ఆయనో ఇండియన్ ముజాహిదీన్! | Acharya Pramod Krishnam compares PM Modi with Indian Mujahidden | Sakshi
Sakshi News home page

ఆయనో ఇండియన్ ముజాహిదీన్!

Published Fri, Nov 6 2015 1:20 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

Acharya Pramod Krishnam compares PM Modi with Indian Mujahidden

న్యూఢిల్లీ: కల్కి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు,  కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ క్రిష్ణం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో ప్రధానిని పోల్చి మరోసారి వివాదానికి తెరతీశారు. ఆచార్య ప్రమోద్ తాజా వ్యాఖ్యలతో  దేశంలో పెరుగుతున్న అసహనంపై  రేగిన వివాదం మరింత తీవ్రమవుతోంది

తీవ్ర వాద  సంస్థ ఇండియన్ ముజాహిదీన్  (ఐఎమ్) ను చూసి భారతీయులు ఎలా భయపడుతున్నారో,  మోదీని చూసి కూడా దేశ ప్రజలు అలాగే వణికిపోతున్నారని ఆయన  వ్యాఖ్యానించారు. మోదీపై దాడితోనే ఆయన సరిపెట్టలేదు. బీజేపీలోని ఇతర నేతలపైనా  ఆచార్య ప్రమోద్  విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ హీరో షారూక్‌ను పాకిస్తాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌తో పోల్చిన గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ని కూడా టార్గెట్ చేశారు. ఆయనొక మాఫియా అని వ్యాఖ్యానించారు. 

దీంతోపాటు మరో బీజేపీ నేత సాక్షి మహరాజ్ ఒక  రేపిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. శత్రుదేశం పాకిస్తాన్ ఏం కోరుకుంటోందో, దేశంలోని కొంతమంది బీజేపీ నేతలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఆచార్య ప్రమోద్ 2014  ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement