
బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో వధూవరులతోపాటు ఏడుగురు మృతి చెందారు. మృతులలో వధూవరులు, వరుడి అత్త, సోదరుడు సహా ఏడుగురు ఉన్నారు.
ధాంపూర్‌లోని తిబ్డి గ్రామంలో నివాసముంటున్న మగ పెళ్లివారి కుటుంబం జార్ఖండ్‌కు చెందిన వధువుతో కలిసి తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వధువుకు స్వాగతం పలికేందుకు వరుని ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న ఆ కుటుంబంలోని వారంతా ఈ విషాద వార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు.
కొత్త పెళ్లికూతురుతో వరుడు ఇంటికి వస్తాడని ఎదురు చూసిన అతని కుటుంబ సభ్యులు వధూవరుల మృతదేహాలు ఇంటికి రావడంతో విషాదంలో మునిగిపోయారు. పెళ్లి దుస్తుల్లో విగతజీవులుగా మారిన నూతన దంపతులను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment