expell
-
భారత దౌత్యవేత్తల బహిష్కరణ కథనాలు.. స్పందించిన అమెరికా
న్యూయార్క్:భారత్, కెనడా దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో ప్రతిస్పందనగా భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిపై తాజాగా అమెరికా స్పందించింది. సదరు వార్తలను అమెరికా విదేశాంగశాఖ తోసిపుచ్చింది. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారతీయ హైకమిషన్ పేరును కెనడా చేర్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు కెనడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అమెరికా సైతం భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలని యోచిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం.అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత దౌత్యవేత్తలపై చర్యలు తీసుకోవాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు వెలువడిన కథనాలను ఖండించారు.‘‘ మేం భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు వెలువడ్డ నివేదికల విషయం గురించి నాకు తెలియదు. అటువంటి బహిష్కరణ గురించి మేం ఆలోచించలేదు. అంతా ఊహాగానాలు మాత్రమే’’ అని అమెరికా వైఖరిని స్పష్టం చేశారు.ఈ నెల ప్రారంభంలో భారత దౌత్యవేత్తలపై కెనడా ఆరోపణలు చేయటంతో ప్రతిస్పందనగా భారతదేశం కెనడాలో ఉన్న తన ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అదేవిధంగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను కూడా భారత్ బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రక్తలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ పరిణామాలు కెనడా, భారత్ మధ్య సంబంధాలను మరింత దెబ్బతీశాయి. -
పవన్‌ను బహిష్కరించిన బీజేపీ
రెబల్ అభ్యర్థిగా.. పార్టీకి తలనొప్పిగా మారిన భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఎన్డీయే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. వాస్తవానికి.. లోక్‌సభ ఎన్నికల కోసం 200 మందితో కూడిన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది బీజేపీ. కానీ, పశ్చిమ బెంగాల్ అసన్సోల్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేని పవన్ సింగ్.. బీజేపీకి క్షమాపణలు చెప్పారు. అయితే సొంత రాష్ట్రంలో పోటీ చేసేందుకు మాత్రం ఆయన ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో.. బీజేపీ తరఫున బీహార్‌లో పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఆర్జేడీ తరఫున టికెట్ కోసం కూడా యత్నించారు. రెండు వైపుల నుంచి ఆయన సానుకూలత దక్కలేదు. చివరకు.. కారాకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయడమే కాకుండా.. తన తల్లితోనూ ముందు జాగ్రత్తగా మరో నామినేషన్ వేయించారు. చివరకు ఉపసంహరణ గడువు ముగిసేనాడు.. తన తల్లితో నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. ఈ పరిణామాలన్నింటిని బీజేపీ తీవ్రంగా పరిగణించింది.మరోవైపు పవన్ సింగ్‌ను కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయని బీజేపీ.. చివరకు పవన్‌పై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కారాకాట్ నుంచి కేంద్ర మాజీ మంత్రి, ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి తరఫున సీపీఐ(ఎంఎల్)ఎల్ తరఫున రాజా రామ్ సింగ్ కుష్వాహా బరిలో ఉన్నారు. జూన్ 1వ తేదీన కారాకాట్కు పోలింగ్ జరగనుంది. -
ఎవరీ ఆచార్య ప్రమోద్ కృష్ణం? కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది
కాంగ్రెస్ తమ సొంత పార్టీ నేతపైనే వేటు వేసింది. ఆచార్య ప్రమోద్ కృష్ణం అనే ఓ నేత ఇటీవల కాలంలో సొంత పార్టీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. క్రమశిక్షణారాహిత్యంగా సొంతపార్టీ విధానాలపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు ప్రమోద్ కృష్ణం. ఇటీవల ప్రమోద్ కృష్ణం ప్రధాని నరేంద్రమోదిపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కాంగ్రెస్ హాజరకాబోమని ప్రకటించటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రమోద్.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘిస్తూ.. తరచూ కాంగ్రెస్‌పై విమర్శలు చేయటంతో పార్టీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎవరీ ఆచార్య ప్రమోద్ కృష్ణం? 2019 లోక్‌సభ ఎన్నికల్లో లక్నో సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆచార్య ప్రమోద్ కృష్ణం పోటీ చేశారు. కానీ.. ఆయన అక్కడ ఓటమిపాలయ్యారు. అయినా 1.8 లక్షల ఓట్లు సంపాధించారు. అదేవిధంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ సెగ్మెంట్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సలహామండలిలో కీలకంగా వ్యవహించేవారు. ప్రియాంకా గాంధీ వాద్రాకు యూపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆమెకు యూపీకి సంబంధించి సహాయసహకారాలు అందించేవారు. ప్రియాంకా గాంధీ టీంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు. ప్రమోద్ బహిష్కరణకు కారణాలు! సంభాల్ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్మించిన కల్కీధామ్ గుడి ప్రారంభోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోదీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ నేతలను ఆహ్వానించటం యూపీలో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా తాను ఆశలు పెట్టుకున్న లక్నో, సంభాల్ స్థానాల్లో ఎస్పీ తమకు ఆవే సీట్లు కేటాయించాలని కోరటంతో ఆయన ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ హాజరుకామని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతూ.. ప్రధాని పొడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రమోద్ కృష్ణంను బహిష్కరించాలని యూపీ కాంగ్రెస్ తీర్మానానికి కాంగ్రెస్ చీఫ్ ఆమోదం తెలిపారని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తరచూ సొంత పార్టీపైనే వ్యతిరేకంగా విమర్శలు చేయటంతో కాంగ్రెస్ ఆరేళ్లు వేటు వేసినట్టు తెలిపారు. వాటి విషయంలో రాజీ పడను: ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ బహిష్కరణపై తాజాగా ఆచార్య ప్రమోద్ కృష్ణం ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రాముడు, దేశం విషయంలో రాజీ కుదరదు’ అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. राम और “राष्ट्र” पर “समझौता” नहीं किया जा सकता. @RahulGandhi — Acharya Pramod (@AcharyaPramodk) February 11, 2024 -
దౌత్యవేత్తల బహిష్కరణ: దెబ్బకి దెబ్బ కొట్టిన అమెరికా
వాషింగ్టన్: రష్యా చర్యకు అమెరికా ప్రతిచర్యకు దిగింది. తమ దేశం నుంచి ఇద్దరు రష్యా దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తాజాగా ప్రకటన చేసింది. కీలక సమాచారం సేకరించారనే ఆరోపణలపై ఇద్దరు అమెరికన్ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లాలంటూ కిందటి నెలలో రష్యా ఆదేశించింది. ఈ యాక్షన్‌కు కౌంటర్ యాక్షన్‌గానే.. అగ్రరాజ్యం ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ‘‘మా దౌత్యవేత్తలను రష్యా ప్రభుత్వం కావాలనే వేధింపులకు గురి చేస్తోంది. ఈ పరిణామాన్ని మేం సహించేది లేదు’’ అని అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా ఇది ప్రతీకారచర్య అనే విషయాన్ని స్పష్టం చేశారాయన. అమెరికాను విడిచి వెళ్లేందుకు రష్యా దౌత్య వేత్తలిద్దరికీ వారం గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. వ్లాడివోస్టోక్‌లోని అమెరికా కాన్సులేట్‌కు చెందిన ఓ మాజీ ఉద్యోగి.. రష్యా భద్రతకు సంబంధించిన కీలక సమాచారం సేకరించాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని దోషిగా తేల్చారు. అయితే.. అమెరికా దౌత్యవేత్తలు జెఫ్రీ సిల్లిన్, డేవిడ్ బెర్న్స్టెయిన్లు ఆ మాజీ ఉద్యోగితో సంబంధాలు కలిగి ఉన్నారని, వాళ్లు కూడా ఇందుకు సహకరించారని ఆరోపిస్తూ రష్యా ఈ ఇద్దరిని బహిష్కరించింది. అయితే అమెరికా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ దౌత్యవేత్తలను రష్యా ఘోరంగా అవమానిస్తోందని విమర్శించింది. మరోవైపు 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా-అమెరికాల మధ్య సంబంధాలు అంతకంతకు దిగజారుతున్నాయి. -
VK Sasikala: శశికళకు ఎదురు దెబ్బ
అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉండే హక్కును కోరుతూ వీకే శశికళ వేసిన పిటిషన్‌ను చెన్నై కోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకేలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. 2017లో పార్టీ నుంచి తనను మహిష్కరిస్తూ అన్నాడీఎంకే పార్టీ సాధారణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్ పళనిస్వామి, లీగల్ వింగ్ జాయింట్ సెక్రెటరీ ఏఎం బాబు మురుగవేల్ ఇంటర్లోక్యూటరీ(సంభాషణ) దరఖాస్తు దాఖలు చేయడంతో శశికళ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. 2017లో జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం.. అప్పటి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించించింది. ఈ వేటుపై శశికళ గతంలో చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని అప్పటి విడివిడి వర్గాల విలీనం తర్వాత ఈ కౌన్సిల్ భేటీ జరిగి.. శశికళను పార్టీ నుంచి వెలేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్ -
కొత్త పార్టీ.. కుండబద్ధలు కొట్టేసిన సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : సొంత పార్టీపైనే తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో వీడే ప్రసక్తే లేదని ఆయన కుండబద్ధలు కొట్టేశారు. కాగా, ఈ మధ్యే ఆయన ‘రాష్ట్ర మంచ్’ అనే రాజకీయ వేదికను ప్రారంభించి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఆయన బయటకు వచ్చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై మీడియా ఆయన్ని ప్రశ్నించింది. ‘‘బీజేపీ సభ్యుడిగా కంటే.. ఒక పౌరుడిగానే నాకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర మంచ్ అనేది నిరుద్యోగులు, రైతుల హక్కుల కోసం పోరాటం చేసేందుకు ఏర్పాటు చేసిన ఓ వేదిక మాత్రమే. అంతేగానీ పార్టీల పేరుతో రాజకీయాలను వెలగబెట్టడానికి కాదు. నేను బీజేపీలోనే ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీని వీడను’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే తన వ్యవహారం నచ్చక ఒకవేళ బీజేపీ అధిష్ఠానం వేటు వేస్తే సంతోషంగా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. అంతేగానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించటం మాత్రం ఆపనని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. ‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట ఓ జాతీయ పత్రికలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఆయన రాసిన వ్యాసంతో మొదలైన దుమారం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులకు మద్ధతుగా ఆయన పోరాటానికి దిగటంతో తారాస్థాయికి చేరుకుంది. మరో సీనియర్ నేత, నటుడు శతృఘ్న సిన్హా.. యశ్వంత్‌కు బహిరంగంగానే మద్ధతు ప్రకటిస్తూ వస్తున్నారు. -
నితీశ్ వెలివేతకు రంగం సిద్ధం?
జేడీయూ నుంచి నితీశ్‌ను బహిష్కరిస్తాం: శరద్ యాదవ్ వర్గం పట్నా: బీజేపీ- జేడీ(యూ) మళ్లీ చేతులు కలుపడంతో బిహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మహాకూటమిని వీడి.. మళ్లీ బీజేపీతో జత కట్టిన జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ పై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత శరద్ యాదవ్‌తోపాటు పలువురు నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని అసమ్మతి వర్గం నితీశ్‌కు వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని జేడీయూ అసమ్మతి వర్గం భావిస్తోంది. మహాఘట్ బంధన్(కూటమి) నుంచి బయటకు వచ్చేయటం 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును అవమానించటమే, అందుకే నితీశ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారంటూ అరుణ్‌పై నితీశ్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పార్టీపై పట్టుకోసం నితీశ్ ఈ నెల 19న పట్నాలో జాతీయ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో సీనియర్ నేత శరద్‌యాదవ్ కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి పార్టీ నేతలతో భేటీకానున్నారు. ఒకవేళ ఈ రెండు వర్గాలు గనుక విడిపోయేందుకే మొగ్గు చూపినట్లయితే సమాజ్‌వాదీ లుకలుకలు, అన్నాడీఎంకేలో వర్గపోరు తరహాలోనే జేడీ(యూ) పంచాయితీ కూడా ఎన్నికల సంఘం ముందుకు చేరే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్సీపీ
తూర్పుగోదావరి (వై.రామవరం): వై.రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వైఎస్సార్సీపీ నాయకులు బహిష్కరించారు. అభివృద్థి కార్యక్రమాల గురించి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారంటూ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వంతాల రాజేశ్వరీ(రంపచోడవరం), స్థానిక ఎంపీపీ కర్రా వెంకటలక్ష్మీలతో పాటు పలువురు హాజరయ్యారు. ప్రభుత్వాధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. -
అవిశ్వాసం ప్రకటించినందునే బహిష్కరణ: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ : సొంత సర్కారుపైన అవిశ్వా సం ప్రకటించినందునే ఆ ఆరుగురు ఎంపీలను బహిష్కరించామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆ ఎంపీలు వారి సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టేందుకు సంతకాలు చేశారు. వారిని బుజ్జగించాం. కానీ వారు పదేపదే అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. అందువల్ల బహిష్కరణ చర్య తీసుకున్నాం’ అని తెలిపారు. పార్టీ నుంచి బహిష్కృతులైన ఎంపీలను సభలో సస్పెండ్ చేస్తారా? అని అడగ్గా.. ‘‘అది సభాపతికి సంబంధించిన అంశం’’ అని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ, బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అది సమస్య కాదు. కానీ ఈ ఎంపీలు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు’’ అని అన్నారు. తెలంగాణ బిల్లు 11న రాజ్యసభకు వస్తుందని చెప్పారు కదా అని అనగా.. ‘‘అది ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న బిల్లు. అందువల్ల అది లోక్‌సభకు వస్తోంది’’ అని చెప్పారు. కేసీఆర్, సోనియాల భేటీ గురించి ప్రస్తావించగా.. ‘‘కేసీఆర్ అందరినీ కలుస్తున్నారు. బీజేపీ నేతలను కూడా కలిశారు’’ అని అన్నారు. టీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్‌నే అడగండని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ఏర్పాటు దిశలో బహిష్కరణ ఓ అడుగు: మాకెన్ పార్టీ ఎంపీల బహిష్కరణ చర్య తెలంగాణ ఏర్పాటు కోసం పడుతున్న అడుగుల్లో ఒకటని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణకు వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి. మిగిలిన విషయాలపై విభిన్న స్థాయిల్లో నిర్ణయాలు ఉంటాయి’’ అని చెప్పారు. బీజేపీ నేతలతో ప్రధానమంత్రి విందు దౌత్యంపై ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘అధికార పార్టీ ఎప్పుడూ బిల్లులు పాస్ అయ్యేందుకు అన్ని పార్టీలతో సమావేశాలు జరుపుతుంది. ప్రధానమంత్రి చేసేది కూడా అదే. అవినీతి వ్యతిరేక బిల్లులు, తెలంగాణ బిల్లు, రోడ్డు పక్క వ్యాపారుల బిల్లులతోపాటు పెండింగులో ఉన్న బిల్లులు ఆమోదం పొందాలని కోరుకుంటున్నాం. దేశానికి ఇవి చాలా ముఖ్యమైనవి. అందువల్ల ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.