Syed Akbaruddin
-
‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్‌కు అనుకూలం’
ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవటం దౌత్యపరంగా భారత్‌కు అనుకూలమని అమెరికాలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుందని తెలిపారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత ప్రధాన నరేంద్ర మోదీపై తనకు అభిమానం ఉందని చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. మోదీని ట్రంప్ స్నేహితుడిగా, బలమైన నాయకుడిగా భావిస్తారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యక్తిగత దౌత్యం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుంది. పరిపాలన మార్పులు గతంలో విజయవంతంగా జరిగాయి. ప్రతీ ప్రభుత్వ పరిపాలన ద్వారా ఇరుదేశాల మధ్య మెరుగైన లౌకిక బంధాల్లో అభివృద్ధి చెందాయి....ఇరు దేశాల మధ్య దౌత్య వ్యవహారాల విషయంలో ఎవరు (ట్రంప్ లేదా కమలా హారిస్) అధ్యక్ష పదవి చేపడతారనే ఆందోళన భారత్‌కు ఉందని భావించటం లేదు. అయితే.. అధ్యక్షుడిగా జో బిడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలనపై భారత్ ప్రాధాన్యతనిచ్చే కొన్ని అంశాలు ఉన్నాయని భావిస్తున్నా. ఇక.. పరిపాలనలో మార్పు వచ్చిన ప్రతిసారీ కొన్ని అడ్డంకులు సాధారణంగానే ఉంటాయి. ...అమెరికా ఒక ప్రపంచ శక్తి.. ఇది ప్రపంచస్థాయి నిర్ణయాలతో పాలన కొనసాగింస్తుంది. కొన్నిసార్లు అమెరికా తీసుకునే నిర్ణయాలు.. ప్రపంచ స్థాయిలో పరోక్షంగా ప్రభావం చూపుతాయి. అయితే.. ట్రంప్ భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, వాణిజ్యం వంటి కొన్ని అంశాల్లో మార్పులను ప్రవేశపెడితే.. అది మనపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని తెలిపారు.చదవండి: Donald Trump: మళ్లీ హౌడీ.. అంటారా? -
నమస్తేతో ఐక్యరాజ్యసమితికి అక్బరుద్దీన్ వీడ్కోలు
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత కీర్తిప్రతిష్టలు మరింత పెరిగేలా తన పదునైన మాటలతో ఆకట్టుకున్న భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం రిటైర్ అయ్యారు. ముఖ్యంగా ఐరాసాలో భారత్‌పై పాక్ తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతీసారి పాక్ ప్రతినిధులనోట మాట రాకుండా సయ్యద్ కడిగిపారేసేవారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారి 2016 జనవరి నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సయ్యద్ తర్వాత ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఇక తన వీడ్కోలు సందర్భాన్నికూడా కరోనావ్యాప్తిని అరికట్టడానికి వీలుపడే ఓ మంచి సూచనను ఇవ్వడానికి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రయత్నించారు. వీడియో కాల్ ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు భారత సంప్రదాయ పద్దతిలో నమస్కరించి తన విధులనుంచి తప్పుకున్నారు. నమస్కరించడానికి సమయం ఆసన్నమైంది అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుటెరస్‌కు నమస్కరిస్తున్న వీడియోను తన ట్విటర్‌ఖాతాలో సయ్యద్ పోస్ట్ చేశారు. తన విధులనుంచి తప్పుకునే ముందు ఓ చిన్న విన్నపం అంటూ గుటేరస్‌కు విజ్ఞప్తి చేశారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరినైనా కలిసినప్పుడు లేదా వీడ్కోలు సమయాల్లో హలోగానీ, షేక్ హ్యాండ్‌వంటివి కాకుండా నమస్తే అని చెబుతారు. అందుకే ఇప్పుడు కూడా నమస్తే చెప్పాలని అనుకుంటున్నాను అని గుటెరస్‌తో సయ్యద్ అన్నారు. దీనికి చిరునవ్వుతో నమస్తే అంటూ గుటెరస్‌కూడా బదులిచ్చారు. Time to bow out, with the usual🙏🏽 pic.twitter.com/BM6m7j7qQW — Syed Akbaruddin (@AkbaruddinIndia) April 30, 2020 -
ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు
ఐక్యరాజ్యసమితి: భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలిపోయింది. కశ్మీర్ అంశం ద్వైపాక్షికమైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘పాక్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘పాక్ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు’అని ఆయన వివరించారు. దురుద్దేశపూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా దౌత్యవేత్త ఝాంగ్ జున్ మాట్లాడుతూ ‘కశ్మీర్‌పై సమావేశం జరిగింది. భారత, పాక్ అంశం ప్రతి సమావేశంలోనూ ఉంటుంది. దీంతో భద్రతామండలి దీనిపై కొంత సమాచారం తెలుసుకుంది’అని పేర్కొనడం గమనార్హం. ఎస్సీఓ భేటీకి ఇమ్రాన్‌కూ ఆహ్వానం న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) వార్షికభేటీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పలువురు నేతలకు భారత్ ఆహ్వానం పంపనుంది. ఎస్సీవోలోని పాకిస్తాన్ సహా 8 సభ్య దేశాలు, నాలుగు పరిశీలక హోదా దేశాలనూ ఆహ్వానిస్తామని విదేశాంగ శాఖ మంత్రి రవీశ్ కుమార్ వెల్లడించారు. ‘గతం’ నుంచి భారత్ బయటపడాలి గత అనుభవాలు, ఆలోచనల చట్రంలో బందీగా ఉన్న భారత్, వాటి నుంచి బయటకు రావాల్సి ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. కీలక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో దేశం ప్రస్తుతం కొత్త వైఖరిని అనుసరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అయితే, తనను తాను స్వతంత్రంగా నిర్వచించుకుంటుందా లేక ఆ అవకాశాన్ని ఇతరులకు ఇస్తుందా అనేదే అసలైన ప్రశ్న అన్నారు. ఇందులో స్వతంత్ర వైఖరికే తనతోపాటు తమ పార్టీ మొగ్గుచూపు తాయని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలో జరుగుతున్న ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాటం సాగించాలన్నారు. ఈ పోరులో ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను భాగస్వాములను కానీయరాదని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో తమ దేశం దౌత్యా నికి సిద్ధమే కానీ, చర్చలకు మాత్రం కాదన్నారు. తమ సైనిక జనరల్ సులేమానీని చంపడం అమెరికా చేసిన క్షమించరాని తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇరాన్ మంత్రి జరీఫ్ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ‘రైజినా డైలాగ్’లో విదేశాంగ మంత్రి జై శంకర్ -
పాకిస్తాన్ పప్పులు ఉడకవు!
ఐక్యరాజ్య సమితి: చీకటి వ్యవహారాలు నడపడంలో రెండాకులు ఎక్కువే చదివిన పాకిస్తాన్ పప్పులు ఇకపై ఉడకబోవని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సెక్యురిటీ కౌన్సిల్లో జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్‌కు భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటు సమాధానమిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాంతిభద్రతల నిర్వహణపై బహిరంగ చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘‘చీకటి వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బృందం మరోసారి తన అసలు రూపాన్ని చూపింది. అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. వీటిని మేము ఖండిస్తున్నాం. పాకిస్థాన్‌కు నా ప్రతిస్పందన ఒక్కటే. కొంచెం ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఇప్పటికైనా వాళ్లు తమ పాపాలను కడిగేసుకునే ప్రయత్నం చేయాలి. మీ కథలు నమ్మేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు, తదనంతరం ఆ ప్రాంతంలో సమాచార వ్యవస్థలపై నిర్బంధం వంటి అంశాలను మునీర్ అక్రమ్ ప్రస్తావించారు. బాలాకోట్ దాడుల సందర్భంగా తాము వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను బందీగా చేసిన విషయాన్ని చెబుతూ.. భారత్ పాక్‌ల మధ్య ఘోర యుద్ధాన్ని నివారించాలంటే తక్షణమే కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద నెట్‌వర్క్‌లు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం కావడం, ఉగ్రవాదులు కొత్త ఆయుధాలు–టెక్నాలజీ సమకూర్చుకుంటుంటే నియంత్రించలేకపోవడం వంటి వాటిని మండలి లోపాలుగానే చూడాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన ఉద్దేశాల అమలుపై నిష్పక్షపాత సమీక్ష జరగాలని సూచించారు. ఇప్పటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా మండలిలో మార్పులు జరగాలని అన్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి ఛార్టర్ ఇప్పటికీ ప్రపంచ స్ఫూర్తికి ప్రతీకగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ సైన్యం శుక్రవారం ఎల్ఓసీ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది. పూంఛ్ సెక్టార్లో సరిహద్దు వెంబడి పాక్ సైన్యం మోర్టార్లతో కాల్పులు జరిపిందని సైనికాధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు మరణించారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. -
వెరైటీ దీపావళి: మీరు రాక్‌స్టార్!
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దివ్వెల పండుగ జరుపుకొని ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ తాను కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. అంతేకాదు అందరి కంటే భిన్నంగా దీపావళి అత్యంత ఎత్తులో సెలబ్రేట్ చేసుకుని ఆనందించారు. అసలు విషయమేమిటంటే... తన విధుల్లో భాగంగా అక్బరుద్దీన్ ఆదివారం విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే భారతీయులంతా దీపావళి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఆయన కూడా పండుగ చేసుకోవాలని భావించారు. బ్యాటరీ ఎల్ఈడీ కొవ్వొత్తి ‘వెలుగు’లోని డిన్నర్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్న అక్బరుద్దీన్... ‘కొంతమంది ముందే జరుపుకొన్నారు.. మరికొంత మంది కాస్త ఆలస్యంగా.. ఇంకొంతమంది ఇలా ఇదిగో నాలాగా 10 వేల అడుగుల ఎత్తులో. ఎలాగైతేనేం.. ఇది ఎల్లప్పుడూ సంతోషదాయకమే.. హ్యాపీ దీపావళి’ అంటూ తన డిన్నర్‌కు సంబంధించిన ఫొటో షేర్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ రాక్‌స్టార్. భిన్నత్వంలో ఏకత్వం చాటే విధంగా చాలా అందంగా దీపావళి జరుపుకొన్నారు. శుభాకాంక్షలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Some celebrate it early, some late... Some,like me, 10000 feet high... It still is always is Happy #Diwali. 🙏🏽 pic.twitter.com/GZCcpUqR4e — Syed Akbaruddin (@AkbaruddinIndia) October 27, 2019 -
మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేదెప్పుడు?
ఐరాస తీరుపై భారత్ ఆగ్రహం న్యూయార్క్: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడంతో భద్రతామండలి అనుసరిస్తున్న తీరును భారత్ గర్హించింది. ఐక్యరాజ్యసమితిలో సోమవారం జరిగిన సదస్సులో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడారు. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిందని..దీనిపై మండలి 9 నెలలు సమయం తీసుకుందన్నారు. కాగా, భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనను పాకిస్తాన్ వ్యతిరేకించింది. -
కశ్మీర్‌పై పాక్ అభ్యంతరాలు పట్టించుకోలేదు
-
ఉగ్ర చర్యలపై పొగడ్తలా..?
ఐరాసలో పాక్ తీరుపై భారత్ మండిపాటు * బుర్హాన్, కశ్మీర్ అంశాల్ని లేవనెత్తడంపై అభ్యంతరం * చర్చలే మా అభిమతం: అమెరికా ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఐక్యరాజ్యసమితిలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మృతిని, కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తడంపై భారత్ శుక్రవారం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఉగ్రవాదులు చేస్తున్న పనుల్ని పొగడటంతో పాటు, ఇతరుల భూభాగాల్ని పాకిస్తాన్ ఆశిస్తోందంటూ ఐరాసలో భారత రాయబారి సయద్ అక్బరుద్దీన్ ఒక ప్రకటనలో గట్టిగా సమాధానమిచ్చారు. బుధవారం ఐరాసలో మానవ హక్కులపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి మలీహా లోధీ కశ్మీర్ అంశంతో పాటు, బుర్హాన్ మృతిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కశ్మీర్ అంశంతో పాటు, బుర్హాన్‌ను భారత్ దళాలు అన్యాయంగా హత్య చేశాయంటూ లోధీ పేర్కొన్నారు. కశ్మీర్లో భారత దళాలు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనేందుకు బుర్హాన్ మృతి భీతిగొల్పే తాజా ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. దీనిపై అక్బరుద్దీన్ స్పందిస్తూ... పాకిస్తాన్ ఇతరుల భూభాగాన్ని దురాశపూరితంగా ఆశిస్తోందని, అందుకోసం ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా వాడడానికి పాకిస్తాన్ స్వస్తి పలకాలన్నారు. ఐరాస జాబితాలోని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ మానవ హక్కులు, స్వయం పాలనకు మద్దతుగా మాట్లాడడంపై విస్మయం వ్యక్తం చేశారు. చర్చలకు ఆహ్వానం: బాన్ కీ మూన్ బుర్హాన్ మృతితో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో అన్ని వర్గాలు నిగ్రహం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య ప్రత్యక్ష చర్చల్ని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తానని అన్నారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి భారత్, పాకిస్తాన్ల మధ్య చర్చలు కొనసాగాలని అమెరికా కోరుకుంటుందని ఆ దేశ స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ చెప్పారు. సంబంధాలు తెంచుకోండి: సయీద్ భారత్ పాలిత కశ్మీర్లో హింస పెరుగుతోందని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించారు. కశ్మీర్ వివాదంలో అమెరికాను ఒప్పించకపోతే ఆ దేశంతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలంటూ దేశ వ్యాప్త ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా శుక్రవారం ర్యాలీలు నిర్వహిస్తామంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఫరూక్‌కు ఫోన్లో చెప్పారు. -
'ఉగ్రవాద కార్యకలాపాలపై విశ్వాసం లేదు'
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల్ని బాధ్యులుగా చేయాలి ఐక్యరాజ్యసమితిలో భారత్ డిమాండ్ అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి భారత్ పిలుపు యూఎన్: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల్నే బాధ్యులుగా చేయాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ డిమాండ్ చేసింది. ఇందుకు గాను అంతర్జాతీయ ఉగ్రవాదంపై దేశాల మధ్య సమగ్ర ఒప్పందానికి భారత్ పిలుపునిచ్చింది. శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో జరిగిన గ్లోబల్ కౌంటర్ టైజమ్ స్ట్రేటజీస్ అంశంపై ఐదో సమీక్ష సదస్సులో ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కారణాలతో గానీ, న్యాయం పేరుతో గానీ జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై భారత్‌కు ఎంతమాత్రమూ విశ్వాసం లేదని.. ఎటువంటి ఉగ్రకార్యకలాపాలను తమ దేశం ఉపేక్షించబోదని ఆయన అన్నారు. ఉగ్రదాడులు ఏ ఒక్కదేశానికో పరిమితం కాలేదని అంతర్జాతీయ ఉగ్రవాదాన్నిఅన్ని దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు. ఉగ్రదాడుల బాధితులు ఏ ఒక్కదేశానికో లేదా ఏ ఒక్క జాతికో, మతానికో మాత్రమే పరిమితమైన వారు కాదని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై మరింత వేగవంతంగా, సమష్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి తమ దేశం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. దురదృష్టవశాత్తూ అది ఇప్పటికీ చట్టబద్దతను కల్పించుకోలేకపోయిందన్నారు. ఇప్పటికైనా ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, ఉగ్రవాద సంస్థలను పెంచిపోషించడం వంటి చర్యలను అరికట్టాలని అన్ని దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో బంగ్లాదేశ్ ప్రతినిధి మసూద్ బిన్ మొమెన్ తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఉగ్రదాడిఘటనకు సంబంధించి మాట్లాడుతూ... తమ దేశం ఉగ్రవాదంపై నిరంతర పోరును కొనసాగిస్తుందని, యువతను ఉగ్రవాదం వైపు మళ్లకుండా వివిధ మతాల పెద్దలు, విద్యావేత్తలు, పౌర సమాజంతో కలసి పనిచేస్తామన్నారు. -
క్రికెట్ జెర్సీలలో మురిసిన నేతలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండో క్రికెట్ జెర్సీలఫొటో ఒకటి ట్విట్టర్లో ఆకర్షణగా నిలిచింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తన ట్టిట్టర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. నేతలిద్దరూ ఇండియా క్రికెట్ నెం.1, ఫ్రాన్స్ క్రికెట్ నెం.1 అని రాసి ఉన్న జెర్సీలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు భారత్ మరియు ఫ్రాన్స్ ఒకటి.. ఒకటి.. పదకొండు అంటూ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ జర్మనీ, కెనడాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. -
ఇరాన్ అణుఒప్పందానికి భారత్ స్వాగతం
న్యూఢిల్లీ: అణు కార్యక్రమాల విషయంలో ఇరాన్, ఆరు ప్రపంచ శక్తిమంత దేశాల(సిక్స్ వరల్డ్ పవర్స్) మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని భారత్ ప్రకటించింది. తామెప్పుడూ శాంతియుత అణుకార్యక్రమాలకే మద్ధతిస్తామని, ఆరు దేశాల ప్రతినిధులు ఇరాన్‌తో ఆ మేరకే చర్చలు జరిపి విజయం సాధించినట్లు తెలిపింది. దీనిపై పూర్తిస్థాయిలో జరిగే ఒప్పందంపై జూన్ 30న సంతకాలు జరగనున్నట్లు పేర్కొంది. 'ప్రపంచాన్ని మరింత శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లగల, అందరికి సముచితమైన కీలక ఒప్పందంపై జూన్ 30న నిర్ణయం జరగనుంది' అని భారత విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ తెలిపారు. ఇరాన్ అణుకార్యక్రమాల వివాదాన్ని ఆ దేశ హక్కులను గౌరవిస్తూనే శాంతియుత మార్గంలో పరిష్కరించాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని ఆయన చెప్పారు. ఆరు ప్రపంచ శక్తులు అనగా చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా, జర్మనీ. ఇవీ ప్రపంచ దేశాల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇరాన్ నిర్వహించే అణుకార్యక్రమాలను నియంత్రించడం కోసం శాంతియుత పంథాను అనుసరించేందుకు 2006లో ఏర్పడ్డాయి. టెహ్రాన్ వివాదాస్పద అణుకార్యక్రమం విషయంలో దౌత్య ఒప్పందాలు చేస్తుంటాయి. -
భారత్ రానున్న సింగపూర్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్ల నేపథ్యంలో సింగపూర్ అధ్యక్షుడు టాన్ కెంగ్ యామ్ భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం వెల్లడించారు. టాన్ కెంగ్ యామ్ పర్యటనలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పలు అంశాలపై చర్చ జరుగనుందని తెలిపారు. 9 ఏళ్ల అనంతరం సింగపూర్ అధ్యక్షుడు భారత్‌లో పర్యటిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 2006లో అప్పటి భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సింగపూర్‌లో పర్యటించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో సింగపూర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. -
నూతనాధ్యాయానికి నాంది
మోదీ, ఒబామాల మధ్య కెమిస్ట్రీ మంచి ఫలితాలనిస్తుంది పరస్పర ప్రయోజనకర కీలకాంశాలపై ఇరువురి నేతల మధ్య చర్చ పౌర అణు ఒప్పందం అమలుపై చర్చల్లో ముందంజ ఒబామా పర్యటనపై అమెరికా వ్యాఖ్య వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు కొత్తగా ప్రారంభమవబోతున్నాయని అమెరికా ప్రకటించింది. ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీల సాన్నిహిత్యం, వ్యక్తిగత స్నేహం ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల ఫలితాలనందిస్తుందని విశ్వసిస్తున్నామని అమెరికా జాతీయ ఉప భద్రతాసలహాదారు బెన్ రోడ్స్ పేర్కొన్నారు. గత సంవత్సరం అమెరికాలో ఒబామా, మోదీల భేటీ సందర్భంగా ఇరువురు నేతల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, అది ఇరుదేశాలకు ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల అనుబంధంలో దాగిన అసాధారణ శక్తిని వెలికితీసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్న విషయం ఒబామా పర్యటనద్వారా ప్రపంచానికి వెల్లడవుతుందన్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలన్న మోదీ ఆహ్వానం వైట్‌హౌజ్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందని రోడ్స్ వ్యాఖ్యానించారు. ఆ వేడుకలకు హాజరవుతున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే కావడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత కల్పించిందన్నారు. భారత్‌తో సంబంధాల్లో పర్యావరణ మార్పు, విద్యుత్ విధానం అంశాలకు తమ ఎజెండాలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. అలాగే, ఆర్థిక, రక్షణ రంగాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు భారత్‌తో చర్చల్లో కీలకం కానున్నాయన్నారు. ఒబామాతో పాటు అమెరికా భద్రతాసలహాదారు సునాన్ రైస్, వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిజెకర్, పలువురు అమెరికా వ్యాపార ప్రతినిధులు భారత్‌కు వస్తున్నారు. కాగా, ఒబామా పర్యటన భారత్‌కు అత్యంత ప్రధాన దౌత్యపరమైన కార్యక్రమమని గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, ప్రాంతీయ పరిస్థితులు.. తదితర అంశాలు ఒబామా, మోదీల మధ్య చర్చల్లో ప్రస్తావనకు వస్తాయని వెల్లడించారు. పౌర అణు ఒప్పందం అమల్లో ఎదురవుతున్న అడ్డంకులపై ఇరుదేశాల అధికారుల మధ్య లండన్‌లో జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితం దిశగా సాగుతున్నాయన్నారు. అణుపరిహారం, అణు సరఫరా బృందంలో భారత్‌కు చోటు మొదలైన అంశాలపై సంప్రదింపుల బృందం చర్చిస్తోందన్నారు. అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం జరిగినప్పుడు అణు సరఫరాదారులే బాధ్యత వహించాలన్న భారత చట్టాలను అమెరికా, ఫ్రాన్స్‌లు అంగీకరించడం లేదు. నిర్వహణదారులే బాధ్యత వహించాలనే అంతర్జాతీయ నిబంధనలను పాటించాలని ఆ దేశాలు కోరుతున్నాయి. ఈ విషయం భారత్, అమెరికాల అణు ఒప్పందం అమలులో పీటముడిగా మారింది. ఒబామా పర్యటన సందర్భంగా ఈ సమస్యను పరిష్కరించి అణు ఒప్పందం అమలుకు మార్గం సుగమం చేయాలని ఇరుదేశాలు కృషి చేస్తున్నాయి. గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం, తాజ్ మహల్ సందర్శన మాత్రమే ఒబామా పర్యటన ఉద్దేశం అని వస్తున్న విమర్శలను అక్బరుద్దీన్ తోసిపుచ్చారు. రక్షణ, ఆర్థిక, ఇంధన, అంతర్జాతీయ, ప్రాంతీయ సంబంధాల్లో అమెరికా భారత్‌కు కీలక భాగస్వామి అని, ఆ సంబంధాల మెరుగుదలకు ఒబామా పర్యటన దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మోదీ, ఒబామా సంయుక్తంగా ఒక రేడియో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కాగా, గతవారం ఒకసారి, గతనెల్లో ఒకసారి ఐదుగురు సభ్యుల అమెరికా భద్రతానిపుణుల బృందం ఢిల్లీలోని ఎయిమ్స్‌ను పరిశీలించింది. ముఖ్యంగా ట్రామా కేంద్రంలోని సౌకర్యాలను పరీక్షించింది. మరోవైపు, గణతంత్ర వేడుకల వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 90 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు. -
షరీఫ్‌తో మోడీ భేటీ లేదు
కాట్మాండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి భేటీ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ బుధవారం నేపాల్ రాజధాని కాట్మాండ్‌లో స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల మధ్య భేటీకి ఇప్పటి వరకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు. 18వ సార్క్ సమావేశాలు కాట్మాండ్‌లో ఈ రోజు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ దేశాల ప్రధానులతోపాటు మరో ఆరు దేశాధినేతలు ఈ సమావేశాలకు హాజరయ్యరు. దీంతో భారత్, పాక్ నేతలు ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించే అవకాశం ఉందా అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సయ్యద్ అక్బరుద్దీన్‌పై విధంగా స్పందించారు. ఇటీవల కాలంలో భారత్‌పై పాకిస్థాన్ తరచుగా కాల్పులకు తెగబడుతు గతంలో ఇరుదేశాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇరుదేశాల ప్రధానులు సార్క్ సమావేశాలలో భాగంగా భేటీ అయి చర్చించ వచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
స్వదేశానికి మరో 200 మంది
* ఇరాక్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి.. * రెండు రోజుల్లో మరో 2,200 మంది న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఇరాక్ నుంచి మరో 201 మంది భారతీయులు ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. భారత విదేశాంగ శాఖ వీరిని నజాఫ్ నుంచి ఇరాకీ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో వేకువజామున ఢిల్లీకి తీసుకొచ్చింది. ఎయిరిండియా, ఇతర విమాన సంస్థల ప్రత్యేక విమానాల ద్వారా వచ్చే రెండు రోజుల్లో మరింత మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆదివారం తెలిపారు. ఘర్షణలు లేని దక్షిణ ఇరాక్‌లో ఉన్న దాదాపు 2,200 మంది భారతీయులు అక్కడి నుంచి వస్తామని చెప్పారని, రెండు రోజుల్లో వీరినీ భారత్‌కు తీసుకొస్తామన్నారు. వీరిలో 600 మందికి వారి యాజమాన్య కంపెనీలు టికెట్లు ఇచ్చాయని, మిగతా 1600 మందికి భారత ప్రభుత్వం టికెట్లు ఇస్తోందని తెలిపారు. ‘వచ్చే 48 గంటల్లో నజాఫ్ నుంచి 200 మందిని, బస్రా నుంచి 280 మందిని ప్రత్యేక విమానాలు ఢిల్లీకి తీసుకొస్తాయి. నజాఫ్ నుంచి మరో వాణిజ్య విమానంలో 117 మంది సోమవారం ఢిల్లీ చేరుకుంటారు. బాగ్దాద్‌లోని భారత ఎంబసీ.. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబైలకు చెందిన 600 మందికి ఇదివరకే టికెట్లు సమకూర్చింది. వీరిలో చాలా మంది స్వస్థలాలకు చేరుకున్నారు. నజాఫ్, కర్బలా, బస్రా, బాగ్దాద్లలో నాలుగు సంచార బృందాలు స్వదేశానికి రావాలనుకునే భారతీయుల వివరాలు సేకరిస్తున్నాయి’ అని తెలిపారు. నావి తప్పులైతే సలహాలివ్వండి: ఐఎస్ఐఎస్ నేత బకర్ బాగ్దాద్: ఇరాక్ మిలిటెంట్లు ఇస్లామిక్ రాజ్యాధినేత(ఖలీఫా)గా ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) నేత అబూ బకర్ అల్ బగ్దాదీ తొలిసారిగా ఓ వీడియోలో కనిపించారు. ఆయన మోసుల్ లో శుక్రవారం ఓ మసీదులో ప్రసంగిస్తున్నట్లున్న ఈ వీడియోను మిలిటెంట్లు ఆన్లైన్లో ఉంచారు. ‘మీలో నేను సమర్థుడిని కాకపోయినా నేనే మీ నాయకుడిని. నేను సరైన దారిలో వెళ్తుంటే మద్దతివ్వండి. నావి తప్పులైతే సలహాలివ్వండి’ అని బకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.