట్టి ఒక్కో వ్యక్తికి సుమారు 500 డాలర్లు, అంటే సుమారు 30 వేల రూపాయల నుంచి 1800 డాలర్లు అంటే సుమారు లక్ష రూపాలకు పైగా ఛార్జీలు ఉంటాయి. దేశంలోని మొత్తం ఐదు లగ్జరీ ట్రైన్లలో తొలి లగ్జరీ ట్రైన్... ప్యాలెస్ అన్ ది వీల్స్ ను మూడు దశాబ్దాలక్రితం రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్టీడీసీ) ప్రారంభించింది. తర్వాత రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ను కూడ ప్రారంభించిన ఆర్టీడీసీ.. ఇంచుమించు రెండు రైళ్ళనూ ఢిల్లీ నుంచి ప్రారంభమై రాజస్థాన్, ఆగ్రాలను కవర్ చేసేట్లు ఒకే మార్గంలో నడుపుతోంది. ఆ తర్వాత మహరాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ప్రారంభించిన డెక్కన్ ఒడిస్సీ... మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లను కవర్ చేస్తుంది. కర్నాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కర్నాటక నుంచి గోవా వరకూ నడిపే 'గోల్డెన్ ఛరియట్'.. దక్షిణ ప్రాంతంలో నడిచే ఒకేఒక్క లగ్జరీ ట్రైన్ గా చెప్పాలి. ఈ మొత్తం అన్ని లగ్జరీ ట్రైన్లలోనూ సెంట్రల్ ఎయిర్ కండిషన్, ఇంటర్ కమ్, టీవీ, వైఫై, కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతోపాటు... పాంట్రీ, లాంజ్, మ్యూజిక్, మనీ ఎక్సేంజ్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అంతేకాక పర్యాటకులకు అనువుగా కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, దేశీయ ప్రత్యేక వంటకాలను వడ్డించే ప్ర్తత్యేక రెస్టారెంట్లు, బార్లు తో పాటు ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందుబాటులో అటెండెంట్స్ కూడ ఉంటారు. ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకునే ఈ లగ్జరీ రైళ్ళు.. సుమారు 14 నుంచి 19 బోగీలను కలిగి ప్రయాణీకులకు భారత రాచరిక మర్యాదలతో ఎర్రతివాచీ స్వాగతం పలుకుతాయి. అయితే తాజాగా విదేశీయులు, ఎన్నారైలు వారి దేశాలనుంచే క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించిన భారత రైల్వే... లగ్జరీ ట్రైన్ల ఆక్యుపెన్సీ సమస్య తీర్చేందుకు ఇకపై ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
’మహమ్మనా’ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని
-
ఈ మద్య తెగ కనిపిస్తున్నా!!
-
సూది సైకో నుంచి 2 సిరంజీలు స్వాధీనం
-
కరుణించు ప్రభూ
రాజంపేట: నిన్న యూపీఏ.. నేడు ఎన్డీఏ.. పాలకులు ఎవరైనా జిల్లా రైల్వే ప్రగతిలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో పనులు నొస్సం వరకు పూర్తి కాగా, కడప- బెంగళూరు పనులు పెండ్లిమర్రి వరకు పూర్తయ్యాయి. ఇక కృష్ణపట్నం- ఓబులవారిపల్లె మార్గంలో ఎర్త్ పనులు పూర్తికాగా, టన్నెల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులకు అరకొర నిధులు కేటాయిస్తుండటంతో దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఇక కొత్త రైళ్లపై జిల్లా వాసులు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ముంబయి-చెన్నై కారిడార్ మార్గం జిల్లా మీదుగా ఉండటంతో బైవీక్లీ ైరైళ్లు నడుస్తున్నాయి. జిల్లాలో రైల్వేపరంగా బ్రిటీష్ కాలం నుంచి వైభవంగా వెలుగొందిన నందలూరు రైల్వే పరిశ్రమపై నాటి యూపీఏ..నేటి ఎన్డీఏ పాలకులు శీతకన్ను వేశారన్నది వాస్తవం. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానికి జిల్లా నుంచి ఒక్కటంటే ఒక రైలుమార్గం కూడా అందుబాటులో లేదు. కొత్త రైల్వేలైన్లు సర్వేలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌తోపాటు డబుల్‌డెక్కర్ రైలు స్టాపింగ్స్ గురించి ఎప్పటి నుంచో కోరుతున్నా రైల్వే మంత్రిత్వశాఖ ఖాతరు చేయడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వే అభివృద్ధి విషయంలో జిల్లా ఎంతో వెనుకబడి ఉంది. ఈనెల 26న పార్లమెంటులో రైల్వేమంత్రి సురేష్‌ప్రభు రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వం ఈసారైనా కరుణ చూపేనా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త రైళ్లపై కోటి ఆశలు.. జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్ల మాట అటుంచితే.. కనీసం పొడిగింపు రైళ్లకు కూడా మోక్షం కలగలేదు. జిల్లా మీదుగా షిర్డికి వెళ్లేందుకు గతంలో ఏర్పాటు చేసిన రైలును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో గుంతకల్లు నుంచి ధర్మవరం, పాకాల మీదుగా తిరుపతికి మళ్లించేలా చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లా మీదుగా షిర్డీ వెళ్లేందుకు ఒక్కరైలు కూడా వేయలేని దుస్థితి నెలకొంది. అలాగే మచిలీపట్నం-తిరుపతి రైలును కడప వరకు పొడిగిస్తే తాత్కాలికంగా రాజధానికి వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.ఎర్రగుంట్ల- నంద్యాల రైలు మార్గంలో నందలూరు నుంచి నొస్సం వరకు రైలు నడిపించాలనే ప్రయత్నాలు ఎప్పుడు అమలవుతాయో అర్థం కావడం లేదు. పగటి పూట కర్నూలు- హైదరాబాద్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. చెన్నై నుంచి డీజిల్ మల్టిపుల్ యూనిట్ (డీఎంయూ) రైళ్లను కడప వరకు నడిపిస్తే ఆదాయం బాగుంటుందని రైల్వే కమర్షియల్ అధికారులు సూచిస్తున్నా పట్టించుకునే వారు లేరు. జిల్లాలో గ్రామీణులకు అందుబాటులో గుంతకల్లు నుంచి కడప వరకు, కడప నుంచి రేణిగుంట వరకు మరో ప్యాసింజర్ రైలును కోరుతున్నప్పటికి బోగీల కొరత ఉందంటూ కాలయాపన చేస్తున్నారు. కొత్త రైల్వే లైన్లు సర్వేలకే పరిమితం.. 2010-2011 రైల్వే బడ్జెట్లో కూడా కొత్త రైల్వే లైన్‌గా కంభం-ప్రొద్దుటూరును ప్రకటించారు. రైల్వేలైన్ 142 కిలోమీటర్ల మేర ఉండే విధంగా రూట్‌ను ఖరారు చేశారు. దాదాపు రూ.829 కోట్ల వ్యయాన్ని ఈ రైల్వేలైన్‌కు అంచనా వేశారు. అయితే కేంద్ర ప్రణాళిక సంఘం ఈ లైనుకు సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. యూపీఏ, ఎన్డీఏ సర్కారు బడ్జెట్లో ప్రవేశపెట్టిన గిద్దలూరు- భాకరాపేట, కంభం -ప్రొద్దుటూరు రైల్వే లైన్లు గిద్దలూరులో ఉన్న రైలు మార్గానికి కలిపే విధంగా సర్వేలు చేపట్టిన విషయం విదితమే. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు, బద్వేలు మీదుగా గిద్దలూరు లైనుకు కలిపే విధంగా మార్గానికి రూపకల్పన చేసినట్లు రైల్వే వర్గాల సమాచారం. గత బడ్జెట్లో కేటాయింపు ఇలా.. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక తొలిసారి అప్పటి రైల్వేమంత్రి సదాశివనందగౌడ్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసులకు ఆశాజనకంగా లేదు. కంభం-ప్రొద్దుటూరు లైనుకు రూ. 10లక్షలు, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్‌కు రూ.208కోట్లు, కడప-బెంగళూరు రైల్వేలైన్‌కు రూ. 30కోట్లు కేటాయించారు. పెండ్లిమర్రి వరకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ రైల్వేలైను అందుబాటులోకి రావాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందోననే చర్చ జరుగుతోంది. అలాగే నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వేలైన్‌కు రూ.80కోట్లు కేటాయించారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైలును పూర్తి స్థాయిలో ఎప్పుడు నడిపిస్తారోనని ఆ రెండు ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ైరె ల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా జిల్లాకు మేలు జరుగుతుందో లేదో వేచి చూద్దాం. -
స్పీడ్ పెరగాలి
నగరం నుంచి వేగంగా నడిచే రైళ్లు అవసరం విశాఖ, హైదరాబాద్, చెన్నై, తిరుపతిలకు నాన్‌స్టాప్‌లు కావాలి స్పీడ్ రైళ్లకు ఫుల్ డిమాండ్ డబ్బు కన్నా టైమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్న ప్రయాణికులు విమానాలు, బస్సుల వైపు మొగ్గు చూపుతున్న జనం విజయవాడ : రాష్ట్ర విభజన తర్వాత నగరానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలో నగరానికి రాకపోకలు సాగించే ప్రముఖుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరం నుంచి ఢిల్లీకి, ఇతర ముఖ్య పట్టణాలకు వేగవంతమైన రైళ్లు నడపాల్సిన అవసరం ఏర్పడింది. చార్జీలు భారమైనప్పటికీ వేగంగా వెళ్లే రైళ్లకే ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. చార్జీల గురించి పట్టించుకోకుండా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇప్పటివరకు కొత్త రైళ్లు కోరుకున్న రైల్వే డివిజనల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వేగవంతమైన రైళ్లు సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దురంతో వంటి రైళ్లు అవసరం ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు దురంతో ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు విశాఖపట్నంలో ప్రారంభమైతే విజయవాడలో ఆగుతుంది. ఇక్కడ సిబ్బంది మాత్రమే మారతారు. ప్రయాణికులు ఎక్కే అవకాశం లేదు. విజయవాడలో బయలుదేరితే హైదరాబాద్‌లోనే ఆగుతుంది. దీంతో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రైలు టికెట్లకు తీవ్ర డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి రైళ్లను విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం నగరం ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఆరు గంటల సమయం పడుతోంది. నాలుగు గంటల్లో హైదరాబాద్, చెన్నై, తిరుపతిలకు వెళ్లే విధంగా విజయవాడ నుంచి నాన్‌స్టాప్ రైళ్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైళ్లు గంటకు 50 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో నడుస్తున్నాయని, దీనిని 110 కిలోమీటర్లకు పెంచితే నగరం నుంచి చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలకు ప్రయాణికులను నాలుగు గంటల్లో తీసుకెళ్ల వచ్చని చెబుతున్నారు. ప్రయాణ సమయం తగ్గిన కొద్దీ ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుందని ఓ అధికారి తెలిపారు. గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కొన్ని బస్సులు కూడా హైదరాబాద్‌కు 4.30 గంటల్లోనే చేరుతున్నాయని, రైళ్లు మాత్రం ఆరు గంటలకు వెళ్తున్నాయని, దీని వల్ల ఎక్కువ మంది బస్సులకే వెళ్తున్నారని పేర్కొన్నారు. విమానాలకూ పెరిగిన ప్రయాణికులు.. ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగింది. దశాబ్దన్నర క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం నడిపేందుకు ప్రయాణికులు ఉండరని భయపడేవారు. ప్రస్తుతం రోజూ ఢిల్లీకి రెండు, బెంగళూరుకు రెండు, హైదరాబాద్‌కు మూడు సర్వీసులు, విశాఖపట్నం, తిరుపతిలకు ఒక్కో విమాన సర్వీసులను నడుపుతున్నారు. ఢిల్లీకి రెండు గంటలు, బెంగళూరుకు 70 నిమిషాలు, హైదరాబాద్‌కు 55 నిమిషాల్లో ప్రయాణికులు చేరుతున్నారు. దీంతో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సర్వీసులకు 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. రైలు కన్నా చార్జీ ఎక్కువ అయినప్పటికీ సమయం కలిసి వస్తోందని రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతోపాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా విమానాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో స్పీడ్ రైళ్లు వస్తే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. రానున్న రైల్వే బడ్జెట్లో ఎన్ని రైళ్లు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే. -
రైళ్ల వేళల్లో మార్పు
గుడివాడ టౌన్ : పట్టణానికి వచ్చే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మారినట్లు స్టేషన్ మేనేజర్ పొట్లూరి శేషగిరిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 17213/ 17231 నర్సపూర్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ గతంలో మధ్యాహ్నం 12.50 గంటలకు వచ్చి 12.55 బయల్దేరేదని, ప్రస్తుతం 12.30కు వచ్చి 12.32కు వెళ్తుందని పేర్కొన్నారు. ట్రైన్ నంబర్ 18519 విశాఖ-ఎల్టిటి ఎక్స్‌ప్రెస్ గతంలో ఉదయం 5.08 గంటలకు వచ్చి 5.10కు వెళ్లేదని ప్రస్తుతం 5.03కు వచ్చి 5.05కు వెళ్తుందని చెప్పారు. ట్రైన్ నంబర్ 17643 చెన్నై-కాకినాడ సర్కార్ ఎక్స్‌ప్రెస్ గతంలో 4.20కు వచ్చి 4.22 గంటలకు వెళ్లేదని, ప్రస్తుతం 3.58కు వచ్చి 4.00 గంటలకు వెళ్తుందని, ట్రైన్‌నంబర్ 18520 ఎల్టిటి-విశాఖ ఎక్స్‌ప్రెస్ గతంలో 5.08 గంటలకు వచ్చి 5.10కు వెళ్లేదని, ప్రస్తుతం 5.03కు వచ్చి 5.05కు వెళ్తుందని తెలిపారు. ట్రైన్ నంబర్ 17250 సికింద్రాబాద్ -మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ గతంలో ఉదయం 5.58కు వచ్చి 6.00కు వెళ్లేదని, ది, ప్రస్తుతం 5.45కు వచ్చి 5.47కు వెళ్తుందని,అలాగే ట్రైన్ నంబర్ 17212 యశ్వంత్‌పూర్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.46కు వచ్చి 5.48కు వెళ్లేదని, ప్రస్తుతం 6.05కు వచ్చి 6.07కు వెళ్తుందని చెప్పారు. ట్రైన్ నంబర్ 57229 మచిలీపట్నం-విశాఖపట్నం పాసింజర్ ప్రస్తుతం రాత్రి 10.15కు వచ్చి 10.30కు వెళ్తుందని తెలిపారు. -
రైళ్ల వేళల్లో మార్పులు
విశాఖపట్నం : రైళ్ల రాకపోకల వేళలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మారబోతున్నాయి. ఇప్పటికే దురంతో ఎక్స్‌ప్రెస్‌తో బాటు పలు రైళ్ల రాకపోకలు మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని రైళ్ల వేళలు మారినట్టు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. హౌరా/ హైదరాబాద్(ఈస్టుకోస్టు) ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 3.55 గంటలకు చేరుకుని 4.15 గంటలకు బయల్దేరుతుంది. మచిలీపట్నం/నరసాపురం నుంచి విశాఖకు వచ్చే ప్యాసింజర్ ఉదయం 8 గంటలకు చేరుతుంది. సాంత్రగచ్చి నుంచి ఛెన్నై సెంట్రల్ల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ బుధ, శనివారాల్లో ఉదయం 8.10గంటలకు వచ్చి 8.30 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ-రాయగడ పాసింజర్ ఉదయం 8.20 గంటలకు వచ్చి 8.40 గంటలకు బయలుదేరుతుంది. హటియా-యశ్వంత్‌పూర్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమ, బుధవారాల్లో, అసన్సోల్-చెన్నై ఎక్స్‌ప్రెస్ గురువారం, టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్ ప్రెస్ శనివారం, హటియా-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్‌ప్రెస్ ఆదివారం నడిచే రైళ్లు ఉదయం 9.40 గంటలకు వచ్చి 10 గంటలకు బయలుదేరుతాయి. దన్బాద్/టాటానగర్ - అలెప్పిబొకారో ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.55 గంటలకు చేరుకొని 10.15 గంటలకు బయలుదేరుతుంది. నాందేడ్ / సంబల్పూర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ మంగ,బుధ,ఆదివారాల్లో 10.15 గంటలకు చేరుకొని 10.35 గంటలకు వెళుతుంది. సంబల్పూర్/నాందేడ్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమ,శుక్ర,ఆదివారాల్లో విశాఖకు రాత్రి 7.05 గంటలకు చేరుకొని 7.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖ-మచిలీపట్నం/నర్సాపూర్ పాసింజర్ రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతుంది. మూడు కొత్త రైళ్లకు చోటు.... విశాఖ, విజయనగరం మీదుగా మరో మూడు కొత్త రైళ్లు పరుగులు తీయనున్నాయి. కొత్త రైళ్ల వేళలను కొత్త రైల్వే టైంటేబుల్లో పొందుపరిచింది. హౌరా- యశ్వంత్‌పూర్-హౌరా (22863/64), గాంధీధమ్-పూరి-గాంధీధమ్ (19453/54) రైళ్లు విజయనగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి. విశాఖ మీదుగా టాటానగర్-బయ్యపానహలి(బెంగుళూర్)-టాటానగర్ (18111/12) ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. టాటా నగర్-బయ్యపానహలి(బెంగుళూర్) ఎక్స్‌ప్రెస్ ప్రతీగురువారం టాటానగర్‌లో సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి శుక్రవారంఉదయం 9.40 గంటలకు విశాఖ చేరుకొని, తిరిగి 10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది. బయ్యపానహలి (బెంగుళూర్)-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 9.15 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.55 గంటలకు విశాఖ చేరుకొని తిరిగి 8.15 గంటలకుబయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు టాటా చేరుతుంది. -
చవితి ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం : వినాయక చవితి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు, సికింద్రాబాద్‌లకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. కామాఖ్య-బెంగళూర్(02552) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాత్రి 8.30 గంటలకు కామాఖ్యలో బయల్దేరి 31వ తేదీ తెల్లవారుజామున 2.10 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 2.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.30 గంటలకు బెంగళూరు చేరుతుంది. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(02727/02728) ఎక్స్‌ప్రెస్‌ను మరో రెండు ట్రిప్పులు పొడిగించినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-విశాఖపట్నం(02728) ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 5, 12 తేదీల్లో ప్రతి శుక్రవారం రాత్రి 10.10 గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి02727 నంబర్‌తో ప్రయాణించే ఈ రైలు సెప్టెంబర్ 6, 13 తేదీల్లో ప్రతి శనివారం రాత్రి 7.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు చేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ మీదుగా చెన్నైకు ప్రీమియం రైళ్లు విశాఖ మీదుగా చెన్నైకు రెండు ఏసీ ప్రీమియం రైళ్లను నడుపుతున్నారు. హౌరా-చెన్నై వీక్లీ ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్(22839), చెన్నై-వీక్లీ ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్(22840), కామాఖ్య-చెన్నై(12528), చెన్నై-కామాఖ్య(12527) ఏసీ ప్రీమియం రైళ్లున్నాయి. వీటి వివరాలు రైల్వే వెబ్సైట్ నుంచి పరిశీలించి బెర్తులు బుక్ చేసుకోవచ్చు. గుణుపూర్‌కు రోజూ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం-గుణుపూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రాకపోకల వేళలను తూర్పు కోస్తా రైల్వే గురువారం ప్రకటించింది. ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ఈ రైలును రోజూ న డిపేందుకు రైల్వే పచ్చజెండా ఊపింది. కొత్త రేక్ మంజూరయితే అప్పటి నుంచి పట్టాలెక్కుతుంది. ఈ ప్యాసింజర్‌కు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే రైల్వే టైంటేబుల్లో రాకపోకలు ప్రకటించారు. విశాఖ-గుణుపూర్(58506) డైలీ ప్యాసింజర్ రోజూ ఉదయం 7 గంటలకు విశాఖలో బయల్దేరి నౌపడ జంక్షన్‌కు 10.20 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 10.50 గంటలకు బయల్దేరి గుణుపూర్‌కు మధ్యాహ్నం 1.55 గంటలకు చేరుతుంది. గుణుపూర్-విశాఖ ప్యాసింజర్(58506) రోజూ మధ్యాహ్నం 2.25కు బయల్దేరి నౌపడ జంక్షన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుతుంది. తిరిగి 5.25 గంటలకు బయల్దేరి రాత్రి 9.40 గంటలకు విశాఖకు చేరుతుంది. -
రైలు మోత
భారీగా పెరిగిన చార్జీలు అన్ని తరగతులపై 14.2 శాతం పెంపు నెలకు సగటున రూ.87 లక్షల భారం జిల్లాలో నిత్యం 70 వేల మంది రాకపోకలు సామాన్యుడికి రైలు ప్రయూణమూ కష్టమే.. సాక్షి, హన్మకొండ: రైల్వే చార్జీలు పెంచాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రయూణికుల జేబులకు భారీగానే చిల్లు పడనుంది. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, స్లీపర్, ఏసీ కోచ్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ ప్రస్తుతం ఉన్న చార్జీలపై 14.2 శాతం పెంచుతూ రైల్వేశాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నారుు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లా ప్రయూణికులపై నెలకు సగటున రూ.85 లక్షల వరకు భారం పడుతుందని రైల్వేవర్గాలు అంటున్నాయి. ఇందులో సగానికి పైగా జిల్లా కేంద్రంపైనే పడనుంది. అన్ని తరగతులపై వడ్డన గతంలో చార్జీలు పెంచినప్పుడు సామాన్యులపై భారం పడకుండాై రెల్వేశాఖ జాగ్రత్తలు తీసుకునేది. ఎక్కువగా సంపన్నులు ప్రయాణించే ఏసీ తరగతులపైనే చార్జీల వడ్డన ఉండేది. ఆ తర్వాత స్లీపర్ క్లాస్, ఎక్స్‌ప్రెస్‌ల చార్జీలను పెంచేది. అతి కొద్ది సందర్భాల్లోనే ప్యాసింజర్ రైళ్ల చార్జీలలో పెరుగుదల ఉండేది. కానీ ఈ సారి అనూహ్యంగా ప్యాసింజర్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఏసీ వరకు అన్ని తరగతులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న టికెట్ చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచింది. దానితో చార్జీల పెంపు భారం నుంచి ఏ ఒక్క ప్రయాణికుడికీ మినహాయింపు లభించ లేదు. జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట స్టేషన్ నుంచి 12వేల మంది, వరంగల్ నుంచి సగటున 27వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరితో పాటు పోస్టాఫీసులో, ఆన్లైన్లో రిజర్వేషన్లు చేసుకునే వారిని కలుపుకుంటే జిల్లా కేంద్రం నుంచి రైళ్ల ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య 40వేలుగా ఉంది. వీటితో పాటు మహబూబాబాద్, జనగామ, డోర్నకల్ వంటి ఇతర స్టేషన్లను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య సగటున దాదాపుగా 70వేలుగా ఉంది. తద్వారా ప్రతీరోజు జిల్లాలో సగటున 20 లక్షల రూపాయల వరకు టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఈ లెక్కన చార్జీల పెంపు వల్ల ప్రతీరోజు జిల్లా ప్రయాణికులపై 2.90 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, షిర్డీ, తిరుపతి వంటి దూరప్రాంతాలకు స్లీపర్‌క్లాస్, ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారిపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ చార్జీల పెంపు వల్ల సగటున ఒక్కో ప్రయాణికుడి టిక్కెట్ ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. -
ఉగ్రవాదుల టార్గెట్ సీమాంధ్ర ?
ముమ్మరంగా ‘చెన్నై సెంట్రల్’ బాంబుపేలుడు కేసు తమిళనాడు ఏడీజీపీ నేతృత్వంలో దర్యాప్తు బెంగళూరు చేరుకున్న ప్రత్యేక బృందం అనుమానితుల భావచిత్రాలు సేకరణ బెంగళూరు, న్యూస్‌లైన్: ‘చెన్నై సెంట్రల్’ బాంబు పేలుడు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సీమాంధ్ర లక్ష్యంగా బాంబులు అమర్చి ఉంటారని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. బెంగళూరు నుంచి చెన్నై, విజయవాడ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు గువాహటి చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తుండటంతో చెన్నై సెంట్రల్ స్టేషన్లో బాంబులు పేలాయని అధికారులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు సీబీ సీఐడీ ఏడీజీపీ కరణ్ సింగ్ శుక్రవారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. శనివారం ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. కొందరి అనుమానితుల భావ చిత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురిని విచారణ చేశారు. బుధవారం రాత్రి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లోనే గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబులు అమర్చి ఉంటారని తమిళనాడు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటక రైల్వే పోలీసు విభాగం డీఐజీ శ్రీకంఠప్ప, బెంగళూరు సిటీ రైల్వే ఎస్పీ సిద్దరావ ుప్ప తమిళనాడు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. -
సంబరాల నడుమ కొత్త రైళ్ల పరుగులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆధునాతన బోగీలతో కొత్త రైళ్లు పట్టాలెక్కాయి. మంగళవారం ఉదయం సరిగ్గా 7.45 గంటలకు ఒకటి, 8 గంటలకు మరో రైలు పరుగులు తీశాయి. విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-గాంధీధాం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. పాత-కొత్త బోగీలను కలపాలని ముందు భావించినా జోన్ సాధన సమితి సభ్యులు ఆందోళన చేస్తారేమోనని తక్కువ బోగీలతోనైనా ప్రారంభించారు. కేవలం13 బోగీలతోనే సర్దుబాటు చేశారు. కొత్త రైళ్ల ప్రారంభం పై గుజరాత్ సమాజ్ సభ్యులు హర్షం ప్రకటించి ప్రయాణికులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కాగా కొత్త రైళ్లలో ప్రయాణికులు స్వల్పంగానే ఉన్నారు. విశాఖ-జోధ్‌పూర్‌లో 365 మంది.. విశాఖ-గాంధీధాంలో 146 మంది మాత్రమే పయనమయ్యారు. వీరంతా అప్పటికప్పుడే బయల్దేరిన వారు కావడంతో రైల్లోనే రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. కొత్త రైళ్ల ప్రారంభం సందర్భంగా కొందరు జైనులు, మార్వాడీలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కొత్త రైలు లేక గుజరాత్ వెళ్లేందుకు నానా పాట్లు పడేవారు. చెన్నై వెళ్లి అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కోసం ప్రదక్షిణలు చేసేవారు. రెండు మూడు రోజుల పాటు నిరీక్షించినా ఆ రైల్లో చోటు లభ్యమయ్యేది కాదు. ఇప్పుడా బాధ తప్పిందని సురేష్ జైన్ అనే వ్యక్తి ఆనందం వ్యక్తం చేశారు. సమోసాలు తింటూ కులాసాగా ప్రయాణం... విశాఖపట్నం-జోధ్‌పూర్ రైలు సమోసాలకు ప్రసిద్ధి గాంచిన ఊరు మీదుగా ప్రయాణిస్తుంది. భిలాస్‌పూర్‌కు అతి సమీపంలో వున్న పెండ్రారోడ్ స్టేషన్ అంటేనే నోరూరించే సమోసాలకు పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. అందుకే ఈ రైల్లో కొందరు జోధ్‌పూర్ వాసులు సమోసాలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. -
పోకిరి ఎక్స్‌ప్రెస్
-
5pm News Express 27th Sep 2013
-
Sakshi News Express 20th Sept 2013