ఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌లతో కలిసి ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే.. ఈ ఇంటర్వ్యూ విషయంలో కెనడా మరోసారి దూకుడుగా వ్యవహరించింది. ఇంటర్య్వూ ప్రసారం చేసిన.. ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్ , ఆస్ట్రేలియన్ న్యూస్ అవుట్‌లెట్ పేజీలు బ్లాక్ చేసింది.
అక్కడితో ఆగకుండా కొన్ని గంటల్లోనే సదరు మీడియా సంస్థపై కెనడా నిషేధం విధించింది. దీంతో కెనడా వ్యహరించిన తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు వాక్ స్వాతంత్రాన్ని కెనడా వంచిస్తోందని మండిపడింది. కెనడాలో ఆస్ట్రేలియా టుడే సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను బ్లాక్ చేయటంపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు.
‘‘ఆస్ట్రేలియా టుడే మీడియా అవుట్‌లెట్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పేజీలు బ్లాక్ చేయబడ్డాయి. కెనడాలోని వీక్షకులకు అవి అందుబాటులో లేవు. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్.. పెన్నీ వాంగ్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కొన్ని గంటల తర్వాత జరిగింది. కెనడా తీరుపై మేం ఆశ్చర్యపోయాం. చాలా వింతగా అనిపించింది. అయితే, ఇవి కెనడా కపటత్వాన్ని మరోసారి ఎత్తి చూపే చర్యలు.
..వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి విదేశాంగ మంత్రి మూడు విషయాల గురించి మాట్లాడారు. కెనడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోంది. భారత దౌత్యవేత్తలపై నిఘా కెనాడా నిఘా పెట్టడం ఆమోదయోగ్యం కాదు. కెనడాలో వేర్పాటువాదులకు రాజకీయంగా చోటు ఇస్తోంది. భారతదేశ అంశాలు మాట్లాడితే.. ఆస్ట్రేలియా టుడే ఛానెల్‌ను కెనడా ఎందుకు బ్లాక్ చేసింది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment