ఆదోని మీదుగా వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
Published Wed, Nov 9 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
ఆదోని రూరల్ : పట్టణంలో జరిగే విద్య, వ్యాపార పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఆదోని మీదుగా చెన్నై– అహ్మదాబాద్‌కు వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నం.06039 ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం ఉదయం 5.13 గంటలకు ఆదోని రైల్వే స్టేషన్‌కు వచ్చి రెండు నిముషాల అనంతరం రాయచూరు, యాదగిరి, వాడి, షోలాపూర్, పూనె, పాన్‌వెల్, వాసైరోడ్, సూరత్ మీదుగా అహ్మబాద్ చేరుతుందని తెలిపారు. అలాగే రైలు నం.09462 అహ్మదాబాద్–చెన్రైఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు ఆదోని రైల్వే స్టేషన్ చేరుకొని రెండు నిముషాల తర్వాత గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అర్కోణం మీదుగా చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement