
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల, పర్యాటకుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లను జత చేసే దిశగా వాల్తేర్ డివిజన్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం మధ్య నడిచే స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మూడునెలల పాటు ఐసీఎఫ్ విస్టాడోమ్ కోచ్‌ను జత చేయాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే నిర్ణయించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి ప్రకటనలో తెలిపారు.
∙ప్రతీ సోమ, బుధ, శని వారాలలో విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం–కోరాపుట్ (08546)స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మే 9వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కోరాపుట్‌లో ప్రతీ మంగళ, గురు,ఆది వారాలలో బయల్దేరే కోరాపుట్–విశాఖపట్నం(08545)స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మే 10వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ కోచ్‌ను జత చేయనున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అద్దాల పెట్టెల్లో నుంచి కొండల మీదుగా సాగే ప్రయాణ అనుభూతిని పొందాలని డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సత్పతి కోరారు. (క్లిక్: సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి')
Comments
Please login to add a commentAdd a comment