ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో కెనడా హిందూ ఫోరం ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్‌కు విజ్ఞప్తి చేసింది.
గురుపత్వంత్ సింగ్ పన్నూ అమెరికాకు చెందిన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనేది ఈ సంస్థ ఆశయం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కూడా పన్నూ ఇప్పటికే పలు ప్రకటనలు కూడా చేశాడు. ఈ క్రమంలో హిందువుల పట్ల ఆయన విద్వేషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పన్నూపై కెనడాలో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇరు దేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. కెనడా, యూకే, అమెరికా సహా విదేశాల్లో ఉన్న 18 మంది ఖలిస్థానీ నాయకులను ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. ఇండియాలో వారి ఆస్తులను జప్తు చేసింది. ఈ జాబితాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకరు.
కెనడాలో హిందువులు దేశం విడిచి వెళ్లాలని గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల వివాదాస్పద ప్రకటనలు జారీ చేశాడు. ఖలిస్థానీ మద్దతుదారులకే కెనడాలో స్థానం ఉందంటూ మాట్లాడారు. దీంతో అక్కడి హిందూ సంఘాలు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక ఐఎస్‌ఐ హస్తం
Comments
Please login to add a commentAdd a comment