breaking news
stoked
-
రోబోటిక్‌తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ
పక్షవాతం(స్ట్రోక్)కు గురైన రోగి శరవేగంగా కోలుకునేందుకు రోబోటిక్ ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుందని హెల్త్ కేర్ ఎట్ హోమ్(హెచ్‌సీఏహెచ్) ఇండియా సహ వ్యవస్థాపకుడు ఢిల్లీకి చెందిన డాక్టర్ గౌరవ్ తుక్రాల్ అన్నారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని సోమాజిగూడలోని సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ బుధవారం ప్రారంభించింది. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఇది స్ట్రోక్ న్యూరో రిహాబిలిటేషన్‌లో కీలకమైన ముందడుగని, రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మిళితం చేయడం ద్వారా రోగులకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రికవరీని అందించగలమన్నారు. నడక సహా పలు అవయవాల కదలికలకు శిక్షణ అందించే ఈ సరికొత్త రోబోటిక్ గైటర్ పూర్తి మేడ్ ఇన్ ఇండియా కాగా రోగులు ఇప్పుడు ఎక్సోస్కెలిటన్–సహాయక నడక వ్యవస్థలను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో వెయ్యి గైడెడ్ స్టెప్స్ తీసుకోవచ్చన్నారు. హెచ్సీఏహెచ్కు చెందిన అంకిత్ గోయెల్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన.. గిన్నిస్ బుక్‌లో చోటు..) -
బంగారు గొలుసు వివాదంలో సీఎం సతీమణి
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక గురువానంద్ స్వామి ఇచ్చిన బంగారు గొలుసును స్వీకరించి ఆమె చిక్కుల్లో పడ్డారు. గురువానంద్ స్వామీ తన జుట్టులోంచి తీసి ఇచ్చిన బంగారు గొలుసును సీఎం భార్య తీసుకుంటున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేయడంతో వివాదం రాజుకుంది. మూఢనమ్మకాలను ప్రోత్సహించారంటూ, ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మహారాష్ట్ర లోని అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి అధ్యక్షుడు అవినాష్ పాటిల్ స్పందించారు. సీఎం భార్య వైఖరిని తప్పుబట్టిన ఆయన ఇది శాస్త్రీయ దృక్పథానికి వ్యతిరేకమని వాదించారు. ముఖ్యంగా చేతబడులు, తాంత్రిక విద్యలను నిషేధించిన రాష్ట్రంలో సాక్షాత్తు ప్రభుత్వాధినేత భార్యే ఇలా వ్యవహరించడం తగదన్నారు. అటు ప్రతిపక్ష ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ బ్లాక్ మ్యాజిక్ నివారణ యాక్ట్ కింద అమృతాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ ఆరోపణలను సీఎం సతీమణి అమృత ఖండించారు. తనకు అద్భుతాలు, మాయలు మీద నమ్మకం లేదన్నారు. స్వామీజీ తనను ఆశీర్వదిస్తూ గొలుసు ఇచ్చారే తప్ప వేరే ఏమీ లేదని తెలిపారు. కాగా బ్లాక్ మ్యాజిక్ లాంటి ఇతర మూఢ నమ్మకాలను నిరోధించే క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ 2013 లో ఒక బిల్ ను ఆమోదించింది. -
ఆయనో ఇండియన్ ముజాహిదీన్!
న్యూఢిల్లీ: కల్కి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ క్రిష్ణం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో ప్రధానిని పోల్చి మరోసారి వివాదానికి తెరతీశారు. ఆచార్య ప్రమోద్ తాజా వ్యాఖ్యలతో దేశంలో పెరుగుతున్న అసహనంపై రేగిన వివాదం మరింత తీవ్రమవుతోంది తీవ్ర వాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎమ్) ను చూసి భారతీయులు ఎలా భయపడుతున్నారో, మోదీని చూసి కూడా దేశ ప్రజలు అలాగే వణికిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీపై దాడితోనే ఆయన సరిపెట్టలేదు. బీజేపీలోని ఇతర నేతలపైనా ఆచార్య ప్రమోద్ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ హీరో షారూక్‌ను పాకిస్తాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌తో పోల్చిన గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ని కూడా టార్గెట్ చేశారు. ఆయనొక మాఫియా అని వ్యాఖ్యానించారు. దీంతోపాటు మరో బీజేపీ నేత సాక్షి మహరాజ్ ఒక రేపిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. శత్రుదేశం పాకిస్తాన్ ఏం కోరుకుంటోందో, దేశంలోని కొంతమంది బీజేపీ నేతలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఆచార్య ప్రమోద్ 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.


