
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆమె జిల్లాలోని నహ్తౌర్ ప్రాంతాలో మృతుల ఇద్దరి కుటుంబాలను కలుసుకున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆమె ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడారని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు తెలిపారు. సిఏఏకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ బిజ్నోర్ లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను తగలబెట్టిన సంగతి తెలిసిందే.