భారత్ రానున్న సింగపూర్ అధ్యక్షుడు | Singapore president to visit India from Feb 8 | Sakshi
Sakshi News home page

భారత్ రానున్న సింగపూర్ అధ్యక్షుడు

Published Fri, Feb 6 2015 8:43 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్ల నేపథ్యంలో సింగపూర్ అధ్యక్షుడు టాన్ కెంగ్ యామ్ భారత్లో పర్యటించనున్నారు.

న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్ల నేపథ్యంలో సింగపూర్ అధ్యక్షుడు టాన్ కెంగ్ యామ్ భారత్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్లో పర్యటించనున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం వెల్లడించారు.

టాన్ కెంగ్ యామ్ పర్యటనలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పలు అంశాలపై చర్చ జరుగనుందని తెలిపారు. 9 ఏళ్ల అనంతరం సింగపూర్ అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 2006లో అప్పటి భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సింగపూర్లో పర్యటించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని  నిర్మాణంలో సింగపూర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement