దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దివ్వెల పండుగ జరుపుకొని ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ తాను కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. అంతేకాదు అందరి కంటే భిన్నంగా దీపావళి అత్యంత ఎత్తులో సెలబ్రేట్ చేసుకుని ఆనందించారు. అసలు విషయమేమిటంటే... తన విధుల్లో భాగంగా అక్బరుద్దీన్ ఆదివారం విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే భారతీయులంతా దీపావళి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఆయన కూడా పండుగ చేసుకోవాలని భావించారు. బ్యాటరీ ఎల్‌ఈడీ కొవ్వొత్తి ‘వెలుగు’లోని డిన్నర్ చేశారు.
ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేసుకున్న అక్బరుద్దీన్... ‘కొంతమంది ముందే జరుపుకొన్నారు.. మరికొంత మంది కాస్త ఆలస్యంగా.. ఇంకొంతమంది ఇలా ఇదిగో నాలాగా 10 వేల అడుగుల ఎత్తులో. ఎలాగైతేనేం.. ఇది ఎల్లప్పుడూ సంతోషదాయకమే.. హ్యాపీ దీపావళి’ అంటూ తన డిన్నర్‌కు సంబంధించిన ఫొటో షేర్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ రాక్‌స్టార్. భిన్నత్వంలో ఏకత్వం చాటే విధంగా చాలా అందంగా దీపావళి జరుపుకొన్నారు. శుభాకాంక్షలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Some celebrate it early, some late...
— Syed Akbaruddin (@AkbaruddinIndia) October 27, 2019
Some,like me, 10000 feet high...
It still is always is Happy #Diwali. 🙏🏽 pic.twitter.com/GZCcpUqR4e
Comments
Please login to add a commentAdd a comment