బిజ్నార్(ఉత్తర ప్రదేశ్): ఓ మహిళకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన కాంగ్రెస్ నేతతో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిజ్నూర్ లో మొహల్లా సాంబా గ్రామం లో భర్తను కోల్పోయి వితంతవుగా జీవిస్తున్నమహిళ కాంగ్రెస్ నేత, నగర మాజీ అధ్యక్షుడు యాడ్రం చంద్రల్ ను మహిళ అక్టోబర్ 6 వతేదీన కలిసింది. ఆ మహిళ తనకు ప్రభుత్వ పథకాలు కల్పించాల్సిందిగా చంద్రల్ కు విన్నవించింది.
ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని అలుసుగా తీసుకున్న అతను ప్రభుత్వ వసతులు కల్పిస్తానాని నమ్మబలికాడు. అన్నీ తానై చూసుకుంటానని ఆమెకు హామి ఇచ్చాడని. ఈ క్రమంలోనే ఆమెను తన కారులో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశంలోకి తీసుకువెళ్లిన అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు తెలిపింది..అనంతరం అతని మిత్రులు ఓంపాల్, రఘు, రిజ్వాన్,సల్మాన్ కూడా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీనికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.