న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. 33 ఏళ్ల లఖ్‌బీర్ ఖలిస్తానీ గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’ (బీకేఐ)కి చెందిన గ్యాంగ్‌స్టర్. 2021లో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై రాకెట్ దాడి ప్రణాళికలో భాగస్వామ్యుడు.
అదే విధంగా 2022 డిసెంబరులో తరన్ తరణ్‌లోని సర్హాలి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఆర్‌పీజీ దాడి ఘటనలోనూ లాండా పాత్ర ఉంది. అతను అనేక ఇతర తీవ్రవాద కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. లఖ్‌బీర్ స్వస్థలం పంజాబ్ కాగా గత కొన్నేళ్లుగా కెనడాలో స్థిరపడ్డాడు. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో అతని హస్తం ఉంది.
ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో లఖ్‌బీర్ సన్నిహితులతో సంబంధం ఉన్న 48 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), పంజాబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల అనంతరం కొంత మందిని అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 21న ఒక వ్యాపారిపై ఇద్దరు దుండగులు దాడి చేయడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. తాను లాండ హరికే అని చెప్పుకుంటూ ఓవ్యక్తి తనకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి పోలీసులకు చెప్పడంతో వారు దాడులు చేపట్టారు
చదవండి: డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్
Comments
Please login to add a commentAdd a comment