Acharya Pramod Krishnam
-
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
ఢిల్లీ: మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం తాజాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ త్వరలో రాహుల్ గాంధీ వర్గంగా, ప్రియాంక గాంధీ వర్గంగా చీలిపోవచ్చని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుట్రలో ప్రియాంక గాంధీ బలి అయ్యారని కృష్ణం ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీని వీడిన తీరు కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం తగ్గిపోయింది. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆమె మద్దతుదారుల కొంత నిరాశను మిగిల్చింది.రాహుల్ గాంధీకి పాకిస్తాన్లో ప్రజాదరణ, డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రాయ్‌బరేలీకి బదులుగా రావల్పిండి నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నాను అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు.రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పాను. ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర ఉంది. దీనికి ప్రియాంక గాంధీ బలైపోతోందని మాజీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం అన్నారు.#WATCH | Delhi: Former aide of Congress leader Priyanka Gandhi Vadra, Acharya Pramod Krishnam says, "The way Rahul Gandhi has left Amethi, Congress party workers' morale is down. Priyanka Gandhi not contesting the election, this is now taking the shape of a volcano in the hearts… pic.twitter.com/ynbNsTYkqG— ANI (@ANI) May 4, 2024 -
ఎవరీ ఆచార్య ప్రమోద్ కృష్ణం? కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది
కాంగ్రెస్ తమ సొంత పార్టీ నేతపైనే వేటు వేసింది. ఆచార్య ప్రమోద్ కృష్ణం అనే ఓ నేత ఇటీవల కాలంలో సొంత పార్టీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. క్రమశిక్షణారాహిత్యంగా సొంతపార్టీ విధానాలపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు ప్రమోద్ కృష్ణం. ఇటీవల ప్రమోద్ కృష్ణం ప్రధాని నరేంద్రమోదిపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కాంగ్రెస్ హాజరకాబోమని ప్రకటించటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రమోద్.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘిస్తూ.. తరచూ కాంగ్రెస్‌పై విమర్శలు చేయటంతో పార్టీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎవరీ ఆచార్య ప్రమోద్ కృష్ణం? 2019 లోక్‌సభ ఎన్నికల్లో లక్నో సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆచార్య ప్రమోద్ కృష్ణం పోటీ చేశారు. కానీ.. ఆయన అక్కడ ఓటమిపాలయ్యారు. అయినా 1.8 లక్షల ఓట్లు సంపాధించారు. అదేవిధంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ సెగ్మెంట్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సలహామండలిలో కీలకంగా వ్యవహించేవారు. ప్రియాంకా గాంధీ వాద్రాకు యూపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆమెకు యూపీకి సంబంధించి సహాయసహకారాలు అందించేవారు. ప్రియాంకా గాంధీ టీంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు. ప్రమోద్ బహిష్కరణకు కారణాలు! సంభాల్ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్మించిన కల్కీధామ్ గుడి ప్రారంభోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోదీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ నేతలను ఆహ్వానించటం యూపీలో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా తాను ఆశలు పెట్టుకున్న లక్నో, సంభాల్ స్థానాల్లో ఎస్పీ తమకు ఆవే సీట్లు కేటాయించాలని కోరటంతో ఆయన ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ హాజరుకామని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతూ.. ప్రధాని పొడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రమోద్ కృష్ణంను బహిష్కరించాలని యూపీ కాంగ్రెస్ తీర్మానానికి కాంగ్రెస్ చీఫ్ ఆమోదం తెలిపారని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తరచూ సొంత పార్టీపైనే వ్యతిరేకంగా విమర్శలు చేయటంతో కాంగ్రెస్ ఆరేళ్లు వేటు వేసినట్టు తెలిపారు. వాటి విషయంలో రాజీ పడను: ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ బహిష్కరణపై తాజాగా ఆచార్య ప్రమోద్ కృష్ణం ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రాముడు, దేశం విషయంలో రాజీ కుదరదు’ అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. राम और “राष्ट्र” पर “समझौता” नहीं किया जा सकता. @RahulGandhi — Acharya Pramod (@AcharyaPramodk) February 11, 2024 -
ఆ శాపమే కాంగ్రెస్‌ను ముంచేసింది: కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్ ప్రకారం బీజీపీ ఆధిక్యం కొనసాగుతోంది. మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ సలహాదారు ఆచార్య ప్రమోద్ కృష్ణం కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన్ (ధర్మం)ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ పార్టీని ముంచేసిందన్నారు. గతంలో మహాత్మా గాంధీ బోధనలకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీని కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి మద్దతివ్వడం, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే శాపమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటమి కాదు. కూల్చివేస్తామని ప్రకటించిన వారికి (కమ్యూనిస్టులు) కాంగ్రెస్ మద్దతిస్తోంది. సెక్యులరిస్ట్ మహాత్మా గాంధీని అనుకరించే కాంగ్రెస్ పార్టీ, సనాతన్ (ధర్మం)ని వ్యతిరేకించడం శాపం అని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేక మనస్తత్వం ఫలితమే ఇదని ప్రమోద్ కృష్ణ పేర్కొన్నారు. కాంగ్రెస్ మతాన్ని అగౌరవపరిచింది. సనాతన్ శాపం కారణంగా తాము ఓడిపోయాం అంటూ ట్వీట్లో ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు. భావాన్ని తెలియజేశాడు. రాజస్థాన్అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్క్ దాటేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమంటూ బీజేపీ సంబరాలు చేసుకుటోంది. దీంతో దశాబ్దాలుగా కొసాగుతున్న ట్రెండ్ ఈసారి కూడా రిపీట్ అయ్యింది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కాదని బీజేపీకి ప్రజలు కట్టినట్టు కనిపిస్తోంది. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించి వసుంధర రాజే ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలోకి నెట్టింది. అశోక్ గెహ్లోత్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇపుడు కాంగ్రెస్‌ను ఓడించి, అధికారాన్ని తిరిగి చేజిక్కించు కోవాలని బీజేపీ చూస్తోంది. వసుంధరా రాజే, దియా కుమారి భారీ విజయం బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 53,193 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో తమ నేతమళ్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించాలని ఆమె విధేయులు కోరుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దియా కుమారి విద్యాధర్ నగర్లో 71,368 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై విజయం సాధించారు. రాజకుటుంబానికి చెందిన కుమారికూడా సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. తన విజయం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె దేశవ్యాప్తంగా మోదీ సునామీ వస్తోందని వ్యాఖ్యానించారు. -
ఆయనో ఇండియన్ ముజాహిదీన్!
న్యూఢిల్లీ: కల్కి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ క్రిష్ణం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో ప్రధానిని పోల్చి మరోసారి వివాదానికి తెరతీశారు. ఆచార్య ప్రమోద్ తాజా వ్యాఖ్యలతో దేశంలో పెరుగుతున్న అసహనంపై రేగిన వివాదం మరింత తీవ్రమవుతోంది తీవ్ర వాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎమ్) ను చూసి భారతీయులు ఎలా భయపడుతున్నారో, మోదీని చూసి కూడా దేశ ప్రజలు అలాగే వణికిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీపై దాడితోనే ఆయన సరిపెట్టలేదు. బీజేపీలోని ఇతర నేతలపైనా ఆచార్య ప్రమోద్ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ హీరో షారూక్‌ను పాకిస్తాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌తో పోల్చిన గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ని కూడా టార్గెట్ చేశారు. ఆయనొక మాఫియా అని వ్యాఖ్యానించారు. దీంతోపాటు మరో బీజేపీ నేత సాక్షి మహరాజ్ ఒక రేపిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. శత్రుదేశం పాకిస్తాన్ ఏం కోరుకుంటోందో, దేశంలోని కొంతమంది బీజేపీ నేతలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఆచార్య ప్రమోద్ 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. -
సన్యాసికి కాంగ్రెస్ టికెట్
బిజెపి అనుకూల యోగ గురు బాబా రామ్ దేవ్ పై ఫిర్యాదులు చేసి, కేసులు వేసి చీకాకు పెట్టిన ఇంకొక స్వామీజీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని సంబల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంటే రామ్ దేవ్ ని కేసులతో శీర్షాసనం వేయించినందుకు ఆ బాబాజీకి కాంగ్రెస్ 'సుఖాసన్' సమర్పించుకుంటోందన్నమాట! రామ్ దేవ్ గురువైన స్వామి శంకరదేవ్ 2007 నుంచీ కనిపించడం లేదు. ఆయన పతంజలి యోగపీఠ్ ప్రారంభించిన కొద్ది రోజుల తరువాతే అదృశ్యం అయిపోయారు. దీన్లో బాబా రామ్ దేవ్ హస్తం ఉందని స్వామి ప్రమోద్ కృష్ణం ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగానే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ... కాదు కాదు... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రామ్ దేవ్ పై దర్యాప్తు చేస్తోంది. ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి పీఠాధిపతి. ఆయన అఖిల భారత సంత్ సమాజ్ అధ్యక్షులు కూడా. స్వామీజీ ఎన్నికైతే కాంగ్రెస్ కి డబుల్ లాభం. ఆయన చెయ్యి చూపిస్తే ఆశీర్వదిస్తున్నారో లేక వోటడుతున్నారో ఎన్నికల అధికారులకు అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఆచార్య శ్రీ కూడా తక్కువేం తినలేదు. 2007 అజ్మీర్ పేలుళ్లలో ప్రధాననిందితుడైన భవేశ్ పటేల్ పోలీసు దర్యాప్తులో సదరు స్వామీజీ పేరు కూడా చెప్పారు. అంతే కాదు. కొందరు కాంగ్రెస్ నేతలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల రహస్య సమావేశాలను కూడా స్వామీజీ ఏర్పాటు చేయించారట.