Indian Mujahideen
-
మామూలోడుకాదు.. ఇండియా బిన్ లాడెన్!!
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్! ఇప్పుడు పోలీసుల దృష్టిలో ‘ఇండియా బిన్ లాడెన్’!! గణతంత్రదినోత్సవానికి కొద్ది రోజుల ముందు దేశరాజధానిలో సంచలన రీతితో పట్టుబడిన అబ్దుల్ సుభాన్ ఖురేషీ(46) అలియాస్ తౌఖీర్ మామూలోడుకాదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ ఘాజీపూర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్న ఖురేషీని ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. యాంటీ టెర్రరిస్టు వ్యవహారాలకు సంబంధించి ఖురేషీ అరెస్టు గొప్ప ముందడుగని పోలీసులు పేర్కొన్నారు. టెకీగా పలు కంపెనీల్లో : ఖురేషీ కుటుంబీకులు దశాబ్ధాల కిందటే ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వలసవచ్చారు. అతని విద్యాబ్యాసమంతా ముంబైలోనే సాగింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన ఖురేషీ.. పలు సంస్థల్లో ఉద్యోగాలు కూడా చేశాడు. ముంబై మతకలహాల తర్వాత ఉగ్రవాదానికి ప్రభావితులైన వ్యక్తుల్లో ఇతనూ ఒకడు. మొదట స్టుడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో చేరి క్రియాశీలకంగా పనిచేశాడు. ఆ సంస్థకు అనుబంధంగా దాడులకు పాల్పడే గ్రూపు ఒకటి 2008లో అహ్మదాబాద్‌లో వరుసపేలుళ్లకు పాల్పడింది. సాంకేతిక విషయాలపై గట్టిపట్టున్న ఖురేషీనే.. ఆ బాంబులు తయారుచేశాడని పోలీసులు చెబుతారు. నాటి ఘటనలో 56 మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖురేషీ.. అనంతరకాలంలో ‘ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం)’ ఉగ్రసంస్థ ఏర్పాటులోనూ విశేషమైన పోషించాడు. ఐఎం సహవ్యవస్థాపకుడిగా.. యువతను సమీకరించి, వారిలో జాతివ్యతిరేక భావజాలాన్ని పురిగొల్పేలా ఖురేషీ క్లాసులు తీసుకునేవాడు. విదేశాల నుంచి ఎందుకొచ్చినట్లు? : అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత చాలా కాలం కనిపించకుండా పోయిన ఖురేషీ అలియాస్ తౌఖీర్.. బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నట్లు 2004లో వెల్లడైంది. అంతకుముందు అతను నేపాల్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోనూ కొన్నాళ్లు గడిపినట్లు తెలిసింది. ఖురేషీని పట్టుకునేందుకు ప్రయత్నించిన అన్నిసార్లూ విఫలమైన భారత పోలీసులు.. ఇంటర్‌పోల్ ద్వారా అతనిపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయించారు. అతని తలపై రూ.4లక్షల బహుమతి కూడా ఉంది. ఇన్నాళ్లూ విదేశాల్లో గడిపిన ఖురేషీ.. ఏకంగా ఢిల్లీలో పట్టుబడటం సంచలనంగా మారింది. భారత్‌లో ఐఎం కార్యకలాపాలను పునఃప్రారంభించే క్రమంలోనే అతను ఇండియాకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఖురేషీ అరెస్టు నేపథ్యంలో రిపబ్లిక్‌డే వేడుకల బందోబస్తును మరింత పటిష్టంచేశారు. -
జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
-
జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులను దోషులుగా ఖరారు చేశారు. వారికి ఏ శిక్ష విధించేదీ సోమవారం (ఈనెల 19వ తేదీన) వెల్లడిస్తారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. దోషులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ ఇంతకుముందు అరెస్ట్ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. అరెస్టయిన ఐదుగురినీ ఎన్ఐఏ వర్గాలు మంగళవారం నాడు కోర్టులో హాజరుపరిచాయి. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. -
మోస్ట్‌వాంటెడ్ జాబితాలో.. ఆ ఇద్దరూ మిస్సింగ్!
⇒ యూఎన్ జాబితాలో..కనిపించని భత్కల్, షఫీ ఆర్మర్ ⇒ సిటీ పోలీసులకూ వీరు ‘బాగా కావాల్సిన వారే’ ⇒ విస్మయం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర పోలీసు వర్గాలు సాక్షి, సిటీబ్యూరో: విషవృక్షంగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని తమవంతుగా అడ్డుకోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్) సమాయత్తమవుతోంది. దీని కోసం సభ్యదేశాలకు తమకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదుల జాబితా అందించమని ఇటీవల కోరింది. భారత్ ఇచ్చిన జాబితాలో దేశానికి, నగరానికి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, ఐసిస్‌కు అనుబంధంగా అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్ పేర్లు ఆ జాబితాలో లేవని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇది నిర్లక్ష్యమా? వ్యూహంలో భాగమా? అనేది అర్థంకాక విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సిటీకీ అవే అత్యంత ప్రమాదకరం... హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ప్రస్తుతం ముప్పు ‘రెండు’రకాలుగా పొంచి ఉంది. ఇందులో ప్రధానమైనది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కాగా, రెండోది ఐసిస్. ఇటీవల ఎనిమిది నెలల కాలంలోనే హైదరాబాద్‌లో ఐసిస్‌కు చెందిన రెండు ప్రధాన మాడ్యుల్స్ చిక్కాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఎం, ఐసిస్‌కు చెందిన గజఉగ్రవాదులు రియాజ్ భత్కల్, షఫీ ఆర్మర్ పేర్లను యూఎన్‌కు ఇచ్చిన జాబితాలో చేర్చకపోవడం వెనుకా వ్యూహం దాగి ఉండచ్చని అధికారులు చెప్తున్నారు. అత్యంత రహస్య ఆపరేషన్లు చేస్తున్న సందర్భంలోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటారని అభిప్రాపడుతున్నారు. భత్కల్ ఎందరికో మోస్ట్‌వాంటెడ్... 2007 ఆగస్టు 25, 2013 ఫిబ్రవరి 21న రాజధాని నగరం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. మొదటిది గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జరగ్గా... రెండోది దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ రియాజ్ భత్కల్‌ది కీలక పాత్ర. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఇతడు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాల సృష్టించాడు. 2005 నుంచి దేశ వ్యాప్తంగా 19 పేలుళ్లకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వాంటెడ్. ప్రస్తుతం ఇతను పాకిస్థాన్‌లోని కరాచీలో తలదాచుకున్నాడు. అక్కడ నుంచే హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్న ఇతడికి ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐ భద్రత కల్పిస్తోంది. ఆర్మర్‌తో ఆషామాషీ కాదు... ఐసిస్‌కు అనుబంధంగా ఏయూటీని ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్ సైతం మామూలోడు కాదు. హైదరాబాద్‌కు సంబంధించి ఇప్పటి వరకు పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల వెనుక ఇతడే ఉన్నాడు. 2014లో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన సల్మాన్ మొయినుద్దీన్ నుంచి తాజాగా పాతబస్తీలో చిక్కిన ఇబ్రహీం యజ్దానీ మాడ్యుల్ వరకు అందరినీ ఇతడే ఆ బాటపట్టించాడు. ప్రస్తుతం సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాను చనిపోయినట్లు అనేకసార్లు వదంతులు వ్యాపించజేశాడు. నిఘా వర్గాల దృష్టి మళ్లించడానికే ఈ పంథా అనుసరించినట్లు అధికారులు చెప్తున్నారు. కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్చార్జ్గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. -
టెర్రర్ టూర్స్
- సిటీకి వచ్చి వెళ్లిన ‘ఇరువురు’ గజ ఉగ్రవాదులు - 2013లో అబు ఫైజల్‌కు చెందిన సిమి మాడ్యుల్ - 2015-16ల్లో ‘పర్యటించిన’ ఆలమ్ జెబ్ అఫ్రిది - ముష్కరుల విచారణల్లో వెలుగులోకి వాస్తవాలు సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడి ఒడిశాలోని రూర్కెలాలో చిక్కిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) గ్యాంగ్.., మోస్ట్‌వాంటెడ్‌గా ఉండి బెంగళూరులో పట్టుబడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది అఫ్రిదీల విచారణలో ‘సిటీ లింకులు’ వెలుగులోకి వస్తున్నాయి. అటు సిమి, ఇటు ఐఎం ఉగ్రవాదులు హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు అంగీకరించారు. ఒకరు ‘వ్యవహారం’ కోసం రాగా... మరొకరు ‘కోచింగ్’ కోసం వచ్చినట్లు స్పష్టమైంది. అబు ఫైజల్ నేతృత్వంలో సిమి గ్యాంగ్... రూర్కెలాలో పట్టుబడిన సిమి గ్యాంగ్ 2013లో అబు ఫైజల్ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుంది. దానికి ముందు ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అనేక దోపిడీలు, చోరీలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబైలో ఉన్న జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. సిమి మధ్యప్రదేశ్ శాఖకు ప్రెసిడెంట్‌గా పని చేసిన ఇతడు డాక్టర్‌గా చెలామణి అయ్యాడు. దోపిడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ పాల్గొన్నాడు. ఖాండ్వాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సిమి ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్, అబిద్ మీర్జాలతో ముఠా కట్టాడు. పహాడీషరీఫ్ కేంద్రంగా ‘పంపకాలు’... పోలీసులకు చిక్కి ఖాండ్వా జైలుకు చేరడానికి ముందు నేరాల ద్వారా సంపాదించిన సొమ్మును వివిధ ఉగ్రవాద సంబంధ కేసుల్లో అరెస్టయి జైళ్లల్లో ఉన్న, ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు అందించడం తదితర కార్యకలాపాలు సాగించారు. ఇందులో భాగంగానే 2005-07 మధ్య ఈ ముఠా హైదరాబాద్‌కు చేరుకుంది. పహాడీషరీఫ్‌లో ఉన్న ఓ డెన్‌లో షెల్టర్ ఏర్పాటు చేసుకుని దాదాపు 20 రోజుల పాటు గడిపింది. ఈ సమయంలోనే నగరంలో ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ‘జిహాదీ భావజాలాన్ని’ ప్రచారం చేయడానికి ప్రయత్నించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ కాయిదాకు చెందిన కీలక నేత అన్వర్ అల్ అవల్కీ రాసిన ‘44 వేస్ టు సపోర్ట్ జిహాద్’ అనే పుస్తకాన్ని సేకరించింది. దీన్ని స్థానిక భాషల్లోకి అనువదించి పంపకాలు చేపట్టింది. ఉర్దూలో ముద్రించిన ప్రతిని పహాడీషరీఫ్ కేంద్రంగా నగరంలో పంపిణీ చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఖాండ్వా ఎస్కేప్ తర్వాత ఫైజల్, అబిద్ వెంటనే పోలీసులకు చిక్కగా... ఎజాజ్, అస్లంలు గతేడాది నల్లగొండ జిల్లాలో ఎన్కౌంటర్ అయ్యారు. మిగిలిన వారితో జట్టు కట్టిన సాలఖ్ సహా నలుగురు రూర్కెలాలో పట్టుబడ్డారు. అఫ్రిది... ఐఎం టు జునూద్... గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపురాకు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాదబాటపట్టాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించాడు. పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరులోని దొడ్డనాగమంగళంలోని వినాయకనగర్‌లో మారు పేరుతో తలదాచుకున్నాడు. ఇక్కడ కొన్ని విద్రోహక చర్యలు చేయడం, సీసీ కెమెరా ఫుటేజ్‌లు బయటకు రావడంతో మళ్లీ పోలీసుల భయం పెరిగింది. దీంతో సిరియా కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నెరపుతున్న షఫీ ఆర్మర్‌ను సంప్రదించిన అఫ్రిది తానూ సిరియా వచ్చేస్తానన్నాడు. దీంతో కొత్తగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ విషయం ఇతడికి చెప్పిన షఫీ... హైదరాబాద్ వెళ్లి ఆ మాడ్యుల్‌కు సహకరించమని ఆదేశించాడు. రెండుసార్లు నగరానికి ‘టూర్’.... దీంతో సోషల్ మీడియా ద్వారా నగరానికి చెందిన నఫీస్ ఖాన్‌ను సంప్రదించిన అఫ్రిది గతేడాది టోలిచౌకి వచ్చి అతడిని కలిసి వెళ్లాడు. ఆ సమయంలో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్తో పాటు శిక్షణ, లావాదేవీలు తదితర అంశాలను చర్చించాడు. విధ్వంసాలకు అవసరమైన బాంబుల్ని తయారు చేసే ప్రయత్నాల్లో భాగంగా నఫీస్ ఖాన్ ‘స్థానిక పదార్థాల’తోనే నాలుగు బకెట్ బాంబుల్ని రూపొందించాడు. ఇవి పేలడానికి అవసరమైన డిటోనేటర్లును తయారు చేయడం మాత్రం ఇతడి వల్లకాలేదు. దీంతో నఫీస్ బాంబుల తయారీలో నిష్ణాతుడైన అఫ్రిదీ సహాయం కోరాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో మరోసారి హైదరాబాద్ వచ్చిన అఫ్రిది... రసాయనాలు వినియోగించి డిటోనేటర్లు ఎలా తయారు చేయాలనేది ‘బోధించి’ వెళ్లాడు. ఈ ప్రయత్నాలు కార్యరూపంలోకి రాకముందే ‘జునూద్’ మాడ్యుల్‌తో పాటు అఫ్రిది సైతం చిక్కడంతో భారీ ముప్పు తప్పినట్లైంది. -
‘దిల్సుఖ్నగర్’ ఉగ్రవాదులకు ఢిల్లీలో ‘విముక్తి’
తెహసీన్, వఖాస్‌లపై అక్కడి కుట్ర కేసు నమోదు ఆధారాలు లేవంటూ డిశ్చార్జ్ చేసిన న్యాయస్థానం మిగిలిన నిందితుల్లో సయ్యద్ మగ్బూల్ సైతం మానవబాంబు దాడులకు కుట్రపై 2012లో కేసు సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా మానవ బాంబులతో దాడులకు కుట్ర పన్నిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లకు ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించింది. వీరిద్దరూ 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ కుట్ర కేసులో హైదరాబాద్‌లో పట్టుబడిన సయ్యద్ మక్బూల్ సైతం ఉండటం గమనార్హం. ఐఎం కో-ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ 2012లోనూ సిటీలో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని, ఏకంగా మానవ బాంబులతో మూడు జనసమ్మర్ధ ప్రాంతాల్లో విరుచుకుపడాలని పథకం వేశారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని షాహిన్‌నగర్‌లో నివసించిన సయ్యద్ మక్బూల్ ఈ కుట్రలో ప్రధాన భాగస్వామిగా ఉన్నాడని తేల్చారు. దీపావళి టపాసులుల్లో ఉండే మందు, డీజిల్, యూరియాలతో అత్యాధునికమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)లు తయారు చేయడానికి పథకం సిద్ధం చేసుకున్నట్లు తేల్చారు. 2012 అక్టోబర్ 26న నమోదు చేసిన కేసులో వీరి టార్గెట్‌లో హైదరాబాద్‌తో పాటు బీహార్‌లోని బుద్ధగయ ప్రాంతం కూడా ఉన్నాయని స్పెషల్ సెల్ పేర్కొంది. మక్బూల్ మరో ఉగ్రవాదైన ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 2012లో హైదరాబాద్ వచ్చి, ద్విచక్ర వాహనంపై జనసమర్థ ప్రాంతాలైన దిల్సుఖ్నగర్, బేగంబజార్, అబిడ్స్ ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో మక్బూల్, ఇమ్రాన్ సహా మరికొందరు అప్పుడే అరెస్టు కాగా... మిగిలిన వారిలో పరారీలో ఉన్న నిందితులైన తెహసీన్ అక్తర్, వఖాస్‌లు 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లకు అవసరమైన బాంబుల తయారు చేసిన, 107 బస్టాప్‌లో విధ్వంసానికి కారణమైన వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2014 మార్చి 22న పట్టుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు అవసరమైన సైకిళ్లను మలక్‌పేట్, జుమ్మేరాత్ బజార్‌ల్లో కొనుగోలు చేసిన... ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద పేలిన సైకిల్ బాంబును అక్కడ పెట్టిన తెహసీన్ సైతం అదే నెల 25న పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. దీంతో ఢిల్లీలో నమోదైన మానవ బాంబుల కుట్ర.. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్లు సహా అనేక కేసుల్లో వీరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో యాసీన్ భత్కల్‌తో పాటు తెహసీన్, వఖాస్... తీహర్ జైల్లో ఉన్న మక్బూల్, ఇమ్రాన్ తదితరులపై ఢిల్లీ స్పెషల్ సెల్ గత వారంలో అభియోగాలు మోపుతూ అక్కడి కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే తెహసీన్, వఖాస్‌లపై సరైన ఆధారాలు లేవంటూ న్యాయస్థానం శుక్రవారం వీరిద్దరినీ డిశ్చార్జ్ చేసింది. మిగిలిన వారిపై ఈ నెల 28 నుంచి విచారణ చేపట్టనుంది. -
విచ్చలవిడి విధ్వంసాలకు ‘జునూద్’ కుట్ర
♦ ఆత్మాహుతి దాడులు.. వాహనాల ద్వారా పేలుళ్లకు పథకం ♦ బెంగాల్ నుంచి ఆయుధాలు.. పక్కా వ్యూహం సిద్ధం చేసిన అఫ్రిదీ ♦ ఎన్ఐఏ బృందాల దర్యాప్తులో వెలుగులోకి.. సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ దేశవ్యాప్తంగా విచ్చలవిడి విధ్వంసాలకు కుట్ర పన్నింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడటం.. ఎంపిక చేసుకున్న ప్రముఖులను హతమార్చడంతో పాటు వాహనాల్లో బాంబులు పెట్టి పేల్చడం ద్వారా భారీ విధ్వంసాలకు పథకం రచించింది. బెంగళూరులో పట్టుబడిన ఆలమ్ జబ్ అఫ్రిదీ నేతృత్వంలో అమలు చేసేందుకు సిద్ధమైన ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇన్వెస్టిగేషన్, నిందితుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)లో పనిచేసిన అఫ్రిదీ.. ప్రస్తుతం సిరియా కేంద్రంగా పనిచేస్తున్న షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు ‘జునూద్’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జునూద్ మాడ్యూల్‌కు సంబంధించి హైదరాబాద్‌లో నలుగురు అరెస్టు అయిన విషయం విదితమే. తుమ్కూర్లో ఫిదాయీన్ల కోసం.. కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా వ్యవహారాలు సాగించిన అఫ్రిదీ భారీ విధ్వంసాలతో పాటు సంచలనాలు సృష్టించడం ద్వారా ‘జునూద్’కు ప్రాచుర్యం సంపాదించాలని భావించాడు. షఫీ సూచనల మేరకు ఒకే సమయంలో ఎక్కువచోట్ల మానవబాంబు దాడులు (ఫిదాయీన్ ఎటాక్స్) చేయించాలని నిర్ణయించాడు. ఈ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా రెండుసార్లు ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లి వచ్చిన అఫ్రిదీ.. అక్కడున్న అల్‌కాయిదా క్యాడర్‌ను కలిశాడు. ఫిదాయీన్ల ఎంపిక, శిక్షణ తదితర అంశాలను వారి నుంచి తెలుసుకున్నాడు. కర్ణాటకలోని తుమ్కూర్లో ఉన్న ‘జునూద్’ మాడ్యూల్‌కు చెందిన వారినే మానవబాంబులుగా మార్చాలని నిర్ణయించుకుని రెండుసార్లు అక్కడకు వెళ్లి వచ్చాడని ఎన్ఐఏ గుర్తించింది. అక్కడ ఎవరెవరిని కలిశాడనే అంశాలపై ఆరా తీస్తోంది. మిలిటరీ వాహనాలతో పేలుళ్లు.. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వారిని టార్గెట్ చేసుకున్న ‘జునూద్’ మాడ్యూల్.. ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నింది. మిలిటరీ వాహనాలను తస్కరించి, వాటిలో భారీగా పేలుడు పదార్థాలు, బాంబుల్ని పెట్టి విధ్వంసం సృష్టించాలని పథకం వేసింది. మహారాష్ట్ర, గోవాల్లో ఈ కుట్రను అమలు చేయాలని భావించింది. మిలిటరీ వాహనాలను, ఆ తరహాలో ఉన్న ఇతర వాహనాలను చోరీ చేయడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న కొందరు వాహనచోరులతోనూ అఫ్రిదీ, మరికొందరు సంప్రదింపులు జరిపారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మిలిటరీ వాహనాలపై నిఘా తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో వీటిని ఎంపిక చేసుకున్నారు. ఈ వ్యవహారాలను చక్కబెట్టడానికి గోవాలో రూ. 1.5 లక్షలతో అద్దెకు ఓ ఇంటినీ ఎంపిక చేసుకున్నారని తెలిసింది. గత నెల్లో దేశవ్యాప్తంగా చిక్కిన 14 మందిలో ఉన్న మొహిసిన్ సయీద్, ఖాలిద్ ఈ వ్యవహారాలను పర్యవేక్షించారని తేలింది. వెపన్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్..: టార్గెట్ చేసుకున్న ప్రముఖుల్ని కాల్చిచంపడం ద్వారా భయానక వాతావరణం సృష్టించేందుకు ‘జునూద్’ మాడ్యూల్ సిద్ధమైంది. దీని కోసం తుపాకులు, తూటాలను పశ్చిమ బెంగాల్లో ఖరీదు చేయాలని భావించింది. ఈ బాధ్యతల్ని అఫ్రిదీ హైదరాబాద్‌లో చిక్కిన నలుగురిలో ఒకడైన నఫీజ్ ఖాన్‌కు అప్పగించాడు. ఆయుధాల సమీకరణ కోసం మాడ్యూల్ చీఫ్‌గా ఉన్న ముంబై వాసి ముదబ్బీర్ నుంచి హవాలా ద్వారా రూ. 2 లక్షల వరకు అందుకున్న నఫీజ్ పలుమార్లు బెంగాల్‌కు వెళ్లివచ్చాడు. బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న అక్రమ ఆయుధ వ్యాపారులతో సంప్రదింపులు జరిపాడు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) మాడ్యూల్‌ను సంప్రదించడానికి నఫీజ్ ప్రయత్నాలు చేసినట్లు అధికారులు ఆధారాలను సేకరించారు. -
అశ్లీలంలో ఐడీల గుట్టు!
* ‘స్టఫ్ మై స్టాకింగ్స్’ పుస్తకం ఆధారంగా మెయిల్ ఐడీల సృష్టి * నిఘా వర్గాలకు చిక్కకుండా రూపొందించిన ఐఎం ఉగ్రవాదులు * పుస్తకం వివరాలను ఎట్టకేలకు గుర్తించిన దర్యాప్తు అధికారులు సాక్షి, సిటీబ్యూరో: దిల్సుఖ్నగర్ లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు సమాచారమార్పిడికి వినియోగించిన ఐడీలను అశ్లీల సాహిత్య పుస్తకం ఆధారంగానే సృష్టించినట్లు తేలింది. దాదాపు ఏడాదికి పైగా ఈ పుస్తకం పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఎట్టకేలకు అది ‘స్టఫ్ మై స్టాకింగ్’గా గుర్తించాయి. పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించాడు. ఈ బాధ్యతల్ని తన సోదరుడు యాసీన్ భత్కల్‌కు అప్పగించాడు. ఆపరేషన్ పూర్తి చేసేందుకు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహమాన్ అలియాస్ వఖాస్‌లను రంగంలోకి దింపాడు. సమాచారమార్పిడికి ఫోన్లపై ఆధారపడితే తేలిగ్గా నిఘా వర్గాలకు దొరికే ప్రమాదం ఉందని వాటికి పూర్తి దూరంగా ఉన్నారు. కేవలం ఈ-మెయిల్‌తో పాటు నింబస్, పాల్‌టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని రియాజ్ సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో తన మెయిల్ ఐడీ నుంచి మిగతా వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మెట్లో ఉన్న ఓ పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తూ సమాచారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకోవాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నెంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలి. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉన్న నేపథ్యంలో ఎవరి ఐడీ ఏమిటి? అనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. ఎక్కువగా సంప్రదింపులు జరిపిన వారు ఎక్కువ ఐడీలు, తక్కువగా జరిగిన వారు తక్కువ ఐడీలు సృష్టించుకున్నారు. 2013లో యాసీన్ భత్కల్ సహా మిగిలిన ఉగ్రవాదులు అరెస్టయినప్పుడు ఓ పుస్తకం ఆధారంగా ఐడీలు సృష్టించినట్టు బయటపడింది. అయితే అది ఏ పుస్తకం అనేది ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో అనేక కోణాల్లో లోతుగా అధ్యయనం చేసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఆ పుస్తకం ఇంటర్నెట్లో లభిస్తున్న ‘స్టఫ్ మై స్టాకింగ్స్’గా గుర్తించాయి. ఎవరు, ఏ ఐడీలు వాడారంటే..? .... రియాజ్ భత్కల్ (సూత్రధారి): lovesam361@yahoo.com, patarasingh@yahoo.com, coolallz@yahoo.com, dumzum@paltalk.com. యాసీన్ భత్కల్ (కీలక పాత్రధారి): halwa.wala@yahoo.com, jankarko@yahoo.com, a.haddad29@yahoo.co, hbhaddur@yahoo.com, khalid.k@Nimbuzz.com హడ్డీ (సహాయ సహకారాలు అందించాడు): khalid.k@Nimbuzz, spentthose11@yahoo.com, tashan99@paltalk.com, spentthose@nimbuzz.com మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టాడు): laho0@yahoo.com వఖాస్ (107 బస్టాప్ వద్ద బాంబు పెట్టాడు): Ubhot4u@yahoo.com వీరు వాడిన ఇతర ఐడీలు: Jamesusually10, menothing1, davidthapa77, menothing1 (ఇవన్నీ నింబస్‌లో), kul.chitra@yahoo.com, muthumamu80@yahoo.com, jankarko@yahoo.com -
ఆయనో ఇండియన్ ముజాహిదీన్!
న్యూఢిల్లీ: కల్కి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ క్రిష్ణం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో ప్రధానిని పోల్చి మరోసారి వివాదానికి తెరతీశారు. ఆచార్య ప్రమోద్ తాజా వ్యాఖ్యలతో దేశంలో పెరుగుతున్న అసహనంపై రేగిన వివాదం మరింత తీవ్రమవుతోంది తీవ్ర వాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎమ్) ను చూసి భారతీయులు ఎలా భయపడుతున్నారో, మోదీని చూసి కూడా దేశ ప్రజలు అలాగే వణికిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీపై దాడితోనే ఆయన సరిపెట్టలేదు. బీజేపీలోని ఇతర నేతలపైనా ఆచార్య ప్రమోద్ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ హీరో షారూక్‌ను పాకిస్తాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌తో పోల్చిన గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ని కూడా టార్గెట్ చేశారు. ఆయనొక మాఫియా అని వ్యాఖ్యానించారు. దీంతోపాటు మరో బీజేపీ నేత సాక్షి మహరాజ్ ఒక రేపిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. శత్రుదేశం పాకిస్తాన్ ఏం కోరుకుంటోందో, దేశంలోని కొంతమంది బీజేపీ నేతలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఆచార్య ప్రమోద్ 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. -
కలకలం రేపుతున్న యాసిన్ భత్కల్
తాజాగా మరోసారి లేఖ విసిరిన యాసిన్ హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్భత్కల్ కలకలం రేపుతున్నాడు. బాంబు పేలుళ్ల కేసులో ట్రయల్స్ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి హాజరైనప్పుడల్లా ఏదో ఒకరకమైన చర్యలతో పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా మంగళవారం కోర్టు విచారణకు హాజరైన భత్కల్ ఒక లేఖను విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈసారి విసిరిన లేఖలో తనకు జైల్లో తగిన సదుపాయాలు కల్పించాలని న్యాయమూర్తిని కోరిన ట్లు సమాచారం. ఇప్పటికే భత్కల్ పరారీకి పలు ఉగ్రవాద సంస్థలు కుట్ర చేస్తున్నాయనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ నెల 6న కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఒక లేఖ విసిరేశాడు. తనకు తగిన భద్రత కల్పించాలని అందులో విన్నవించాడు. రెండోసారి పువ్వును ప్రదర్శించిన అతడు తాజాగా మరోసారి లేఖ విసిరేశాడు. అయితే భత్కల్ ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నాడనే దానిపై పోలీసులు, నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. -
'ఐఎం అనేది ఉగ్రవాద సంస్థ కాదు'
పనాజీ: ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) అనేది ఉగ్రవాద సంస్థ కాదని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ సెల్ చైర్మన్ ఖుర్షిద్ అహ్మద్ సయ్యద్ వ్యాఖ్యానించారు. భారత్ , అమెరికాల్లో ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎంకు మత పరమైన అభిమానం మాత్రమే ఉందని.. కానీ ఆ సంస్థ ఎప్పుడూ ఉగ్రవాద చర్యలకు పాల్పడలేదని ఖుర్షిద్ అహ్మద్ తెలిపారు. గోవా కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం విలేకర్లతో మాట్లాడిన ఖుర్షిద్.. మిగతా దేశాల్లో ముస్లిం టెర్రిరిస్టులు ఉండవచ్చు కానీ భారత్ కు చెందిన ముస్లింలు ఎప్పుడూ ఉగ్రవాద చర్యల్లో పాల్గొనలేదని తెలిపారు. ఈ విషయంలో తాను మాత్రం చాలా కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నానన్నారు. అయితే గతంలో ఐఎం పేరుతో జరిగిన ఉగ్రవాద చర్యలపై విలేకర్లు ప్రశ్నించగా.. దేశంలో గందరగోళ పరిస్థితులు స్పష్టించటానికి వేరే సంస్థలు ఆ చర్యలకు పాల్పడి ఉండవచ్చని ఖుర్షిద్ పేర్కొన్నారు. -
‘సమాచారం’ కోసం ఉగ్రవాది పోరాటం!
హైదరాబాద్: కర్ణాటకలోని ఉల్లాల్ పోలీ సులు తనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం అందించలేదంటూ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి పోరాటం ప్రారంభిం చాడు. ప్రస్తుతం ముంబైలోని ఆథర్ రోడ్ జైల్లో ఉన్న ఇతడు బెంగళూరులో ఉన్న కర్ణాటక రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ ల్లో చోటు చేసుకున్న పేలుళ్ల కేసులో ఇతడు నిం దితుడిగా ఉన్నాడు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన అక్బర్ వృత్తిరీత్యా కంప్యూటర్ మెకానిక్. మంగుళూరు నుంచి పుణే మీదుగా అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు 2008లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగుళూరులో ఉన్న ఉల్లాల్ పోలీసుస్టేషన్లో ఇతడిపై ఓ కేసు నమోదు చేశా రు. దీనిపై పురోగతి లేకపోవడంతో గత ఏడాది ఫిబ్రవరి 28న సమాచార హక్కు చట్టం కింద కేసు వివరాలు కోరుతూ ఉల్లాల్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం కింద తనపై ఉల్లాల్ పోలీసులు నమోదు చేసిన కేసు సమాచారం అందించాల్సిందిగా కోరాడు. దీనిపై 30 రోజుల్లో సమాచారం అం దించాలని పోలీసుల్ని కమిషన్ ఆదేశించింది. -
ముజాహిద్దీన్, అల్‌ఖైదా ప్రసంగాలను కూడా...
హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసరాన్ని దురదర్శన్ ప్రసారం చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోహన్ భగవత్ ప్రసంగాన్ని డీడీలో ఎలా ప్రసారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని సమాచార శాఖమంత్రి సమర్థించటం సరికాదని వీహెచ్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్, అల్‌ఖైదా నేతల ప్రసంగాలను కూడా డీడీలో ప్రసారం చేయాలంటే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకుంటున్నారా లేక విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా అని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా మోడీ సర్కార్ వ్యవహరించటం సరికాదని ఆయన అన్నారు. -
ముష్కరులపై మూడో చార్జ్‌షీట్
మానవ బాంబులతో దాడి కేసులో ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు కీలక నిందితులుగా రియాజ్, తెహసీన్ పేర్లు కేసులో ఇద్దరు హైదరాబాదీలు కూడా.. హైదరాబాద్: మానవబాంబులతో హైదరాబాద్ నగరంలోని మూడు ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం మూడో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్‌లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన అభియోగపత్రాల్లో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్, ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్ (ఈ ముగ్గురూ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులు)లతో సహా మొత్తం ఇరవై మందిపై మోపింది. ప్రభుత్వంపై యుద్ధానికి తెగబడటం, ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నడం, నిషిద్ధ ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం, యువతను ఆకర్షించి ఉగ్రవాదబాట పట్టించడం వంటి నేరాల కింద నిందితులు శిక్షార్హులని స్పష్టం చేసింది. ఇదే కేసుకు (ఆర్సీ నం-06/2012/ఎన్ఐఏ/డీఎల్ఐ) సంబంధించి గతేడాది జూలై 17న ఎన్ఐఏ దాఖలు చేసిన మొదటి చార్జ్‌షీట్‌లో హైదరాబాద్‌లోని పాతబస్తీ గుల్షన్ ఇక్బాల్కాలనీకి చెందిన ఒబేద్-ఉర్-రెహ్మాన్, షాహిన్నగర్కు చెందిన సయ్యద్ మగ్బూల్ అలియాస్ జుబేర్‌లతో పాటు బీహార్ వాసులు డానిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్ ఖాన్లు నిందితులుగా ఉన్నారు. వీరి వాంగ్మూలాల మేరకు అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పేలుడు పదార్థాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ హైదరాబాద్ విభాగం మగ్బూల్, ఇమ్రాన్‌లను పీటీ వారంట్‌పై తీసుకువచ్చి విచారించింది. ఆర్సీ నెం-06/2012 కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన ఐఎం ఫౌండర్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.ఢిల్లీ పోలీసులు 2012 అక్టోబర్‌లో ఈ కుట్రను ఛేదించి నలుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. ఆ తరువాత కేసు దర్యాప్తు బాధ్యతల్ని జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. మూడో చార్జ్‌షీట్‌తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 మంది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. వీరిలో ఐఎం వ్యవస్థాపకుడు, 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లలో నిందితుడిగా ఉన్న అమీర్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. ఇదీ ఉగ్రవాదుల కుట్ర... రియాజ్ భత్కల్ దేశ వ్యాప్తంగా మరోసారి మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నాడు. మానవబాంబులతో వివిధ నగరాల్లో ఉన్న జనసమ్మర్ధ ప్రాంతాల్లో విరుచుకుపడాలని పథకం వేశాడు. వీరి టార్గెట్‌లో హైదరాబాద్‌తో పాటు బీహార్‌లోని బుద్ధగయ ప్రాంతం కూడా ఉంది. గతానికి భిన్నంగా మానవబాంబుల్ని తయారు చేసి దాడులు చేయాలని నిర్ణయించిన రియాజ్ దీపావళి టపాసుల్లో వాడే మందు, వ్యవసాయానికి వినియోగించే యూరియా, డీజిల్‌లతో అత్యాధునికమైనవి తయారు చేయించాలని నిర్ణయించాడు. బాంబుల తయారీలో ప్రమేయం ఉన్న మగ్బూల్కు వీటి తయారీ బాధ్యతలు అప్పగించాడు. ఔరంగాబాద్ శివార్లలో అసద్ ఖాన్‌కు ఉన్న ఫామ్‌హౌస్‌లో మగ్బూల్ కొన్ని ట్రయల్స్ కూడా పూర్తి చేశాడు. ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 2011లో హైదరాబాద్ వచ్చి దిల్సుఖ్నగర్, బేగంబజార్, అబిడ్స్‌ల్లో రెక్కీలు నిర్వహించాడు. దిల్సుఖ్నగర్ టార్గెట్ అని 2012లో మగ్బూల్, ఇమ్రాన్ తదితరుల అరెస్టు సందర్భంలో బయటపడినా 2013 ఫిబ్రవరి 21 నాటి జంట పేలుళ్లను ఆపలేకపోయారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. -
అల్కాయిదాలోకి ఐఎం కీలక క్యాడర్
హైదరాబాద్: హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)లో విభేదాలు వచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దీని మాస్టర్‌మైండ్ ఇక్బాల్ భత్కల్‌తో తలెత్తిన వివాదాల నేపథ్యంలో మరో కీలక ఉగ్రవాది మీర్జా సాజిద్ బేగ్ అలియాస్ బడా సాజిద్ అల్‌కాయిదాలో చేరినట్లు కీలక ఆధారాలు సేకరించాయి. భారత్‌తో పాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ‘ఖైదత్-అల్-జిహాద్’ పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అల్‌కాయిదా చీఫ్ అల్ జవహరి ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2007లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇక్బాల్ భత్కల్ సైబర్ టైరిజంతో వ్యవస్థల్ని అతలాకుతలం చేయాలని యత్నించాడు. ప్రస్తుతం ఇతనితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అజామ్ఘడ్కు చెందిన బడా సాజిద్ సైతం పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నాడు. ఇక్బాల్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఐఎం నుంచి బయటకు వచ్చిన సాజిద్ ప్రత్యేకంగా మరో గ్రూప్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘ఖైదత్-అల్-జిహాద్’ ఏర్పాటుపై అల్‌జవహరి చేసిన ప్రకటనతో అల్‌కాయిదాలో చేరినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతని వెంట అజామ్‌ఘడ్ మాడ్యుల్‌కు చెందిన మరికొందరు ఉగ్రవాదులు అల్‌కాయిదా వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అల్‌కాయిదా కన్ను భారత్‌పై ఉండడం, ఐఎంకు ఇక్కడ పట్టు ఉండటంతో ఈ పరిణామం ఆందోళనకరమని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
ఢిల్లీలో దాడులకు ఐఎం కుట్ర!
న్యూఢిల్లీ: రానున్న పండుగ రోజుల్లో ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ప్రణాళికలు వేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహారన్పూర్లో అరెస్టయిన ఐఎం ఉగ్రవాది అజీజ్ షేక్ వెల్లడించిన సమాచారం మేరకు ఆ అభిప్రాయానికి వచ్చారు. గత ఏడాది ఐఎం నేత యాసిన్భత్కల్ అరెస్ట్ అనంతరం అజీజ్ నేపాల్ పారిపోయాడు. ఇటీవల రియాజ్‌భత్కల్, మొహ్సిన్ల నుంచి ఢిల్లీ వెళ్లాలని షేక్‌కు ఆదేశాలందాయి. నేరుగా కాకుండా, లక్నో, మొరాదాబాద్, సహారన్పూర్ల మీదుగా వెళ్లాలని షేక్‌కు చెప్పారు. ఆ మార్గంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో దాడుల కోసం స్లీపర్ సెల్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూర్చేందుకే షేక్ ఢిల్లీ వెళ్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఫేస్బుక్ లో భత్కల్: పోలీసులు
న్యూఢిల్లీ: తీవ్రవాదులు పరస్పరం సందేశాలు పంపుకునేందుకు సామాజిక సంబంధాల వెబ్సైట్లు వినియోగిస్తున్నారా. అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులు - ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఇతర ఇ-మెయిల్ చాటింగ్ వెబ్సైట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తాను అమలుచేయాలనున్న దాడులు గురించి ఇంటర్నెట్ ద్వారా సహచరులకు తెలిపేవాడని పోలీసులు పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఐఎం తీవ్రవాదులు నిమ్బజ్, యాహు, పాల్‌టాక్, జీమెయిల్, ఫేస్బుక్ ఐడీలు కలిగివున్నారని పోలీసులు గుర్తించారు. ఓ అక్రమ ఆయుధ కర్మాగారం ఏర్పాటు వెనుక కూడా వీరి ప్రమేయం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. -
ఐఎం ఖాతాలో రూ.200 కోట్లు
* ఆధారాలు సేకరించిన నిఘా వర్గాలు * ఈ పరిణామం మంచిది కాదంటున్న అధికారులు * అల్ కాయిదాతో పోటీ.. దందాలు, ఆయుధాల విక్రయం, బ్లాక్‌మెయిల్‌తో నిధుల సమీకరణ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంపై రెండుసార్లు పంజా విసిరి, 4 బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వద్ద ప్రస్తుతం రూ.200 కోట్ల నిధులు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దేశ వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్న ఈ ముష్కరులు అంతర్జాతీయ సంస్థ అల్‌కాయిదాను ఆదర్శంగా తీసుకుని నిధులు సమీకరింస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. 2012లో ఐఎం రూ.45 కోట్లు సమీకరించగా.. 2014 జూన్ నాటికి ఈ మొత్తం రూ.200 కోట్లకు పెరిగిందని చెప్పడానికి అవసరమైన ఆధారాలనూ కేంద్ర నిఘా వర్గాలు సేకరించాయి. దేశంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఉగ్రవాద సంస్థ వద్ద ఈ స్థాయిలో నిధులుండడం ఆందోళన కలిగించే అంశమని హెచ్చరిస్తున్నాయి. - కోల్‌కతాకు చెందిన అమీర్ రజా ఖాన్ స్థాపించిన ఐఎం ఒకప్పుడు కేవలం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా(ఎల్ఈటీ) నుంచి వచ్చే నిధులే ఆధారంగా పని చేసింది. - ఐఎం కార్యకలాపాలు.. భత్కల్ బ్రదర్స్‌గా పిలిచే రియాజ్, ఇక్బాల్ చేతుల్లోకి వెళ్లిన తరవాత సొంత నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. 2000లో కోల్‌కతాకు చెందిన రాయ్బర్మన్ను బెదిరించి రూ. 3.5 కోట్లు తీసుకున్న ఉగ్రవాదులు.. అప్పటి నుంచి ఇలాంటి పంథానే అనుసరిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. - దేశంలో దుశ్చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా కొంతకాలం నిధుల సమీకరణకు బ్రేక్ వేస్తున్న ఐఎం ముష్కరులు.. ఆపై ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ తన ఖజానాను నింపుకుంటున్నారు. - కొన్నేళ్ల క్రితం ఉత్తరాది రాష్ట్రాల్లో కిడ్నాప్‌లకూ పథక రచన చేసిన ఐఎం ఉగ్రవాదులు అవి అంత శ్రేయస్కరం కాదని భావించి వెనక్కు తగ్గినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవనే ఉద్దేశంతో ఈ దందానే కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. - గడిచిన కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబైల్లోని బడా హోటళ్ల యజమానుల్ని బెదిరించడం ద్వారానే ఏకంగా రూ.18 కోట్లు వసూలు చేసినట్టు ఆధారాలు సేకరించారు. అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించి ఫోన్లు చేస్తుండటంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆధీనంలో ఉన్న ఈ కేసులూ కొలిక్కిరావట్లేదు. - దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు నిధుల సమీకరణకూ ఐఎం ఉగ్రవాదులు నకిలీ కరెన్సీని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పాక్‌లో ముద్రితమై, బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి వస్తున్న ఈ కరెన్సీని మార్చడంద్వారా రూ.50 కోట్లకు పైగా ఆర్జించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. - బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్లోనూ అక్రమ ఆయుధాల విక్రయాలను చేపట్టిన ఐఎం.. ఈ వ్యాపారంలో రూ.40 కోట్ల వరకు సమీకరించినట్లు గుర్తించారు. ఉత్తరాదిలో కొన్ని దోపిడీలు, దొంగతనాలకు పాల్పడి మరో రూ.8 కోట్ల వరకు తమ ఖాతాల్లో వేసుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. - ఆయా అంశాలను రాష్ట్ర పోలీసు విభాగాలకు చేరవేసిన నిఘా వర్గాలు.. ఇకపై చోటు చేసుకునే భారీ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించాయి. గతంలో చోటు చేసుకుని, ఇప్పటికీ కొలిక్కిరాని, ఎలాంటి ఆధారాలూ లేని కేసుల దర్యాప్తు వేగాన్ని పెంచాలని స్పష్టం చేశాయి. -
దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు హై అలర్ట్
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని విమానాశ్రయాలకు బాంబు దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. కారు బాంబులతో తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందంటూ దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలపై దాడులకు పాల్పడతామని ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ముంబయి కమిషనర్‌కు లేఖ రాసింది. భారత్ లోని ముఖ్యప్రాంతాల్లో, మెట్రో నగరాల్లో బాంబులతో విధ్వంసం సృష్టిస్తామంటూ ఆ లేఖలో పేర్కొంది. ఇండియన్ ముజాహిద్దీన్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అన్ని విమానాశ్రయల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అనువణువూ సోదాలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో రోజుల కొద్దీ పార్క్ చేసిన వాహనాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్ట్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పట్లను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ష్కరే తోయిబా కు చెందిన ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అరెస్టు చేసిన ఇద్దరు యువకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. లష్కరే తోయిబాలో యువత చేరేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని భావిస్తున్న అబ్దుల్ సుభాన్ ను అరెస్టు చేశారు. ఢిల్లీలోని సరాయి కాలేఖాన్ బస్ స్టాండ్ వద్ద వలపన్ని పట్టుకున్నారు. -
పేలుడుకు బాధ్యులెవరు?
పింప్రి, న్యూస్‌లైన్: ఫరస్కానా పోలీస్ స్టేషన్ వద్ద గురువారం జరిగిన బాంబు పేలుడుకు కారణం ఎవరనే విషయమై స్పష్టత రావడం లేదు. దగుడుసేఠ్ హల్వాయి గణపతి దేవాలయం తీవ్రదాడుల హిట్‌లిస్టులో ఉన్నప్పటికీ, తాజా బాంబు పేలుడు అంత తీవ్రమైనది కాకపోవడంతో దీనికి బాధ్యులెవరే దానిపై స్పష్టత కొరవడింది. ఈ పేలుడు కేవలం ఒకరిని లక్ష్యంగా చేసుకుని జరిపారా అన్న సందేహాలూ కలుగుతున్నాయి. పుణే నగర క్రైంబ్రాంచ్‌లో పని చేస్తున్న ఒక పోలీసు అధికారి నక్సల్ హిట్ లిస్టులో ఉన్నారు. ఈ అధికారి గురువారం దగుడుసేఠ్ గణపతి ఆలయ దర్శనానికి వెళ్లే ముందు తన మోటార్ సైకిల్‌ను ఫరస్కానా పోలీసు స్టేషన్ ఆవరణంలో పెట్టారు. ఆయనకు భద్రతగా స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బందితోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. సదరు అధికారి ఆలయం నుంచి వెళ్లిపోయిన వెంటనే ఈ పేలుడు జరగడంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడుకు ఉపయోగించిన వాహనం పోలీసుదే పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ సాతారాలో పనిచేసే కానిస్టేబుల్ దాదా బాబురావుదని గుర్తించారు. అయితే ఈ బైకు సాతారా కోర్టు వద్ద గత నెల 25న చోరీ అయింది. దీనిని దొంగిలించిన వారిని గుర్తించేందుకు సాతారా-పుణే ప్రాంతాల మధ్య ఉన్న టోల్‌నాకాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల వీడియోలను పరిశీలిస్తున్నారు. కోరేగాల్ పార్క్ పరిసరాలలోని జర్మన్ బేకరిలో 2010, ఫిబ్రవరి 13న జరిగిన బాంబు పేలుడు పేలుళ్లలో 17 మంది మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. 2012లో ఆగస్టులో డెక్కన్ జంగ్లీ మహరాజ్ మార్గంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్దే బాధ్యత అని తేలింది. గణేష్ ఉత్సవాలకు ముందే సీసీటీవీల ఏర్పాటు : మంత్రి పాటిల్ పేలుడు సమాచారం తెలిసిన వెంటనే హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కేసును ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్)కు అప్పగించామని ప్రకటించారు. గణేష్ ఉత్సవాలకు ముందుగానే నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నగర ప్రజలు ధైర్యంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా అనుమానపు కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. డీజీపీ సంజీవ్ దయాళ్, సీనియర్ పోలీసు అధికారులు మంత్రి వెంట ఉన్నారు. ఈ పేలుడు ఉగ్రవాద చర్యేనని ఏటీఎస్ ప్రకటించింది. ఈ మేరకు సెక్షన్ 324, 120 (బీ) ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. దర్యాప్తు కోసం పది బృందాలు పనిచేస్తున్నాయని, ఘటనాస్థలం నుంచి అన్ని ఆధారాలూ సేకరించామని వెల్లడించింది. ఇదిలా ఉంటే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కూడా శుక్రవారం ఘటనాస్థలాన్ని సందర్శించారు. -
ముంబై పేలుళ్లకు గర్వపడుతున్నా: భత్కల్
ముంబై: ముంబైలో 21 మంది మృతికి కారణమైన 2011నాటి వరుస పేలుళ్లకు పాల్పడినందుకు తనకు గర్వంగా ఉందని ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అన్నాడు. ‘పేలుళ్లకు పశ్చాత్తాపపడ డం లేదు. నా దృష్టిలో అవి నేరం కాదు. అందుకే వాటికి పాల్పడ్డానని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వదలచుకున్నా’ అని ఇటీవల ముంబై పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో చెప్పాడు. పేలుళ్లకు పశ్చాత్తాపపడడం లేదని భత్కల్ సహచరుడు అసదుల్లా ఆఖ్తర్ కూడా తన నేరాంగీకార ప్రకటనలో పేర్కొన్నాడు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో 2005 నుంచి తాము పాల్పడ్డ పేలుళ్ల వివరాలను వీరు వెల్లడించారు. 2002 నాటి గోధ్రా అల్లర్లకు ప్రతీకారంగానే బాంబులు పేల్చామన్నారు. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ గత ఏడాది ఆగస్ట్‌లో భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేయడం తెలిసిందే. -
పోలీస్ కస్టడీకి ఐఎం ఉగ్రవాది
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి పేలుళ్ల కేసులో అరెస్టయిన ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) సంస్థ ఉగ్రవాది ఫైజాన్ అహ్మద్ సుల్తాన్‌ను స్థానిక న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీదాకా పోలీస్ కస్టడీకి ఆదేశించింది. షార్జానుంచి రప్పించిన ఫైజాన్‌ను ఢిల్లీ పోలీసులు ఈ నెల ఆరంభంలో పోలీసులు అరెస్టుచేసిన సంగతి విదితమే. ఫైజాన్‌ను బుధవారం అదనపు సెషన్స్‌కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి దయాప్రకాశ్ ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉంచాలంటూ ఆదేశించారు. వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి నిందితుడిని ఇంకా విచారించాల్సి ఉందని, అందువల్ల అతడిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు చేసిన విన్నపాన్ని మన్నించిన న్యాయమూర్తి పైవిధంగా ఆదేశాలు జారీచేశారు. కాగా వరుస పేలుళ్ల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న 55 ఏళ్ల సుల్తాన్‌ను అంతకుముందు అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) జాతి వ్యతిరేక యుద్ధం అనే మరొక ప్రత్యేక కేసుకు సంబంధించి విచారించింది. ఇదిలాఉంచితే 2008, సెప్టెంబర్ 13నాటి వరుస బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఐఎం సహ వ్యవస్థాపకులు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లతోపాటు మొత్తం 29 మంది నిందితులపై ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఏ అప్పట్లో అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా 16 మంది నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. -
తాలిబన్ల వద్ద వఖాస్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది వఖాస్ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థానీ అయిన వఖాస్ భారత్‌లో అడుగుపెట్టడానికి ముందు ఆరేళ్ల పాటు తాలిబన్లో శిక్షణ పొందినట్లు వెల్లడైంది. ఇతడితోపాటు మరో ఉగ్రవాది తెహసీన్ అక్తర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఢిల్లీ న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారంతో కస్టడీ గడువు ముగియనుండటంతో ఈలోపు లేదా న్యాయస్థానం అనుమతితో కస్టడీ పొడిగించుకుని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన వఖాస్ అసలు పేరు జఖీ ఉర్ రె హ్మాన్. ఫుడ్ టెక్నాలజీలో డిప్లమో పూర్తి చేసిన ఇతగాడు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఆ సంస్థలో ఏడాది పాటు తాజ్ మహ్మద్ అనే ట్రైనర్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. 2004 నుంచి 2010 వరకు ఆరేళ్ల పాటు అఫ్గానిస్తాన్‌లో ఉన్న తాలిబన్ శిక్షణా కేంద్రంలో అదనపు శిక్షణ పొందాడు. -
మళ్లీ సిమి సెగ!
న్యూఢిల్లీ: ఎన్నో ఉగ్రవాద దాడులతో ప్రమేయమున్న భారత ఇస్లామిక్ విద్యార్థుల ఉద్యమ (సిమి) సంస్థ..ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సాయంతో మళ్లీ విస్తరణకు యత్నిస్తోందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. పాకిస్థాన్ జాతీయుడు వకాస్ సహా పలువురు ఐఎం సభ్యుల అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఇది నిధులు సేకరిస్తున్నట్టు నిఘా వర్గాలు గ్రహించాయి. ఢిల్లీ సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిమి ప్రయత్నిస్తోందని జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్ పోలీసుల విచారణలో వెల్లడిం చారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉన్న ఇతడు, సిమిలో చురుగ్గా పని చేస్తున్న వారి వివరా లు కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఉగ్రవాద స్థాపనకు నిధుల కోసం బ్యాంకులను దోపిడీ చేయాలంటూ ముస్లిం యువకులను ప్రేరేపించిన సిమి సభ్యుడు అబూ ఫైజల్ ఎలియాస్ ‘డాక్టర్’తోనూ వకాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు బయటపడింది. ‘డాక్టర్’ ఇది వరకే మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఐదుగురు సిమి కార్యకర్తలతోపాటు తప్పించుకున్నాడు. ఇతణ్ని పోలీసులు తిరిగి గత డిసెంబర్లో అరెస్టు చేశారు. మిగతా ఐదుగురు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. జైలు నుంచి తప్పించుకోవాలన్న కుట్రకు కూడా ఇతడే సూత్రధారని విచారణలో వెల్లడయింది. ఉగ్రవాద సంస్థకు నిధుల కోసం ‘డాక్టర్’ బృందం నర్మదలోని గ్రామీణబ్యాంకులో 2009లో దోపిడీ జరిపింది. దేవస్, ఇటార్సీ బ్యాంకు దోపిడీలతోనూ ఇతనికి సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇతడు ఢిల్లీలో ఎటువంటి దాడులకూ పాల్పడకపోయినా, ఉగ్రవాద సంస్థలకు ఇతడు నిధులు సమకూర్చాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. 2011లో అరెస్టు కాకముందు ‘డాక్టర్’ ఐంఎ సభ్యులతో సన్నిహితంగా మెలిగాడు. పాక్ నుంచి ప్రోత్సాహం నిర్బంధం కారణంగా చెల్లాచెదురైన సిమి కార్యకర్తలంతా తిరిగి ఒక్కటయ్యేందుకు చర్యలు తీసుకోవాలని పాక్‌లోని ఐఎం అగ్రనాయకులు భారత్‌లోని తమ రహస్య సభ్యులకు సూచించినట్టు తెలిసింది. ఇలా మళ్లీ సంఘటితంగా మారిన సిమి కార్యకర్తలు బ్యాంకు దోపిడీలకు పునఃప్రారంభిస్తారని దర్యాప్తు సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 2010కి ముందు సిమి కార్యకర్తలు దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. ‘గతంలో సిమిలో పనిచేసిన వారందరితోనూ ఐఎం కార్యకర్తలు మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నారు. సంస్థ లో చేరాల్సిందిగా ముస్లిం యువతను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారిపై ఎక్కువ గా దృష్టి సారిస్తున్నారు’ అని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఐజాజుద్దీన్, అస్లాం, జాకీర్ హుస్సే న్, షేక్ మెహబూబ్, ఇక్రార్ను మళ్లీ అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు నిఘా సంస్థల సాయంతో ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఈ ఐదుగురు మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ వాసులని తేలింది. ఈ విషయ మై మరింత సమాచారం సేకరించేందుకు ఢిల్లీ పోలీసు స్పెషల్‌సెల్ వకాస్‌ను తన కస్టడీలోకి తీసుకుంది. సిమి 1977లో అలీగఢ్‌లో ఏర్పాటయింది. 2002లో సిమిని నిషేధించకముందు మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు, ముఖ్యప్రాంతాల్లో దీనికి కార్యకర్తలు, కార్యాలయాలు ఉండేవి. ఇస్లామిక్ మతప్రచారం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం దీని ప్రధాన లక్ష్యాలు. సిమి అధ్యక్షుడు షహీద్ ఫలాహీ 9/11 దాడుల కేసులో అరెస్టు కావడంతో నిఘా వర్గాలు దీనిపై దృష్టి సారించాయి. నిషేధం తరువాత 1,200 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. 2010లో ఏర్పడిన ఐఎం సిమి అనుబంధ సంస్థేనని పోలీసులు అంటున్నారు. పలు పేలుళ్ల ఘటనలతో సిమి, ఐఎంకు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. సిమి కార్యకర్త అరెస్టు భోపాల్: సిమిలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న గుల్రేజ్ అలీని మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు భోపాల్ రైల్వే స్టేషన్లో ఆదివారం అరెస్టు చేశారు. విశేషమేమంటే ఢిల్లీ పోలీసులు ‘డాక్టర్’ను (అబూ ఫైజల్) ఆదివారమే భోపాల్‌కు తీసుకెళ్లారు. ఇతణ్ని తిరిగి తీసుకెళ్లడానికి అక్కడ వేచిచూస్తున్న ఏటీఎస్ పోలీసులకు అలీ కనిపించాడు. ఇతనిపై రూ.15 వేల రివార్డు కూడా ఉంది. నిందితుడికి స్థానిక కోర్టు మే ఐదు వరకు పోలీసు కస్టడీ విధించింది. అలీపై ఇది వరకే పలు కేసులు నమోదయ్యాయి. -
తహ్సీన్ అక్తర్‌కు ఏప్రిల్ 2 వరకు రిమాండ్
ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది తహ్సీన్ అక్తర్ అలియాస్ మోనును ఏప్రిల్ 2వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలని ఢిల్లీ కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. దేశంలోని వివిధ నగరాలలో బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న తహ్సీన్ అక్తర్‌ను నిన్న ఇండో-నేపాల్ సరిహద్దు డార్జిలింగ్ జిల్లాలోని కకర్విట్టా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహ్సీన్ ను దేశ రాజధాని తరలించారు. బుధవారం ఉదయం అతడిని పోలీసులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో అతడికి వచ్చే నెల 2వ తేదీ వరకు న్యాయమూర్తి పోలీసు రిమాండ్ విధించారు. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లతో సంబంధాలున్న తహ్సీన్ ను ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో అక్తర్ మూడో నిందితుడిగా ఉన్న విషయం విదితమే. ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌తోపాటు మరోకరిని దేశ సరిహద్దుల్లో గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఐఎం చీఫ్ అక్తర్ అరెస్ట్
నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు రోజుల వ్యవధిలోనే మరో ముందడుగు న్యూఢిల్లీ: దేశంలో గత కొన్నేళ్లుగా వరుస బాంబు పేలుళ్లతో వందల సంఖ్యలో అమాయక పౌరుల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న తెహ్సీన్ అక్తర్(23) అలియాస్ మోను ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులకు పట్టుబడ్డాడు. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో... భారత్-నేపాల్ సరిహద్దుల్లో కాకరవత్త వద్ద తెహ్సీన్ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీస్ ప్రత్యేక కమిషనర్ శ్రీవాత్సవ మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. పాకిస్థాన్ కేంద్రంగా ఐఎంకు బాస్‌లుగా వ్యవహరిస్తున్న ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్‌కు తెహ్సీన్ సన్నిహితుడని చెప్పారు. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుండగా... మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే, వకాస్ అరెస్ట్ విషయం తెలుసుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయే క్రమంలో తెహ్సీన్ పట్టుబడినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అతడిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చినట్లు, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశాలున్నట్లు వెల్లడించాయి. ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాది, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్, అతని ముగ్గురు అనుచరులు రాజస్థాన్‌లో అరెస్ట్ అయిన రెండు రోజుల వ్యవధిలోనే వీరి నాయకుడూ పట్టుబడడం కీలక పరిణామం. ఐఎం సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను పోలీసులు గతేడాది భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వకాస్, తెహ్సీన్ కోసం పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఎట్టకేలకు వీరి అరెస్ట్‌తో ఐఎం అగ్రశ్రేణి నాయకులంతా పట్టుబడినట్లయింది. దేశంలో ఈ సంస్థ నిర్వహించిన ప్రతీ బాంబు పేలుళ్ల విధ్వంసం వెనుక వీరే ముఖ్య పాత్ర పోషించారు. 2013 ఫిబ్రవరిలో దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తెహ్సీన్ అరెస్ట్‌తో ఈ కేసులో ప్రధాన నిందితుడైన రియాజ్ మినహా నలుగురూ పట్టుబడ్డారు.బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అక్తర్ బాంబుల తయారీలో నిపుణుడు. యాసిన్ అరెస్ట్ తర్వాత ఐఎం నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
-
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
ఢిల్లీ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ నేత తహసీన్ అక్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే రెండు రోజుల క్రితం జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు అక్తర్ అరెస్ట్‌ను ఆలస్యంగా ప్రకటించారు. మొత్తంమీద దిల్సుఖ్నగర్ కేసులో ఇప్పటిదాకా రియాజ్ మినహా మిగతా వారంతా అరెస్ట్ అయ్యారు. యాసిన్ భత్కల్ అరెస్ట్ అనంతరం తహసీన్ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. కాగా 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు. -
దాడికి సిద్ధంగా ఉండండి
* అరెస్టయిన ఉగ్రవాదులకు అందిన సందేశమిదే * వెల్లడికాని లక్ష్యం.. మరో ఉగ్రవాది కోసం గాలింపు జైపూర్: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు, వారి అనుచరుడిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీ సులు మరో అనుచరుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకోసం కొన్ని పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాది షకీబ్ అన్సారీ ఇద్దరు అనుచరుల పేర్లను బయటపెట్టగా.. ఆదిల్ అనే అతడిని పోలీసులు ఆదివారమే అరెస్ట్ చేశారు. ఇప్పుడు బర్కత్ అనే అనుచరుడి కోసం అన్వేషణ సాగుతోంది. షకీబ్‌కు బర్కత్ పేలుడు పదార్థాలు సరఫరా చేసేవాడని జోథ్‌పూర్ పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన కరుడుకట్టిన ఐఎం ఉగ్రవాది వకాస్ అతడి ముగ్గురు అనుచరులు విచారణలో తమ లక్ష్యాన్ని బయటపెట్టలేదు. వకాస్‌ను ఢిల్లీ కోర్టు 10 రోజుల పాటు స్పెషల్‌సెల్ పోలీసుల కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.అతడి అనుచరులైన మహ్రూఫ్, హనీఫ్, ఖలీద్లకు ప్రతేక కోర్టు ఏప్రిల్ 2 వరకు పోలీస్ కస్టడీ విధించింది. దీంతో ఈ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనుకున్నారు? ఎక్కడ? అనే వివరాలను వారు వెల్లడించలేదని దర్యాప్తులో పాలుపంచుకున్న ఒక అధికారి చెప్పారు. ఐఎం చీఫ్ తెహ్సీన్ అక్తర్ దాడికి సిద్ధంగా ఉండాలని మాత్రమే వీరికి చెప్పాడని, లక్ష్యాన్ని ఇంకా తెలియజేయలేదని వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన మదర్సా నిర్వాహకుడి అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్ ఖవిని గుజరాత్ పోలీ సులు సోమవారం ఢిల్లీలో అరెస్టు చేశారు. 2004లో గు జరాత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన కేసులో అబ్దుల్ నిందితుడు. కాగా, అబ్దుల్ అరెస్టును ఐంఐఎం అధినేత అసదుద్దీన్ ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని వ్యా ఖ్యానించారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసినవా రిని అమాయకులని తేలడంతో విడిచిపెట్టిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. -
ఎన్నికలపై ఉగ్రపంజా
ఇండియన్ ముజాహిదీన్ అనుమానిత సభ్యుడు యాసిన్ భత్కల్ అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో దాడులకు దిగాలని మరో ఉగ్రవాద సంస్థ సిమి ప్రయత్నిస్తున్నట్టు గూఢచార వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీలోని ఏడు సీట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులందరికీ తగిన రక్షణ కల్పించాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థలు సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజధానిలో దాడులు చేయడం/నాయకులను అపహరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ పోలీసుశాఖ అన్ని పోలీసు స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుడిగా అనుమానిస్తున్న యాసిన్ భత్కల్ అరెస్టుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సంస్థ సభ్యులు దేశరాజధానిలో దాడులకు తెగబడవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏడు సీట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులందరికీ తగిన రక్షణ కల్పించాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి జనాదరణ పెరగడాన్ని సహించలేని నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ (సిమి) కార్యకర్తలు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనకుండా నిరోధించేందుకు సిమి కార్యకర్తలు ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో బాంబు పేలుళ్లకు తెగించే అవకాశాలను తోసిపుచ్చలేమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అన్నారు. ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్, కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం. అబ్దూస్ సుభాన్ ఖురేషి ఎలియాస్ తాఖీర్ వంటి సిమి సభ్యులు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. లష్కరే తోయిబా నేతృత్వంలో సిమి..ఇండియన్ ముజాహిదీన్‌ను (ఐఎం) ఏర్పాటు చేసింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాం తం (ఎన్సీఆర్)లో దాడులు చేయాలని ఐఎం నాయకుడు తెహిసిన్ అఖ్తర్ ఎలియాస్ మోనూ వ్యూహాలు రచిస్తున్నాడని అధికారవర్గాలు తెలిపాయి. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఇతర రాష్ట్రాలకు వచ్చి విదేశీయులను అపహరించాలని మోనూ భావిస్తున్నట్టు యాసిన్ పోలీసుల విచారణలో తెలిపాడు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు గత నుంచి గత ఏడాది తప్పించుకుపారిపోయిన సిమి ఉగ్రవాదులు కూడా దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. దక్షణాదిలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న అల్ ఉమ్మా కార్యకర్తలు సిమికి సహకరించవచ్చని సమాచారం. సిమి తో అల్ ఉమ్మాకు చాలా కాలంగా సంబంధాలు ఉన్నా, ఇది ఉత్తరాదిలో ఎప్పుడూ దాడులకు పాల్పడలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధానిలో భద్రత సంబంధిత అంశాలపై చర్చించడానికి నగర పోలీసులు, సంబంధిత అధికారులు వచ్చే వారం సమావేశం కానున్నారు. యాసిన్ భత్కల్‌కు మరోసారి నిరాశే ఢిల్లీలో 2008 వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితు డు యాసిన్ భత్కల్‌కు బెయిల్ ఇవ్వడానికి స్థానిక కోర్టు మళ్లీ తిరస్కరించింది. ఇతని అనుచరుడు అసదుల్లా అఖ్తర్‌కు కూడా నిరాశ తప్పలేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి వీలుగా ఈ ఇద్దరిని మరోసారి 15 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసుల విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ అంగీకరించారు. గ్రేటర్ కైలాష్‌లో 208, సెప్టెంబర్ 13న జరిగిన పేలుళ్లపై వీరిద్దరి ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసు ల అదుపులో ఉన్న భత్కల్, అఖ్తర్‌ను వచ్చే మూడు న విచారణకు హాజరుపర్చాలని ఆదేశిస్తూ జడ్జి దయాప్రకాశ్ ప్రొడక్షన్ వారంట్లు జారీ చేశారు. ఈ కేసుతో ప్రమేయమున్న ఆసియా దేశస్తుడి గురించి కేంద్ర నిఘావర్గాలు కొంత సమాచారం ఇచ్చినందునే, వీరిద్దరి కస్టడీ కోరుతున్నామని స్పెషల్‌సెల్ న్యాయమూర్తికి విన్నవించింది. -
టుండాకు ఐఎంతో లింకు!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా ఉగ్రవాది, హైదరాబాద్‌లో పట్టుబడిన అబ్దుల్ కరీంటుండాకు దిల్షుక్ నగర్లో పేలుళ్లకు తెగబడిన ఐఎం(ఇండియన్ ముజాహిదీన్)తో సంబంధాలున్నాయని ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్తో మరింత సత్సంబంధాలున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ మేరకు గత మంగళవారం ఢిల్లీ కోర్టులో టుండాపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఆయా వివరాలను పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాం తాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతేడాది ఆగస్టులో ఇక్కడ అరెస్టు చేశారు. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న మరిన్ని వివరాలు.. - 1994లో బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్-ఇండియా టై నెట్‌వర్క్‌ను స్థాపించి వ్యవహారాలు సాగించిన టుండా పాకిస్థానీయులతో పాటు భారత యువతనూ ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. - పాక్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం, వారితో స్థానిక యువతను ఆకర్షించి, బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటివి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. దీనికోసం ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నలుగురిలో సలీం జునైద్ ఒకడు. ఈయన టుండా తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇది హైదరాబాద్‌లో దాదాపు 6 పేలుళ్లకు పాల్పడింది. జునైద్‌ను హైదరాబాద్ పోలీసులు 1998లో అదుపులోకి తీసుకున్నారు. - మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ టుండాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2005లో ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్‌ను కలిశాడు. కోల్‌కతాకు చెందిన రజాఖాన్ ఐఎం ముసుగులో రియాజ్, ఇక్బాల్ భత్కల్ ద్వారా దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాడు. 2007లో హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసుల్లోనూ రజాఖాన్ వాంటెడ్‌గా ఉన్నాడు. 2005లో టుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన ఓ ఉన్నతాధికారి సాయంతో అమీర్ రజా ఖాన్‌ను కలిశాడని, ఐఎంకు పూర్తిస్థాయి సహకారం అందించేందుకు అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. -
దుబాయ్‌లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్టు
న్యూఢిల్లీ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అబ్దుల్ వాహిద్ సిద్ది బాపాను ఇంటర్ పోల్ అధికారులు అరెస్ట్ చేశారు. భారత్‌లో జరిగిన పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది అబ్దుల్ వాహిద్ సిద్దిబాపాను యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు అరెస్టు చేశారు. గత నెలలో అతడు దుబాయ్ నుంచి అబుదాబి వెళ్లగా అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరచారు. దీంతో అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగనుంది. ముంబై ఉగ్రదాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులైన యాసిన్ భత్కల్, అతడి సోదరులకు వాహిద్ సమీప బంధువు. యూఏఈలో అబ్దుల్ వాహిద్ పట్టుబడినట్లు ఇంటర్ పోల్ అధికారులు వెల్లడించారు. ఇదే విషయమై మన దేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కూడా సమాచారం అందించారు. -
కేజ్రీవాల్ కిడ్నాప్‌కు కుట్ర
భత్కల్ను విడిపించుకోవడానికి ఐఎం భారీ ప్లాన్ పసిగట్టిన ఇంటెలిజెన్స.. ‘జెడ్ భద్రత’ తీసుకోవాలంటూ కేజ్రీవాల్‌కు సూచన శంషాబాద్, కెంపేగౌడ విమానాశ్రయాల్లో తనిఖీలు సాక్షి, న్యూఢిల్లీ, బెంగళూరు/శంషాబాద్: పోలీసుల చెరలో ఉన్న ఉగ్రవాది యాసిన్ భత్కల్ను విడిపించుకోవడానికి ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ భారీ పన్నాగమే పన్నింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అపహరించడం ద్వారా లేదా విమానాలను హైజాక్ చేయడం ద్వారా భత్కల్ను విడిపించుకుపోవాలని ఐఎం ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ ముప్పు గురించి ఢిల్లీ పోలీసులు ఆదివారం కేజ్రీవాల్‌కు వివరించారు. జెడ్ కేటగిరీ భద్రతను తీసుకోవాల్సిందిగా ఆయన్ను వారు కోరారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఉగ్రవాదుల ముప్పుపై నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మండిపడిన కేజ్రివాల్ ‘‘నాకు ప్రాణభయం లేదు. నాకు దేవుడిపై నమ్మకముంది. పోలీసు భద్రత తీసుకునేదే లేదు’’ అని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పలు ట్వీట్లు చేశారు. భద్రతకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. తన భద్రతతో రాజకీయాలు చేయొద్దని ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘‘పోలీసులు ఈ రోజు(ఆదివారం) సాయంత్రం నన్ను కలిశారు. ముప్పుందని చెప్పారు. ఈ విషయం మీడియాతో చెప్పొద్దని కూడా అన్నారు. కానీ వారంతట వారే మీడియాకు చెప్పారు. ఈ విషయాన్ని ప్రకటించి.. వారు నాకు ముప్పు తెస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే నా మీద దాడి చేసి.. అది భత్కల్ మనుషులే చేశారనుకునేలా చేయొచ్చు’’ అంటూ మండిపడ్డారు. రాజకీయాలు చేయొద్దంటూ ఆయన పోలీసుల్ని కూడా కోరారు. ఢిల్లీలో అత్యాచారాలు, డ్రగ్స్ రాకెట్ విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిని ట్వీట్లలో ఘాటుగా ఎండగట్టారు. హైజాక్ ప్లాన్.. గతంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం హైజాక్ చేసి జైషే-మహ్మద్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్‌ను విడిపించిన తరహాలోనే యాసిన్ భత్కల్ను కూడా విడిపించుకు పోవాలని కూడా ఐఎం ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పోలీసులకు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు కొద్ది రోజుల్లో గణతంత్ర వేడుకలున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీచేశారు. దీంతో మన రాష్ట్రంలోని శంషాబాద్, బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీ చేపట్టారు. రహస్య ప్రాంతంలో భత్కల్ విచారణ .. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి యాసిన్ భత్కల్ను బెంగళూరు తీసుకు వచ్చి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు తీసుకు వచ్చిన భత్కల్ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ నెల 28 వరకు విచారణ చేయడానికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. భత్కల్ను బెంగళూరు నుంచి తీసుకు వెళ్లేలోపు విడిపించుకు పోవాలని ముజాహిద్దీన్ ఉగ్రవాదులు పథకం వేసినట్లు ఇంటెలిజెన్స వర్గాల సమాచారం. -
ఒక ఉగ్రవాది ఆత్మకధ
-
భత్కల్‌కో ‘జీవిత చరిత్ర’
సాక్షి,సిటీబ్యూరో: అనేకమందిని పొట్టనపెట్టుకొని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) కో-ఫౌండర్ యాసీన్ భత్కల్ రాస్తున్న ఆటోబయోగ్రఫీపై నిఘా వర్గాలు ఆత్రుతుగా చూస్తున్నాయి. 2008 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన అనేక పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న యాసీన్‌భత్కల్ గతేడాది ఆగస్టు 29న నేపాల్‌లో చిక్కిన విషయం విదితమే. అక్కడ్నుంచి అనేక కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. దిల్సుఖ్నగర్ జంటపేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సైతం హైదరాబాద్ తీసుకొచ్చి విచారించింది. ఇలా ఇతడు కేవలం తీహార్ జైల్లోనే కాదు ఏ పోలీసుల కస్టడీలో ఉన్నా...ప్రతిరోజూ ఇంటరాగేషన్ పూర్తయిన తర్వాత తన సెల్‌లోకి వెళ్లిపోతూ పోలీసుల నుంచి తీసుకున్న కాగితాలపై ‘జీవితచరిత్ర’ రాస్తున్నాడు. ఎవరా ‘క్లోజ్‌ఫ్రెండ్’..?: యాసీన్ భత్కల్ ఉర్దూలో రాస్తున్న ఈ ‘జీవితచరిత్ర’లో కొన్ని కవితలు, పద్యాలు సైతం ఉన్నట్లు కేంద్ర నిఘావర్గాలకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. ఈ రాతలపై కన్నేసి ఉంచిన నిఘావర్గాలను ఓ అంశం ఆకర్షించింది. ఇప్పటివరకు యాసీన్ రాసిన దానిప్రకారం కేంద్ర నిఘా వర్గాలకు తన కదలికలపై ఉప్పందించింది ఓ ‘క్లోజ్‌ఫ్రెండ్’గా అతడి అనుమానం. తన అరెస్టుకు కొన్నినెలల ముందు సదరు స్నేహితుడిని కలిసిన సంద ర్భంలో ‘అగ్లీ రంజాన్ షాయద్ తీహార్ మేహోగా’ (బహుశా వచ్చేడాది రంజాన్‌ను తీహార్ జైల్లో చేసుకోవాల్సి ఉంటుందేమో!) అని అతడితో వ్యాఖ్యానించానని యాసీన్ రాశాడు. ఈ విషయాన్ని జైలు, పోలీసు అధికారుల ద్వారా తెలుసుకున్న నిఘావర్గాలు ఆ ‘క్లోజ్‌ఫ్రెండ్’ ఎవరనే కోణంలో ఆరాతీస్తున్నాయి. ఎక్కడా కనిపించని పశ్చాత్తాపం: ఆరేళ్లపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబులతో విధ్వంసం సృష్టించి, వందలాదిమంది చావుకు, వేలమంది క్షతగాత్రులు కావడానికి కారణమైన యాసీన్‌భత్కల్‌లో ఎలా ంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని నిఘావర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు అతగాడు రాసిన ‘జీవిత చరిత్ర’లోనూ ఈ కోణంలో ఎలాంటి ప్రస్తావన లేదని, ఓచోట తాను చేస్తున్న పనుల్ని ‘తమవారి కోసం చేస్తున్న త్యాగం’ అంటూ అభివర్ణించాడని అవి వివరించాయి. మాకూ ప్రాణహానీ ఉంది..: పదుల సంఖ్యలో విద్రోహక చర్యలకు పాల్పడి, వందలమంది ప్రాణాలు తీసిన టై ద్వయం యాసీన్,అసదుల్లాఅక్తర్‌లు ప్రస్తుతం తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారట. ఇదే విషయాన్ని తమ లాయర్ ద్వారా తీహార్ జిల్లా కోర్టుకు నివేదించారు. స్పందించిన న్యాయస్థానం నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖను ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదావేసింది. -
సూరత్‌లో అణుబాంబు పేల్చాలనుకున్నా!
న్యూఢిల్లీ: అణుబాంబు.. అత్యంత ఆధునిక ఆయుధం.. భారీస్థాయిలో ప్రాణనష్టాన్నే కాకుండా, తరాల తరబడి తీవ్ర ప్రభావం చూపగల మారణాయుధం. అది ముష్కరులు.. ముఖ్యంగా భారత్‌పై ఎల్లవేళలా విషం కక్కే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) లాంటి ఉగ్రవాద సంస్థల చేతికి చిక్కితే.. వారికి అవి యథేచ్ఛగా లభిస్తుంటే..! ఐఈడీ లాంటి బాంబులతోనే అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులు.. ఇక అణుబాంబు దాడులను ప్రారంభిస్తే..! ఆలోచిస్తేనే వణుకు పుట్టే పరిస్థితి. అయితే, అణు బాంబులు అంత ఈజీగా ఉగ్రవాదులకు లభించవని, వాటిని భద్రపరిచే, వినియోగించే సాంకేతికత వారి దగ్గర లేదనే నమ్మకంతో మనమే కాదు, మన నిఘా సంస్థలూ ఉన్నాయి. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా పలు కళ్లు చెదిరే వాస్తవాలను ఇండియన్ ముజాహిదీన్ ఇండియా చీఫ్ యాసిన్ భత్కల్ వెల్లడిస్తున్నాడు. ప్రస్తుతం జాతీయ నిఘా సంస్థ(నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) అదుపులో ఉన్న యాసిన్ ఐఎం ప్రణాళికలను, శిక్షణ విధానాలను, సహాయం అందిస్తున్న వారి వివరాలను ఇంటరాగేషన్ సందర్భంగా వెల్లడిస్తున్నాడు. ఒక ఆంగ్ల పత్రిక చేతికి యాసిన్ భత్కల్ ఇంటరాగేషన్ వివరాలు చిక్కాయి. అవి యాసిన్ భత్కల్ మాటల్లోనే.. ‘గుజరాత్‌లోని సూరత్‌లో చిన్నపాటి అణుబాంబును పేల్చాలని ప్రణాళిక వేశాను. న్యూక్లియర్ బాంబును అందించగలరా? అని పాకిస్థాన్‌లోని మా బాస్ రియాజ్ భత్కల్ను అడిగాను. పాకిస్థాన్‌లో మనకు ఏదైనా లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నాకో చిన్నపాటి అణుబాంబును అందించమని, దానిని సూరత్‌లో పేల్చాలనుకుంటున్నానని చెప్పాను. అలా చేస్తే ముస్లింలు కూడా చనిపోతారని రియాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలా జరగకుండా.. కుటుంబాలతో సహా నగరం విడిచివెళ్లిపోవాలని కోరుతూ పేలుడుకు ముందు సూరత్‌లోని అన్ని మసీదుల్లో పోస్టర్లు అతికిస్తానని చెప్పాను’. అదృష్టవశాత్తూ ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చకముందే యాసిన్ భత్కల్ నేపాల్‌లో ఈ ఆగస్ట్‌లో అరెస్ట్ అయ్యాడు. కానీ అణుబాంబు భయం మాత్రం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. విచారణ సందర్భంగా యాసిన్ ఐఎం నిర్వహణకు సంబంధించిన పలు వివరాలను భారత నిఘా విభాగాలకు వెల్లడిస్తున్నాడు. సైనిక శిక్షణకు దీటైన శిక్షణను పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో పాకిస్థాన్‌లో ఐఎం శ్రేణులకు అందుతోందని తెలిపాడు. అందులో శారీరక ధృడత్వ శిక్షణ, పీఈ3ఏ, సీ3, సీ4, టీఎన్టీ సహా పలు రకాల బాంబుల తయారీ, పిస్టల్ నుంచి ఏకే 47 వరకు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే విధానం నేర్పిస్తారని చెప్పాడు. సాధారణంగా 50 రోజులపాటు ఆ శిక్షణ ఉంటుందన్నారు. దాడులకు సంబంధించిన అన్ని ప్రణాళికలను రియాజ్ భత్కల్‌కు తెలియజేస్తామన్నాడు. -
'విధ్వంసానికి కుట్ర, అప్రమత్తంగా ఉండండి'
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ పలుచోట్ల విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర పన్నుతోందని ఐబీ హెచ్చరికలు చేసింది. దాంతో జంట నగరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బార్లు, పబ్బులల్లో రాత్రి 12 వరకు, హోటల్స్, రిసార్ట్స్‌లలో రాత్రి 1 గంట వరకు కొత్త సంవత్సర వేడుకలకు అనుమతించారు. రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నారు. ఇటు సైబరాబాద్‌లోని పివి ఎక్స్‌ప్రెస్‌వేపై ఎయిర్ టికెట్ ఉన్న వారికి వినహా మిగతా వారికి అనుమతి నిషేధించారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై రాకపోకలను నియంత్రిస్తున్నారు. నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లలోరాకపోకలు నిషేధించి ఆ మార్గంలో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎక్కడిక్కడే డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్ని శ్రుతిమించకుండా నిర్వహించుకోవాలని జంటనగరాల ప్రజలకు హైదరాబాద్ సిటి కమిషనర్ అనురాగ్ శర్మ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే కోరారు. -
మోడీపై తప్పిన గురి!
‘మచిలీ-5’ పేరిట ఇండియన్ ముజాహిదీన్ పథకం ఆత్మాహుతి దాడికి సిద్ధమైన ఉగ్రవాదులు బాంబు ముందే పేలడంతో అడ్డం తిరిగిన కథ న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని హతమార్చాలని ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు కుట్రపన్నారా? బీహార్ రాజధాని పాట్నాలో ఈ నెల 27న మోడీ నిర్వహించిన హుంకార్ ర్యాలీలో ఆత్మాహుతి దాడులతో ఆయన్ను మట్టుబెట్టాలనుకున్నా గురి తప్పిందా? ఈ వరుస పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఐఎం ఉగ్రవాదులు ప్రధానంగా మోడీపైనే గురిపెట్టారని, ‘మచిలీ-5’ కోడ్ పేరుతో ఆత్మాహుతి దాడికి పథకం సిద్ధం చేసుకున్నారని ఈ పేలుళ్ల కేసులో పట్టుబడిన ఉగ్రవాది ఇంతియాజ్ అన్సారీ విచారణలో అంగీకరించినట్లు ‘గల్ఫ్ న్యూస్’ కథనాన్ని ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ వెల్లడించింది. అందులోని వివరాల ప్రకారం ... మోడీ హత్యకు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పథకం సిద్ధం చేసుకున్నారు. ఇంతియాజ్, అతడి సహచరుడు అయినుల్ తారిఖ్ మానవబాంబులుగా మారి, మోడీ వేదిక వద్దే పేలుడుకు పాల్పడేలా ఆత్మాహుతి దాడికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. పాట్నా రైల్వేస్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్లో బాంబును సిద్ధం చేస్తుండగా, టైమర్, బ్యాటరీ అమర్చక ముందే అది అనుకోకుండా పేలిపోవడంతో కథ అడ్డం తిరిగింది. పేలుడులో తారిఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. కీలక నిందితుడైన ఇంతియాజ్, అక్కడి నుంచి పరారవుతుండగా పట్టుబడ్డాడు. పాట్నాలో మోడీ సభ జరిగిన గాంధీ మైదాన్ వద్ద ఏడు వరుస పేలుళ్లలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. గాంధీ మైదాన్ పరిసరాల్లో ఉగ్రవాదులు మొత్తం 18 బాంబులను అమర్చగా, పేలకుండా మిగిలిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. మరోవైపు, ఆగస్టులో అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ కుట్రదారు యాసిన్ భత్కల్ కూడా మోడీనే తమ ప్రధాన ‘టార్గెట్’ అని ఎన్ఐఏ ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. ఈ లక్ష్యాన్ని తాము సాధించినట్లయితే, అంతర్జాతీయంగా తమకు అందే నిధులు కూడా పెరుగుతాయని భత్కల్ చెప్పినట్లు సమాచారం. పాట్నా పేలుళ్లలో గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మోడీ శనివారం రానున్నారు. -
బుద్ధగయ, పాట్నా పేలుళ్ల మధ్య పోలిక
బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం సంభవించిన వరుస బాంబు పేలుళ్లు, ఈ ఏడాది జులైలో బుద్ధగయలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లు ఒకేలా ఉన్నాయని జార్ఖండ్ పోలీసు ఉన్నతాధికారి ఎస్.ఎన్. ప్రధాన్ వెల్లడించారు. ఇరు ప్రాంతాలలో జరిగిన బాంబు పేలుళ్లలో వాడిని టైమర్లు ఒకటేనని తమ దర్యాప్తులో వెల్లడైందని, అలాగే ఆ పేలుళ్ల వెనక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని తమ ప్రాధమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. అయితే పాట్నాలో వరుస బాంబు పేలుళ్ల జరిగినప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళనతో నలువైపులకు పరుగులు తీశారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా సాక్ష్యాలు కనుమరుగు అయ్యాయని తెలిపారు. ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హుంకార్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి కొన్ని గంటల ముందు పాట్నాలో పలు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో పలువు మరణించారు. అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
కోర్టు నుంచి పారిపోయిన ఉగ్రవాది అరెస్ట్
ముంబై కోర్టు దగ్గర గత నెలలో పారిపోయిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది అఫ్జల్ ఉస్మానిని పోలీసులు మళ్లీ పట్టుకున్నారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఉస్మాని నేపాల్ పారిపోయే ప్రయత్నాల్లో ఉండగా పోలీసులు నిఘా వేసి అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్, సూరత్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఉస్మాని నిందితుడు. గత నెల 20న ముంబై మోకా కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో అతను పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. 38 ఏళ్ల ఉస్మాని సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లా సంగార్పూర్ గ్రామం. ఉగ్రవాదిగా మారకముందు ముంబైలో కొంతకాలం హోటల్లో పనిచేశాడు. -
పాట్నా పేలుళ్ల సూత్రధారి తెహసీన్ అక్తర్
పాట్నా : పాట్నా వరుస పేలుళ్ల సూత్రధారిని పోలీసులు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన తెహసీన్ అక్తర్ ఈ పేలుళ్ళకు ప్రధాన సూత్రధారని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. పేలుళ్ళకు ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ వాడారు. ప్రతి బాంబులోనూ అరకేజీ పేలుడు పదార్ధాలు ఉపయోగించారు. అటు పేలుళ్ళ మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుళ్ళ ఘటనలో గాయపడ్డ అనుమానితుడు పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. పేలుళ్లకు సంబంధించి ముందే అప్రమత్తం చేశామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మరోవైపు నిన్న అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఇక బీహార్ పోలీసులు పేలుళ్లపై ఆరా తీస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. -
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ : పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌కు భద్రత పెంచాల్సిందిగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పాట్నా బాంబు పేలుళ్ళ వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్లు బీహార్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు సన్నిహితుడైన తైసిన్ అక్తర్ ఈ పేలుళ్లకు సూత్రదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక పాట్నా పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. మరో వందమంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
దేశంలో ఇండియన్ ముజాహిదీన్ మరిన్ని దాడులు!
దేశంలో శాంతి భద్రతలను ప్రశ్నించే విధంగా తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హుంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసర, దీపావళీ పండగల లక్ష్యంగా దాడులు చేయవచ్చని ఆ తీవ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు తమకు సమాచారం అందించాయని తెలిపింది. భారత్‌లో శాంతి భద్రతలను కాలరాయాడమే పనిగా ఇండియన్ ముజాహిదీన్ కంకణం కట్టుకుందని హోం మంత్రిత్వ శాఖ ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. తీవ్రవాదుల దాడులకు తిప్పికొట్టే విధంగా సమాయత్తం కావలని రాష్ట్రాలను కోరింది. ప్రజలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులోభాగంగా దేవాలయాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు, వంతెనల వద్ద పోలీసుల పహారా పెంచాలని హోం మంత్రిత్వశాఖను కోరింది. అలాగే తీవ్రవాద సంస్థలతో అనుబంధం అనుకున్న అనుమానితులను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన ఉన్నత అధికారుల హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లాలని, స్థానికంగా ఎటువంటి ఆందోళనలు చెలరేగకుండా శాంతి భద్రతలను సమీకించే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని హోం మంత్రిత్వశాఖ కోరింది. -
ఒకటే స్కెచ్
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఐదున్నరేళ్ల వ్యవధిలో నగరంలో రెండు భారీ విధ్వంసాలను సృష్టించింది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో బాంబుల్ని పేల్చి 47 మంది ప్రాణాలు తీసింది. మరో 300 మందిని క్షతగాత్రుల్ని చేసింది. సుదీర్ఘ విరామం తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న మరోసారి విరుచుకుపడిన ముష్కరులు 18 మందిని చంపి, 131 మందిని క్షతగాత్రుల్ని చేశారు. ఈ రెండు పేలుళ్ల ఆపరేషన్ల మధ్య ఉన్న సారూప్యతలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ విధ్వంసాల కోసం ముష్కరులు 25 రోజుల ముందు నగరానికి చేరుకోగా... ఈసారి మాత్రం కేవలం 16 రోజుల ముందే వచ్చారు. అప్పట్లో తొలుత అనీఖ్ షఫీఖ్ సయీద్ (లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టాడు) అనే ఉగ్రవాది వచ్చాడు. షెల్డర్ ఏర్పాటు చేశాక అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఇతడు పెట్టిన బాంబు పేలలేదు)ని పిలించించాడు. ఇద్దరూ కలిసి ప్రాథమిక రెక్కీలు పూర్తి చేసిన తరవాత పేలుడుకు రెండు రోజుల ముందు మాత్రమే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన రియాజ్ భత్కల్ (గోకుల్‌చాట్‌లో పెట్టింది ఇతడే) చేరుకుని బాంబుల పని పూర్తి చేశాడు. ఆ తరవాత ఒక రోజు తమ గదిలోనే ఉండి తిరిగి వెళ్లారు. తాజా దిల్సుఖ్నగర్ ఆపరేషన్ కోసం మొదట తెహసీన్ అక్తర్ అలియాస్ మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టిన వ్యక్తి) రాగా... కొన్ని రోజులకు తబ్రేజ్, వఖాస్ (107 బస్టాప్‌లో పెట్టిన వ్యక్తి) వచ్చారు. ఈ ముగ్గురూ కలిసి రెండు పేలుళ్లు జరిపి వెళ్లారు. మంగుళూరు నుంచే ‘పార్సిల్స్’ అప్పటి, ఇప్పటి జంట పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థం, డిటోనేటర్లు ఉగ్రవాదులు నగరానికి చేరుకున్న తరవాతే వారికి అందాయి. 2007లో విధ్వంసం సృష్టించడానికి పదిహేను రోజుల ముందు మంగుళూరు నుంచి రియాజ్ భత్కల్ పేలుడు పదార్థంతో పాటు ఇతర ఉపకరణాలను ఓ బస్సు ద్వారా పంపాడు. వీటిని అనీఖ్, అక్బర్లు చాదర్‌ఘాట్‌లో రిసీవ్ చేసుకున్నారు. ఈసారి మాత్రం తబ్రేజ్ నేరుగా మంగుళూరు నుంచి తీసుకువచ్చాడు. ఇతడిని మోను ఎల్బీనగర్ చౌరస్తాలో రిసీవ్ చేసుకుని తమ డెన్‌కు వెంటపెట్టుకు వెళ్లాడు. నాడు చెక్కతో చేసిన షేప్డ్ బాంబుల్ని పేల్చగా... నేడు ప్రెషర్ కుక్కర్లతో తయారు చేసిన బాంబుల్ని పేల్చారు. రెండు సందర్భాల్లోనూ పేలుడు పదార్థంగా అమ్మోనియం నైట్రేట్‌నే వినియోగించారు. కామన్ ‘పాయింట్’ దిల్సుఖ్నగర్ 2007 నాటి గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల ఆపరేషన్, ఈ ఏడాది ఫిబ్రవరి నాటి ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద జరిగిన విధ్వంసం... ఈ రెండు అంశాల్లోనూ దిల్సుఖ్నగర్ కామన్ పాయింట్‌గా ఉంది. అప్పట్లో గోకుల్‌చాట్‌లో రియాజ్, లుంబినీపార్క్‌లో అనీఖ్ బాంబులు పెట్టగా... అక్బర్ మరో బాంబును దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వద్ద వదిలి వెళ్లాడు. ఆ రెండూ పేలగా... ఇది పేలలేదు. ఫిబ్రవరి ఆపరేషన్‌లో మాత్రం ఉగ్రవాదులు నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌నే టార్గెట్ చేసి రెండు బాంబుల్ని పేల్చారు. ఈ రెండు ఉదంతాలపై నమోదైన ఐదు కేసుల్లోనూ రియాజ్ భత్కల్ ప్రధాన నిందితుడిగా, మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అప్పట్లో నేరుగా వచ్చి హబ్సిగూడలోని గదిలో బాంబుల్ని అసెంబుల్ చేసి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా... ఈసారి మాత్రం పాకిస్థాన్ నుంచి నేతృత్వం వహించి చేయించాడు. బాంబుల అసెంబ్లింగ్ బాధ్యతల్ని వఖాస్‌కు అప్పగించాడు. రెండుసార్లూ మారిన ‘టార్గెట్స్’... ఈ రెండు ఆపరేషన్లలోనూ ఉగ్రవాదులు ఆఖరి నిమిషంలో అనుకోని ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని బాంబు పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఉగ్రవాదులు టార్గెట్ చేసిన ప్రాంతాల్లో గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు హుస్సేన్‌సాగర్‌లో తిరిగే షికారు బోటు ఉంది. అయితే ఇందులో బాంటు పెట్టేందుకు ట్రిగ్గర్ ఆన్ చేసుకుని ఆటోలో వెళ్లిన అనీఖ్... ఆటోవాలాకు చెల్లించేందుకు అవసరమైన చిల్లర లేకపోవడంతో బాంబు పేలే సమయం సమీపించి లుంబినీపార్క్ లేజేరియం వద్ద వదిలి వెళ్లాడు. ఫిబ్రవరి 21న సైతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్‌తో పాటు దాని వెనుక ఉన్న ఓ మద్యం దుకాణాన్ని టార్గెట్ చేశారు. అయితే అక్కడకు బాంబుతో కూడిన సైకిల్‌ను తీసుకువెళ్తున్న వఖాస్ సమయం మించిపోతుండటంతో 107 బస్టాప్ వద్ద పార్క్ చేసి వెనక్కు వెళ్లిపోయాడు. అనుమానం రాని చోట మకాం సిటీని టార్గెట్‌గా చేసుకుని విధ్వంసం సృష్టించడానికి నిర్ణీత సమయం ముందు వచ్చిన ఐఎం ఉగ్రవాదులు పోలీసుల ఆలోచన సోకని, వారికి అనుమానం రాని ప్రాంతాల్లోనే షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నాటి జంట పేలుళ్ల కోసం నగరానికి వచ్చిన ఉగ్రవాదులు హబ్సిగూడలోని స్ట్రీట్ నెం.8లో ఉన్న బంజారా నిలయం అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్‌ను ఎంచుకుంటే... తాజాగా దిల్సుఖ్నగర్ ఆపరేషన్ పూర్తి చేయడం కోసం వచ్చిన వారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సాయినగర్‌లో ఉన్న రేకుల ఇంటిలో ఆశ్రయం పొందారు. ఈ రెండు సందర్భాల్లోనూ విద్యార్థులమంటూనే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. రెండు ఇళ్ల యజమానులూ వాటికి సమీపంలో లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. -
పేలుళ్లకు నెల్లాళ్ల ముందే బాంబులు సిద్ధం
ఎన్ఐఏ విచారణలో భత్కల్, తబ్రేజ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కోసం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారం నెల్లాళ్ల ముందుగానే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో విధ్వంసం సృష్టించేందుకు జనవరిలోనే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌లు దర్యాప్తులో వెల్లడించాడు. బాంబుల తయారీ కోసం ఒక వ్యక్తి యాసిన్ భత్కల్‌కు పేలుడు పదార్థాలను సమకూర్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. యాసిన్ భత్కల్ నెల్లాళ్ల ముందుగానే నగరంలో మకాం వేసినట్లు వారు అనుమానిస్తున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను బాధ్యులుగా గుర్తించారు. -
ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్ ముజాహిదీన్ రెక్కీ
ఇండియన్ ముజాహిదీన్.. ఈ పేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడతాయి. అలాంటి ఉగ్రవాద సంస్థ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల మళ్లీ ఉగ్రదాడులు చేసేందుకు రెక్కీ నిర్వహించింది!! ఈ విషయాన్ని ఇటీవలే అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసీన్ భత్కల్ వెల్లడించాడు. దాంతో మహారాష్ట్ర పోలీసులు ముంబైలో ఒక్కసారిగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ రాకేష్ మారియా సంతకం చేసిన ఓ రహస్య నివేదికలోని విషయాలు వెల్లడయ్యాయి. ఆగస్టు మొదటివారంలో నాలుగు సైనేజిలు సహా మొత్తం 11 ప్రాంతాల్లో వీళ్లు రెక్కీలు చేసిన విషయం ఆ నివేదికలో ఉంది. భత్కల్‌తో పాటు అతడి సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ను నిఘా సంస్థలు విచారించినప్పుడు వాళ్లు ఈ వివరాలు వెల్లడించారు. ముంబై పోలీసు కమిషనరేట్, జవేరీ బజార్, కల్బాదేవి, మంగళ్‌దాస్ మార్కెట్, లోహార్ చాల్, క్రాఫోర్డ్ మార్కెట్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, ముంబై సెంట్రల్ బస్ డిపో, ముంబాదేవీ ఆలయం, నాగ్‌పడ ప్రాంతంలో ఏటీఎస్ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న మాగెన్ డేవిడ్ సైనేజి, అగ్రిపడ ప్రాంతంలోని హసిదిమ్ సైనేజి, డోంగ్రీలోని షేర్ రాసన్ సైనేజి, పైధోని ప్రాంతంలోని హరహమీమ్ సైనేజి... ఈ అన్ని ప్రాంతాల మీద దాడులు చేయాలని వారు తలపెట్టి రెక్కీలు చేశారు. -
ఈ ఉగ్రవాదుల సమాచారమివ్వండి
ప్రజలకు ఎన్ఐఏ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల సమాచారం తెలిస్తే తమకు అందించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు తహసీన్ అక్తర్ అలియాస్ మోను, అలియాస్ హసన్, వకాస్ అలియాస్ జవేద్ అలియాస్ అహ్మద్‌లు దేశంలోనే ఉండివుంటారని అనుమానిస్తోంది. వీరిద్దరూ మళ్లీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉండొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్యాప్తు అధికారులు సూచించారు. 2010లో జరిగిన వారణాసి, 2011లో ముంబై పేలుళ్లకు కూడా వీరు బాధ్యులని ఎన్ఐఏ ప్రకటించింది. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల రివార్డును ఇప్పటికే ప్రకటించింది. వీరిద్దరి ఆచూకీ తెలిసినవారు ‘ఎస్పీ10.ఎన్ఐఏఎట్జీవోవీ.ఇన్’కు మెయిల్ పంపాలని, 011-23438200, 91-8540848216 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఎస్పీ, సీబీఐ-1, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్, 6వ అంతస్తు, ఎన్డీసీసీ బిల్డింగ్ -11, జై సింగ్ రోడ్, న్యూ ఢిల్లీ-110001 అడ్రస్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదుచేయవచ్చని వెల్లడించారు. కూనంనేనిపై కేసు ఎత్తివేయాలి: నారాయణ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన నాన్‌బెయిలబుల్ కేసుల్ని ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. -
పాక్ ఐఎస్ఐ నుంచే ఐఎంకు నిధులు: ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ నుంచి హవాలా మార్గంలో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని, ఆ డబ్బుతోనే వారు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి విధ్వంసాలకు పాల్పడుతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టుకు స్పష్టం చేసింది. స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్(సిమీ) సంస్థే.. ఐఎంగా మారిందని, దీనికి యాసిన్ భత్కల్ నేతృత్వం వహిస్తున్నాడని వివరించింది. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్లలో రెండో నిందితుడిగా ఉన్న భత్కల్ను ఢిల్లీ నుంచి నగరానికి తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు భత్కల్‌కు అక్టోబరు 17 వరకు రిమాండ్ విధించింది. అయితే, ఐఎస్ఐతో ఐఎంకున్న సంబంధాలు, పేలుళ్ల కుట్రలపై వివరాలు రాబట్టేందుకు భత్కల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. ఐఎస్ఐ నుంచి వచ్చిన నిధులతో దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపింది. ఈ క్రమంలో భత్కల్ తరఫు న్యాయవాది ముజఫరుల్లా వాదిస్తూ, భత్కల్ను ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తీసుకెళ్లి విచారించారని, కొత్తగా విచారించాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. వాదనల అనంతరం మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.లక్ష్మీపతి, పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తూ, మంగళవారం నుంచి అక్టోబరు 8 వరకు (15 రోజులు) భత్కల్ను ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారు. -
పోలీసుల నుంచి తప్పించుకున్న ఐఎం ఉగ్రవాది!
ముంబై: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదిగా భావిస్తున్న అఫ్జల్ ఉస్మానీ ముంబై పోలీసుల నుంచి శుక్రవారం తప్పించుకున్నాడు. గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్‌లలో 2008లో సంభవించిన పేలుళ్ల కేసులో ఉస్మానీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం రాయ్‌గఢ్‌లోని తలోజా జైలు నుంచి దక్షిణ ముంబైలోని సెషన్స్ కోర్టుకు తీసుకువస్తుండగా పోలీసు చెరనుంచి ఉస్మానీ తప్పించుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అతని కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు చెప్పారు. -
వరుస పేలుళ్లకు ఐదేళ్లు
న్యూఢిల్లీ: ఇటీవల ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అత ని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ల అరెస్టు నేపథ్యం లో వ రుస బాంబు పేలుళ్ల కేసులో ఇతర నిందితులను పట్టుకోగలుగుతామనే ధీమా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్నారు. 2008, సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం నగరంలోని కన్నాట్‌ప్లేస్, బారాఖంబారోడ్, గఫార్ మార్కెట్, గ్రేటర్ కైలాశ్ తదితర ప్రాంతాల్లో ఐదు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 26 మంది చనిపోగా 133 మంది గాయపడిన సంగతి విదితమే. ఇక కన్నాట్‌ప్లేస్, రీగల్ సినిమా, ఇండియా గేట్ల వద్ద పేలని బాం బులు లభించాయి. భత్కల్, అసదుల్లాలతో కలిపి ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు మొత్తం 16 మంది నిందితులను అరెస్టుచేశారు. మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉంది. న్యాయస్థానంలో దాఖలుచేసిన అభియోగపత్రం లోనూ పోలీసులు వీరిరువురి పేర్లు చేర్చారు. ఈ కేసు విషయమై పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ భత్కల్‌నుంచి మరింత సమాచారం లభించొచ్చంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. కుట్రదారుల పేర్లు కూడా బయటికొచ్చే అవకాశముందన్నారు. గఫార్ మార్కెట్లో జరిగిన బాంబు పేలుడు ఘటన మీరాదేవి అనే మహిళ జీవితంలో పెనువిషాదం మిగిల్చింది. ఈ ఘటనలో ఆమె నలుగురిని కోల్పోయింది. ప్రస్తుతం ఇంటికి సమీపంలోని ఓ రావి చెట్టు కింద మంచం వేసుకుని కాలం గడుపుతున్న మీరా ఇప్పటికీ ఆనాటి ఘటనను మరిచిపోలేకపోతోంది. ఆనా టి పేలుడు ఘటనలో ఆమె అల్లుడు హర్షన్, కుమార్తెలు సరోజ, పూజ. మనవడు అశోక్‌లు చనిపోయా రు. ఆనాటి ఘటన గురించి మాట్లాడుతూ ‘ఆ రోజు కూడా ఈ రావి చెట్టు కిందే కూర్చున్నా. సరోజ బతిమిలాడుతుండడంతో స్నానం చేసేందుకు లోపలికెళ్లా. అంతలోనే చెవులు పగిలిపోయేలా శబ్దం వినిపించింది. భూకంపం వచ్చిందేమోనని అనుకున్నా. స్నానంచేసిన తర్వాత బయటికి రాగా శవాలు చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించింది’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పింది. దేవుడా నన్ను మాత్రం ఎందు కు తీసుకెళ్లలేకపోయావంటూ రోదించానని తెలి పింది. సొంత బిడ్డలకంటే ఎంతో జాగ్రత్తగా చూసుకున్న తన అల్లుడిని ఎందుకు తీసుకు పోయావు దేవుడా అంటూ గద్గద స్వరంతో పలి కింది. కుటుంబసభ్యులంతా చనిపోయిన తర్వాత మీరా జీవితం అస్తవ్యస్తమైపోయింది. జీవనం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు 60 ఏళ్ల భగవతి అనే నగరవాసిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. కార్యాలయం నుంచి తిరిగొచ్చిన తన పెద్దకుమారుడు గంగా ప్రసాద్ అలి యాస్ బిల్లు టీ పెట్టమ్మా కాసేపాగి మళ్లొస్తా అంటూ బిల్లు బయటికెళ్లాడు. బిల్లు బయటికెళ్లిన కాసేపటి తరువాత భీకర శబ్దం వినిపించిందని భగవతి తెలిపింది. తాము ఉండే ప్రాంతమంతా పొగతో నిండిపోయిందని చెప్పింది. ఈ ఘటనలో గంగాప్రసాద్ చనిపోయాడు. చిన్నకుమారుడి తలకి గాయాల య్యాయని, అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలిపింది. -
బాంబులు పెట్టింది నేనే
హైదరాబాద్/న్యూఢిల్లీ: బాంబులతో దారుణ మారణకాండకు పాల్పడి, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 17 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నది తానేనని ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ అంగీకరించాడు. ఆ ఘటనలో వాడిన బాంబులను తయారు చేయడంతో పాటు, తానే స్వయంగా అమర్చానని భత్కల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. 2008 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన వివిధ పేలుళ్లకు పాల్పడింది కూడా తానేనని అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడాల్సిందిగా పాకిస్థాన్‌లో ఉన్నవారి నుంచి తనకు ఆదేశాలు అందినట్లు చెప్పాడు. ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 17 మంది మరణించగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు పాల్పడ్డ భత్కల్ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది తబ్రేజ్‌ను బీహార్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నిఘా సంస్థల సిబ్బంది విచారించారు. ఆ విచారణలో ‘దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ఎలా రెక్కీ నిర్వహించిందీ? బాంబులను తయారుచేసి స్వయంగా ఎలా పేలుళ్లకూ పాల్పడిందీ?’ తదితర విషయాలను భత్కల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దిల్సుఖ్నగర్ పేలుళ్ల ప్రాంతాన్ని, అక్కడి ఆధారాలను పరిశీలించిన రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు అప్పట్లోనే పలు కీలక విషయాలను వెల్లడించారు. రెండు బాంబులూ స్థానికంగానే తయారయ్యాయని, నిపుణులే వాటిని తయారుచేసి ఉంటారని కూడా గుర్తించారు. బాంబుల తయారీకి ఉపయోగించిన పదార్థాలన్నీ స్థానికంగా సేకరించుకున్నట్లు కూడా తేలింది. అత్యంత నైపుణ్యంతో ఎక్కువ నష్టం కలిగించేలా ఆ బాంబులను రూపొందించారు. అయితే.. ఆ బాంబుల తయారీకి పేలుడు పదార్థాల సేకరణలో స్థానికంగా భత్కల్‌కు ఎవరు సహకరించారు? భత్కల్ హైదరాబాద్‌లో ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు? తదితర విషయాలు భత్కల్ను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యాసిన్ భత్కల్ అరెస్టు సమయంలో రెండు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిళ్ల డీకోడింగ్ తలనొప్పే పేలుళ్ల సమయంలో మాత్రమే బినామీ అడ్రస్‌ల ద్వారా తీసుకున్న సిమ్‌కార్డులతో సెల్ఫోన్లు ఉపయోగించే భత్కల్.. సాధారణ సమయంలో తన మాడ్యుల్‌తో ఈ-మెయిళ్ల ద్వారానే సంబంధాలు నెరిపేవాడని తేలింది. హైదరాబాద్‌లోని కొందరితో కూడా ఈ-మెయిళ్ల ద్వారానే సంప్రదింపులు జరిపినట్లు భత్కల్ అంగీకరించినట్లు తెలిసింది. కానీ, ‘కోడ్’ల రూపంలో ఉన్న ఆ మెయిళ్లను ‘డీకోడ్’ చేయడం అధికారులకు సమస్యగా మారినట్లు సమాచారం. ‘డీకోడ్’ చేయగలిగితే దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సహకరించిన స్థానికులెవరనేది గుర్తించడం సాధ్యమవుతుందని అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరిగిన పలు పేలుళ్లకు తానే బాంబులను తయారు చేసినట్లు కూడా భత్కల్ బీహార్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. బాంబుల నమూనాలు, ఆకారాల్లో మార్పులు చేస్తూ అధికారులను బురిడీ కొట్టించానన్నాడు. బాంబుల తయారీలో వంద మంది యువకులకు శిక్షణ ఇచ్చాననీ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం. నేపాల్ ద్వారానే.. భారత్-నేపాల్‌ల మధ్య వీసా అవసరం లేకుం డా సులువుగా ప్రయాణించగల అవకాశాన్ని తాము ఉపయోగించుకున్నట్లు భత్కల్ చెప్పాడు. ఇరు దేశాల మధ్య తనతో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్ తరచూ ప్రయాణించేవారమన్నాడు. తన సోదరులు ఇక్బాల్, రియాజ్ భత్కల్‌లు ఇండియాకు వచ్చేవారు కాదని, ఇక్బాల్ మాత్రం నేపాల్‌కు వచ్చే వాడనీ చెప్పాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోని వారితో శాటిలైట్ ఫోన్లద్వారా మాట్లాడేవారమన్నాడు.అంతేగాకుండా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల కోసం బీహార్ యువకులను పెద్ద సంఖ్యలో ఇండియన్ ముజాహిదీన్‌లో చేర్చినట్లు భత్కల్ చెప్పారని సమాచారం. అందుకే పాత సైకిళ్లు... దిల్సుఖ్నగర్ పేలుళ్లకు, 2010 పుణెలో జర్మన్ బేకరీ పేలుళ్లకూ సైకిళ్లనే ఉపయోగించినప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు భత్కల్ చెప్పినట్లు తెలిసింది. పుణె పేలుళ్లలో కొత్త సైకిళ్లను వాడటంతో ఛాసిన్ నంబరు ఆధారంగా వాటిని కొనుగోలు చేసినవారిని దర్యాప్తు అధికారులు గుర్తిం చారు. అందువల్ల దిల్సుఖ్నగర్ పేలుళ్లకు మాత్రం రెండూ పాత సైకిళ్లనే ఉపయోగించామన్నాడు. దిల్సుఖ్నగర్ పేలు ళ్ల తర్వాత అధికారులు రెండు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నప్పటికీ బాగా పాతవి కావడంతో అవి ఎక్కడివి? ఎవరు కొనుగోలుచేశారు? అనేవి గుర్తించలేకపోయారు. -
'దిల్సుఖ్నగర్ పేలుళ్లకు వ్యూహం పన్నింది నేనే'
ఢిల్లీ: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఢిల్లీకి పయనం కానున్నారు. పేలుళ్లకు సూత్రధారి తానేనని భత్కల్ విచారణలో తెలపడంతో నగర పోలీసులు ఢిల్లీకి పయనమైందేకు సిద్ధమవుతున్నారు. ఈ విచారణంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ టీం సభ్యులు కూడా నగర పోలీసులకు జతకలవనున్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గత గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతనిపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. -
యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే
పాట్నా/న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దుల్లో పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే ఉంటున్నాడు. తాను చెబితే ఏమైనా చేయగల వంద మంది ఉగ్రవాదులను సైతం తయారు చేశాడు. ఇంటరాగేషన్‌లో అతడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. భత్కల్ను, అతడి సహచరుడు అసదుల్లా అక్తర్‌ను ఎన్ఐఏ పోలీసులు శుక్రవారం ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారిని పన్నెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. భత్కల్, అక్తర్లను బుధవారం రాత్రి నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్న ఎన్ఐఏ అధికారులు, తొలుత వారిని బీహార్‌లోని మోతిహారి కోర్టులో ప్రవేశపెట్టి, మూడు రోజుల బదిలీ రిమాండ్ పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ కోర్టులో గోప్యంగా జరిగిన విచారణలో నిందితుల తరఫు న్యాయవాది ఎస్.ఎం.ఖాన్, నిందితుల్లో ఒకరు మహమ్మద్ అహ్మద్ అని, అతడు యాసిన్ భత్కల్ కాదని వాదించారు. అయితే, మహమ్మద్ అహ్మద్ సిద్దిబప్ప, యాసిన్ భత్కల్ ఒక్కరేనని, అతడిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని ఎన్ఐఏ తన రిమాండ్ దరఖాస్తులో తెలిపింది. నిందితులను ఇతర రాష్ట్రాలకు తీసుకు వెళ్లేటప్పుడు వారి చేతులకు సంకెళ్లు వేసి తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని ఎన్ఐఏ అభ్యర్థించగా, కోర్టు అంగీకరించింది. ఉత్తర కర్ణాటకలోని ఉడిపి జిల్లా భత్కల్ గ్రామానికి చెందిన యాసిన్ భత్కల్ దాదాపు 40 ‘ఉగ్ర’ కేసుల్లో కీలక నిందితుడు. హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, పుణే, ఢిల్లీ, బెంగళూరు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ గత నెలలో ఢిల్లీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కాగా, ఇటీవల ఈద్ పర్వదినం సందర్భంగా భత్కల్ తన భార్యకు కానుకగా లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా పంపాడు. ఈ చర్య ఆధారంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతడి ఆచూకీని కనిపెట్టగలిగినట్లు సమాచారం. ఇంటరాగేషన్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తంచేయని భత్కల్, హెచ్చరిక పంపేందుకే తాను బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు చెప్పాడని సమాచారం. నేపాల్‌లో ఉన్న ఆరు నెలల్లోనూ తరచుగా ఇళ్లు మార్చేవాడినని, యునానీ వైద్యుడిగా చెప్పుకుంటూ అక్కడి ముస్లింలకు వైద్యం చేసేవాడినని చెప్పినట్లు మోతిహారి ఎస్పీ చెప్పారు. అయితే, గతనెల 7న బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో తమ పాత్ర లేదని అతడు విచారణలో చెప్పినా, అతడి పాత్ర ఉందనే తాము అనుమానిస్తున్నామని తెలిపారు. -
యాసిన్ భత్కల్ కు 12 రోజుల కస్టడీ
ఢిల్లీ:నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత అయిన యాసిన్ భత్కల్ ను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’కి కూడా కోర్టు కస్టడీకి అప్పగించింది. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది. పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అప్పగించారు.. -
జైల్లో నిద్రలేని రాత్రి గడిపిన భత్కల్
భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన కరుడు గట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ పాట్నాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రాంతమైన మిలటరీ క్యాంప్ జైలులో నిన్న రాత్రింతా నిద్రపోలేదని ఆ జైలు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ తెలిపారు. అలాగే అతడు ఒత్తిడి కూడా గుర్యయాడని చెప్పారు. భత్కల్‌తోపాటు చిక్కిన అసదుల్లా అక్తర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉందని పేర్కొన్నారు. తీవ్రవాదులు ఇద్దరు కూడా రాత్రి చాలా తక్కువగా ఆహారం తీసుకున్నారని, అలాగే మంచి నీరు కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పారు. ఆహారం తీసుకున్న సమయంలో తప్ప మిగతా సమయంలో అసలు మాట్లాడనే లేదని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. వారిరువురిని న్యూఢిల్లీలో విచారించేందుకు తమకు అనుమతి ఇప్పించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన అధికారుల అభ్యర్థనపై బీహార్ కోర్టు సానుకూలంగా స్పందించింది. వారిని మూడో రోజుల పాటు ఎన్ఐఏ ఉన్నతాధికారులకు అప్పగించాలని బీహార్ పోలీసులను కోర్టు గురువారం ఆదేశించింది. దాంతో ఆ తీవ్రవాదులిద్దరిని ఈ రోజు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ తరలించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో యాసిన్ భత్కల్ బాంబు పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించాడు. అతడిని తమకు అప్పగించాలని కేంద్రం హోం మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఇప్పటికే 12 రాష్ట్రాలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. -
ఆరు నెలలుగా ఐబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పేలుళ్లు సృష్టిస్తూ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన యాసిన్ భత్కల్ కదలికలపై కేంద్ర నిఘా విభాగం (ఐబీ) ఆరు నెలలుగా నిఘా తీవ్రం చేసింది. ఉగ్రవాద కదలికలను గుర్తించేందు కు ఐబీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విభాగం ద్వారా ఈ సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. దిల్సుఖ్నగర్ పేలుళ్ల సమయంలో యాసిన్, తబ్రేజ్‌లు వినియోగించిన ఫోన్ నంబర్లను నిఘావర్గాలు గుర్తించాయి. దేశవ్యాప్తంగా పేలుళ్ల కోసం ఆజంగఢ్, దర్బాంగ్ మాడ్యూల్స్‌ను యాసిన్ వినియోగించుకున్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ రెండు మాడ్యూల్స్‌లోని వ్యక్తులను నీడలా వెంటాడి యాసిన్ ఆచూకీపై కొంత సమాచారం రాబట్టారు. అతను పాక్, బంగ్లాదేశ్‌ల నుంచి ఇండో-నేపాక్ సరిహద్దుకు వచ్చివెళ్తున్నట్లు రూఢీ అయిన తరువాత సీక్రెట్ ఆపరేషన్‌ను వేగిరం చేశారు. తర్వాత ఎన్ఐఏ నుంచి కూడా కొంత సహకారం తీసుకున్నారు. బుధవారం రాత్రి అరెస్టు చేసేవరకూ బీహార్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అరెస్టు సమయంలో మాత్రం ఆ రాష్ట్ర అదనపు డీజీ స్థాయి అధికారులు ఇద్దరికి మాత్రం విషయం తెలిపారు. అరెస్టు సమయంలో యాసిన్ పాక్ పాస్‌పోర్టు కలిగివున్నట్లు సమాచారం. తాను ఇంజనీర్‌నని, ఉగ్రవాదులతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని అరెస్టు తరువాత కూడా నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఇలా పలుమార్లు త్రుటిలో తప్పించుకున్న అనుభవం యాసిన్‌కు ఉంది. అయితే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఎన్ఐఏ అధికారుల ద్వారా పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నారు. సుదీర్ఘ విచారణలో తాను యాసిన్ భత్కల్నేనని అతను అంగీకరించినట్లు తెలిసింది. యాసిన్ గుర్తింపును నిర్ధారించుకునేందుకు అతని డీఎన్ఏనూ పరీక్షించే అవకాశం ఉంది. నా కుమారుడు నిరపరాధి: యాసిన్ తండ్రి బెంగళూరు, న్యూస్‌లైన్: తన కుమారుడు యాసిన్ భత్కల్ నిరపరాధని, అతన్ని రక్షించుకోడానికి న్యాయ పోరాటం చేస్తానని అతని తండ్రి యాకుబ్ సిద్ది బాషా అన్నారు. ఆయన భత్కల్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు బూటకపు ఎన్కౌంటర్లో మరణించాడని భావించామని, అయితే బతికే ఉన్నాడని తెలిసి సంతోషిస్తున్నట్లు చెప్పారు. యాసిన్ కస్టడీ కోరుతున్న పలు రాష్ట్రాలు బెంగళూరు, న్యూస్‌లైన్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక పోలీసులు కూడా యాసిన్ భత్కల్ కస్టడీని కోరుతున్నారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి కర్ణాటక సహా అనేక రాష్ట్రాలలో బాంబు పేలుళ్లకు కారణమైన యాసిన్ భత్కల్ను ఇక్కడకు తీసుకొచ్చి విచారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తునకు కర్ణాటక పోలీసులు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. యాసిన్‌ను వీలైనంత త్వరగా బెంగళూరు తీసుకువస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. పలు ఉగ్రవాద కేసులతో సంబంధమున్న యాసిన్‌ను కస్టడీకి కోరనున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీకి సంబంధించిన పలు కేసుల్లో 2011లో ఢిల్లీ హైకోర్టు బయట జరిగిన పేలుళ్లు, 2008లో జరిగిన వరుస పేలుళ్లు కీలకమైనవని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుతో పాటు మరో 35 కేసుల్లో యాసిన్‌ను గుజరాత్ పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు పోలీసు జాయింట్ కమిషనర్ ఎ.కె.శర్మ చెప్పారు. మహారాష్ట్ర యాంటీ టైస్టు స్క్వాడ్ (ఏటీఎస్) యాసిన్ కస్టడీ కోరనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ చెప్పారు. -
యాసిన్ భత్కల్ ను హైదరాబాద్ కు రప్పిస్తాం: అనురాగ్ శర్మ
భారత, నేపాల్ సరిహద్దులో అరెస్టైన ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ లను విచారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు బీహార్ కు వెళ్లనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమీషన్ అనురాగ్ శర్మ మీడియాకు వెళ్లడించారు. ఫిబ్రవరి 21 తేదిన దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరస పేలుళ్ల ఘటనలో భత్కల్, అసదుల్లాలను విచారిస్తారని శర్మ తెలిపారు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్లతో సంబంధమున్న సీసీటీవీ దృశ్యాలతో భత్కల్, అసదుల్లాల చిత్రాలు సరిపోయాయని పోలీసులు తెలిపారు. విచారణలో పేలుళ్ల సంఘటనతో సంబంధమున్నట్టు తేలితే, తదుపరి విచారణకు భత్కల్, అసదుల్లాలను హైదరాబాద్ కు తీసుకువస్తామన్నారు. ఫిబ్రవరి 21 తేదిన జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 17 మంది మృత్యువాత పడగా, 100 మందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. తొలుత ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపగా, ఆతర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.