కాంగ్రెస్ తమ సొంత పార్టీ నేతపైనే వేటు వేసింది. ఆచార్య ప్రమోద్ కృష్ణం అనే ఓ నేత ఇటీవల కాలంలో సొంత పార్టీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. క్రమశిక్షణారాహిత్యంగా సొంతపార్టీ విధానాలపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు ప్రమోద్ కృష్ణం.
ఇటీవల ప్రమోద్ కృష్ణం ప్రధాని నరేంద్రమోదిపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కాంగ్రెస్ హాజరకాబోమని ప్రకటించటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రమోద్.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘిస్తూ.. తరచూ కాంగ్రెస్‌పై విమర్శలు చేయటంతో పార్టీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎవరీ ఆచార్య ప్రమోద్ కృష్ణం?
2019 లోక్‌సభ ఎన్నికల్లో లక్నో సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆచార్య ప్రమోద్ కృష్ణం పోటీ చేశారు. కానీ.. ఆయన అక్కడ ఓటమిపాలయ్యారు. అయినా 1.8 లక్షల ఓట్లు సంపాధించారు.
అదేవిధంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ సెగ్మెంట్‌లో పోటీ చేసి ఓడిపోయారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సలహామండలిలో కీలకంగా వ్యవహించేవారు. ప్రియాంకా గాంధీ వాద్రాకు యూపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆమెకు యూపీకి సంబంధించి సహాయసహకారాలు అందించేవారు. ప్రియాంకా గాంధీ టీంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు.
ప్రమోద్ బహిష్కరణకు కారణాలు!
- సంభాల్ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్మించిన కల్కీధామ్ గుడి ప్రారంభోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోదీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ నేతలను ఆహ్వానించటం యూపీలో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా తాను ఆశలు పెట్టుకున్న లక్నో, సంభాల్ స్థానాల్లో ఎస్పీ తమకు ఆవే సీట్లు కేటాయించాలని కోరటంతో ఆయన ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- అయితే ఇటీవల రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ హాజరుకామని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతూ.. ప్రధాని పొడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
- ఈ నేపథ్యంలోనే.. ప్రమోద్ కృష్ణంను బహిష్కరించాలని యూపీ కాంగ్రెస్ తీర్మానానికి కాంగ్రెస్ చీఫ్ ఆమోదం తెలిపారని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తరచూ సొంత పార్టీపైనే వ్యతిరేకంగా విమర్శలు చేయటంతో కాంగ్రెస్ ఆరేళ్లు వేటు వేసినట్టు తెలిపారు.
వాటి విషయంలో రాజీ పడను: ప్రమోద్ కృష్ణం
కాంగ్రెస్ బహిష్కరణపై తాజాగా ఆచార్య ప్రమోద్ కృష్ణం ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రాముడు, దేశం విషయంలో రాజీ కుదరదు’ అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు.
राम और “राष्ट्र”
— Acharya Pramod (@AcharyaPramodk) February 11, 2024
पर “समझौता” नहीं किया जा सकता. @RahulGandhi
Comments
Please login to add a commentAdd a comment