Vistadome Coach
-
విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌కు మరో విస్టాడోమ్ కోచ్
సాక్షి, పాడేరు : ఆంధ్రా ఊటీ అరకులోయ రైల్వే ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రితో చర్చించి విజయవాడ రైల్వే డీసీఎంకు అదనపు విస్టాడోమ్ ఏర్పాటుపై ఎంపీ మాధవి లేఖ రాశారు. దీంతో త్వరలో అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులు, పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేలా అరకు రైల్వే స్టేషన్ సుందరీకరణ చేపడతామని వాల్తేర్ డివిజన్ డీసీఎం అరకు ఎంపీకి శుక్రవారం లేఖ ద్వారా తెలిపారు. అంతేకాకుండా స్టేషన్ భవనాలను శిల్పకళతో రూపొందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
విశాఖపట్నం నుంచి తొలిసారిగా కొరాపుట్‌కు రైలు.. షాకిచ్చిన ప్రయాణికులు
కొరాపుట్(భువనేశ్వర్): ఎద్దు ఈనిందంటే.. తీసుకొచ్చి వాకిట్లో కట్టేయమన్న చందంగా ఉంది ఈస్టుకోస్టు రైల్వే అధికారుల తీరు. ప్రజలు డిమాండ్ చేశారు. అధికారులు మంజూరు చేశారు. కానీ రైలు ఏ మార్గంలో నడపాలో పట్టించుకోక పోవడంతో డొల్లతనం బయటపడింది. విశాఖపట్నంలో ఉదయం 6.35 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి, రాయగడ మీదుగా తొలిసారిగా కొరాపుట్ చేరుకున్న విస్టాడోం కోచ్‌లో ఒక్కరు కూడా ప్రయాణించ లేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో రైల్వేశాఖ సిబ్బందే సమాధానం చెప్పాల్సి ఉంది. వాస్తవానికి విశాఖపట్నం నుంచి అరకు ప్రయాణించే కిరండూల్ రైలు(18551) కొరాపుట్ మీదుగా జగదల్పూర్ వెళ్తుంది. తూర్పు కనుమల్లో ఉన్న ఈ మార్గమంతా ప్రకృతి అందాలతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రైల్వేశాఖ కిరండూల్ రైలుకు విస్టాడోం కోచ్‌ను గతంలోనే అనుసంధానించారు. దీనిని కొరాపుట్ వరకు నడపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపాదనకు ఆమోదించిన ఈస్టుకోస్టు రైల్వే అధికారులు.. కోచ్‌ను మాత్రం రాయగడ మీదుగా కొరాపుట్ వెళ్లే రైలుకు అనుసంధానించి, చేతులు దులుపుకొన్నారు. మరోవైపు విశాఖపట్నం నుంచి కొరాపుట్‌కు నిడిపే ప్రత్యేక రైలు(08545)లో సాధారణ టిక్కెట్ ధర కేవలం రూ.140లు ఉండగా.. విస్టాడోం కోచ్‌లో రూ.1,300లుగా ఉంది. అరుకు మీదుగా కొరాపుట్ చేరు కిరండూల్ రైలులో సాధారణ టిక్కెట్ రూ.85 మాత్రమే. ఈ లెక్కను అరకు అందాలు చూడకుండా రాయగడ మీదుగా విస్టాడోంలో ప్రయాణించేందుకు అదనంగా రూ.1,160లు చెల్లించేందుకు ప్రయాణికులు ఆసక్తిగా ఉండరని రైల్వేశాఖ గమనించలేదు. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు అరకు వెళ్లదని తెలిసి, పర్యాటకుల్లో అసంతృప్తి నెలకొంది. చదవండి: పెళ్లిలో ‘షేర్వాణీ’ రగడ -
కోరాపుట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు విస్టాడోమ్ కోచ్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల, పర్యాటకుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లను జత చేసే దిశగా వాల్తేర్ డివిజన్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం మధ్య నడిచే స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మూడునెలల పాటు ఐసీఎఫ్ విస్టాడోమ్ కోచ్‌ను జత చేయాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే నిర్ణయించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి ప్రకటనలో తెలిపారు. ∙ప్రతీ సోమ, బుధ, శని వారాలలో విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం–కోరాపుట్ (08546)స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మే 9వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కోరాపుట్‌లో ప్రతీ మంగళ, గురు,ఆది వారాలలో బయల్దేరే కోరాపుట్–విశాఖపట్నం(08545)స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మే 10వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ కోచ్‌ను జత చేయనున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అద్దాల పెట్టెల్లో నుంచి కొండల మీదుగా సాగే ప్రయాణ అనుభూతిని పొందాలని డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి కోరారు. (క్లిక్: సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి')