ఉత్తరప్రదేశ్లో పాశిపోయిన చిరుతిళ్లు తిని 50 మందికిపైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. బిజ్నూరు జిల్లా రాంపూర్ గ్రామంలో రోడ్డు వైపున చాట్ తిన్నారు.
అది విషాహారంగా మారడంతో పిల్లు వాంతులు, కడుపు నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. బాధితుల్ని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై విచారణ చేపట్టనున్నట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. కాగా ఎవర్నీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.