ఉత్తరప్రదేశ్‌లో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు వెళుతున్న అభ్యర్థులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు.
కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిరోజ్‌పూర్ నుండి ధన్‌బాద్ వెళ్తోంది. ఈ రైలు బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. అకస్మాత్తుగా దాని కప్లింగ్ విరిగిపోయింది. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా, వాటిలో ఎనిమిది కోచ్‌లు వేరయ్యాయి. స్టేషన్ నుంచి రైలు కొంత దూరం వెళ్లిన తరువాత వెనుకనున్న ఎనిమిది బోగీలు విడిపోయాయని అధికారులు తెలిపారు. రైలులో కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన మరవకముందే ఈ రైలు ప్రమాదం చోటుచేసుకోవడం రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment