విశాఖ–కిరండూల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరో విస్టాడోమ్‌ కోచ్‌ | Another Vistadome Coach on Visakhapatnam Kirandul Express: Araku MP Appeal | Sakshi
Sakshi News home page

విశాఖ–కిరండూల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరో విస్టాడోమ్‌ కోచ్‌

Published Sat, May 21 2022 8:59 PM | Last Updated on Sun, May 22 2022 2:37 PM

Another Vistadome Coach on Visakhapatnam Kirandul Express: Araku MP Appeal - Sakshi

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేస్తున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

సాక్షి, పాడేరు : ఆంధ్రా ఊటీ అరకులోయ రైల్వే ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ–కిరండూల్‌ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా విస్టాడోమ్‌ కోచ్‌ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రితో చర్చించి విజయవాడ రైల్వే డీసీఎంకు అదనపు విస్టాడోమ్‌ ఏర్పాటుపై ఎంపీ మాధవి లేఖ రాశారు.

దీంతో త్వరలో అదనపు విస్టాడోమ్‌ కోచ్‌ ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులు, పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేలా అరకు రైల్వే స్టేషన్‌ సుందరీకరణ చేపడతామని వాల్తేర్‌ డివిజన్‌ డీసీఎం అరకు ఎంపీకి శుక్రవారం లేఖ ద్వారా తెలిపారు. అంతేకాకుండా స్టేషన్‌ భవనాలను శిల్పకళతో రూపొందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement