న్యూఢిల్లీ: రానున్న పండుగ రోజుల్లో ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ప్రణాళికలు వేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్‌లో అరెస్టయిన ఐఎం ఉగ్రవాది అజీజ్ షేక్ వెల్లడించిన సమాచారం మేరకు ఆ అభిప్రాయానికి వచ్చారు. గత ఏడాది ఐఎం నేత యాసిన్‌భత్కల్ అరెస్ట్ అనంతరం అజీజ్ నేపాల్ పారిపోయాడు.
ఇటీవల రియాజ్‌భత్కల్, మొహ్సిన్‌ల నుంచి ఢిల్లీ వెళ్లాలని షేక్‌కు ఆదేశాలందాయి. నేరుగా కాకుండా, లక్నో, మొరాదాబాద్, సహారన్‌పూర్‌ల మీదుగా వెళ్లాలని షేక్‌కు చెప్పారు. ఆ మార్గంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో దాడుల కోసం స్లీపర్ సెల్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూర్చేందుకే షేక్ ఢిల్లీ వెళ్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఢిల్లీలో దాడులకు ఐఎం కుట్ర!
Published Mon, Sep 8 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement