ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న 12554 వైశాలి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో క్లోన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఛత్ పూజలో పాల్గొనేందుకు బీహార్, యూపీకి చెందిన పలువురు ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో తూర్పు యూపీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్‌కు చెందిన ఒకరు ఉన్నారు. గాయపడిన 11 మంది రైల్వే ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులను డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్‌లో చేర్చారు.
రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మైన్‌పురి ఔటర్ గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. కాగా బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు
Comments
Please login to add a commentAdd a comment