ఇద్దరు స్నేహితుల మధ్య వంట గదిలో జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో 22ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
కెనడా పోలీసుల వివారాల మేరకు.. సుమారు నాలుగు నెలల క్రితం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం లుథియానాకు చెందిన 22 ఏళ్ల గురాసిస్ సింగ్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడ సర్నియా నగరంలో లాంబ్టన్ కాలేజీలు చేరాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో తన 34 క్రాస్లీ హంటర్‌తో కలిసి ఉంటున్నాడు.
అయితే, ఈ తరుణంలో నవంబర్ 30 రాత్రి తన రూమ్‌లో ఓ విషయంలో గురుసిస్‌కు,హంటర్‌ల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారి తీసింది. కిచెన్‌లో ఉన్న గురుసిస్‌ను హంటర్ కత్తి దాడి చేశారు. ఈ ఘటనలో గురుసిస్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ దుర్ఘటన అనంతరం, గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడు హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, ఈ హత్యపై విచారణ నిర్వహిస్తున్నామని సర్నియా పోలీస్ అధికారి డేవిస్ తెలిపారు. హత్యకు గల కారణాల్ని వెలుగులోకి తెస్తామన్నారు. కాగా, గురుసిస్ హత్యపై లాంబ్టన్ కాలేజీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment