ఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లాను కెనడాలో అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు వెల్లడించాయి.అయితే.. అతను విడుదలయ్యాడా లేదా ఇంకా జైలులో ఉన్నాడా? అనే దానిపై ఎటువంటి సమాచారం తెలియజేయలేదు. ప్రస్తుతం కెనడాతో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎటువంటి సమాచారం పంచుకోకపోవటం గమనార్హం. అతని నిర్బంధంపై అధికారిక ధృవీకరించలేదు. అక్టోబర్ 27-28 తేదీలలో కెనడాలో జరిగిన కాల్పుల తర్వాత డల్లాను అదుపులోకి తీసుకున్నారు.
కెనడియన్ ఏజెన్సీల ప్రకారం.. మిల్టన్‌లో జరిగిన కాల్పులపై హాల్టన్ ప్రాంతీయ పోలీసు సర్వీస్ (HRPS) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై హెచ్‌ఆర్‌పీఎస్.. గల్ఫ్ పోలీసులను సంప్రదించారు. ఆ రోజు కాల్పుల్లో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చేరారని, అందులో ఒకరికి డాక్టర్లు చికిత్స అందించి అనంతరం పంపించి వేశారని తెలిపారు.
మరోవైపు.. 28 ఏళ్ల డల్లా తన భార్యతో కలిసి కెనడాలోని సర్రేలో నివసిస్తున్నట్లు భారత భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. అతనికి దోపిడీ, హత్య, తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. అదీకాక.. అతనిపై UAPA కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతడిపై ఇప్పటికే పంజాబ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
పంజాబ్‌లోని జాగ్రావ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ పరమజీత్ సింగ్ హత్యకు డల్లా బాధ్యత వహించాడు. డేరా సచ్చా సౌదా అనుచరుడు మనోహర్ లాల్‌ను అతని సహచరులు నవంబర్ 2020లో కాల్చి హత్య చేశారు. మరో డేరా సచ్చా సౌదా అనుచరుడైన శక్తి సింగ్‌ను కిడ్నాప్ చేసి చంపడానికి కుట్ర పన్నడంలో డల్లా ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో భారత్ డల్లాను మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది.
#BreakingNews: Wanted Khalistani terrorist Arsh Dalla arrested in Canada@arvindojha joins us for more on this #ArshDalla #Canada #Khalistani (@ahuja_harshit94) pic.twitter.com/pWset1mtnh
— IndiaToday (@IndiaToday) November 10, 2024
క్రెడిట్స్: IndiaToday
చదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?
Comments
Please login to add a commentAdd a comment