ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవటం దౌత్యపరంగా భారత్‌కు అనుకూలమని అమెరికాలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుందని తెలిపారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత ప్రధాన నరేంద్ర మోదీపై తనకు అభిమానం ఉందని చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. మోదీని ట్రంప్ స్నేహితుడిగా, బలమైన నాయకుడిగా భావిస్తారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యక్తిగత దౌత్యం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుంది. పరిపాలన మార్పులు గతంలో విజయవంతంగా జరిగాయి. ప్రతీ ప్రభుత్వ పరిపాలన ద్వారా ఇరుదేశాల మధ్య మెరుగైన లౌకిక బంధాల్లో అభివృద్ధి చెందాయి.
...ఇరు దేశాల మధ్య దౌత్య వ్యవహారాల విషయంలో ఎవరు (ట్రంప్ లేదా కమలా హారిస్) అధ్యక్ష పదవి చేపడతారనే ఆందోళన భారత్‌కు ఉందని భావించటం లేదు. అయితే.. అధ్యక్షుడిగా జో బిడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలనపై భారత్ ప్రాధాన్యతనిచ్చే కొన్ని అంశాలు ఉన్నాయని భావిస్తున్నా. ఇక.. పరిపాలనలో మార్పు వచ్చిన ప్రతిసారీ కొన్ని అడ్డంకులు సాధారణంగానే ఉంటాయి.
...అమెరికా ఒక ప్రపంచ శక్తి.. ఇది ప్రపంచస్థాయి నిర్ణయాలతో పాలన కొనసాగింస్తుంది. కొన్నిసార్లు అమెరికా తీసుకునే నిర్ణయాలు.. ప్రపంచ స్థాయిలో పరోక్షంగా ప్రభావం చూపుతాయి. అయితే.. ట్రంప్ భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, వాణిజ్యం వంటి కొన్ని అంశాల్లో మార్పులను ప్రవేశపెడితే.. అది మనపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment