న్యూఢిల్లీ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అబ్దుల్ వాహిద్ సిద్ది బాపాను ఇంటర్ పోల్ అధికారులు అరెస్ట్ చేశారు. భారత్‌లో జరిగిన పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది అబ్దుల్ వాహిద్ సిద్దిబాపాను యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు అరెస్టు చేశారు.
గత నెలలో అతడు దుబాయ్ నుంచి అబుదాబి వెళ్లగా అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరచారు. దీంతో అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగనుంది. ముంబై ఉగ్రదాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులైన యాసిన్ భత్కల్, అతడి సోదరులకు వాహిద్ సమీప బంధువు. యూఏఈలో అబ్దుల్ వాహిద్ పట్టుబడినట్లు ఇంటర్ పోల్ అధికారులు వెల్లడించారు. ఇదే విషయమై మన దేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కూడా సమాచారం అందించారు.