Bijnor
-
యూపీలో మరో ఘోరం: రోడ్డు ప్రమాదంలో వధూవరులతోపాటు ఏడుగురు మృతి
బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో వధూవరులతోపాటు ఏడుగురు మృతి చెందారు. మృతులలో వధూవరులు, వరుడి అత్త, సోదరుడు సహా ఏడుగురు ఉన్నారు.ధాంపూర్‌లోని తిబ్డి గ్రామంలో నివాసముంటున్న మగ పెళ్లివారి కుటుంబం జార్ఖండ్‌కు చెందిన వధువుతో కలిసి తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వధువుకు స్వాగతం పలికేందుకు వరుని ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న ఆ కుటుంబంలోని వారంతా ఈ విషాద వార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు.కొత్త పెళ్లికూతురుతో వరుడు ఇంటికి వస్తాడని ఎదురు చూసిన అతని కుటుంబ సభ్యులు వధూవరుల మృతదేహాలు ఇంటికి రావడంతో విషాదంలో మునిగిపోయారు. పెళ్లి దుస్తుల్లో విగతజీవులుగా మారిన నూతన దంపతులను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: ఆమె కాదు.. అతడు! -
చిరుతపులి దాడి.. మరో చిన్నారి మృతి
లక్నో: చిరుతపులి దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పశుగ్రాసం తీసుకొచ్చేందుకు తల్లితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాలికపై.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. నహ్తౌర్ ప్రాంతంలోని మల్కాపూర్ గ్రామానికి తాన్య(8) అనే చిన్నారి పశుగ్రాసం సేకరించేందుకు తల్లితో కలిసి ఉదయం 8 గంటల సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది.అయితే అదే సమయంలో చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసి.. తాన్యను రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. వెంటనే చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు కర్రలతో చిరుతను వెంబడించారు. దీంతో భయపడిన చిరుత.. చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపినట్లు నహ్తౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధీరజ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్లను, థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇటీవల చిరుత దాడిలో యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
Uttar Pradesh: రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్.. తప్పిన ముప్పు
ఉత్తరప్రదేశ్‌లో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు వెళుతున్న అభ్యర్థులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు.కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిరోజ్‌పూర్ నుండి ధన్‌బాద్ వెళ్తోంది. ఈ రైలు బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. అకస్మాత్తుగా దాని కప్లింగ్ విరిగిపోయింది. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా, వాటిలో ఎనిమిది కోచ్‌లు వేరయ్యాయి. స్టేషన్ నుంచి రైలు కొంత దూరం వెళ్లిన తరువాత వెనుకనున్న ఎనిమిది బోగీలు విడిపోయాయని అధికారులు తెలిపారు. రైలులో కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన మరవకముందే ఈ రైలు ప్రమాదం చోటుచేసుకోవడం రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. -
కరోనా టెస్ట్ చేయించుకోలేదని కడతేర్చారు..!
లక్నో : కరోనా టెస్ట్ చేయించుకోలేదనే కారణంతో ఓ వ్యక్తిని అతని కజిన్స్ కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నూర్లోని మలక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంజీత్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఢిల్లీ నుంచి మలక్‌పూర్‌కు చేరుకున్నాడు. దీంతో అతని కజిన్స్ కపిల్, మనోజ్.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అయితే ఇందుకు మంజీత్ నిరాకరిస్తు వచ్చాడు. ఈ క్రమంలో గురువారం మంజీత్‌కు అతని కజిన్స్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కపిల్, మనోజ్‌లు కర్రలతో మంజీత్‌పై దాడికి దిగారు. (చదవండి : కరోనా.. ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ మృతి) ఈ ఘర్షణలో మంజీత్ తలకు గాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే మంజీత్ తల్లిదండ్రులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మంజీత్ చికిత్స పొందుతుండగానే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మంజీత్ తండ్రి కల్యాణ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మంజీత్ కజిన్స్ కపిల్, మనోజ్, వారి తల్లి పుణియా, మనోజ్ భార్య డాలీలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బిజ్నూర్ అడిషనల్ ఎస్పీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మే 19వ తేదీన బిజ్నూర్కు చేరుకున్న సమయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు. అయితే అక్కడ నెగిటివ్ రావడంతో అతని శాంపిల్స్ తీసుకోలేదని చెప్పారు. -
దారుణం: మంచానికి కట్టేసి తగలబెట్టారు!
లక్నో : మంచానికి కట్టిపడేసి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో లభ్యమైంది. బిజ్నూర్ జిల్లాలోని గజ్రోలా అనే గ్రామంలోని మామిడితోటలో పూర్తిగా కాలిపోయి ఉన్న మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు.అస్థిపంజరం మాత్రమే కనిపించేలా పాశవికంగా ఆమెను తగులబెట్టారని పేర్కొన్నారు. తోటమాలి అందించిన సమాచారం మేరకు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రెండు తుపాకీ గుండ్లు లభ్యమయ్యాయని.. అందులో ఒకటి బాధితురాలిపై ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళను తుపాకీతో కాల్చి చంపి.. అనంతరం తగల బెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటన జరిగిన మామిడితోట నోయిడాకు చెందిన వ్యక్తిదని పోలీసులు తెలిపారు. అయితే మృతి చెందిన మహిళ ఎవరనే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదని.. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. -
మృతుల కుటుంబాలకు ప్రియాంక పరామర్శ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆమె జిల్లాలోని నహ్తౌర్ ప్రాంతాలో మృతుల ఇద్దరి కుటుంబాలను కలుసుకున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆమె ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడారని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు తెలిపారు. సిఏఏకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ బిజ్నోర్ లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను తగలబెట్టిన సంగతి తెలిసిందే. -
జడ్జి చూస్తుండగానే.. నిందితున్ని కాల్చి చంపారు..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం రేగింది. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న షానవాజ్ అన్సారీని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. జిల్లాలోని నజీబాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి హజీ అసన్ (50), అతని మేనల్లుడిని గత మే నెలలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. నిందితుల్లో ఒకరైన షానవాజ్ ఈ ఇద్దరినీ తానే చంపానని ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతన్ని మంగళవారం బిజ్నూర్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అయితే, కోర్టులో వాదనలు జరుగుతుండగా.. హజీ అసన్ కొడుకు, మరో ఇద్దరు సాయుధులు షానవాజ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కోర్టు సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఇక కాల్పుల నేపథ్యంలో కోర్టులో భీతావహ వాతావరణం నెలకొంది. న్యాయమూర్తి, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు చెక్క బల్లల కింద దాక్కుని ప్రాణాలు రక్షించుకున్నారు. కాల్పులకు తెగబడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి సంజీవ్ త్యాగి చెప్పారు. వ్యాపార సంబంధ కారణాలతోనే ఈ హత్యలు జరిగినట్టు స్థానిక పోలీసులు చెప్తున్నారు. -
బరాత్ ఆలస్యం: మరో యువకుడితో పెళ్లి!
లక్నో : పెళ్లి బరాత్ ఆలస్యమైన నేపథ్యంలో ఘర్షణ తలెత్తి ఓ వధువు కుటుంబ సభ్యులు ఆమెను మరొక యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో భంగపడిన వరుడు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలు.. బిజ్నూర్లోని నంగల్‌జాట్ గ్రామానికి చెందిన ఓ యువతికి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా అక్టోబరులో ఓ యువకుడితో పెళ్లి జరిగింది. అయితే డిసెంబరు 4న మరోసారి ఈ జంటకు శాస్త్రోక్తంగా పెళ్లి చేయాలని ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. దీంతో ధంపూర్ పట్టణానికి చెందిన వరుడు బిజ్నూర్కు బయల్దేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉండగా... రాత్రి వరకు అతడు రాకపోవడంతో వధువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కట్నం విషయమై కూడా గొడవ జరిగింది. దీంతో వధువు బంధువులు వరుడి తరఫు వాళ్లను ఓ గదిలో బంధించి తాళం వేశారు. వాళ్ల నుంచి విలువైన వస్తువులు లాక్కొని.. దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాళ్లను విడిపించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పోలీసుల సమక్షంలో రాజీకి వచ్చాయి. అయితే వధువు మాత్రం వరుడిని మరోసారి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించిన గ్రామ పెద్దలు వధువు కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించారు. -
ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?
బిజనోర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పూర్ణిమకు రకరకాల డిజైన్ల రాఖీలు మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్ జిల్లాలో శ్రీకృష్ణా గోశాల నిర్వాహకులు విభిన్నంగా ఆవు పేడతో రాఖీలు తయారు చేశారు. సహజ రంగులు, దారాలతో పర్యావరణ హితంగా వీటిని తయారు చేసినట్టు ఎన్నారై మహిళ అల్కా లహోటి(52) తెలిపారు. తన తండ్రికి తోడుగా గోశాల నిర్వహణను చూసుకునేందుకు ఇండోనేసియాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆమె బిజనోర్‌కు వచ్చేశారు. ‘జునా అఖహరాతో కలిసి ఆవు పేడతో మేము తయారుచేసిన రాఖీలను మొదటసారి కుంభమేళాలో ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. ప్రజల కోసం ఇలాంటి రాఖీలు రూపొందించాలని స్వాములు సూచించారు. ఇతర నిపుణుల సాయంతో రాబోయే రాఖీ పండగ కోసం వేల సంఖ్యలో రాఖీలు తయారుచేశాం. ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, ఉత్తరాఖండ్, ఒడిశా నుంచి ఆర్డర్లు వచ్చాయి. వివిధ ఆకృతులు, పరిమాణాల్లో టెంప్లేట్స్ తయారుచేసుకుని వీటిలో ఆవు పేడ నింపుతాం. తర్వాత వీటిని చల్లటి, చీకటి ప్రదేశంలో ఉంచుతాం. ఆరిపోయిన తర్వాత పర్యావరణహిత రంగులద్ది, రంగు రంగుల దారాలు కడతాం. చైనా రాఖీలతో పోలిస్తే ఈ రాఖీలు పర్యావరణహితమైనవి. వీటిని తయారుచేయడంలో మొదట్లో పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ రాఖీలు త్వరగా ఇరిగిపోయేవి. ప్రయోగాలు కొనసాగిస్తూనే ఈ సమస్యను అధిగమించాం. గట్టిగా, దృఢంగా ఉండేలా వీటిని రూపొందించగలిగాం. తక్కువ ధరకే వీటిని విక్రయిస్తాం. మిగిలిపోయిన రాఖీలను ఉచితంగా పంచిపెడతామ’ని అల్కా లహోటి వివరించారు. శ్రీకృష్ణా గోశాలలో 117పైగా ఆవులున్నాయి. ఆవు మూత్రంతో ఫినాయిల్, పేడతో పూలకుండీలు కూడా తయారుచేస్తున్నారు. -
స్వీటు బాక్సులో గన్ పెట్టుకుని వచ్చి..
లక్నో : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఆమేథీ ఎంపీ స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత ఘటన మరువక ముందే బీఎస్పీ, ఎస్పీ నేతల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నాయకుడు హజీ అహ్సన్(55), ఆయన మేనల్లుడు తమ ఆఫీసులోనే దారుణ హత్యకు గురయ్యారు. స్వీటు బాక్సులో తుపాకీ పెట్టుకుని లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు హజీని అతి సమీపం నుంచి కాల్చారు. ఈ క్రమంలో హజీని కాపాడేందుకు ప్రయత్నించిన అతడి మేనల్లుడు కూడా వారి తూటాలకు బలయ్యాడు. ఈ ఘటన బిజ్నూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ..‘ ఈ హత్యల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నాం. హజీని అభినందించాలంటూ స్వీటు బాక్సుతో ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్లగా ముగ్గురు బయట కాపుకాశారు. పథకం ప్రకారమే హజీని హత్య చేశారు. నిందితులకు మృతులతో వ్యక్తిగత కక్షలేమీ లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుపై లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు. కాగా బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి దుండగులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అదే విధంగా సోమవారం సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా బీఎస్పీ నాయకుడిపై కాల్పులు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఘోర రోడ్డుప్రమాదాలు, 14మంది దుర్మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14మంది దుర్మరణం చెందారు. బిజ్నూరు సమీపంలో 75వ నంబర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణ బస్సు అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా లహర్పూర్ సమీపంలో ఓ ట్రక్...కారును ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మాయిలపై వేధింపులు: ముగ్గురి హత్య
బిజ్నూర్ : ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్ లో మరో మతకల్లోలం చెలరేగింది. బిజ్నూర్ పట్టణంలో స్కూలుకు వెళుతున్న విద్యార్థినులను ఓ వర్గానికి చెందిన యువకులు వేధించడంతో మొదలైన గొడవ చివరికి ముగ్గురి హత్యకు దారితీసింది. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ దల్టీత్ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బిజ్నూర్ లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శుక్రవారం స్కూల్ కు వెళుతున్న సమయంలో మరో వర్గానికి చెందిన యువకుల బృందం వేధింపులకు పాల్పడింది. స్కూల్ కు వెళ్లాల్సిన ఆ అమ్మాయిలు ఏడ్చుకుంటూ ఇళ్లకు వెళ్లి.. వేధింపుల విషయాన్ని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు.. యువకులను నిలదీసేందుకు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువర్గాలు తీవ్రంగా వాదులాడుకున్నాయి. ఒక దశలో యువకుల తరఫు బంధువుల్లో ఒకరు తుపాకి బయటికితీసి.. యువతి తరఫున మాట్లాడుతోన్న వారిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయంతో ఒక యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తమ వాళ్ల మరణవార్త తెలుసుకున్న ఆ వర్గాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఇటు వైరివర్గం కూడా వారిని ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున గుమ్మికూడింది. బిజ్నూర్ వ్యాప్తంగా నెలకొన్ని ఉద్రిక్తత సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరుపక్షాలను చెదగొట్టారు. ప్రస్తుతానికి శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ప్రకటించారు. చనిపోయిన యువకులను అహసాన్, సర్తాజ్, అనీస్ లుగా గుర్తించామని, పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులను మృతదేహాలను అందజేస్తామని పోలీసులు పేర్కొన్నారు. యూపీ డీజీపీ జావెద్ అహ్మద్ సౌతం బిజ్నూర్ కల్లోలంపై ప్రత్యేక దృష్టిసారించారు. వేధింపులు, కాల్పుల వ్యవహారంలో ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అసలే కుల, మత తారతమ్యాలు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్ లో తాజా ఉదంతం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్లను అణిచివేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఎన్నికల దృష్ట్యా ఈ హత్యాకాండ రాజకీయరంగు పులుముకునే అవకాశం లేకపోలేదు! -
ఎన్ఐఏ అధికారి హత్య: దర్యాప్తులో కీలక మలుపు
లక్నో: భారత్ లోనేకాక పాకిస్థాన్ లోనూ సంచలనం కలిగించిన ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యకుసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. స్వగ్రామం సాహస్ పూర్ లో తంజీల్ హాజరైన వివాహవేడుకకు హాజరైన ఇద్దరు వ్యక్తులే హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పెళ్లి వీడియోను కూలంకషంగా పరిశీలించారు. ఇద్దరు ఆ అనుమానితుల్లో ఒకరిని ఆర్షిగా గుర్తించామని, అతను తంజీల్ కుటుంబానికి స్నేహితుడని బిజ్నూర్ ఎస్పీ సుభాస్ సింగ్ బఘేల్ తెలిపారు. రెండో వ్యక్తిని ఇంకా గుర్తించాల్సిఉందన్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే తంజీల్ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న మొహమ్మద్ తంజీల్ అహ్మద్ గత ఆదివారం స్వగ్రామంలో జరిగిన వివాహానికి హాజరై కుటుంబంతో సహా కారులో తిరిగివస్తుండగా బిజ్నూర్ సమీపంలో దుండగులు అతణ్ని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. 24 బుల్లెట్లు దూసుకెళ్లడంతో తంజీల్ శరీం ఛిధ్రమైపోయి అక్కడికక్కడే మరణిచారు. అతని పక్కసీట్లో కూర్చున్న భార్య ఫాతిమాకు నాలుగు బెల్లెట్లు తగిలాయి. నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఫాతిమా ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అనేక విమర్శలు చెలరేగిన నేపథ్యంలో తంజీల్ హత్యకేసు సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు నిమిత్తం ఎనిమిది బృందాలను ఏర్పాటుచేశారు. యూపీలోని డ్రగ్స్ మాఫియా, హవాలా వ్యాపారులు సహా మాజీ నేరస్తులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీలనైన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించామని, లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ముగింపునకు వచ్చేఅవకాశం ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. -
సీసీటీవీలో కోడలి దాష్టీకం
-
రహస్య కెమెరాతో బయటపడ్డ కోడలి దాష్టీకం
బిజ్నూర్: ఆమె విద్యాధికురాలు. నాగరికురాలిగా కనిపిస్తుంది కూడా. కానీ కాళ్లు చచ్చుపడిపోయిన అత్త పట్ల మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కనీసం మనిషని.. ముసలావిడనే కనికరం కూడా లేకుండా జుట్టుపట్టి ఈడ్చి, తలపై బండరాయితో మోది హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ దాష్టీకంలో నిందితురాలైన కోడలిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ కు చెందిన సంగీతా జైన్ అనే వివాహితకు కొన్నేళ్లుగా భర్తతో విబేధాలున్నాయి. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. వేధింపులు, లైంగికదాడి సహా భర్త సందీప్ జైన్ పై పలు అక్రమ కేసులు బనాయించిన సంగీత.. బెదిరించిమరీ అత్తింట్లోనే ఉంటోంది. భర్తను జైలుకు పంపి, అత్త రాజ్ రానీ జైన్ ను హతమార్చితే ఆస్తి సొంతమవుతుందనుకున్న సంగీత.. ఆమేరకు పథకం రచించుకుంది. ఇంట్లో ఎవరూలేనప్పుడు అత్తను తీవ్రంగా హింసించేది. చున్నీ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసేంది. బండరాయితో తలపై బాదేది. అయితే భార్య ప్రవర్తనపై ఎప్పటినుంచో అనుమానమున్న సందీప్.. ఇంట్లో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటుచేశాడు. ఆ సంగతి తెలియని సంగీత ఎప్పటిలాగే అత్తపై క్రౌర్యాన్ని ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయింది. జనవరి 5 నాటి దృశ్యాలను సాక్షాధారాలుగా భార్యపై పోలీసులకు ఫిర్యాదుచేశాడు సందీప్ జైన్. రంగంలోకి దిగిన పోలీసులు సంగీతను అదుపులోకి తీసుకుని, బాధిత అత్తను ఆసుపత్రికి తరలించారు. -
స్కూల్ బస్సులో మంటలు: విద్యార్థులకు గాయాలు
బిజ్నోర్: విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్, స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని నజీబాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో రావల్ హదీ రైల్వే క్రాసింగ్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 17 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
హామీలు గుప్పిస్తున్న జయప్రద
-
హామీలు గుప్పిస్తున్న జయప్రద
అమ్మకు అన్నం పెట్టలేదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట వెనకటికి ఒకడు. ఆర్ఎల్డీ నేత, సినీనటి జయప్రద మాటలు అలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి చేసిందేమీ లేకున్నా కొత్త నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానంటూ హామీలు గుప్పించేస్తున్నారు. సమాజ్‌వాదీకి చెల్లుచీటీ ఇచ్చి ఇటీవలి ఆర్ఎల్డీలో చేరిన జయప్రద.... లోక్‌సభ ఎన్నికల్లో బిజ్నూర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన రాంపూర్‌లో ఓటమి ఖాయమనే భావనతోనే ఆమె బిజ్నూర్ నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను జయప్రద ఖాతరు చేయడం లేదు. బిజ్నూర్ నుంచి నామినేషన్ వేసిన ఆమె పొత్తులో భాగంగానే తాను ఇక్కడి పోటీ చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. శుక్రవారం జయప్రద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ నేతపై అత్యాచారం కేసు నమోదు
బిజ్నార్(ఉత్తర ప్రదేశ్): ఓ మహిళకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన కాంగ్రెస్ నేతతో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిజ్నూర్ లో మొహల్లా సాంబా గ్రామం లో భర్తను కోల్పోయి వితంతవుగా జీవిస్తున్నమహిళ కాంగ్రెస్ నేత, నగర మాజీ అధ్యక్షుడు యాడ్రం చంద్రల్ ను మహిళ అక్టోబర్ 6 వతేదీన కలిసింది. ఆ మహిళ తనకు ప్రభుత్వ పథకాలు కల్పించాల్సిందిగా చంద్రల్ కు విన్నవించింది. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని అలుసుగా తీసుకున్న అతను ప్రభుత్వ వసతులు కల్పిస్తానాని నమ్మబలికాడు. అన్నీ తానై చూసుకుంటానని ఆమెకు హామి ఇచ్చాడని. ఈ క్రమంలోనే ఆమెను తన కారులో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశంలోకి తీసుకువెళ్లిన అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు తెలిపింది..అనంతరం అతని మిత్రులు ఓంపాల్, రఘు, రిజ్వాన్,సల్మాన్ కూడా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీనికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చాట్ తిని 50 మంది పిల్లలకు అస్వస్థత
ఉత్తరప్రదేశ్‌లో పాశిపోయిన చిరుతిళ్లు తిని 50 మందికిపైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. బిజ్నూరు జిల్లా రాంపూర్ గ్రామంలో రోడ్డు వైపున చాట్ తిన్నారు. అది విషాహారంగా మారడంతో పిల్లు వాంతులు, కడుపు నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. బాధితుల్ని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై విచారణ చేపట్టనున్నట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. కాగా ఎవర్నీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.