ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.
ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు.
దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్‌ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.
దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఐఏ, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్‌ను కిగాలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment