రైళ్ల వేళల్లో మార్పు | Change trains at | Sakshi
Sakshi News home page

రైళ్ల వేళల్లో మార్పు

Published Thu, Sep 4 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

రైళ్ల వేళల్లో మార్పు

రైళ్ల వేళల్లో మార్పు

గుడివాడ టౌన్ : పట్టణానికి వచ్చే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మారినట్లు స్టేషన్ మేనేజర్ పొట్లూరి శేషగిరిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 17213/ 17231 నర్సపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ గతంలో మధ్యాహ్నం 12.50 గంటలకు వచ్చి 12.55 బయల్దేరేదని, ప్రస్తుతం 12.30కు వచ్చి 12.32కు వెళ్తుందని పేర్కొన్నారు. ట్రైన్ నంబర్ 18519 విశాఖ-ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ గతంలో ఉదయం 5.08 గంటలకు వచ్చి 5.10కు వెళ్లేదని ప్రస్తుతం 5.03కు వచ్చి 5.05కు వెళ్తుందని చెప్పారు.

ట్రైన్ నంబర్ 17643 చెన్నై-కాకినాడ సర్కార్ ఎక్స్‌ప్రెస్ గతంలో 4.20కు వచ్చి 4.22 గంటలకు వెళ్లేదని, ప్రస్తుతం 3.58కు వచ్చి 4.00 గంటలకు వెళ్తుందని, ట్రైన్‌నంబర్ 18520 ఎల్‌టిటి-విశాఖ ఎక్స్‌ప్రెస్ గతంలో 5.08 గంటలకు వచ్చి 5.10కు వెళ్లేదని, ప్రస్తుతం 5.03కు వచ్చి 5.05కు వెళ్తుందని తెలిపారు.

ట్రైన్ నంబర్ 17250 సికింద్రాబాద్ -మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ గతంలో ఉదయం 5.58కు వచ్చి 6.00కు వెళ్లేదని, ది, ప్రస్తుతం 5.45కు వచ్చి 5.47కు వెళ్తుందని,అలాగే ట్రైన్ నంబర్ 17212 యశ్వంత్‌పూర్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.46కు వచ్చి 5.48కు వెళ్లేదని, ప్రస్తుతం 6.05కు వచ్చి 6.07కు వెళ్తుందని చెప్పారు. ట్రైన్ నంబర్ 57229 మచిలీపట్నం-విశాఖపట్నం పాసింజర్ ప్రస్తుతం రాత్రి 10.15కు వచ్చి 10.30కు వెళ్తుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement