Diwali 2019
-
‘ఇండియన్ అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నా’
న్యూజెర్సీ: అది న్యూజెర్సీలోని ఇండియా స్క్వేర్ ప్రాంతం. దీపావళి నాడు భారతీయులు పేల్చిన టపాకాయల శబ్ధంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అన్నీ టపాకాయలు కాల్చేసిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఖాళీ డబ్బాలతో, కాల్చి పడేసిన టపాకాయలతో వీధి అంతా చెత్త పేరుకుపోయింది. టపాకాయలు కాల్చడం వల్ల కాలుష్యపు పొగలు కూడా కమ్ముకున్నాయి. దీంతో అక్కడి జనం నీళ్లతో వీధిని శుభ్రం చేయటానికి కదిలారు. పద్నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను సంధ్య అనే యువతి ట్విటర్లో షేర్ చేసింది. భారతీయురాలినని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నానంటూ కామెంట్ జోడించింది. మరోవైపు ఆ వీధిలో పెట్రోలింగ్ నిర్వహించి.. బాధ్యతగా వ్యవహరించిన పోలీసులపై ప్రశంసలు కురింపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారతీయులు పండగ వేడుకలు నిర్వహించుకున్న అనంతరం శుభ్రం చేయకుండా ఉండిపోవడంపై అమెరికన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అడుగుపెట్టేముందు భారతీయులకు శుచీ శుభ్రత గురించి పాఠాలు నేర్పాల్సిన అవసరం ఉంది అని ఓ నెటిజన్ క్లాసు పీకాడు. ఇదా మీ సంస్కృతి అంటూ మరో నెటిజన్ హేళనగా కామెంట్ చేశాడు. దీంతో సరదాగా సాగాల్సిన దీపావళి వివాదాలతో ముగిసింది. all indians should undergo compulsory rigorous training camps on cleanliness before entering these developed countries — Kishor Siri (@KishyCool) October 29, 2019 — Bala Iyer (@Bala1000) October 28, 2019 — shared share (@SharedShare) October 29, 2019 -
నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?
ముంబై : దీపావళి సందర్భంగా సెలబ్రిటీలు తమ అభిమానులకు విషెస్ చెప్పడం సాధారణమే. అయితే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ట్విటర్ వేదికగా చెప్పిన దీపావళి విషెస్ పెద్ద దుమారాన్నే రేపాయి. కింగ్‌ఖాన్‌ను ట్రోల్స్ బారిన పడేలా చేశాయి. షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, కుమారుడు అబ్రామ్తో కలిసి నుదుటన తిలకం ఉన్న ఫోటోను షేర్ చేయడమే ఇందుకు కారణం. ‘ముస్లిం మతస్తుడివి అయి ఉండి ఒక ఫోటో కోసం ఇలా తిలకం పెట్టుకుంటావా’ అంటూ కొంతమంది నెటిజన్లు షారూఖ్‌పై విరుచుకుపడుతున్నారు. అతడిని వ్యతిరేకిస్తూ ట్విటర్లో అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో షారూఖ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై ప్రముఖ బాలీవుడ్ నటి అజ్మి షబానా స్పందించారు. కేవలం తిలకం పెట్టుకున్నంత మాత్రాన షారూఖ్‌ను ఫేక్ముస్లిం అని నిందించడం దారుణమన్నారు. ‘ప్రతీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. భారతీయ అందమైన సంప్రదాయమైన తిలకం పెట్టుకున్నంత మాత్రాన ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇస్లాం మరీ అంత బలహీనమైనది కాదు. గంగా జమునా సంగమంలోనే భారత నిజమైన అందం దాగుంది’ అని ట్రోల్స్‌కు చురకలు అంటించారు. అయినా వెనక్కి తగ్గని ట్రోలర్స్ షారుఖ్‌కి సపోర్ట్ చేసినందుకు షబానాను కూడా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా షారూఖ్‌కు ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. గతంలో గణేష్ చతుర్థి సందర్భంగా తన నివాసం ‘మన్నత్’లో అబ్రం వినాయకుడిని పూజిస్తున్న ఫొటోను పోస్ట్ చేసినందుకు గానూ ముస్లిం నెటిజన్లు అతడిని తీవ్రంగా విమర్శించారు. Appalled to read that @iamsrk Diwali greeting invites wrath of rabid Islamists, gets called a “False Muslim” for sporting a tilak!”FUNDOS get a life! Islam is not so weak that it stands threatened by what is a beautiful Indian custom.Indias beauty is in her GangaJamuni tehzeeb — Azmi Shabana (@AzmiShabana) October 28, 2019 -
దీపావళి ఎఫెక్ట్; 167 కేసులు.. 799 మంది అరెస్టు
సాక్షి, నిజామాబాద్ : దీపావళి పండగ నేపథ్యంలో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ముమ్మర దాడులు జరిపారు. మొత్తం 167 కేసులు నమోదు చేసి 799 మందిని అరెస్టు చేశారు. రూ. 15,04,180 స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ డివిజన్లో 105 కేసులు నమోదు అయ్యయి. 464 మందిని అరెస్టు చేశారు. రూ. 8,15,000 స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్లో 41 కేసులు నమోదు చేసి 233 మందిని అరెస్టు చేశారు. రూ. 5,69,580 స్వాధీనం చేసుకున్నారు. బోధన్ డివిజన్లో 21 కేసులు నమోదు చేసి 102 మందిని అరెస్టు చేశారు. రూ.1,19,600 స్వాధీనం చేసుకున్నారు. -
టపాసులు పేల్చినందుకు వ్యక్తి దారుణ హత్య
భువనేశ్వర్ : దీపావళి పండగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఎంతో సంబరంగా టపాసులు కాల్చుతున్న ఓ వ్యక్తికి ఆ సంతోషమే చివరి క్షణాలుగా మారాయి. టపాసులు కాల్చొద్దు అన్న మాట పట్టించుకోనందుకు కొంతమంది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రాజధాని సమీపంలోని సుందర్‌పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు టపాసులు పేల్చుతున్నాడు. బాణాసంచా కాల్చుతుండగా ఆ దారిలో వెళ్తున్న కొంత మంది అమరేశ్ వద్దకు వచ్చి టపాకాయలు కాల్చనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అది ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీయగా.. కోపానికి గురైన 15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా అమరేశ్‌పై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. దీంతో సదరు వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అమరేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు. దీపావళి నాడు జరిగిన ఘటనల్లో పలు ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. కియోంజార్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దీపావళి పటాసులు కాల్చుతున్న క్రమంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో మరణించగా, భద్రక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అలంకరించే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. -
వెరైటీ దీపావళి: మీరు రాక్‌స్టార్!
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దివ్వెల పండుగ జరుపుకొని ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ తాను కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. అంతేకాదు అందరి కంటే భిన్నంగా దీపావళి అత్యంత ఎత్తులో సెలబ్రేట్ చేసుకుని ఆనందించారు. అసలు విషయమేమిటంటే... తన విధుల్లో భాగంగా అక్బరుద్దీన్ ఆదివారం విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే భారతీయులంతా దీపావళి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఆయన కూడా పండుగ చేసుకోవాలని భావించారు. బ్యాటరీ ఎల్ఈడీ కొవ్వొత్తి ‘వెలుగు’లోని డిన్నర్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్న అక్బరుద్దీన్... ‘కొంతమంది ముందే జరుపుకొన్నారు.. మరికొంత మంది కాస్త ఆలస్యంగా.. ఇంకొంతమంది ఇలా ఇదిగో నాలాగా 10 వేల అడుగుల ఎత్తులో. ఎలాగైతేనేం.. ఇది ఎల్లప్పుడూ సంతోషదాయకమే.. హ్యాపీ దీపావళి’ అంటూ తన డిన్నర్‌కు సంబంధించిన ఫొటో షేర్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ రాక్‌స్టార్. భిన్నత్వంలో ఏకత్వం చాటే విధంగా చాలా అందంగా దీపావళి జరుపుకొన్నారు. శుభాకాంక్షలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Some celebrate it early, some late... Some,like me, 10000 feet high... It still is always is Happy #Diwali. 🙏🏽 pic.twitter.com/GZCcpUqR4e — Syed Akbaruddin (@AkbaruddinIndia) October 27, 2019 -
దీపావళి: ఫొటోలు షేర్ చేసిన ‘చందమామ’
దీపావళి పండగను సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు వారి ఫ్యామిలీతో కలిసి పండగ జరుపుకోడానికే ఓటేస్తారు. ఈ లిస్టులో ముందు వరుసలో ఉండేది.. టాలీవుడ్ సుందరి కాజల్ అగర్వాల్. దీపావళి పండగను ఆనందమయంగా జరుపుకొన్న క్షణాలను ఈ చందమామ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సోదరి నిషా అగర్వాల్, ఆమె కొడుకు ఇషాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిరాడంబరంగా జరుపుకున్నట్టుగా కనిపిస్తున్న ఫొటోలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఇక దీపావళి పండగకు వెలుగులతోపాటు ఆలోచనలను కూడా పంచుకోండని పిలుపునిచ్చింది ఈ ముద్దుగుమ్మ. పనిలో పనిగా బంధాలను మరింత బలోపేతం చేసుకోండని సూచించింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ కూడా తన ఫ్యామిలీతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మేరకు భార్య కాజోల్ దేవగన్, కూతురు నైశాతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపాడు. మరో బాలీవుడ్ సంచలన తార సన్నీలియోన్ కూడా తన కుటుంబంతో కలిసి పండగ జరుపుకోడానికే మొగ్గు చూపింది. భర్త డేనియ్ వెబర్‌తోపాటు ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందజేసింది. -
దీపావళి ఎఫెక్ట్; ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి వేళ దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం తారాస్థాయికి చేరింది. పండగ వేడుకల అనంతరం నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. ‘సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్)’ నివేదిక ప్రకారం.. దేశ రాజధానిలో సోమవారానికి పవన నాణ్యత సూచీ ఉదయం 9 గంటలకు 463గా ఉండటంతో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా.. సుప్రీంకోర్టు 2018లోనే వాతావరణానికి హాని కలిగించే టపాసులను కాల్చరాదని, కేవలం ఎకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చాలని ఆదేశించింది. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ టపాసుల అమ్మకాలను నిషేధించగా కాకరవొత్తులు, చిచ్చుబుడ్లను మాత్రమే కాల్చుకోవడానికి అనుమతినిచ్చింది. ఇవి కూడా కేవలం ప్రభుత్వం తయారు చేసినవి మాత్రమే కొనాలని సూచించింది. వీటి ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని పేర్కొంది. ఇందుకు తోడు రాజధానిలో కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా పేల్చాలని ఆంక్షలు విధించింది. అంతేగాక శనివారం నుంచి రాత్రి సమయాల్లో భవన నిర్మాణ పనులను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం నమోదైన కాలుష్యపు సూచీ చూస్తుంటే నగర వాసులు సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని నవంబర్ 4 నుంచి 15 వరకు మరో దఫా అమలు చేయనున్నారు. సాధారణంగా పవన నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే మంచిదని, 51-100 ఫర్వాలేదని, 101-200 మధ్య రకమని, 201-300 బాలేదని, 301-400 పూర్తిగా బాలేదని, అలాగే 401-500 తీవ్రమైనది-ప్రమాదకరమని సఫర్ నివేదించింది. చదవండి : ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి -
కుటుంబసభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్న ఆర్కే రోజా
-
గురుకుల పాఠశాలలో దీపావలి జరుపుకున్న పుష్పశ్రీవాణి
-
ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు
-
ఆ సంకల్పంతోనే దీపావళి నిర్వహించుకోవాలి: మోదీ
న్యూఢిల్లీ : మహిళలను గౌరవించాలన్న సంకల్పంతోనే దీపావళిని నిర్వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం 58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా దేశంలో తయారైన వస్తువులనే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్నారని తెలిపారు. భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాయని చెప్పారు. భారతదేశ సంబరాలు దేశవిదేశాల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. భారతదేశం పండుగులకు నెలవని, ఫెస్టివల్ టూరిజానికి భారత్‌లో అనేక అవకాశాలున్నాయని వెల్లడించారు. -
ఫ్యాషన్ ఫెస్టివల్
-
మోక్ష జ్ఞాన దీపాలు
ఆ రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, నరకచతుర్దశి అని అమ్మ పార్వతీదేవి త్వరత్వరగా కుమారులిద్దరిని లేపి ఇద్దరికి తైలాభ్యంగన స్నానం చేయించడానికి సన్నద్ధమైంది. వాళ్ళిద్దరి శిరస్సులమీద తైలం పెట్టి విభూతితో నలుగు పెట్టి స్నానం చేయించి గణేశునికి ధవళవర్ణపు వస్త్రాలు, స్కందునికి ఎరుపురంగు వస్త్రాలు తొడిగింది. నంది, భృంగి ఇత్యాది గణాలన్ని రేపు దీపావళి అమావాస్య పండగకి కైలాస శిఖరాన్ని దీపాలతో ఎలా అలంకరించాలా అని తర్కించుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైకుంఠంలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి తో ‘‘కృష్ణావతారంలో నువ్వు నరకుడిని సంహరించిన రోజు గుర్తుందా సత్య! అని అడిగాడు. ‘సత్య’ అన్న ఆ పిలుపు వినగానే ఆనంద పరవశురాలైన మహాలక్ష్మి ‘‘అవును స్వామీ! మీరు నన్ను కదనరంగంలోకి పంపిన రోజు కదా! వనితలు దేనిలోను తీసిపోరని చూపడానికే అలా చేశాను’’ అంటూ అలనాటి జ్ఞాపకాలతో మైమరపులోకి వెళ్లింది. ఆనందంగా నారాయణుడు ఆమెని దగ్గరకి తీసుకుంటుండగా ‘‘స్వామీ! మర్చేపోయాను, మనం వైకుంఠమంతా దీపాలు వెలిగించాలి’’ అని ఆమె పతిదేవునితో అంటుండగా ఆ మాటలు చెవిన పడిన క్షణంలోనే వైనతేయుడు ఆ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యాడు. భూలోకంలో మానవులు చక్కగా రకరకాలుగా దీపావళి జరుపుకుంటారని తెలిసిన దేవతలు వాళ్ళ అదృష్టానికి సంబరపడుతూ మన ఇంద్ర లోకంలో కూడా దీపావళిని జరుపుకోవాలని మహేంద్రుణ్ణి కలిసి విన్నవించుకున్నారు. ఆ ప్రతిపాదనకి దేవేంద్రుడు సమ్మతించి, మనం కూడా ఈ పండుగ జరుపుకుందామని అష్టదిక్పాలకులని, కిన్నెర, కింపురుషాదులని సమావేశ పరిచి ఐలాపురమంతా దీపాలు వెలిగించమని ఆనతిచ్చాడు. అలాగే నలమహారాజు చేత మధురమైన భక్ష్య భోజ్యాలు వండించి అమ్మ లక్ష్మీదేవికి పూజ చేసి, దీపాలు పెద్ద ఎత్తున వెలిగించడానికి తన పరివారాన్ని సిద్ధం చేసుకున్నాడు. అమావాస్య చీకట్లు ముసురుకుంటున్నాయి. అటు ఇంద్రలోకంలో దేవతలు, ఇటు భూలోకంలో మానవులు తారతమ్యాలు లే కుండా అమ్మ మహాలక్ష్మిని పూజించి ధూప దీపాలు వెలిగించి చక్కని మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. కైలాసంలో పార్వతీదేవి వైశ్వానరుడు, స్వాహాదేవి సాయంతో తన ఇంటిలో అందరికి సరిపడా వండించిన భక్ష్య భోజ్య నైవేద్యాలన్ని శ్రీ మహాలక్ష్మి నారాయణులకి నైవేద్యంగా సమర్పించిందిట. ముసురుకుంటున్న చీకటిని పారద్రోలడానికి దీపాలు వెలిగించడం మొదలు పెట్టడానికి ముందుగా పిల్లలిద్దరిచేత పార్వతీ పరమేశ్వరులిద్దరు, గోగుకాడలకి తైలపు వస్త్రాలని కట్టి ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని దివిటీ కొట్టించారు. నాగుల చవితి అనగానే శివుని మెడలోని మహా సర్పం వాసుకి, మిగిలిన ఆభరణాలైన నాగులన్ని ఆనందంగా తలలూపాయి. ఆ క్షణం సుబ్రహ్మణ్యుని మోము తేజోమయమైంది. ‘‘నీ పుట్టినరోజు వచ్చే షష్ఠికే కదూ! ’’ అని గణపతి గుర్తు చేయడంతోటే స్కందుడు ఆనందంగా ‘‘అవును అగ్రజా!’’ అని ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆదిదంపతులు ఆ అన్నదమ్ముల ప్రేమకి ఆనంద పడ్డారు. ఈలోగా అమ్మ పార్వతీమాత ప్రమిదలనిండా తైలం పోసి వర్తులు వేసి మహాలక్ష్మిని ప్రార్థించగానే ఆ తైలంలోకి లక్ష్మీదేవి ప్రవేశించింది. ‘దీపం జ్యోతి పరఃబ్రహ్మ దీపం సర్వ తమోపహం! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే’ అనగానే కైలాసమంతా కోటిదీపాలకాంతితో ప్రకాశమానమైంది. వెండికొండ స్వర్ణమయమైంది. పరమశివుడు, గణనాథుడు, స్కందుడు, నంది, శృంగి, భృంగి, మిగిలిన పరివార గణాలు అందరూ కూడా తలో దీపం వెలిగించి నమస్కరించారు. గంగమ్మ మటుకు పరంజ్యోతి లోనే జ్యోతి దర్శనం చేసుకుంది. వైకుంఠం, అలకాపురి, సత్యలోకం దీపాల కాంతులతో మెరిసిపోయింది. భువిపై వెలిగించిన దీపాలకాంతి దివి అంతా పరచుకుని చీకటిని పారద్రోలింది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, చతుర్ముఖుడు, సరస్వతి దంపతులు దివ్యసందేశమిచ్చారు. ‘మానవులైనా, దేవతలైనా సాయం సంధ్యా సమయంలో నువ్వులనూనెతో ఇల్లంతా దీపాలు వెలిగించిన వారికి దీపాన్ని లక్ష్మీస్వరూపంగా భావించి పూజలు చేసినవారికి దీపపు వెలుగుతో దారిద్య్రం, దుఃఖాలు, కష్టాలు వంటివి దూరంగా తొలగిపోతాయి అని వివరించగానే ముల్లోకాలు ఆనందంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. – చాగంటి ప్రసాద్ దీపావళి నాడు ఆచరించవలసినవి... ఈ రోజున తెల్లవారు జామున్నే పెద్దల చేత తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల ఆకులను లేదా మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈరోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళ ఉంచిపోతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి. శాస్త్రీయ కారణం దీపావళినాడు టపాసులు పేల్చడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకాలైన క్రిమికీటకాలు రోగాలను కలిస్తాయి. దీపావళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజే స్తాయి. అలాగని మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో, తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్తంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. చీకటిపడే సమయంలో దీపదానం చేసి, మండుతున్న గోగు కాడలని తిప్పాలి. ఇలా తిప్పడం చేత పీడ పొతుందని చెప్తారు. నిజానికి దీపావళి కొంత వరకు పితృదేవతలకు సంబంధించిన పండుగ. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతసిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీపూజ చేయాలి. ఆకులతో దొన్నెలు కుట్టి, దీపాలు వెలిగించి, నదుల్లోనూ, చెరువుల్లోనూ, సరోవరాల్లోనూ, బావుల్లోనూ వదలాలి. దీపావళిఅర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతోకొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాయిద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం. -
మరీ ముసలోడిలా కనిపిస్తున్నానా?: రామ్‌చరణ్
ఈ రోజు కొత్తింట్లోకి షిఫ్ట్ అవుతున్నారు చెర్రీ అండ్ ఫ్యామిలీ! కొత్తిల్లు అంటే పూర్తిగా కొత్త అని కాదు. ఫ్యామిలీ అంటే చెర్రీ, ఉపాసన మాత్రమే కాదు. మొత్తం మెగా ఫ్యామిలీ.. పెద్ద సెలబ్రేషన్‌తో.. రీమోడలింగ్ చేసిన ఇంట్లోకి వచ్చేస్తోంది. మతాబుల్లాంటి పిల్లలు.. స్టార్స్‌లా వెలుగుతున్న పెద్దలు కలిసి సాయంత్రం దీపావళిని జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా.. ‘సాక్షి’... రామ్‌చరణ్‌ని కలిసింది. కొత్తింట్లోకి వెళ్లడానికి ముందే చెర్రీనిమీ ఇంటికి తీసుకొచ్చింది! హ్యాపీ దీపావళి. ‘సైరా’ నిర్మాతగా మీ అనుభవాలను షేర్ చేసుకోండి. నిర్మాత అనే ట్యాగ్‌ను నేనింకా యాక్సెప్ట్ చేయలేదు. ‘సైరా’ సినిమాను నేను నిర్మాతగా చేయలేదు. నాన్నగారి ఆలోచనకు చిన్న ఎక్స్‌టెన్షనే నిర్మాత అనే పాత్ర. ఆయన కలకి ఎక్స్టెన్షన్. కానీ ‘సైరా’ టీమ్‌లో పని చేసిన వాళ్లందరూ ‘చరణ్ బెస్ట్ ప్రొడ్యూసర్’ అని చెబుతున్నారు.. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్, రెండు ఎపిసోడ్లకే(సుమారు 20 నిమిషాల నిడివి) 75 కోట్లు అయిపోయింది. వేరేవాళ్లైతే సినిమాను ఆపేస్తారు. నేను కూడా ఆపాలనే చూశాను. ఆపడం వల్ల వచ్చే నష్టమేంటి? కొనసాగించడంలో ప్లస్ ఏంటి? అని చూసుకున్నాం. ‘చిరంజీవిగారి సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది’ అనే మాట నేను పడకూడదు. ఆయన 30 ఏళ్ల కెరీర్లో ఇదో బ్లాక్మార్క్లా ఉండిపోతుంది. ఈ సినిమాకు లాభాలు రాకపోయినా నేను నిర్మాతగా ఫెయిల్ అవ్వను కానీ ఈ సినిమా ఆగిపోతే కొడుకుగా, మనిషిగా, నిర్మాతగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే దిగిపోయాం కాబట్టి చేసేద్దాం అని, పూర్తి చేశాం. నేనీ సినిమా లాభాల కోసం చేయలేదు అని చాలా సందర్భాల్లో చెప్పాను. నాన్న కోసమే ఈ సినిమా చేశాను. ఇక ముందు కూడా చేస్తాను. నిర్మాతంటే అనుకున్నదాంట్లో చేయాలి. మేం అనుకున్నదానికంటే లిమిట్ దాటేశాం. అందుకే నన్ను నేను పూర్తి స్థాయి నిర్మాతగా చూసుకోను. నాన్నగారి డ్రీమ్ సినిమా (సైరా) తీయాలని మీరెప్పుడనుకున్నారు? ‘ఖైదీ నంబర్ 150’ తర్వాతే. నెక్ట్స్ ఏం సినిమా చేయాలి? అని ఆలోచిస్తూ ఉంటే ‘ఒక కథ ఉందిరా అని ఆయన చెప్పారు, ఆ కథంతా విన్న తర్వాత చేయాలనుకున్నాను. ఏ నిర్మాతయినా నాన్నగారితో 7–8 నెలల్లో సినిమా తీసి ఏ పండగకో రిలీజ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. అటూ ఇటు అయినా ఫర్వాలేదు అనుకోవాలి. అంత ప్యాషనేట్‌గా ఫ్యామిలీ వాళ్లే తీయగలరు. అప్పట్లో అల్లు అరవింద్‌గారు నాతో ‘మగధీర’ సినిమాను చాలా ప్యాషనేట్‌గా నిర్మించారు. అందుకే ‘సైరా’ని నేను ప్యాషనేట్‌గా తీయాలనుకున్నాను. ‘నా సినిమా కలెక్షన్లను ఇక మీదట సినిమా పోస్టర్స్ మీద వేయను’ అని ఆ మధ్య అన్నారు. ఎందుకా నిర్ణయం? మంచిదే కదా. మేం చెప్పకపోయినా మార్కెట్, ట్రేడ్‌లో తెలుస్తూనే ఉంటుంది కదా. వెబ్సైట్లు ఉంటాయి. నేనొక్కడినే మాట్లాడకపోవడం వల్ల ఆగుతుందా? అఫీషియల్‌గా పోస్టర్స్ మీద ఉండవంతే. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడైనా సినిమా పోస్టర్స్‌లో ఆర్టిస్టులను, టైటిల్స్ మాత్రమే చూసాం. కేవలం మన ఇండియాలోనే పోస్టర్స్ మీద నంబర్స్ (సినిమా కలెక్షన్లు) వేస్తుంటాం. అది బిజినెస్‌కి సంబంధించినది. ఆర్ట్‌కి, ఆర్టిస్ట్‌కి సంబంధించినది కాదు. ‘రంగస్థలం’ సమయంలో మా అభిమానులకు, మహేశ్ అభిమానులకు సోషల్ మీడియాలో కలెక్షన్ల విషయంలో చిన్న గొడవలు ఏర్పడ్డాయి. నిజమైన నంబర్స్ ఏంటో మాకే తెలియదు. నిర్మాతలు ఇచ్చే నంబర్స్ కరెక్టా, ఫ్యాన్స్ వేసే నంబర్స్ కరెక్టా అనేది అర్థం కావడం లేదు. మంచి సినిమా తీశాం. హ్యాపీగా ఉన్నాం. మహేశ్ మంచి సినిమాలు తీస్తున్నాడు. అతను హ్యాపీగా ఉన్నాడు. ఇది కట్ చేయాలని అనుకున్నాను. పోస్టర్స్ మీద కలెక్షన్లను వేయడం ఆపేద్దాం అని నిర్ణయం తీసుకున్నాను. ఇండస్ట్రీలో నంబర్ గేమ్ కూడా కీలకమే కదా. అవును. కానీ పోస్టర్స్ మీద కలెక్షన్లు రావడం కాదు కదా? మేం కష్టపడిందంతా కొంతమంది అభిమానులు ఓవర్ షాడో చేసేసి, మా ఎఫర్ట్‌ని మించిపోయి గొడవలు ఎక్కువవుతున్నాయి. నేను అందరితో బావుంటాను. ఫ్యాన్ వార్స్ వల్ల మా మధ్య ఉన్న ఆ అనుబంధం మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకే సినిమా చేశామా.. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. ‘మా ఫ్యాన్స్ కోసం పోస్టర్ వేయండి’ అని నేను నా నిర్మాతను రెచ్చగొడితే ఎంతసేపు? ఈ బోర్డ్‌లో ‘చెర్రీ మామ, అన్నయ్యా యూ ఆర్ బెస్ట్’ అని ఉంది. పిల్లలు (చెల్లెళ్లు సుస్మిత, శ్రీజల కూతుళ్లు, బాబాయి నాగబాబు కూతురు నిహారిక, పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య) అందరూ వస్తారు. బోర్డ్ మీద వాళ్లకు తోచింది రాస్తుంటారు. చిన్న పిల్లలు కదా.. వాళ్లకు వచ్చిందే బెస్ట్, గుడ్ అనే పదాలు. నీహా (నిహారిక) ఏవేవో రాస్తుంటుంది (నవ్వుతూ). ‘నిన్ను డైరెక్ట్ చేయాలనుంది’ అని రాసింది ఆద్యా. పవన్ కల్యాణ్ గారి అమ్మాయి. తనకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానంటుంది. నేను ఆఫీస్‌లో లేనప్పుడు వస్తే. ఆ రోజుకి వాళ్లకి ఏది అనిపిస్తే అది రాస్తారు. నేను వచ్చినప్పుడు చూస్తాను. ఎన్టీఆర్‌గారితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. మీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఈక్వేషన్ కుదిరిందా? ఏమో. కథ వల్ల మాత్రం మేం దగ్గరవ్వలేదు. మేం ఫస్ట్ నుంచి దగ్గరగానే ఉన్నాం. రాజమౌళిగారు అలా ఆలోచించరు. కథకు మేం సూట్ అయ్యాం కాబట్టి మమ్మల్ని తీసుకున్నారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్లను పెడదాం అని అనుకోలేదు. కెరీర్ మొదట్లో (మగధీర) చేశారు. మళ్లీ ఇప్పుడు చారిత్రాత్మక సినిమా చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? కెరీర్ స్టార్టింగ్‌లోనే పది సినిమాల అనుభవాన్ని నాకిచ్చారు రాజమౌళిగారు. హెవీ డ్రామా ఉన్న సినిమా అది. నాకు చాలా హెల్ప్ అయింది ఆ సినిమా. ఒకవేళ నాకు ‘మగధీర’ ఇప్పుడు ఇచ్చి ఉంటే ఇంకా బాగా చేసేవాణ్ణేమో. ‘ఆర్ఆర్ఆర్’లోనూ హెవీ డ్రామా ఉంటుంది. అద్భుతమైన అవకాశం. ఈ సినిమాలోని అల్లూరి సీతారామారాజు పాత్ర కోసం కొంచెం సన్నబడ్డాను. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మాల వేసుకోవడం ఎలా అలవాటైంది? నాన్నగారు ఒకసారి నన్ను శబరిమల తీసుకెళ్లారు. 14 ఏళ్లప్పుడు అనుకుంటాను. ఆ తర్వాత నాన్న మాల వేసుకున్నప్పుడు ఒంట్లో బాగోలేకపోతే, ఆయన ఇరుముడిని కుటుంబ సభ్యులు శబరిమల తీసుకెళితే చాలన్నారు. దాని వల్ల రెండోసారి వేసుకున్నాను. నా టీనేజ్‌లో గ్యాప్ ఇచ్చి ‘చిరుత’ సినిమా తర్వాత నుంచి వేసుకుంటున్నాను. ఇది పదమూడోసారి. మాకున్న అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ స్టయిల్లో అయ్యప్ప మాల వేసుకుంటే బాగున్నట్లు ఉంటుంది అయ్యప్ప దీక్ష వల్ల ఆలోచనా విధానం మారుతుందా? కచ్చితంగా. మాలలో ఉన్న 40–45 రోజులు మాత్రం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటాం. ‘మనం ఏం తింటున్నామో అదే మనం’ అనే సామెత ఉంటుంది. ప్రతి 3 నెలలకు మన బాడీ మారిపోతుంటుంది. తినేటప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటామో ఈ 45 రోజుల్లో అంతే స్వచ్ఛంగా ఉంటాం. అది సరిగ్గా వర్ణించలేను. డీటాక్స్లాగా అనుకోండి. ఆయుర్వేదిక్ సెంటర్‌కి వెళ్ళినట్టు. మొత్తం కొత్త మనిషిలా మారిపోతాం. 24 గంటల్లో 18 గంటలు పని చేసినా మనకు అలుపు రాదు. ఏదైనా సంవత్సరం మాల వేసుకోవడానికి కుదరకపోతే? వెలితి అనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత, నా పుట్టిన రోజుకి (మార్చి 27) లేకపోతే ఏడాది చివర్లో వేసుకుంటాను. ఈరోజు దీపావళి పండగ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి బాంబులు ఎక్కువ కాల్చేవాణ్ణి కాదు. భయంతో కాదు. పెద్దగా ఆసక్తి లేదు. కూర్చుని చూస్తుంటాను. అల్లు అర్జున్ బాగా కాల్చేవాడు. శిరీష్ వీళ్లంతా కాల్చుతుంటే చూస్తుంటా. నేను వాళ్లకు క్రాకర్స్ అందిస్తుంటాను. ఫ్యామిలీ అందరూ కలిసి ఒకేచోట ఉండటం చాలా ఇష్టం. దానికోసం ఎక్కువ ఎదురుచూస్తూ ఉంటాను. మీ అక్కాచెల్లెళ్లు, తమ్ముళ్లు.. ఇలా ఇల్లంతా చాలా సందడిగా ఉంటుందేమో? చాలా ఎక్కవమంది అయిపోయారు. (నవ్వుతూ). ఈసారి దీపావళి కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం. మా ఇంటిని రీమోడలింగ్ చేయించాం. త్వరగా అయిపోతుందనుకున్నాం కానీ చాలా టైమ్ పట్టేసింది. దీపావళికి కొత్త ఇంట్లోకి వెళ్లిపోతున్నాం. సంక్రాంతి లోపల పూర్తిగా కొత్త ఇంట్లోకి మారిపోతాం. మీకు పిలల్లెప్పుడు? మరీ ముసలోడిలా కనిపిస్తున్నానా? నేను ఫాదర్‌లా అనిపించినప్పుడు ఆలోచిస్తా. ఈ మధ్య ఓ సందర్భంలో నిర్మాత డబ్బులిచ్చేంత వరకూ డబ్బులు అడగను. చరణ్ కూడా అలానే చేస్తున్నాడు అని మీ నాన్నగారు చెప్పారు. మీకు ఫలానా సినిమా చేస్తానని అడ్వాన్సులు తీసుకోను. సినిమా చేసేటప్పుడు నెల ఖర్చులకు మాత్రమే డబ్బు తీసుకుంటాను. అది నాకు ఎప్పటి నుంచో అలవాటు. నేనెప్పుడూ నమ్మిన ప్రొడ్యూసర్స్తోనే చేస్తాను. నమ్మిన వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు ఎక్కడికి వెళ్లిపోతారు? వాళ్ల ఆఫీస్‌లు, బిజినెస్‌లు అన్నీ ఇక్కడే. ఎక్కడికి పారిపోతారు. ఆ నమ్మకం నాకుంది. నేనెక్కువగా దానయ్యగారు, తిరుపతి ప్రసాద్, గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్, నాగబాబుగారు, దత్‌గారు వీళ్ళతోనే చేశాను. నెలనెలా ఇంత జీతం అని తీసుకోవడం వల్ల వాళ్ల వడ్డీలు ఎక్కువ అవ్వవు. సేఫ్‌గా ఉంటారు. రిలీజ్‌కి మూడు రోజుల ముందు బిజినెస్ ముగుస్తుంది. అప్పుడే తీసుకుంటాను. ఈ పద్ధతిని ఎప్పుడు అలవాటూ చేసుకున్నారు? నాన్నగారి దగ్గర కూడా అడ్వాన్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది కాదు. వాళ్లు బలవంతంగా ఇస్తే తప్ప. ఆయన కూడా ఆయనకు ఇష్టమైన నిర్మాతలకే చేశారు. నేను కూడా ఈ సిస్టమ్‌కు అలవాటి పడిపోయాను. – డి.జి. భవాని -
హైదరాబాద్‌లో మొదలైన దీపావళి సందడి
-
పండగ వేళ
-
అసలు ‘గ్రీన్ క్రాకర్స్’ అంటే ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు వ్యవసాయరంగంలో ‘గ్రీన్ రెవెల్యూషన్’ రాగా, ఇప్పుడు దీపావళి క్రాకర్స్ (బాణాసంచా) పరిశ్రమలో ‘గ్రీన్ రెవెల్యూషన్’ వస్తోంది. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని తీసుకరావడం కోసం తీసుకొచ్చిన గ్రీన్ రెవెల్యూషన్‌ను తెలుగులో హరిత విప్తవంగా పేర్కొన్నారు. బాణాసంచాను కాల్చడం వల్ల వాతావరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు క్రాకర్స్‌లో వస్తోన్న ఈ గ్రీన్ రెవెల్యూషన్‌ను తెలుగులో కాలుష్య నియంత్రణ విప్లవంగా పేర్కొనవచ్చు. పలు భాషలు మాట్లాడే ప్రజలందరికి సులభంగా అర్థమయ్యేలా ‘గ్రీన్ క్రాకర్స్’ అని వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణ బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లను సుప్రీం కోర్టు 2018, అక్టోబర్ నెలలో నిషేధించింది. సాధారణ బాణాసంచాను ముందే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నామని, ఇంత త్వరగా ‘గ్రీన్ క్రాకర్స్’ అందుబాటులోకి రావడం కష్టమంటూ నాడు దుకాణదారులు లబోదిబోమంటూ మొత్తుకోగా, సుప్రీం కోర్టు షరతులతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి మాత్రం సాధారణ బాణాసంచాను అమ్మరాదని, గ్రీన్ కాకర్స్‌ను మాత్రమే అమ్మాలని నిక్కచ్చిగా చెప్పింది. అలాగే గ్రీన్ క్రాకర్స్ ఫార్ములాను రూపొందించాల్సిందిగా ఢిల్లీలోని ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’ను సుప్రీం కోర్టు ఆదేశించింది. గ్రీన్ క్రాకర్స్‌లో ఉపయోగించే పదార్థాలు సాధారణ క్రాకర్స్ అన్నింటిలో ‘బేరియం నైట్రేట్’ను ఉపయోగిస్తారు. ఇది అత్యంత హానికరమైన పదార్థం. ప్రజల శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా వాతావరణంలోకి ధూళి, ద్రవ కణాలను వదలని లేదా అణచివేసే పదార్థాలతో గ్రీన్ క్రాకర్స్‌ను తయారు చేయాలని భావించి ఈ ఇంజనీరింగ్ సంస్థ ఓ ఫార్మూలాను రూపొందించింది. ఇందులో ఉపయోగించే పదార్థాల మిశ్రమాన్ని ‘జియోలైట్’ అంటారని సంస్థలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సాధన రాయులు తెలిపారు. ఎక్కువ ఆక్సిజన్ కలిగిన ఈ పదార్థంతో తయారు చేసే గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులోని ఇంధనం వేడి లేదా వెలుతురు రూపంలో బయటకు వెలువడుతుందని ఆమె తెలిపారు. వీటి వల్ల ఎలాంటి విష వాయువులు వెలువడం కనుక సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే 70 శాతం తక్కువ హానికరం అని ఆమె చెప్పారు. ఇవెన్ని రకాలు ? కొత్తగా తయారు చేస్తోన్న గ్రీన్ క్రాకర్స్‌లో ‘సేఫ్ వాటర్ రిలీజర్, సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్, సేఫ్ థర్మైట్ క్రాకర్’ రకాలు ఉన్నాయి. సేఫ్ వాటర్ రిలీజర్ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులో నుంచి నీరు విడుదలై గాలి, దూళి కణాలు వాతావరణంలో కలువకుండా అడ్డుకుంటుంది. సేఫ్ అల్యూమినియం క్రాకర్లో అల్యూమినియం అతి తక్కువగా ఉంటుంది. సేఫ్ థర్మైట్ క్రాకర్లో వేడిని ఉత్పత్తి చేసే ఐరన్ ఆక్సైడ్ లాంటి ఖనిజ లోహాలను, తక్కువ స్థాయిలో అల్యూమినియంను ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా సాధారణ క్రాకర్స్ కన్నా 70 శాతం తక్కువ, అంటే 30 శాతం కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి. నూటికి నూరు శాతం కాలుష్యం ఉండొద్దనుకుంటే ఏ క్రాకర్స్‌ను కాల్చకపోవడమే ఉత్తమం. గ్రీన్ క్రాకర్స్‌కు లైసెన్స్‌లు ఎలా? వీటిని ఉత్పత్తి చేయాలనుకునే వారు ముందుగా ఢిల్లీలోని ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్’ను సంప్రదించి ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకోవాలి. ఫార్ములాను తీసుకోవాలి. ఆ తర్వాత ‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ ఆమోదంతో పరిశ్రమ లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ సంస్థతో ఉత్పత్తిదారులు 230 అవగాహన ఒప్పందాలు, 135 ‘నాన్ డిస్క్లోజివ్’ ఒప్పందాలు తీసుకోగా పెట్రోలియం అండ్ ఎక్స్పోజివ్స్ సంస్థ నుంచి కేవలం 28 మంది మాత్రమే ఆమోదం తీసుకున్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా పరిశ్రమలు స్థాపించి ‘గ్రీన్ కాకర్స్’ తయారు చేస్తున్నారు. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఈ పరిశ్రమలు ప్రస్తుతం వెలిశాయి. ఢిల్లీలో పరిస్థితి ఏమిటీ ? ఢిల్లీలో బాణాసంచా లేదా టపాకాయల దుకాణదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది కస్టమర్స్ నిషేధించిన క్రాకర్స్ కావాలని కోరుతున్నారని, లేదంటే తిరిగి పోతున్నారని వాపోతున్నారు. వారు వెయ్యి రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదనుకొని ఢిల్లీకి దూరంగా వెళ్లి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారని, వారు వాటిని తెచ్చి ఢిల్లీ వీధుల్లో కాలిస్తే ఇక ఫలితమేమిటని ప్రశ్నిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్‌కు డిమాండ్ బాగా పెరిగిందని, కంపెనీల నుంచి సకాలంలో సరఫరా అందక ఇబ్బంది పడుతున్నామని మరో ప్రాంతంలోని దుకాణదారులు వాపోతున్నారు. -
దీపావళి: పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా..
దీపావళి అంటే దీపాల పండుగ అని అర్ధం. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దేశవ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరిగే దీపావళి పూజా సాంప్రదాయం దేశమంతా వెలుగులు పూయిస్తుంది. దీపావళి నాడు ప్రత్యేకంగా.. దీపావళి రోజున వీధులు, దుకాణాలు, భవనాలు విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే రాజస్తాన్‌లోని పింక్‌సిటీలో జోహారీ బజార్ దీపావళికి చాలా ప్రత్యేకం. అక్కడి భవనాలు, వీధులే కాకుండా నగరంలోని ప్రతీ ప్యాలెస్ విద్యుత్ వెలుగులతో అందంగా ముస్తాబవుతుంది. అక్కడి మార్కెట్లు లైట్ల వెలుగుల్లో ప్రకాశిస్తాయి. ప్రతీ సంవరత్సరం అందంగా,సృజనాత్మకంగా అలంకరించబడిన మార్కెట్‌కి బహుమతి కూడా ఉంటుంది. భారతదేశం నలుమూలల నుంచి ఈ అద్బుతమైన ప్రదర్శన తిలకించడానికి సందర్శకులు వస్తారు. అంతేకాకుండా ఆ లైట్లకి అయ్యే విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లించడం విశేషం. శ్రీరాముడిని కొలుస్తూ.. దీపావళి వేడుకలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం చాలా ప్రత్యేకమైనది. దీపాలను వెలిగించి ఆరాధించడంతో పాటు ‘భరత్ మిలాప్’ పేరిట శ్రీరాముడిని కొలుస్తారు. రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు. ప్రతీ సంవత్సరం అక్కడ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. 2018లో సరయు నది ఒడ్డున 3 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా.. దీపావళి వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నరక చతుర్దశికి ఒకరోజు ముందు ఇళ్లంతా శుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు. వంట చేయడానికి ముందు పొయ్యిని శుభ్రపరుచుకొని దానిపై ఓంకారం చిహ్నాలు వేస్తారు. సూర్యోదయానికి ముందే తలంటు స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరిస్తారు. కొత్తగా పెళ్లయిన వారు వధువు ఇంట్లో ఈ వేడుకని జరుపుకోవడం ఆనవాయితీ. కొన్నిచోట్ల నరక చతుర్దశి నాడు తెల్లవారుజామునే తలంటుస్నానం ఆచరించి యముడికి తర్పణం వదులుతారు. సాయంకాలం దీపాలను వెలిగించి మహాలక్ష్మీ పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుకర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్నే పాటిస్తారు. బంగారానికి పూజ ఇక ఉత్తర భారత దేశంలోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరగుతున్నాయన్న విషయం తెలిసిందే. గుజరాతీలు దీపావళి ముందు రోజు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. లక్ష్మీదేవిని వాహీ పూజ పేరుతో ఆరాధిస్తారు. ఇంట్లోని బంగారమంతా తెచ్చి దీపాల ముందు ఉంచి పూజ చేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి పాదముద్రలు గీస్తారు. అదే విధంగా దీపావళి రోజున కొత్త వాహనాలు కొనడం, కొత్త కార్యాలయాలు, దుకాణాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలయాలను నిర్వహిస్తారు. నాలుగు రోజుల పండుగ మహారాష్ట్రలో దీపావళిని 4 రోజులు జరుపుకొంటారు. మొదటి రోజు వసుబరస్ పేరుతో ఆవు, దూడలకు పూజ చేస్తారు. ఇది తల్లి బిడ్డల ప్రేమను ప్రతిబింబిస్తుంది. రెండోరోజు ధంతేరాస్ పేరుతో పూజలు నిర్వహిస్తారు. మూడవ రోజు అంటే నరకచతుర్దశి నాడు ఉదయాన్నే తల స్నానం ఆచరించి ఆలయాన్ని సందర్శిస్తారు. కరంజీ, లడ్డూ, చక్కి లాంటి స్వీట్లను తయారుచేస్తారు. ఇక నాల్గోరోజైన దీపావళి నాడు వ్యాపారులు జమాఖర్చులు చూసుకొని కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇంటిముందు దీపాలు వెలిగించి తమ ఇంట్లోకి రావాలని లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. అమ్మవారిముందు బంగారం, డబ్బు పెట్టి సంపదతో దేవిని పూజిస్తారు. ఇంకాస్త అందంగా.. వారణాసి....ఎప్పుడూ అందమైన ప్రదేశమే. దీపావళి రోజున వారణాసి ఇంకా ఎంతో అందంగా ముస్తాబవుతుంది. బాణాసంచా, దీపాల నిర్విరామ వెలుగులతో కాశీ విరాజిల్లుతుంది. దీపావళి సందర్భంగా ఇచ్చే గంగా హారతిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది హిందువులు వారణాసికి తరలివస్తారు. క్యాండిల్ లైట్లు, నదిలో తేలియాడే మట్టి దీపాలతో వారణాసి వెలుగులు చూడటానికి ఏటా భక్తులు వారణాసిని సందర్శిస్తారు. దీపావళి పండగ అనంతరం రెండు వారాల తర్వాత కార్తిక పౌర్ణమి నాడు వారణాసిలో 10 లక్షల దీపాల మధ్య దేవతామూర్తుల ఊరేగింపు అక్కడి మరో ప్రత్యేకత. కాళీ మాత ఆరాధన భారతదేశంలో చాలా మంది దీపావళి రోజున లక్ష్మీ దేవిని ఆరాధిస్తుండగా, పశ్చిమ బెంగాల్లో కాళీ మాతను పూజిస్తుంటారు. దీపావళి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కాళీ మాత మండపాలు దర్శనమిస్తాయి. కోల్‌కతాలోని కాళీదేవీ ఆలయాలైన కలిఘాట్, బేలూర్ మఠం దక్షిణేశ్వర్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. దీపావళి రోజున కాళికా దేవీని సందర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. దీపావళి రాత్రి పూర్వీకుల ఆత్మలు స్వర్గానికి వెళ్లేలా వారిని దిశానిర్దేశం చేయడానికి పొడవైన స్తంభాలపై దీపాలు వెలిగిస్తారు. ఆ వెలుగుల కాంతిలో వారు స్వర్గస్తులవుతారని వారి నమ్మకం. ఇప్పటికీ అక్కడ ఈ పద్దతిని పాటిస్తున్నారు. ఒడిశాలో కూడా ఇదే పద్దతిని ఆచరిస్తారు. పర్యావరణహిత దీపావళి పంజాబ్‌లో సిక్కులు బాణాసంచా కాల్చరు. కేవలం దీపాలు, క్యాండిల్స్, రంగోలితో ఇంటిని అలంకరిస్తారు. వెండినాణేలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక పంజాబీలు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు పితృదేవతలను కూడా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నాడు భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఒక మాసమంతా తమ వెంట ఉంటారని వారు విశ్వసిస్తారు. దీపావళి నాడు ఆరాధనలు అందుకొని తాము వెలిగించే దీపాలను చూసి పితృలోకాలకు తిరిగి వెళ్లిపోతారని వారి నమ్మకం. -
ఆనంద దీపాలు వెలగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం జగన్ అభిలషించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలతో తెలుగునేల ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.#HappyDiwali — YS Jagan Mohan Reddy (@ysjagan) October 27, 2019 -
మత స్వేచ్ఛకు ఇది నిదర్శనం: ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాలో దీపావళి వేడుకలు జరుపుకోవడం తమ దేశంలోని మత స్వేచ్ఛకు నిదర్శనమని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అఙ్ఞానంపై ఙ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారని పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వెలుగుల పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధిస్టులకు తనతో పాటు భార్య మెలానియా ట్రంప్ తరఫున కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. కాగా ఓవల్ కార్యాలయంలో కొంతమంది ఇండో అమెరికన్ల సమక్షంలో ట్రంప్ దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాలో నివసించే ప్రజలు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా పండుగలు జరుపుకొనే అవకాశం తమ దేశ రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ మేరకు ప్రతీ మతస్తుడి హక్కులను కాపాడుతూ.. తమ మత ఆచారాలను మరింత గొప్పగా పాటించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇక దీపావళి గురించి మాట్లాడుతూ... ‘ఈ పర్వదినం నాడు ఆయా మత సంప్రదాయాలు పాటించే వారు తొలుత పూజ చేస్తారు. ఆ తర్వాత దీపాలు వెలిగించి కాంతులు వెదజల్లుతారు. సంప్రదాయ వంటకాలతో భోజనం చేసి బంధువులు, స్నేహితులతో పండుగను గొప్పగా జరుపుకొంటారు. అమెరికా, ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకొనే వారందరికీ శుభాకాంక్షలు’ అని వ్యాఖ్యానించారు. ఇక గత కొన్నేళ్లుగా అమెరికా శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ దీపావళి సందేశం
సాక్షి, అమరావతి : దీపావళి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందస్ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దీపావళికి సందేశాన్నిచ్చారు. దీపావళి పండుగ అంటే చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా రంగు రంగుల దీపాలను వెలిగించి ఘనంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. శాంతికి, మత సామరస్యానికి, నవ సమాజ నిర్మాణానికి ఈ దీపావళి ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
ఇవి లేకుంటే దీపావళి అసంపూర్ణం
కాంతికి ప్రతీకగా.. ఇళ్లంతా దీపాలు వెలిగించి చీకటిని తరుముతూ వెలుగును స్వాగతిస్తూ ఆనందోత్సాహంతో దేశావ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీప అంటే దీపం, ఆవళి అంటే వరుస కాబట్టి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఇలాంటి పవిత్రమైన రోజు స్వీట్లతో పాటు బాహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం కూడా పండుగ సంప్రదాయంలో భాగమే. ఈ పండుగకు బహుమతులు లేకుంటే దీపావళి వేడుక అసంపూర్ణంగా ఉండిపోతుందని చాలా మంది భావిస్తారు. చిన్నా.. పెద్ద.. పేదా, ధనిక అనే తారతమ్యాలు లేకుండా ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో ప్రియమైన వారిని పండుగ వేడుకల్లో భాగస్వాములుగా చేస్తూ.. వారిలో కూడా కొత్త ఉత్సాహన్ని నింపడానికి బహుమతులు ఉపయోగపడుతాయని నమ్ముతారు. దీపావళి బహుమతుల సంప్రదాయం... దీపావళికి బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడమనేది కొత్తగా పుట్టుకొచ్చిన సంప్రదాయమేమీ కాదు. ప్రాచీన భారతంలో ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్న నాటి నుంచి సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. దీపావళి పర్వదినాన ఇళ్లంతా మట్టి ప్రమిదలతో అలంకరించి ఇంట్లోనే స్వీట్లు తయారు చేసుకునేవారు. పూజలు, వ్రతాలు చేశాక వాటిని బంధువులకు, స్నేహితులకు, ఇరుగుపొరుగు వారికి ఇచ్చి ఆనందాన్ని అందరితో పంచుకునేవారు. ఈ బహుమతి సంప్రదాయం వల్ల ఒకరిపై ఒకరు తమ ప్రేమను, అభిమానాన్ని ఇతరులతో పంచుకోవడమే కాకుండా.. ఇరువురి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి వారి మధ్య మరింత సన్నిహితం పెరుగుతుంది. ఆధునిక భారత్‌లో బహుమతులు నేటి కాలంలో దీపావళి బహుమతుల సంప్రదాయం తార స్థాయికి చేరింది. దీపావళికి బహుమతిని ఇవ్వడంలో ఉన్న నిజమైన విలువలను మరచి.. వస్తువు విలువలను మాత్రమే చూస్తున్న వారు కోకొల్లలు. మరికొంత మంది తమ స్టేటస్‌ను, సంపదను ఇచ్చే బహుమతిలో చూపిస్తున్నారు. దీంతో నిజమైన, స్వచ్ఛమైన దీపావళి భావాలకు, ప్రేమకు, భావోద్వేగాలకు కాకుండా బహుమతుల విలువకే ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి దీపావళికి బహుమతిని ఇవ్వడం అంటే మన ప్రేమను, అభిమానాన్ని, సంతోషాన్ని ఇతురులతో పంచుకోవడం. కాబట్టి ఈ దీపావళికి ఇచ్చే బహుమతులు ఖరీదైనవి మాత్రమే కాకుండా అర్థవంతమైనవిగా ఉండేలా, అలాగే వాటిలో మీ ప్రేమ, భావోద్వేగాలు అద్దం పట్టేలా ఉండే కానులకను ఎంచుకోండి. ఎందుకు బహుమతులు ఇవ్వాలి... దీపావళి కానుక అంటే కేవలం సాధారణ వస్తువు మాత్రమే కాదు.. ఇది భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది. ఇరువురి మధ్య ఉన్న బంధాన్ని, బంధుత్వాన్ని, సంబంధాన్ని కూడా నిర్వచిస్తుంది. అయితే కానుక అనగానే అందరూ ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి విలువైన ఆభరణాలను ఎంచుకుంటారు. కానుక విలువ ఇచ్చే వస్తువులలో కాకుండా వారు ఇచ్చే మనసులో ఉంటుంది. మనం ఇచ్చే బహుమతులను అందంగా, అర్థవంతంగా ఉండేలా చూసుకోవాలి. అందుకే ఈ కాంతుల పండుగలో మీ ఇష్టమైన వారికి, మీ బంధువులకు, స్నేహితులకు మంచి కానుకలను ఇచ్చి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయోలా ఓ మధురమైన దీపావళిని అందించండి. అలాగే మీరు ఇచ్చే కానుకలో వారిపై మీకు ఉన్న అనుబంధాన్ని, వారు మీకు ఎంత ప్రియులనేది మీ కానుకలో చూపించండి. సిల్క్ త్రెడ్ ఆభరణాలు.. రకాల రకాల సిల్క్ దారంతో తయారు చేసే ఆభరణాలను కూడా యువతలకు, మహిళలకు ఈ దీపావళి కానుకకు బాగా ఉపయోగపడతాయి. గాజులు, చెవుల దిద్దులు, నెక్లేస్లను మెరిసే స్టోన్స్‌తో అందంగా తయారు చేసిన ఈ ఆభరణాలను వారికి కానుకగా ఇస్తే ఈ దీపావళిలో వారి ముస్తాబు ఇవి మరింత అందాన్ని తెచ్చిపెడుతాయి. మరైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని మీ స్నేహితులకు, బంధువుల అమ్మాయిలకు బహుమతిగా ఇచ్చేయండి మరి. స్వీట్లతో చేసిన టపాసులు.. ఇది సాధారణమైన బహుమతే అవుతుంది. కానీ దీపావళి పండుగలో అతి ముఖ్యమైనవి స్వీట్లే కదా. ఈ ఆనందోత్సహాల పండుగను ఇతరులతో పంచుకోవాలంటే తీపి పదార్థాలు ఉండాల్సిందే కదా! మరి ఇంకెందుకు ఆలస్యం లడ్డూ, గులాబ్జాము, బర్ఫీ, వంటి రకారకాల స్వీట్స్ ఓ పెద్ద స్వీట్ బాక్స్‌లో పెట్టి ఇవ్వండి. ఇంకాస్త ప్రత్యేకంగా ఉండాలంటే ఉల్లిగడ్డ బాంబు, బూచక్రాలు, చిచ్చుబుడ్డి వంటి వివిధ రకాల టపాసుల రూపంలో స్వీట్స్‌ను ప్రత్యేకంగా తయారు చేయించండి. బయట మర్కెట్స్‌లో ఆకర్షణీయమైన స్వీట్స్ బాక్స్‌లు దొరుకుతాయి. ఈ స్వీట్స్‌ని మీకు నచ్చిన విధంగా అలంకరించి ఆకర్షణీయమైన బాక్స్‌లో ప్రియమైన వారికి స్నేహితులకు అందించండి. దీపావళి కాఫీ కప్పు.. రంగు రంగుల కాంతివంతమైన ఈ దీపావళికి మీ బహుమతి కూడా రంగులతో కాంతివంతంగా ఉండాలంటే దీపావళి కాఫీ కప్పును ఇలా ఇచ్చి చూడండి.. కప్పుపై దీపావళికి కళ తెచ్చే తారాజువ్వలను డిజిటల్ రంగుతో పేయింటింగ్ వేయించి ఈ దీపావళి వేడుకలు ఆ కప్పుపై ప్రతిబింబించేలా మీ స్నేహితులకు ఈ దీపావళికి ఇలా అందమైన కానుకను ఇవ్వండి. గోడ అలంకరణలకు తోరణం: అలంకరణ అనేది దీపావళి వేడుకల్లో ప్రముఖం. దీపావళికి అందరూ తమ ఇంటిని శుభ్రం చేసుకుని రంగుల తోరణాలతో ఇంటిని అలంకరించుకుంటారు. అందుకోసం మీ స్నేహితులకు సంప్రదాయ అలంకరణ వస్తువును బహుమతిగా ఇచ్చిచూడండి. ఇందుకోస రాజస్థానీ అక్రలిక్ తోరణాన్ని దీపావళి బహుమతిగా ఇచ్చి చూడండి. ఈ తోరణం దీపావళి కోసమే ప్రత్యేకంగా రంగురంగుల ధారాలతో, చమ్మక్ చమ్మక్గా ఉండేలా గోల్డ్ రంగు ధారం, పూసలు, గంటలతో వివిధ డిజైన్‌లో తయారు చేస్తారు. దీనిని ఇంటి గోడలకు, ఇంటిముందు గుమ్మాలకు ఈ అక్రలిక్ తోరణాన్ని తగిలిస్తే అందంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే రంగురంగు ధారం, గోల్డ్ రంగు ఫినిషింగ్, పూసలు, గంటలు ఆకర్షణీయంగా ఉండి లక్ష్మి దేవీని ఇంటిలోనికి స్వాగతిస్తుంది. ఈ రాజస్థానీ కలర్‌ఫుల్ యాక్రలిక్ట్ తోరణం ఇంటి ముందు అలంకరించుకుంటే ఇంట్లో నిజమైన దీపావళి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మరింకేంటీ మీ స్నేహితులకు, కుటుంబీకులకు ఈ దీపావళికి దీనిని బహుమతిగా అందించండి. టెడ్డీబేర్ మైనపు కొవ్వొత్తి అందంగా అమాయకంగా కనిపించే టెడ్డిబేర్ బొమ్మలు అంటే ఇష్టపడని వారుండరు. మైనంతో తయారు చేసే ఈ దీపావళి టేడ్డి కొవ్వొత్తిని మీ స్నేహితులకు ఇవ్వండి. ఈ టేడ్డి కొవ్వత్తులను సాయంకాలం దీపాలంకరణలో వాడితే అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని పిల్లలకు కూడా బహుమతిగా ఇవ్వచ్చు. మీ ఈ దీపావళి కానుకలో ఇది సృజనాత్మంగా అత్యంత అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే ఈ టేడ్డిని మీ స్నేహితులకు, పిల్లలకు బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరచండి. రంగురంగుల తేలియాడే దియాస్ దీపావళికి దీపాల ఆలంకరణ రంగులమయంగా ఉండాలంటే ఈ దీపాన్ని (దియాస్)ను ఎందుకు ఎంచుకోకుడదు. రంగురంగుల పూసలతో అలంకరించిన ఈ దీపాలను ఓ గిన్నెలో నీళ్లు పోసి వెలిగిస్తే నీటిలో తేలాడుతూ వెలుగుతుంటే సాయంకాలం దీపాలంకరణలో ఇంటి వెలుగులను తార స్థాయికి పెంచుతుంది. ఈ దీపాలను దీపావళికి కానుకగా ఇచ్చి కాంతి సదేశాన్ని వ్యాప్తి చేయండి. ఇంకా ఇవే కాకుండా చాక్లెట్లను వివిధ రకాల టపాసుల రూపంలో చేయించి వాటిని పిల్లలకు దీపావళి కానుకగా ఇస్తే ఈ దీపావళి ఉత్సాహం వారిలో మరింత రెట్టింపు అవుతుంది. ఓ ఫ్లేన్ టీ షర్టుపై రంగురంగులతో దీపావళి కొటేషస్స్ రాయించి బహుమతిగా ఇవ్వండి. అలాగే దీపావళి గ్రీటింగ్ కార్డుతో పాటు బూ చక్రాలు, చిచ్చుబుడ్డి, క్రాకర్స్ వంటివి ఇచ్చి పెద్ద బాంబులు పేల్చి శబ్ధ కాలుష్యాన్ని, పర్యావరణ కాలుష్యాన్ని పెంచకుండా.. అలాగే ఆగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించమనే సందేశాన్ని ఇవ్వండి. -
వెలుగు పువ్వుల దిబ్బు దిబ్బు దీపావళి
అమావాస్య రోజు శ్రీకృష్టం జననం లాగా అమావాస్య రోజున దివ్వెల తోరణాలతో..వెలుగు పువ్వుల కొలువు దీపావళి. నరకాసుర వధ, బలి చక్రవర్తి రాజ్యదానం, వనవాసం అనంతరం రాముడు అయోధ్యకు తిరిగిరావడం, విక్రమార్కుడి పట్టాభిషేకం...ఇలా కథలూ,కారణాలూ ఎన్ని ప్రాచుర్యంలో ఉన్నా నులివెచ్చని చలికాలంలో దేశవ్యాప్తంగా జరుపుకునే దివ్వెలపండుగ. అయితే దీపావళి పండుగ ప్రజాహితంగా, పర్యావరణ హితంగా జరుపుకుంటున్నామా? ఈ పండుగ వేళ కాలుష్య కాసారంలా మారిపోతున్న పుడమి తల్లికి మరింత భారమేనా? ఢమాల్...ఢమాల్ అంటూ విపరీతమైన శబ్దాలతో.. అక్షరాలా ఆ లక్ష్మీదేవినే (అతి ఖరీదైన టపాసులను) అగ్నికి ఆహుతి చేయడమేనా దీపావళి పరమార్థం....దిక్కులు పిక్కటిల్లేలా భరించలేని శబ్దాలతో..బిక్క మొహం వేసే పసిపిల్లల తల్లుల అవస్థలు ఎవరికీ పట్టవా? ఇలా ప్రతీ దీపావళికి నా మదిని తొలిచేసే ప్రశ్నలు. కానీ చిన్నతనంలో ఒక వేడుక మాత్రం నాకిప్పటికీ గుర్తే.. అదే 'దిబ్బు దిబ్బు దీపావళి..' పొడవాటి గోగు కర్రలు, కొత్త తెల్లటి వస్త్రంతో చేసిన నూనె వత్తులు....దీపావళి ఎంతైనా బాలల పండుగే కదా.. అందుకే బాల్యం నాటి జ్ఞాపకాలు భూచక్రాల్లా గిర్రున నన్ను చుట్టుకున్నాయి. నా జీవితంలో నాకెంతో ఇష్టమైన రేడియోలో పండుగ రోజు గంటపాటు నాదస్వరంతో నిద్ర లేవడం ఎంత గుర్తో. వణికించే చలిలో మందార ఆకులు వేసి నానబెట్టిన కుంకుడు కాయల రసంతో తలంటూస్నానాలు.. అందులోనూ ఆడపిల్లలు ముందు చేయాలి. నాన్న స్వయంగా పొటాషియం, గంధకం కలిపి తయారు చేసే చిచ్చుబుడ్లు, మతాబులు, సిసింద్రీలూ, అన్నయ్యలకోసం ప్రత్యేకంగా తయారుచేసే తిప్పుడు పొట్లం...చిన్న రేకు తుపాకి, దానికోసం గుళ్ల ఎర్ర రీళ్ల బుల్లి డబ్బాలు, కంపుకొట్టే పాముబిళ్లలు, వెన్నముద్దల వెలుగులు ఒక్క క్షణం నన్ను ఆవరించాయి. ఇపుడు నాన్నా లేరు..ఆ మట్టి వాసనల వెలుగులూ లేవు.. అంతా ప్లాస్టిక్ మయం. పర్యావరణ హితం అన్నది ఉత్త మాటలకే పరిమితమైపోయింది. కాంక్రీట్ జంగిల్ అపార్ట్మెంట్లలో పోటా పోటీగా ఎవరు ఎంత ఎక్కువ టపాసులు (డబ్బులు తగలేసారనేదే) కాల్చారనేదే లెక్క. అంతేకాదు అందరూ సద్దుమణిగాక మరీ, మందుగుండు సామగ్రితో సర్జికల్ స్ట్రైక్ చేసేంత శాడిజం నన్ను మరింత భయపెడుతుంది.. నిజం.. 'దిబ్బు దిబ్బు దీపావళి..' సంబరం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది..దీపావళి రోజు సాయంత్రంపూట జరిగే వేడుక ఇది. గోగు మొక్కలు లేదా గోగుకర్రలు పొడవాటివి తీసుకొని వీటిపై అంతకుముందే తయారు చేసుకుని నువ్వుల నూనెలో తడిపి వుంచుకున్న తెల్లని నూలు గుడ్డల వత్తులు వేలాడదీస్తారు. ఒక్కొక్కరు రెండు మొక్కల జత పట్టుకుని వరుసగా నించుని ఆ కుటుంబలోని పిల్లలందరి మొహాలు కొత్త బట్టలు, పూల (పిలక) జడలతో నిండు పున్నమి వెలుగుల్లా వెలిగిపోతూ వుంటే.. అమ్మో..అమ్మమ్మో...నాన్నమ్మో..మేనత్తో.. వాటిని వెలిగిస్తారు. అపుడు ఆవిష్కృమవుతుందో కమనీయదృశ్యం. దీపాల కర్రలను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ- 'దిబ్బు దిబ్బు దీపావళి.. మళ్లీ వచ్చే నాగుల చవితి' అని పాడుతూ దీపం ఆరిపోతున్న సమయంలో నేలమీద మూడుస్లార్లు కొట్టాలి. అది అయిపోయాక.. పెరట్లోకి వెళ్లి కాళ్లు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి అమ్మ పెట్టే అరిసె తినాలి. ఇక తొందరగా అన్నం తినేసి కాల్చుకోవడానికి వెళ్లాలి.. అయితే ఇక్కడ ఇంకో ట్విస్టు ఏంటంటే.. కొత్త బట్టలుమార్చుకుని... పాత కాటన్ బట్టలు వేసుకోవాలి.. ఇహ మారాంలు మొదలు. అయితే ఈ విషయంలో ఇక్కడ మాత్రం అమ్మ, నాన్న ఇద్దరిదీ ఒకటే మాట..టపాసులు కాల్చుకోవాలంటే.. పొట్టి కాటన్ బట్టలు వేసుకోవాల్సిందే..! ఇవేనా..పెరుగుబంతి, కృష్ణ బంతిపూలు, కనకాంబరాలు దీపావళి నాటికి పూస్తాయా లేదా అని రోజు వాటి చుట్టూ తిరగడం, పెద్ద పెద్ద దండలు గుచ్చి వాటిని అన్ని గుమ్మాలకు వేలాడ దీయడం, మట్టి ప్రమిదలు, పొటాషియం, సూరేకారం, కొబ్బరిపొట్టు, బొగ్గు సేకరించడం.. చేటల్లో ఆరబెట్టడం...కళ్లల్లో పెట్టుకోవద్దు..చేతులు సరిగ్గా కడుక్కోలేదంటూ తిట్లూ.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. తెలిసీ తెలియక విసిరిన తారా జువ్వ తడిచి సరిగ్గా వెళ్లక పక్కనే ఉన్న టైలర్ వెంకటరావు మావయ్య ఇంటి చూరులో దూరడం..దీంతో అత్త తిట్ల దండకం.. ఇప్పటికీ గుర్తు.. టైలర్ మామ కుట్టిచ్చిన పూల పూల పట్టు కుచ్చుల గౌను సాక్షిగా..! తడిచి అంటే..గుర్తొచ్చింది...తయారు చేసుకున్న దీపావళి సామానులు రోజూ ఎండలో ఫెళఫెళమంటూ ఎండటం..దేవుడికి ఎంత వేడుకున్నా..సరిగ్గా దీపావళి రోజే వర్షం రావడం ఎలా మర్చిపోగలం..అయినా.. నాన్న చేతి చిచ్చుబుడ్డి అంతెత్తున ఎగిరి విసిరిన వెలుగు పువ్వులు...మతాబుల వెలుగులు జీవితానికి సరిపడా నాతోనే.. ‘‘పర్యావరణహిత దీపావళి సంతోషాల హరివిల్లు..పుడమి తల్లికి ఆనందాల విరిజల్లు’’ మీ నేస్తం.. -
ధన్తేరస్; అప్పుడు పూజ చేస్తేనే మంచిది!
భారతీయ సంస్కృతిలో దీపావళితో పాటు... దివ్వెల పండుగకు రెండు రోజుల ముందుగానే వచ్చే ధన్‌తేరస్‌కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. సర్వ సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి జన్మదినం సందర్భంగా అమ్మవారిని పూజించి.. ఆ రోజు బంగారం, వెండి కొనడం వల్ల తమ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువుదీరుతాయని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ధన్తేరస్ నాడు బంగారం షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ధన్తేరస్ గురించి శాస్త్రం ఏం చెబుతుందో.. ఆరోజు ఏ సమయంలో పూజ చేయాలో ఓసారి గమనిద్దాం. చిరంజీవులుగా ఉండేందుకు అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో.. ఆ క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఆమెతో పాటు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కోరిన వరాలిచ్చే కామధేనువు.. అదే విధంగా దేవ వైద్యుడు ధన్వంతరి కూడా జన్మించారు. ఆ రోజు అశ్వయుజ కృష్ణ త్రయోదశి కావడంతో పాటు... ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి జనియించడం వల్ల ధన త్రయోదశి లేదా ధన్తేరస్ అని కూడా పిలుస్తారు. అయితే సాధారణంగా అశ్వయుజ మాసంలో మొదటి పది రోజుల్లో పార్వతీదేవిని, మూలా నక్షత్రంనాడు సరస్వతీ మాతను పూజిస్తారు. సరస్వతీ కటాక్షం మెండుగా ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటేనే ముందుకు సాగుతామని ప్రతీతి. కాబట్టి త్రిమూర్తుల భార్యల్లో పూజ జరగకుండా మిగిలిన లక్ష్మీదేవిని మూడు రోజుల పాటు(ధన త్రయోదశితో పాటు నరకచతుర్ధశి, దీపావళి) ప్రత్యేకంగా పూజించాలని శాస్త్రం చెబుతోంది. అందుకే సిరి సందలకు మూలమైన లక్ష్మీదేవిని మానవాళి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి.. ఆశీసులు అందుకుంటారు. ఇక ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవితో పాటు ఉత్తర దిక్పాలకుడు, ధనానికి అధినాయకుడు అయిన కుబేరుడితో పాటు ధన్వంతరిని కూడా పూజించడం ఆనవాయితీ. ముందుగా చెప్పినట్లుగా ధంతేరస్ నాడు బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు కొనడంతో పాటు దేవ వైద్యుడు, ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరిని పూజించడం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందడంతో పాటు దీర్ఘ కాలంగా బాధిస్తున్న వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుబేరుడు- ధన్వంతరి ప్రదోష కాలంలో పూజ.. సాధారణంగా దీపావళికి రెండు రోజుల ముందు అంటే ధంతేరస్ నాడు సాయంకాల సమయంలో అనగా ప్రదోష వేళలో వృషభ లగ్నంలో లక్ష్మీపూజ ఆచరిస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం కొనసాగుతుంది. ఆశ్వయిజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో లక్ష్మీపూజ చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు దీపాలు వెలిగించి.. కోటి ఆశలతో ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక ఈ ఏడాది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారం(అక్టోబరు 25) రోజే ధన్తేరస్ కావడం విశేషం. -
ఆ గ్రామాల్లో ‘నిశ్శబ్ధ’ దీపావళి..
దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. ఇటీవలి కాలంలో చాలా మందికి ఎక్కువ టపాసులు కాల్చడమనేది గొప్పదిగా మారింది. వాస్తవానికి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటామనే సంగతి అందరికి తెలిసిందే. పండగ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహిస్తారు. అయితే దీపావళిని ఉత్తరాదిన ఐదు రోజులు జరుపుకుంటుంగా.. దక్షిణాదిన మాత్రం ఒకటి, రెండు రోజులు మాత్రమే పండగ సందడి ఉంటుంది. కానీ దేశం మొత్తం పండగలో కనిపించేది బాణాసంచా. ఇటీవల దీపావళి రోజున బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు నియంత్రణ విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను చాలా చోట్ల ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా తమిళనాడులో శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు మాత్రం టపాకాయలు కాల్చడానికి దూరం. వీరు సుప్రీం ఆదేశాలకు పాతికేళ్ల ముందు నుంచే బాణాసంచా కాల్చకూడదనే తీర్మానం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాలు కూడా వెట్టంగుడి బర్డ్ సాంక్చురీలో భాగంగా ఉన్నాయి. అయితే ఇక్కడికి చలికాలం కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. సైబీరియా, న్యూజిలాండ్ నుంచి వచ్చిన పక్షులు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని మళ్లీ ఎండకాలం ప్రారంభం కాగానే వాటి ప్రదేశాలకు వెళ్లిపోతాయి. ఇక్కడే గుడ్లు పెటి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోతాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో టపాసులు కాల్చేవారు. అయితే బాణాసంచా మోతకు వలస వచ్చిన పక్షలు భీతిల్లిపోయేవి. పక్షులు పొదిగే గుడ్ల నుంచి పిల్లలు కూడా సరిగా బయటికి వచ్చేవి కావు. కొన్ని సార్లు పక్షులు అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయేవి. ఈ పరిస్థితులను గమనించిన రెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లో బాణాసంచా కాల్చకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామాల్లో ఏ దీపావళికి కూడా బాణాసంచా కాల్చడం లేదు. కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాల్లో ఎప్పుడూ బాణాసంచా కాల్చడం చూడలేదని ఆ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులు తెలిపారు. బాణాసంచా కాల్చకూడదనే నిబంధనపై గ్రామస్తులు కూడా బలమైన సంకల్పంతో ఉన్నారు. ‘మనుషులమైతే బాణాసంచా శబ్దం భరించలేకపోతే ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటాం, చెవుల్లో దూది కూరుకుంటాం. మరి ఆ పక్షులు ఈ భయంకరమైన శబ్దాలను ఎలా భరించాలి?’ అని ఆ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మన ఆనందం కోసం పక్షులను క్షోభ పెట్టడం ఏమిటి అనేది వాళ్ల భావన. దీపావళికే కాక గ్రామాల్లో జరిగే ఏ ఇతర వేడుకల్లో కూడా వారు బాణాసంచా కాల్చరు. పిల్లల సరదా కోసం.. పిల్లలకు టపాసులు కాల్చడమంటే మహా సరదా. అలాంటి వాటిని కాల్చవద్దంటే వాళ్ల మనసులు నోచుకుంటాయి. అందుకే ఆ గ్రామాల్లోని పిల్లలు ఎక్కువ శబ్దం లేని టపాసులను మాత్రమే కాలుస్తారు. అది కూడా... స్కూలు హెడ్మాస్టరు పర్యవేక్షణలో చెట్లు, పక్షులు లేని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి మరీ టపాసుల వేడుక చేసుకుంటారు. -
ఐదు రోజుల వెలుగుల పండుగ.. దీపావళి
సంస్కృతిని ప్రతిబింబిచేవే పండుగలు. అందులో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే వెలుగుల పండగే దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం. అయితే కొన్ని ప్రాంతాల్లో దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి. ధనత్రయోదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీ దేవిని భార్యగా స్వీకరించిన శ్రీమహా విష్ణువు ఆమెను ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడు. ఇది ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఈ రోజును ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మ దినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీన్ని ధన త్రయోదశి అంటారు. అందుకే ఈ రోజున కాస్తయినా బంగారం కొంటారు. లక్ష్మీ నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్‌కు చేరుతుంది. కుబేరుడు ఆమెను పూజించి అనుగ్రహం పొంది ఎంతో ధనవంతుడు అయ్యాడు. ఆ అమ్మ భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. నరక చతుర్దశి దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ రోజు స్నానం చాలా పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తెల్లవారుజామునే లేచి, నరకాసురుని బొమ్మని చేసి కాలుస్తారు. ఈ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం. ఈ రోజు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. కొన్ని ప్రాంతాలలో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి, అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి, నూనెతో తలంటి హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆడపడుచులకి ఆశీస్సులు, కానుకలు అందజేస్తారు. అందుకే సాధారణంగా ఈ పండుగకి కుటుంబ సభ్యులంతా కలుస్తారు. కొత్త దుస్తులు ధరించి నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటారు. దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. ధనాధిపతి కుబేరుడినీ పూజించాలి. లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది. బలి పాడ్యమి దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే. భగినీ హస్త భోజనం సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సూర్యభగవానుని కుమారుడు యముడు, అతడి సోదరి యమి. ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. -
వెలుగు నింపాలి.. కాలుష్యం కాదు
పండుగలు ఏవైనా అందరం సంతోషంగా జరుపుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలి . ప్రకృతితో మమేకమైన మన జీవన సౌందర్యాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. కానీ రోజు రోజుకీ మనం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాం. పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. ఆనందం కోసం పటాసులు పేలుస్తూ.. పర్యావరణానికి హాని చేస్తున్నాం. దీపావళి పండగ అంటే వెలుగు నింపాలి కానీ కాలుష్యాన్ని కాదు. దీపావళి పండుగ రోజున పెల్చే బాణాసంచాల వలన పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ స్థాయిలో ఉండాల్సిన కాలుష్య తీవ్రత పండుగ సమయంలో తీవ్రంగా పెరుగుతుంది. .ఒక్క టపాసు పేలితే వచ్చే పొగ అయిదువందల సిగరెట్లకు సమానం అన్నది పుణె పరిశోధకుల మాట. పటాకుల వలన వచ్చే శబ్దం వలన ధ్వని కాలుష్యం, పోగ వలన వాతవరణం కలుషితమవుతుంది. టపాసుల నుంచి వెలువడే పొగ పండగ తరవాత కూడా కొన్ని రోజుల పాటు మన పరిసర వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది చాలా మందిలో శ్వాస సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. పెద్ద శబ్దాలతో వినికిడి లోపం బాణాసంచా కాల్చడం వలన వాతవరణ కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడా ఏర్పడుతుంది. పండుగ రోజున విరజిమ్మె క్రాకర్స్ పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం వలన చిన్నపిల్లలో వినికిడి లోహం ఏర్పడుతుంది. గుండె సంబంధ వ్యాధులకు లోనయ్యె అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని టాక్సిక్ పదార్ధాల వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటితో పాటు పక్షులు జంతువులకు కూడా ముప్పు వాటిలే ప్రమాదముంది. 125డెసిబుల్స్ దాటకూడదని నియమం ఉన్న అంత కు మించిన శబ్దాలు రావడంతో నిద్ర సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద శబ్ధాల వల్ల రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినడంతో తాత్కాలికంగానే కాదు పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తులు విషపూరితం ఇంట్లో ఎవరికైనా ఆస్త్మా, సీఓపీడీ ఉంటే టపాసుల నుంచి వచ్చే పొగవల్ల అది మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. కొన్ని రకాల టపాసుల్లో రకరకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఉదాహరణకు కాపర్, కాడ్మియం మొదలైనవి. ఇవి గాలిలో దుమ్ము రూపంలో పేరుకుపోతాయి. ఈ దుమ్ము ఆస్త్మా ఉన్నవారికి ఎంతో ప్రమాదకారి. దీనివల్ల పైత్యం, తుమ్ములు, జలుబు, తలనొప్పి వంటి రుగ్మతలు కలుగుతాయి. ఈ పండుగ కూడా చలికాలంలో వస్తుంది కాబట్టి పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషపూరితమైన రసాయనాలు ఈ పొగలో కలిసిపోయి మరింత ఇబ్బంది పెడతాయి. ఈ హానికరమైన పొగ వల్ల ఊపిరితిత్తులు కూడా విషపూరితమవుతాయి. కర్ణభేరికి ప్రమాదం అధిక శబ్దంతో పేలే బాంబుల వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదముంది. సాధారణంగా యువత శబ్దం ఎక్కువగా వచ్చే టపాసులను పేల్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే వీటి ప్రభావం అప్పటికప్పుడు తెలియకపోయినప్పటికీ నెమ్మదిగా చెవి సంబంధిత రుగ్మతలతో బాధపడక తప్పదు. వీటి వల్ల పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదమైతే లేదు కానీ.. పండగ తరవాత కొన్ని రోజులపాటు వినికిడి లోపంతో ఇబ్బంది మాత్రం తప్పదు. పటాసుల ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు దీపావళికి, ఇతర సందర్భాల్లో కాల్చే క్రాకర్స్ తయారీలో అనేక రకాల విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని కాల్చిన తర్వాత రసాయనాలన్నీ పీల్చే గాలిలో కలిసి, మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మెగ్నీషియం అనే రసాయనం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జింక్ వల్ల తలనొప్పి, వాంతులు వస్తాయి.- గాలిలో కలసిన సోడియం వల్ల శరీరంపై దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే చర్మక్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాడ్మియం అనే రసాయనాన్ని పీల్చడం అనీమియాకు దారితీస్తుంది. ఎక్కువగా పీలిస్తే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. రక్తహీనత తలెత్తుతుంది. లెడ్ శరీరంలోకి ప్రవేశిస్తే నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గాలిలో కలిసిన కాపర్‌ను పీల్చడం వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస ఆడకపోవడం, విపరీతమైన దగ్గు వస్తుంది. నైట్రేట్ అనే రసాయనం మోతాదు మించితే చాలా ప్రమాదం. ఇది మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కావాల్సింది గ్రీన్ దీపావళి.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ వేడుకలైనా పటాకులు లేకుండా జరుగదు. అయినా అక్కడ కాలుష్యం పెరుగకపోవటానికి కారణం జీరో పొల్యూషన్ పటాకుల వినియోగించడమే. అన్నింటికీ మించి సామూహికంగా క్రాకర్ షో ఏర్పాటు చేసుకుని, అందులో సమిష్టిగా పాలుపంచుకొంటారు. మనదగ్గర సాధారణంగా కర్బన పదార్థాలతో పటాకులు తయారుచేస్తారు. విదేశాల్లో మాత్రం నైట్రోజన్ సంబంధిత పదార్థాలతో తయారుచేస్తారు. అమెరికాకు చెందిన కొన్ని కెమికల్, ఇంజినీరింగ్ కంపెనీలు జీరో పొల్యూషన్ క్రాకర్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటివల్ల తక్కువ పొగ రావడంతోపాటు పర్యావరణహితంగా పటాకులు కాల్చుకొనే అవకాశం కలుగుతున్నది. ఇక క్రాకర్ షో వంటి కార్యక్రమాల వల్ల కాలుష్యం ఒక్క చోటికే పరిమితం అవుతుంది. మనదేశంలో కూడా ఎకోఫ్రెండ్లీ పటాసులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో ఈ దీపావళి వేడుకలు జరుపుకుంటే కాలుష్యాన్ని కొంతమేర తగ్గించినవాళ్లం అవుతాం. ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్ కొంత మేలు దీపావళికి క్రాకర్స్ కాల్చడం తప్పనిసరి అని భావిస్తున్న వారంతా ఈ ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్‌ని వినియోగించుకోవడం మంచింది. పటాసులు పేలిస్తేనే పండుగా అని భావించేవారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కాన్ఫెట్టి, ఫ్లవర్ పవర్, ఫేక్నోట్, బర్ట్స్, స్నేక్‌మిక్స్‌లాంటి పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మామూలు బాణాసంచాలా కాకుండా, వాతావరణానికి అతి తక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. వీటి ధ్వని పరిమిత దూరం వరకే వినిపించడంతోపాటు కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్, ఫాస్పేట్ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు. అయితే వీటి లభ్యత చాలా స్వల్పంగానే ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ► అధిక శబ్దం, విపరీతమైన పొగ వెలువడే టపాసులు కాకుండా చిన్న చిన్న టపాసులను కాల్చండి. ►టపాసులను ఆరుబయట మాత్రమే కాల్చండి. వీటిని పేల్చేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయండి. ►ఎవరైతే ఆస్త్మాతో బాధపడుతున్నారో వారు ఈ సమయంలో తప్పకుండా మందులు వేసుకోవాలి. ►శ్వాసకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వీరు టపాసులకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ►టపాసులు కాల్చడం వల్ల వెలువడే రసాయనాల కారణంగా కళ్లు ఎర్రబడకుండా, కంటి నుంచి నీరు కారకుండా ఉండటానికి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది. ►అలాగే చేతులతో పట్టుకుని కాల్చే టపాసులతో కొంచెం జాగ్రత్త వహించాలి. వీటి వల్ల చేతులు కాలే ప్రమాదముంటుంది కాబట్టి ముందుగానే మాస్కులు లేదా గ్లౌజులు వేసుకోవడం మంచిది. -
దీపావళి : ఉత్తర, దక్షిణ భారతాల్లో తేడాలు
సాక్షి : దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి గెలిచిన దానికి ప్రతికగా ఈ దీపావళిని జరుపుకుంటారు. దీపావళి పండుగ పేరు వినగానే టక్కున గుర్తోచ్చేవి టపాసులు, స్వీట్స్, దీపాలు, కొత్త బట్టలు. కానీ అవే కాకుండా వ్రతాలు, పూజలు అని ఇంకా చాలా ఉన్నాయ్. దీపావళి అంటే చిన్న, పెద్ద, పేద, ధనిక, అనే వర్గం లేకుండా భారత ప్రజలంతా ఉత్సహంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో నాలుగు నుంచి ఐదు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా మన దక్షిణా భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో దీపావళిని జరుపుకోవడంలో కొన్ని తేడాలున్నాయి. తేడాలు - పోలికలు ఉత్తర భారతంలో ఈ పండగను ఐదు రోజులు జరుపుకుంటే దక్షిణంలో నాలుగు రోజులు జరుపుకుంటారు. పేరు కూడా ఉత్తరంలో దీవాళి అంటే దక్షిణంలో దీపావళి అని అంటారు. రెండూ ఒకటే పండుగను సూచిస్తాయి. ఉత్తరంలో ధన్‌తెరాస్ పండుగకు బంగారం కొనడం సెంటిమెంట్. ధన్ అంటే ధనము. తేరాస్ అంటే పదమూడో రోజు అని అర్థం. పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చే క్రమంలో పదమూడో రోజు దీపావళి పండుగ ప్రారంభమవుతుందని దాని అర్ధం. దక్షిణంలో ఆ సంస్కృతి మొదట్లో లేదు. కానీ ఇప్పుడిప్పుడే సౌత్‌లో కూడా బంగారం కొంటున్నారు. దీనికి ఉత్తరాది ప్రజలు దక్షిణాదికి వలస రావడం కారణం కావచ్చు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆత్మీయులను, బంధువులను పిలిపించి ఆతిథ్యమివ్వడం, స్వీట్లు, తినుబండారాలు, పిండివంటలు, ఇంట్లో దీపాలు వెలిగించడం వరకు అంత ఒకేలా ఉంటాయి. దాంతో పాటు టపాసులు, చిచ్చుబుడ్లు పేల్చడం నేడు దేశమంతా సాధారణమైపోయింది. అసలు దీపావళి పండుగను మొదటినుంచీ ఉత్తర భారతంలోనే చాలా ప్రత్యేకంగా జరపుకుంటారు. లక్ష్మీదేవీకి నిష్టగా పూజలు, వ్రతాలు చేసుకుని ఆ తర్వాత వారి బంధుమిత్రులను పూజలకు, వ్రతాలకు ఆహ్వానించడం, ఆ తర్వాత అంతా కలిసి ఒక చోట చేరి సాయంకాలం టసాసులు పేల్చి ఆనందోత్సహాలతో దీపావళి వేడుకను జరుపుకుంటారు. అలాగే మన దక్షిణ భారతంలో కూడా మొదటినుంచి పూజలు, వ్రతాల సంస్కృతి ఉన్నప్పటికీ బంధుమిత్ర సమేతంగా ఉత్తర భారతీయులు జరుపుకనేంత ప్రత్యేకంగా జరుపుకునే వారు కాదు. బంధుమిత్రులతో కలిసి కాకుండా వారి కుటుంబాలతో మాత్రమే జరుపుకునే వారు. మన దక్షిణాదిన దీపావళి పండుగకు చేసుకునే నోములు, వ్రతాలు వంటి వాటికి వారి కుటుంబీకులు తప్ప వేరే వారు ఉండకూడదన్న నమ్మకంతో ఉంటారు. కానీ ఇప్పుడు కాలానుగుణంగా ఉత్తర భారతీయులను చూసి వారి సంస్కృతిని మన దక్షిణాది ప్రజలు కూడ అవలంబిస్తున్నారు. అయితే మార్వాడి వంటి కొన్ని తెగల్లో దీపావళికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఉత్తర భారతదేశంలో వీరి లాంటి జాతులు, తెగల వారికి దీపావళి రోజునే కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. దక్షిణ భారతదేశం, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో దసరాకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఉత్తరాది వారికి దీపావళి అలాంటిది. ఆహారం విషయానికొస్తే సాధారణంగా ఏ పండుగకైనా ఇంట్లో మాంసాహారంతో విందు చేసుకుంటారు. కానీ, దీపావళి పండుగకు మాత్రం ఉత్తర భారతంలో పూర్తి శాఖాహారానికే పరిమితమవుతారు. దక్షిణాదిలో కూడా శాఖాహారానికే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే దీపావళి పండుగ రోజు ప్రతీ ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తారు. దీపాలు వెలిగించి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇదీగాక, దీపావళి ముగిసిన తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దక్షిణాదిలో ఈ మాసం ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది. -
దీపావళి లోగిలిలో అందమైన బొమ్మల కొలువు
చీకట్లను చీల్చి వెలుగునిచ్చే పండుగగా దీపావళిని జరుపుకుంటారన్న సంగతి మనకు తెలిసిందే. దీపావళి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో బొమ్మలకొలువును ఆనవాయితీగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ బొమ్మల కొలువు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఈతరం పిల్లలకు భారతీయ ధర్మం పట్ల అవగాహన, అభిరుచిని పెంపొందింస్తారు. అలాగే పురాణ, ఇతిహాసాలను కథల రూపంలో పిల్లలకు తెలియజేస్తూ భారతీయ సంప్రదాయంపై గౌరవం కలిగేలా చూస్తారు. బొమ్మల కొలువును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. నరక చతుర్దశి రోజున బొమ్మల కొలువును ఏర్పాటు చేసి దీపావళి మరుసటి రోజు సాయంత్రం వరకు దీనిని నిర్వహిస్తారు. బొమ్మలు కొలువు పెట్టే విధానం : బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది. బొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. గౌరమ్మ పూజ అనంతరం కలశం ఏర్పాటు చేసి తమ వద్ద ఉన్న వివిధ బొమ్మలను వరుస క్రమంలో అలంకరిస్తారు. అనంతరం చక్కెర పొంగలి, పేనీలు, పసుసు, కుంకుమ నైవేద్యంగా సమర్పిస్తారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా వివిధ పండులను బొమ్మలకొలువు రూపంలో ఏర్పాటు చేసి వాటి విశిష్టతను తమ పిల్లలకు కథల రూపంలో వివరిస్తారు. తమ చుట్టపక్కల ఉండే మహిళలను, పిల్లలను పిలిచి తమ బొమ్మల కొలువును చూపి వారికి వాయినాన్ని అందజేస్తారు. దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ దేవి పూజను నిర్వహించి బొమ్మల కొలువు చుట్టూ దొంతులనూ ఏర్పాటు చేసి నువ్వులనూనెతో మాత్రమే దీపాలను వెలిగిస్తారు. ఇక మూడో రోజున ఐదుగురు ముల్తైదలను పిలిచి వారికి పసుపు, కుంకుమలను వాయినంగా సమర్పించి , అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడంతో కార్యక్రమం ముగుస్తుంది. -
కళ్లల్లో వత్తులేసుకుని చూడండి
నవ్వింతల తుళ్లింతల చిన్నారి ఆమె. పదేళ్ల వయసు. కళ్లు చెదిరే అందం. మెటికెలు విరవాలనిపించేంత కళ్ల మెరుపు. ఆ వయసుకు ఉండే చురుకు. దీపావళి సందడిలో అందరు పిల్లల్లాగే ఆమె కూడా నిమగ్నమైంది. పటాసును అంటించేసి పక్కకు తొలిగింది. చురచురమనే మంటకు దూరంగా చురుగ్గా కదిలింది. కానీ ఆమె వెనకాలే కాలుతున్న ప్రమిద. చిదిమి దీపం పెట్టుకునేంత అందానికి ఆ దీపం తగిలింది. వెలుగు మంటయ్యింది. ఒంటిని కాల్చేసింది. అగ్గిపుల్ల అంటితేనే గబుక్కున వేలిని వెనక్కు తీసుకునే మనమందరం ఆమె భరించిన ఉష్ణాన్ని ఊహించవచ్చు. కొన్నాళ్ల పాటు భగభగను భరించింది. ప్లాస్టిక్ సర్జరీల పేరిట ఒలిచేసే చర్మం... కలిచేసే బాధ. ఎన్నో సార్లు చర్మాన్ని తీసి కాలిన చోట అంటించారు. బొబ్బలు మానాక అతికించారు. ఎన్నెన్నో చికిత్సలతో ఎట్టకేలకు ఆ పాపాయి ఇప్పుడు పూర్తిగా మామూలయ్యింది. ఆ చిన్నారి మా ఆఫీస్ కలీగ్ కూతురే. కానీ స్కూలుకు వెళ్లినప్పుడల్లా ఆమెనూ, మేనినీ గమనించి చూస్తారు. గాయాల మచ్చలు ఇంకా ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. ఒంటి గాయాలు మానినా మనసుపై మచ్చలు పరుస్తుంటారు. ఇలాంటి కష్టం ఏ పాపకూ రాకూడదు. ఏ చిన్నారికీ ఇలాంటి చేటు కలగకూడదు. పసి మనసులు చెదరకూడదు. అందుకే అందరూ అప్రమత్తం వహించండి. ఈ కొన్ని జాగ్రత్తలు పాటించండి. కళ్లలో ఒత్తులు వేసుకొని పిల్లలను చూసుకోండి... సాధారణ జాగ్రత్తలు ►ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని పంచి ఇచ్చే పండుగ వెనక పరమార్థం కూడా ఉంది. సరిగ్గా వర్షరుతువులోని వానలు తెరిపి ఇచ్చాక వచ్చే పండగ ఇది. వానల తర్వాత ఇళ్లల్లోని చెమ్మకు విరుగుడుగా సున్నంవేస్తారు. ►బాణాసంచా నుంచి వచ్చే పొగల వల్ల ఈ సీజన్లో స్వతహాగా పెరిగే అనేక రకాల హానికారక సూక్ష్మజీవులు నశించిపోయేలా పెద్దలు రూపొందించిన పండగ ఇది. టపాకాయలు కాల్చడం వల్ల వెలువడే గంధకం, పొటాషియం వంటివి కీటకాలను, క్రిములను దూరంగా ఉంచుతాయి. ►ఇదే సీజన్లో విస్తరిల్లే మలేరియా, డెంగ్యూల నుంచి స్వాభావిక రక్షణ కల్పించేలా చేస్తాయి. అంటువ్యాధులను వ్యాపించజేసే అనేక క్రిములను తుదముట్టించి అరికట్టేందుకు బాణాసంచా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి పాజిటివ్ అంశాలు కాగా... ఇక దీంతో వచ్చే కొన్ని నెగెటివ్ అంశాలివి... ►పండగ అనగానే పిండివంటలు, స్వీట్లతో హైక్యాలరీ ఫుడ్ తినేసే అవకాశాలుంటాయి. క్యాలరీ ఇన్‌టేక్ తగ్గించుకోవాలి. ►ఆహార విషయాల్లో డయటరీ ఇర్రెగ్యులారిటీలు వచ్చే అవకాశం ఉంటుంది. అది డయాబెటిస్, హైపీడీ ఉన్న రోగులను. ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ. ఎంత రుచిగా ఉన్నా మితంగా తినడం మంచిది. ►గంధకం వంటి రసాయనాల ప్రభావంతో వాయుకాలుష్యంతోపాటు అది కొన్ని అలర్జీలను మరింత ప్రజ్వరిల్లేలా చేసే అవకాశమూ ఉంది. ►టపాకాయల నుంచి వచ్చే పొగతో ఉబ్బస వ్యాధులు (అలర్జిక్ ఎయిర్‌వే డిసీజెస్) ఉన్నవారికి అకస్మాత్తుగా అటాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు పొగకు దూరంగా ఉండాలి. ►దీపావళి అయిన మర్నాడు చూస్తే రోడ్లపై టపాకాయల చుట్టేందుకు ఉపయోగించిన కాగితాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. ఇది మరోరకం కాలుష్యం. కళ్లు ►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం. ►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల విషప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు. ► తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దాని వల్ల కార్నియల్ బర్న్స్ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు. ►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి. కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు. ►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►వెలుగులు, రవ్వలతో పాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది. ► రాకెట్ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ► డైరెక్ట్ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ► అలాంటిదే జరిగితే కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ► గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను కలిసి చూపించుకోవాలి. చర్మం ►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే. ►బాణాసంచా కేవలం లైసెన్స్డ్ షాప్‌లోనే కొనాలి. ►ఇంట్లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ వంటి దాన్లో పెట్టాలి. ►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి. ►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు. ►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. ►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది. ►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు. ►కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది. ►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం. ►టపాసు నుంచి తలను వీలైనంత దూరంగా ఉంచాలి. ►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు. ►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి. ►గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్ వద్దకుతీసుకెళ్లాలి. ►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్ఫీషియల్), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్ డెప్త్), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్ బర్న్స్). ►వీటిల్లో మీడియన్ డెప్త్, డీప్ బర్న్ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్) మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. ►ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ►డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు. ►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►కాలిన గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు. ►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. ►అలాంటప్పుడు వాటి మధ్య తడిగుడ్డ ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి. ►ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన కాల్చకూడదు. మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు. ►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు. ►మరింత శబ్దం వస్తుందని కుండల వంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు. ఈఎన్టీ ►శబ్దం : శబ్దం వల్ల నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువ. ►మనకు హాని కలిగించే శబ్దాలను రెండురకాలు విభజించుకోవచ్చు. మొదటిది... అకస్మాత్తగా వినిపించే శబ్దం... దీన్ని ఇంపల్స్ సౌండ్ అంటారు. రెండోది... దీర్ఘకాలం పాటు శబ్దాలకు అలా ఎక్స్పోజ్ అవుతూ ఉండటం. ఈ రెండోరకాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. మనం దీపావళి సందర్భంగా ఎదుర్కొనే శబ్దం మొదటిదైన ఇంపల్స్ సౌండ్. అకస్మాత్తుగా ఎక్స్పోజ్ అయ్యే శబ్దం నుంచి హాని ఈ కింద పేర్కొన్న ఏదో విధంగా కనిపించే (మ్యానిఫెస్ట్ అయ్యే) అవకాశం ఉంది. ►అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. ►చెవిలో నొప్పి, గుయ్... మంటూ శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు. ►లోన ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం. ►నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి నష్టం కూడా జరగవచ్చు. ►గర్భిణుల్లో 140 డిసిబుల్స్‌కు మించిన పెద్ద శబ్దం వల్ల ఒక్కోసారి నొప్పులు వచ్చి ప్రసూతి అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. లోపలి పిండంపైనా శబ్దం తాలూకు దుష్ప్రభావం ఉంటుంది. ►వయోవృద్ధులు కూడా మానసికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి: ►మన ఆనందం పొరుగువాళ్లకు (ఆ మాటకొస్తే మనకు కూడా) హానికరం కాకూడదు. కాబట్టి కాస్తంత చైతన్యంతో మరికాస్త సంయమనంతో వ్యవహరించాలి. శబ్దాలతో ప్రభావితమయ్యే గ్రూప్స్‌కు దూరంగా బాణసంచా కాల్చాలి. ►పెద్ద శబ్దాలు వచ్చి పేలిపోయే టపాకాయలకు బదులు శబ్దాలేవీ రాకుండా పూల వర్షం కురిపించే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు... వంటివి కాల్చాలి. ►ఒకవేళ శబ్దానికి ఎక్స్పోజ్ అయితే చెవిలో ఎలాంటి ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె వెయ్యకుండా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు. ►పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. లేదంటే అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆస్తమాతో పాటు అనేక రకాల సమస్యలు తీసుకురావచ్చు. ►బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం వంటివి చేయకూడదు. ►రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చేతులను ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచండి. మానసిక ప్రభావాలు ►మంచి మ్యూజిక్‌తో ఆహ్లాదం వంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్లే పెద్ద శబ్దాలతో నెగెటివ్ ప్రభావాలూ ఉంటాయి. ►బాణాసంచా శబ్దాలతో మానసికంగా కూడా దుష్ప్రభావాలు ఉండే అవకాశాలున్నాయి. ►పెద్ద శబ్దం వల్ల అగ్రెషన్ (ఉద్రేకం, పోట్లాటకు ముందు ఉండే స్థితి) పెరుగుతుంది. ►ఇది గర్భిణులు, వృద్ధులు వంటి వారిలో మరీ ఎక్కువ. ►గర్భంలో ఉన్న పిండంపై కూడా ఈ దుష్ప్రభావాలు ఉంటాయి. కారణం... పిండానికి 20 వారాలప్పుడే దృష్టి కంటే ముందుగా వినికిడి శక్తి ఏర్పడుతుంది. అందుకే వాటిపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. ►యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నవారు ఈ పెద్ద చప్పుళ్లు భరించలేరు. ►వారిలో ఆందోళన, చికాకు, కోపం, విసుగు మరింత పెరుగతాయి. ►కాలుష్యం వల్ల నేరుగా కాకపోయినా పరోక్షంగా కూడా మానసిక ప్రభావం పడుతుంది. ఇది మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదు. ►మామూలు వాళ్లలో శబ్దాల వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ►అలాంటప్పుడు ఇక హృద్రోగం వంటివి ఉన్నవారిలో ఇది మరెంత పెరుగుతుందో దాని వల్ల హాని ఎంతో ఊహించుకోవచ్చు. ►ఎలాంటి పరిణామాల వల్ల అనటామికల్ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. ►భావోద్వేగాలకు త్వరగా లోనయ్యే అవకాశలు ఎక్కువ. ►ఈ శబ్దాల తీవ్రత వల్ల కొన్ని భ్రాంతులు (ప్రైమరీ హ్యాలూసినేషన్స్) ఏర్పడే అవకాశం కూడా ఉంది. జంతువుల సంరక్షణకు సూచనలు... ►పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరే ప్రమాదం ఎక్కువ. అప్పుడే పుట్టిన పసికూనలు పటాసుల శబ్దంతో బెదిరిపోతాయి. ►పెద్దగా పేలే శబ్దాలతో కుక్కలకు సౌండ్ ఫోబియా వచ్చి అన్నం తినడం మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు జంతువులను, పేలుళ్లు వినిపించే ప్రాంతం నుంచి శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి. ►పాడి గేదెలు వాటి పిల్లలపైన లేగదూడలు సైతం శబ్దాల ప్రభావానికి గురవుతాయి. పాడిగేదెలు కట్లు తెంపుకొని పారిపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఒకేసారి కట్లు తెంపుకున్న జంతువులు వీధుల్లోకి వస్తే ప్రమాదమే. ►వీధుల్లో తిరిగే కుక్కలు పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ►ఒక్కోసారి థౌజెండ్‌వాలా లాంటి టపాసులు చాలా సేపు అదేపనిగా చిటపట మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. అవి బెదిరి ఎగిరే సమయాల్లో ఒక్కోసారి బైక్స్ మీద వెళ్లేవారిని ఢీకొంటే మనుషులకూ ప్రమాదం. ►ఒక్కోసారి పక్షుల గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు. ►రాకెట్ల వంటి బాణాసంచాను చెట్లపైకి వదలకూడదు. అవి తాకి వాటి పక్షుల ప్రాణాలు పోవచ్చు. ►బెదిరి చెల్లాచెదురయ్యే వేళల్లో జంతువులో ఫెన్సింగ్‌లలో చిక్కుకుపోవడం, గాయపడటం జరగవచ్చు. ►చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్‌ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీసి పిల్లపక్షులను అనాథలను చేసి ఆ ఉసురు మనం పోసుకున్నట్లే! -
చీకటి వెలుగుల శివకాశి
దీపావళిలోని వెలుగునీడలు జీవితానికి సంకేతంగా భావిస్తారు. అందుకనే చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి అన్నారో సినీకవి..! కటిక చీకట్లకి కొలమానం అమావాస్య అయితే.. వెలుగుల వెల్లువకు పతాక సన్నివేశంగా దీపావళిని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఒకేసారి కలగలిపి మనముందు ప్రజ్వలించే పండుగే దీపావళి. సుఖదుఃఖాలకు, జయాపజయాలకు, మంచిచెడులకు నిండైన ప్రతీకే దీపావళి. జీవితంలో తారసిల్లే మంచిచెడులను కలగలిపి దీపావళి సరంజామాతో పోల్చిచూస్తారు. అందులోనూ దీపావళి అందరి పండుగ. దీపావళి అంటే మనందరికీ ఎంత సరదానో..! మరి ఆ సరదా వెనుకు దాగి ఉన్న నిజాల వెలుగులు కూడా తెలుసుకోవాలి కదా..! జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది. గువ్వలా బతకమని తారాజువ్వ చెబుతుంది. నిప్పుతోటి చెలగాటం వల్ల ముప్పుతప్పదని తానందుకు ప్రత్యక్ష సాక్ష్యమని టపాకాయ చెబుతుంది'. ఇలా తరచి తరచి చూస్తే దీపావళి నిండా జీవితానికి సంబంధించిన ఫిలాసఫీ చాలానే ఉంటుంది. తమస్సు నుంచి ఉషస్సుకు దీపావళి పండుగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది టపాకాయలు. ఆ టపాకాయలకు దేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ప్రాంతం శివకాశి. ఇక్కడ చాలా తక్కువ ధరకు మనకు కావాల్సినన్ని దొరుకుతాయి. మనకు చౌకగా లభ్యమయ్యేవంటే మక్కువ ఎక్కువ. ప్రపంచ మార్కెట్లో శివకాశి బాణాసంచాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వివరాల్లోకెళ్తే.. 1960వ సంవత్సరం దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. అందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే శివకాశిలో ఉన్న నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ది చెందాలని నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణాసంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో రాణించారు. ఈ విషయాలు తెలుసుకున్న అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ ఈ నగరానికి కుట్టి జపాన్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇది మినీ జపాన్‌గా ప్రశస్తి సాధించింది. కేవలం నెహ్రూ పేరు పెట్టారనే కాదు కానీ.. ఇది నిజంగా మినీ జపానే..! ఎందుకంటే ఇక్కడి వారందరూ కుటీర పరిశ్రమలపై ఆధారపడే జీవనం సాగిస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం, నాణ్యత, కలిసికట్టుతనం వంటి లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దీపావళి సమీపించే కొద్దీ ఇక్కడ పనిచేసేవారు ఎక్కువ శ్రమిస్తారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ సమయాల్లో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది. నేడు ఈ ప్రాంతంలో నిరుద్యోగం కనిపించదు. 100శాతం ఉపాధి ఈ పట్టణం సొంతం. దాదాపు 3లక్షల మంది కార్మికులు బాణాసంచా, అగ్గిపుల్లల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. శివకాశి శివారులోని 15కు పైగా గ్రామాల్లో ఈ పరిశ్రమలు ఉండగా తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు తదితర జిల్లాల నుంచి వేలాదిమంది కార్మికులు వలసలు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. శివకాశి స్వరూపం రాష్ట్రం - తమిళనాడు జిల్లా -విదూర్నగర్ పట్టణ విస్తీర్ణం - 343.76 జనాభా - 2.6 లక్షలు అక్షరాస్యత - 77శాతం పరిశ్రమలు - 8,000 బాణాసంచా వ్యాపారం - ఏటా దాదాపు 2వేల కోట్లు వెలుగుకు మార్గం శివకాశిలో తయారైన బాణాసంచా దీపావళి రోజున దేశమంతటా వెలుగులు విరజిమ్ముతాయి. ముల్లోకాలలోని చీకట్లను తొలగించి దీపపు కాంతి వెలుగు ప్రసరించడానికి కారణమయ్యే అగ్గిపుల్లలు కూడా 70శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే పర్వం సంధ్యా దీపం నమోస్తుతే జ్ఞానానికి, ఆనందానికి, భయరాహిత్యానికి మారుపేరుగా నిలిచే దీపానికి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. ఎప్పుడు ఏం జరుగుతుందో..! పుష్కరకాలంగా ఈ ప్రాంతంలో అనేక ఘోరప్రమాదాలు జరిగాయి. దీపావళి సమీపించే కొద్దీ ప్రమాదాలు అధికమవుతూ ఉంటాయి. పండుగ సమయంలో డిమాండ్ రీత్యా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఇక్కడ అనుమతి పొందిన 700 బాణాసంచా తయారీ పరిశ్రమల్లో 2లక్షల మంది కార్మికులు, అనుమతుల్లేని పరిశ్రమల్లో మరో లక్షమంది దాకా పనిచేస్తుంటారు. దేశానికి అవసరమైన బాణాసంచాలు, అగ్గిపుల్లలు 80శాతం ఇక్కడే తయారవుతాయి. ఇక్కడి కార్మికులు పరిశ్రమల్లో రసాయనాల నుంచి తలెత్తే రుగ్మతల నుంచి బయటపడడానికి ఎక్కవగా అరటిపండ్లు తింటుంటారు. ఇక్కడి పొడి వాతావరణం బాణాసంచా తయారీకి అనుకూలం. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతుంటాయి. భారీవర్షాలు, నదులు, పచ్చని పంటపొలాలు ఇక్కడ పెద్దగా కనిపించవు. దీపావళి రోజున చీకట్లు తొలగించి వెలుగులు విరజిమ్మాల్సిన బాణసంచా ఇక్కడి అభాగ్యుల జీవితాల్లో చీకట్లను నింపిన సందర్భాలెన్నో..! -
దీపావళికి పసిడి ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
దీపావళి అంటే దివ్వెలు, వెలుగుల సంబరం మాత్రమేకాదు. పసిడి కాంతుల కళకళలు కూడా. దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చిందంటే నగల వ్యాపారులకు బోలెడన్ని ఆశలు. ముఖ్యంగా పండుగ దీపావళి ముందురోజు వచ్చే ధంతేరస్ (ధన త్రయోదశి) రోజు భారీగా అమ్మకాలు వుంటాయని ఎదురు చూస్తుంటారు. లక్ష్మిదేవిని పూజించడం ఎంత ముఖ్యంగా భావిస్తారో...దీంతో పాటు బంగారం గానీ, ఏదో ఒక కొత్త వస్తువు కొనడం కూడా అంతే ఆనవాయితీ వస్తున్న క్రమంలో వారికి భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన పసిడి దరలు దీపావళి నాటికి దిగి వస్తాయా అని కొనుగోలుదారులు ఆశగా ఎదురుచూస్తోంటే.. కొనుగోళ్లతో తమ షాపులు కళకళ లాడతాయా లేదా అని వ్యాపారులు ఆందోళన పడుతున్నారు. ముందుగా కొనుగోలుదారుల విషయానికి వస్తే.. కొనుగోలుదారులు ఈ ధంతేరస్‌కు ఎంతో కొంత బంగారాన్ని తమ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఆకాశాన్నంటిన ధరలు మరింత దిగిరాకపోతాయా అనే మీమాంసలో చాలామంది కొనుగోలు దారులున్నారు. దీనికి తోడు స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ భవిష్యత్తులో మాత్రం భారీగా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనాలు వారి ఊహలకు రెక్కలు తొడుగుతున్నాయి. అయితే క్షణక్షణానికి మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పుత్తడి ధర ఏ రోజు ఎంత పెరుగుతుందో.. ఎంత తగ్గుతుందో అంచనా వేయడం ఒకింత కష్టంగా మారింది. ఇక రీటైల్ వ్యాపారుల విషయానికి వస్తే.. పుత్తడి స్వల్పంగా ధర దిగి వచ్చినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు కనీసం 30 శాతం తగ్గుతాయని మార్కెట్ వర్గాల అంచనా. అయితే దీపావళి, ధంతేరస్ పర్వదినాల సందర్భంగా కొనుగోళ్లు పుంజు కుంటాయని ఆభరణాల పరిశ్రమ ఆశిస్తోంది. ఇటీవల 10 గ్రాములకు రూ. 40,000 రికార్డు స్థాయిలో ఎగిసిన పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో కస్టమర్ల తాకిడి ఆశాజనకంగా వుంటుందని భావిస్తున్నారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం భయాలు తగ్గుముఖం పట్టి చర్చలు ప్రారంభించడం డాలర్‌కు బలాన్నిచ్చింది. ముఖ్యంగా గడిచిన నెల రోజుల వ్యవధిలో న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 60 డాలర్ల మేర తగ్గింది. గత నెలలో బంగారం ధర గరిష్టంగా 1530 డాలర్ల వరకూ పెరిగింది. అక్కడి నుంచి పతనమైన బంగారం ధర ప్రస్తుతం 1475 డాలర్ల వద్ద వుంది. అటు దేశీయంగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం తగ్గుముఖం పడుతోంది. దీంతో ధంతేరస్‌కు పసిడి లాభాల సిరులు కురిపిస్తుందనే అంచనాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ పరిస్థితులు, గ్లోబల్‌గా ఆర్థిక వ్యవస్థ మందగమనం, ట్రేడ్‌వార్ తదితర కారణాల రీత్యా మొత్తం వ్యాపారం గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తక్కువగా ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంతపద్మనాభన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పిఆర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొనుగోళ్లు హై ఎండ్ రేంజ్లో చాలా ఎక్కువ స్థాయిలో నమోదవు తున్నాయనీ, కానీ తక్కువ నుండి మధ్యస్థాయి వరకు జరిగే కొనుగోళ్లు బాగా ప్రభావితమవుతాయని చెప్పారు. అంతేకాదు ప్రస్తుత ధోరణిని చూస్తే మొత్తం 2019 (750-850 టన్నుల) డిమాండ్ లక్ష్యాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీపావళి అమ్మకాలపై కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ టిఎస్ కల్యాణారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. తమ బ్రాండ్ ఏడాది పొడవునా గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన అధిక బోనస్ కూడా డిమాండ్ పెంచడానికి దోహదపడుతుందని టైటాన్‌కు చెందిన సందీప్ కుల్హల్లి తెలిపారు. దీంతోపాటు తమ దీపావళి స్పెషల్ కలెక్షన్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందన్నారు. అయితే సెప్టెంబరులో దేశీయ బంగారం దిగుమతులు మూడేళ్ళలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏడాది క్రితం 81.71 టన్నులతో పోలిస్తే ఈ సెప్టెంబరులో 68శాతం క్షీణించి 26 టన్నుల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంది. వాల్యూ పరంగా దిగుమతులు 51 శాతం క్షీణించి 1.28 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు అమెరికా చైనా మధ్య వాణిజ్యయుద్ధానికి ముగింపు పలకనున్న సందేశాలు, బ్రెగ్జిట్ సంభావ్యత డాలర్‌కు బలానివ్వనున్నాయి. దీంతో బంగారం ధరలు గ్లోబల్‌గా దిగి వచ్చే అవకాశం ఉంది. ఇది దేశీయంగా కూడా ప్రభావం చూపుతుంది. కానీ డాలరుమారకంలో రూపాయి మరింత క్షీణించినట్లయితే పసిడి గరిష్ట ధరలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. అంటే పసిడి పరుగుకు బ్రేక్ పడనట్టే! -
స్లోడౌన్‌పై పటాస్..
ఆర్థిక మందగమనంతో అన్ని రంగాలు కుదేలైన వేళ దివ్వెల పండుగ ఆయా రంగాల్లో వెలుగులు నింపుతోంది. పండగ వేళ వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లో ఉత్తేజం నెలకొంది. పండగ సీజన్లో వినిమయం పెరగడం ఆర్థిక వ్యవస్థకూ ఊరట ఇస్తోంది. గత పండగ సీజన్‌తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ఈసారి ఇప్పటికే అమ్మకాలు 9 నుంచి 12 శాతం మేర పెరిగాయి. కేరళలో ఓనం పండుగతో ప్రారంభమైన పండగ సీజన్ నవర్రాతి-దుర్గా పూజ, దసరా, కర్వా చౌత్, దంతేరస్ ఆపై దివాలితో ముగియనుండగా రిటైల్ సేల్స్ ఆశాజనకంగా సాగుతున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఎలక్ర్టానిక్, ఆటోమొబైల్ సహా పలు రిటైల్ సేల్స్ వార్షిక అమ్మకాల్లో 35-40 శాతం వరకూ ఈ సీజన్లోనే ఉంటాయి. వాహనాలు, స్మార్ట్ టీవీ అమ్మకాలు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ ప్రోత్సాహకరంగా లేకపోవడంతో పండగ సీజన్ సేల్స్‌పైనే ట్రేడర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. రుణాలపై వడ్డీ రేట్లు దిగిరావడం, ఆఫర్ల వెల్లువతో బంపర్ సేల్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక దివాలి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థలు పోటాపోటీ ఆఫర్ల పటాస్లను పేల్చుతూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.దసరా సేల్‌ను మిస్సయ్యామని ఫీలయ్యే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలి సేల్‌తో ముందుకొచ్చింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకూ ఐదు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. బిగ్ దివాలి సేల్‌లో రెడ్మి నోట్ 7 ప్రొ, రెడ్మినోట్ 7ఎస్, రెల్మీ 5, వివో జడ్1 ప్రొ సహా పలు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణలపై 75 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. బిగ్ దివాలీ సేల్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్ర్కైబర్లకు ఆదివారం రాత్రి 8 గంటల నుంచే అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ సేల్‌లో రెడ్మి నోట్ 7 ప్రొ ఎంఆర్పీ 13,999 కాగా రూ 11,999కు లభిస్తుంది, రెడ్మి నోట్ 7ఎస్ (10,999) రూ 8999, రెల్మీ 5 రూ 9999కు, వివో జడ్1 ప్రొ (రూ 14,990) రూ 12,990 నుంచి ప్రారంభమవుతాయి. డిస్కౌంట్ ధరలతో పాటు బిగ్ దివాలి సేల్ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్లు, ఇతర వస్తువులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆకర్షణీయ ధరలకు అందుబాటులో ఉంటాయి. దాదాపు 50,000కు పైగా ఉత్పత్తులపై 75 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. శాంసంగ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ (32 ఇంచ్) సహా పలు గృహోపకరణాలపైనా భారీ డిస్కాంట్లు ఉంటాయని మైక్రోసైట్లో ఫ్లిప్‌కార్ట్ పొందుపరిచింది. ఇక పలు ఎలక్ర్టానిక్ పరికరాలు, యాక్సెసరీస్‌పై 90 శాతం వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉందని పేర్కొంది. యాపిల్ వాచ్ సిరీస్ 3పైనా ఆకర్షణీయ తగ్గింపులను ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ర్టానిక్ ఉపకరణాలపై ధమాకా డీల్స్ పేరిట అదనపు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ సేల్‌లో రష్ హవర్, మహా ప్రైస్ డ్రాప్ వంటి ఫ్లిప్‌కార్ట్ ప్రమోషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. బిగ్ దివాలీ సేల్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్‌కార్డును ఉపయోగించే వారికి పది శాతం అదనపు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఆఫర్లు ఇలా.. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలి స్పెషల్ ఎడిషన్‌ను లాంఛ్ చేసింది. ఇప్పటికే ప్రారంభమైన సేల్ ఈనెల 25 వరకూ కొనసాగుతుంది. ఈ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, రుపే కార్డుహోల్డర్డ్స్కు పది శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. మొబైల్ ఫోన్లు సహా పలు ఎలక్ర్టానిక్ ఉత్పత్తులు, వస్తువులపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ 64జీబీ రూ 89,900 కాగా దివాలీ సేల్‌లో రూ 79,999కే ఆఫర్ చేస్తోంది. అందుబాటు ధరలో ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్ వివో యూ10పై ఎంఆర్పీ రూ 8,990 కాగా రూ 7,990కి ఆఫర్ చేస్తోంది. ఒన్‌ప్లస్ 7ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై రూ 13,000 వరకూ తగ్గింపును ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ 32,999 కాగా రూ 29,999కు సేల్‌లో అందుబాటులో ఉంది. ఒన్‌ప్లస్ 7 ప్రొ ఎంఆర్పీ రూ 48,999 కాగా రూ 44,999కి అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఎంఆర్పీ రూ 51,990 కాగా రూ 41,999కి, శాంసంగ్ గెలాక్సీ ఎం 30 ఎంఆర్పీ రూ 13,999 కాగా రూ 11,999కి సేల్‌లో ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు రెడ్మి 7, రెల్మి వంటి స్మార్ట్ ఫోన్లు సహా స్మార్ట్ టీవీలు, వాచ్‌లు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. -
ట్రెండ్‌కు తగినట్టు ఉంటేనే ఎవరైనా చూసేది
అక్కా! నువ్వు చేయించుకున్నావ్ కదా! నాక్కూడా చేయించవే!! ఏమండీ!నా తోటికోడలు చేయించుకుందిగా!! అత్తా! మీ అమ్మాయికి చేయించారుగా!! వదినా! మా అన్నయ్య నీకు చేయించాడుగా!! పండగ చేసుకునే సమయంలో ఈ చేయించడమేంటీ?! ఇవాళ ధనత్రయోదశి.. ఎల్లుండి పండగ! మరి కన్నుల పండుగ చేయించాలి కదా! ఆభరణాల కొనుగోలులోనే కాదు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడూ అవి కొత్తదనంతో ఆకట్టుకుంటూ ఉండాలి. ఒకసారి నగ కొన్నాక అదెప్పుడూ ట్రెండ్‌లో ఉండాలి. అలాంటి ఆభరణాలు ఎన్నో మెడల్స్‌లో వచ్చాయి. అతివల మనసు దోచేస్తున్నాయి. ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనిపించే డిజైన్స్‌ను ధరించిన మన ‘తారా’మణులు ఆభరణాలకు కొత్త సింగారాలను అద్దుతున్నారు. వీటిలో ఖరీదైనవే కాదు అచ్చూ అలాగే ఉండే ఇమిటేషన్ జువెల్రీ కొంగొత్తగా ఆకట్టుకుంటుంది. ఏ వేడుకకు ఏ ఆభరణమో ఎంపికలోనే ఉంటుంది అసలు అందం. ♦ వరుసలుగా కూర్చిన పేటల హారాలు, జంతువులు, పక్షుల డిజైన్లతో రూపొందించిన హారాలు అన్నింటి ఔరా! అనిపిస్తూనే ఉన్నాయి. ♦ పోల్కీ కుందన్స్ సెట్ సంప్రదాయ వస్త్రాలంకరణ లోనే కాదు వెస్ట్రన్ డ్రెస్సులకు ఓ ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. అందుకే తారల అలంకరణలో తప్పనిసరి ఆభరణం అయ్యింది. ♦ మామిడి పిందెల హారాలు ఏ సందర్భాన్నైనా కాంతివంతంగా మార్చేస్తాయి. కాలాలు మారినా మారని ఈ డిజైన్ అతివలకు ఎప్పుడూ ఆకర్షణీయమే! ♦ మిగతా ఆభరణాలేవీ అవసరం లేకుండా పెద్ద పెద్ద చెవి బుట్టాలు ఏ వేడుకనైనా ప్రత్యేకతను నిలిపేలా చేస్తున్నాయి. ♦ పెద్ద పెద్ద పోల్కీచోకర్ సెట్స్ వేడుకకు ఒక రాణివాసపు లుక్‌ను తీసుకువస్తున్నాయి. అందుకే మన సంప్రదాయ వేడుకలో తప్పనిసరి గ్రాండ్ ఆభరణమైంది. ♦ దేవతా మూర్తుల రూపాలతో డిజైన్ చేసిన ఆభరణాలు (టెంపుల్ జువెల్రీ) సంప్రదాయ వేడుకలో హైలైట్‌గా నిలుస్తున్నాయి. ♦ ముత్యాల సొగసు ఎప్పుడూ కొత్త సింగారాలను మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి వేడుకను ముత్యాల ఆభరణాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ♦ వజ్రాభరణాలు ఏ వయసు వారికైనా తీరైనా ఖరీదైన అందాన్ని తీసుకువస్తాయి. మగువల మనసు దోచే ఆభరణాలలో ఒక్కటైనా వజ్రాభరణం ఉండాల్సిందే! -
వెలుగులు కురిపించే ఆ వరుసే కీలకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం గృహే దీపం నమోస్తుతే ‘‘ గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస ప్రారంభంలో దేవీ నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. త్రయోదశి రోజు రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందు ఉంచాలి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయాలి. నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు స్నానం చెయ్యాలని నరక చతుర్దశి గురించి యమధర్మరాజుని ఉద్దేశించి చెప్పినట్లు భవిష్య పురాణం చెబుతోంది. దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం. శ్రీరాముడు ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్కరోజు పరిపాలన చెయ్యి’ అన్నాడు. ఆ రోజు వెలిగించే దీపాలకే బలిదీపం అని పేరు. వరాహావతారంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్ని బాధపెట్టాడు. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకోగా దేవేంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకుడిని వధించారు. భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమి మీద జీవించే ప్రతివారికి తల్లే కదా. పుత్ర శోకాన్ని మరచి నరకుని పేరు మీద పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ. – డా. గొర్తి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి -
జాగ్రత్త చిన్నదే.. కానీ ఫలితం పెద్దది
దీపావళిలో ఆనందం ఉంది. కాని ఆ పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీపావళి పండుగ నూనెతో, దీపాలతో, మంటతో, భాస్వరంతో ముడిపడి ఉంది. ఇవి కాంతులతో పాటు ఏమరుపాటుగా ఉండే కన్నీళ్లను కూడా మిగులుస్తాయి. ఎన్నేళ్లు గడిచినా కొన్నింటి పట్ల కొందరు నిర్లక్ష్యంగా వుంటారు. పిల్లలకు టపాకాయలు ఇచ్చి బయట వాళ్లు కాలుస్తూ ఉంటే లోపల ఉంటారు. తీరా ప్రమాదం జరిగాక వేదన అనుభవిస్తారు. దీపావళిలో వినోదంతో పాటు జాగురూకత కూడా అవసరం. నివారణ ఇంకా అవసరం. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు చెప్పారు. పాటించండి. సేఫ్‌గా దీపావళి జరుపుకోండి. చర్మం దీపావళి పిల్లలకు ఇష్టమైన పండుగ. ఆ వెలుగులు ఉత్సవం కాస్తా ఒక్కోసారి జీవితంలో చీకట్లు నిండేలా చేయవచ్చు. మనకు ఇష్టమైన బాణాసంచా చర్మాన్ని కాల్చేయవచ్చు. అలా జరగకుండా మేనిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చదవండి. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదంలో చర్మం కాలినా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్సల గురించి తెలుసుకోండి. ప్రమాదాలకు గురికాకుండా నివారణ ఇలా: ► సాధారణంగా బాణాసంచా కాల్చడానికి మనం కొన్ని పెద్ద దీపాలను లేదా కొవ్వొత్తులు ఉపయోగిస్తాం. ఈ కొవ్వొత్తి లేదా దీపాలను వెలిగించే ముందు కాటన్ దుస్తులు ధరించండి. దీపం మీదికి ఒంగే సమయంలో వేలాడేవి కాకుండా కాస్త ఒంటికి అంటిపెట్టుకొని ఉండేలాంటి దుస్తులు మంచిది. చున్నీ లాంటివి సైతం ముందుకు వంగినప్పుడు వేలాడకుండా కాస్త బిగించి కట్టుకోవాలి. పైటను నడుములో దోపుకోవాలి. ► బాణాసంచా కాల్చే సమయంలో మహిళలు తమ జుట్టును క్లిప్ చేసుకోవాలి. వదులుగా వదిలేయకూడదు. ► ఎప్పుడూ ఆరుబయటే బాణాసంచా కాల్చండి. ► టపాసులు కాల్చే సమయంలో ఒక బకెట్ నీళ్లను పక్కనే ఉంచుకోండి. ► పెద్ద శబ్దం వచ్చే బాంబులకు, తారాజువ్వలకు పిల్లలను దూరంగా ఉంచండి. ► కాళ్లు మొత్తం కవరయ్యే లాంటి పాదరక్షలు ధరించండి. ► మీ ఫస్ట్‌ఎయిడ్ కిట్ దగ్గర ఉంచుకోండి. ► విపరీతమైన పొగవచ్చే పాంబిళ్లల్లాంటివి కాల్చకండి. ఈ పొగ మీ చర్మానికీ హాని చేస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ► మీ గాయాన్ని చల్లటినీళ్లతో కడగాలి. ఈ నీళ్లు నల్లా/కొళాయి నుంచి పడుతుండేలా జాగ్రత్త తీసుకోవాలి. కాలిన గాయంపై నుంచి నీళ్లు జారుతుండేలా మగ్ను ఒంపాలి. (కాలిన చోట నీళ్లతో కడిగే సమయంలో ఆ నీరు కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీటిని పారేలా చేసి, మళ్లీ చల్లని నీరు గాయం మీద ఎప్పటికప్పుడు చేరుతుండాలి. అందుకే గాయాన్ని నల్లా / కొళాయి కింద గానీ లేదా మగ్ సహాయంతో గాని కడగాలన్నమాట)జ ఇలా అక్కడి బాణాసంచాలోని పౌడర్ అంతా కడుక్కుపోయేంతవరకు గాయాన్ని కడగాలి. ► కాలిన గాయాల మీద సిల్వర్ సల్ఫాడయజైన్ క్రీమ్ రాయాలి. కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్రమాదానికి లోనైన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. ► కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్లాస్టిక్ సర్జన్ కూడా అవసరం కావచ్చు. కళ్లు టపాసుల కారణంగా కంటికి స్వల్పమైన ఇరిటేషన్ నుంచి కార్నియా రాపిడికి గురవ్వడం, రెటీనా ఇబ్బందులు అంధత్వం దాకా దారి తీయవచ్చు. క్రాకర్లోని రసాయనాల సాంద్రత, కళ్లకు ఎంత బలంగా తాకింది అనే దానిపై గాయం ఆధారపడి ఉంటుంది. కంటి గోడకు అయ్యే గాయం వల్ల కలిగే వాపు (ఓపెన్ గ్లోబ్ ఇంజ్యూరీ) కార్నియల్ గాయంతో పాక్షికంగా ఉబ్బడం (క్లోజ్డ్ గ్లోబల్ ఇంజ్యూరీ) కంటి చుట్టూ నలిగిపోవడం,(కంట్యూషన్ ) కనుగుడ్డు వాపు (లామెల్లర్ లాకెరేషన్) వగైరా సమస్యలతో దీపావళి వేడుక అనంతరం కంటి వైద్యులను సంప్రదించేవాళ్లు ఎక్కువే. దీర్ఘకాలం అలుముకుని ఉండే పొగలో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ స్థాయిలు బాగా పెరగి కంటి దురదలకు, నీరు స్రవించడానికి దోహదం చేస్తుంది. జాగ్రత్తలు... టపాసుల్ని మూసి ఉంచిన బాక్స్‌లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు ధరించవద్దు. ఖాళీ ప్రదేశాల్లో గాగుల్స్ ధరించాలి. ముఖానికి, జుట్టుకి, దుస్తులకు కనీసం ఒక చేయంత దూరం లేదా అడుగు దూరంలో, చూసేటప్పుడు కనీసం 5 మీటర్లు దూరంగా ఉండి చూడాలి. కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు. వేడికి నేరుగా ఎక్స్పోజ్ అయితే తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు కాబట్టి కాంటాక్ట్ లెన్స్‌లు దరించే వాళ్లు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్చేసిన టపాసులలో సగం కాలినవి కూడా ఉండొచ్చు. బకెట్ నీళ్లతో తడిపి పారేయడం మేలు. కంటికి సమస్య వస్తే... కాలుస్తున్నప్పుడు కంటి దురద అనిపిస్తే రుద్దడం గాని నలపడం కాని చేయకూడదు వెంటనే కన్రెప్పలు పైకి ఎత్తి శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. కంటిలో ఏదైనా పెద్ద పరిమాణంలో ఇరుక్కుపోతే తీసేందుకు హడావిడిగా ప్రయత్నించవద్దు. కళ్లు మూసి ఉంచి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. కంట్లో ఏదైనా రసాయనం లాంటిది పడినట్లయితే కంటి దిగువ భాగాల్ని 30 నిమిషాల పాటు తడిపి వైద్యుల్ని సంప్రదించాలి. కంటి మీద ఏదైనా పడినా ఇరిటేషన్ అనిపిస్తే పిల్లలు గబుక్కున కంటిని నలిపేయడం గాయాన్ని పెద్దది చేస్తుంది. ఫోమ్ క్యాప్ వంటి మెత్తని వస్త్రాన్ని కంటి మీద కప్పి వైద్యులను సంప్రదించాలి. నొప్పి నివారణ మందులు సహా ఒటిసి మెడిసిన్స్ ఉపయోగించవద్దు.. ఆయింట్మెంట్ అప్లయ్ చేస్తే కంటి పరీక్ష చేసేందుకు అది అడ్డంకిగా మారుతుంది. ఈఎన్టీ పెద్ద శబ్దంతో పేలే టపాసుల వల్ల కేవలం చెవులకు మాత్రమేగాక మాత్రమే గాక అన్ని రకాలుగా నష్టం జరగవచ్చు. ఉదాహరణకు పెద్ద పెద్ద శబ్దాలు ప్రెగ్నెంట్స్‌లో గర్భస్రావం కలిగించవచ్చు. వయోవృద్ధుల్లో గుండెపోటుకూ దారితీయవచ్చు. ► ఒక్కోసారి దూరం నుంచి వినిపించే పెద్ద పేలుడు శబ్దం కంటే దగ్గర నుంచి వినిపించే చిన్న చప్పుడే చెవికి ఎక్కువ నష్టం చేయవచ్చు. అదే అంతకంటే తక్కువ శబ్దమే చెవికి మరింత దగ్గరగా అయితే దానివల్ల నష్టం ఎక్కువ ఉండవచ్చు. ► మానవులకు హాని చేసే శబ్దాలను రెండురకాలుగా ఉంటాయి. మొదటిది ఇంపల్స్ సౌండ్, రెండోది రెండోది... నిత్యం శబ్దాలు వింటూ ఉండటం. దీని వల్ల కలిగే నష్టాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. దీపావళి సమయంలో వినిపించే శబ్దం ఇంపల్స్ సౌండ్. దీని వల్ల కింద పేర్కొన్న ఏవైనా సమస్యలు రావచ్చు. అవి... ► అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. ► చెవిలో నొప్పి, గుయ్య్బరనే శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు. ► చెవిలోపలి ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం. ► నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి శాశ్వత నష్టమూ జరగవచ్చు. టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్: ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్’గా పేర్కొనవచ్చు. అప్పటికీ చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది. పెద్ద శబ్దం తర్వాత చెవులు వినిపించకపోతే అప్పుడు ఆ చెవిలో ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె ఎట్టిపరిస్థితుల్లో వెయ్యకండి. తప్పక ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. ఆయన మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు. ముక్కుకు, గొంతుకు హాని – టపాసుల పొగతోనూ ముక్కు, గొంతు, స్వరపేటికలో మంటగా రావచ్చు. అందుకే పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. ► బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం చేయకూడదు. రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని వైద్య పరిభాషలో ఎపిస్టాసిస్ అంటారు. ఇలా బాణాసంచాలోని రసాయానాలు చేతులకు అంటినప్పుడు వాటిని ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచాలి. అదే చేతులతో ముఖాన్ని, కళ్లనూ రుద్దుకోవద్దు. జంతువుల సంరక్షణకు సూచనలు... పటాసుల నుంచి జంతువులను రక్షించడానికి పెటా లాంటి పెట్ కేర్ పీపుల్ మాత్రమే కాకుండా, మన లాంటి మామూలు మనుషులూ ముందుకు రావాలి. మన వినోదం కోసం కాల్చే బాణాసంచా వాటికీ చేటు తెచ్పిడుతుంది. అవి బెదరడం వల్ల మనకే ముప్పు ముంచుకురావచ్చు. ఉదాహరణకు ఒక ఆవు గోడపై పోస్టర్‌ను తింటూ ఉందనుకుందాం. లేదా రోడ్డు పక్కన కూర్చొని తిన్నదాన్ని ప్రశాంతంగా నెమరేసుకుంటుందని అనుకుందాం. పటాసు పేలిన శబ్దంతో అది బెదిరిపోయి రోడ్డు మీదకు అకస్మాత్తుగా వచ్చేస్తుంది. దాంతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురికావచ్చు. ప్రమోదం ప్రమాదం కాకుండా ఉండటానికి పశువైద్య నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివి... ► పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరిపోయే ప్రమాదం ఎక్కువ. ఇది ఎంతగా ఉంటుందంటే... దీపావళి నాడు మాత్రమేగాక దీర్ఘకాలం పాటు వాటికి ఆ బెదురు తగ్గదు. చిన్న చిన్న శబ్దాలకే వణికిపోతుంటాయి. లేగదూడలూ, బర్రెకుర్రలూ ఇదే ప్రమాదానికి గురవుతాయి. వీధుల్లో తిరిగే పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ► ఒక ఒక్కోసారి థౌజెండ్‌వాలా లాంటివి చాలా సేపు అదేపనిగా చిటపటలాడుతూ మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. ఒక్కోసారి వాటి గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు. ► పెద్దగా పేలే శబ్దాలతో కక్కులకు సౌండ్ ఫోబియా వచ్చి అన్నం తినడం కూడా మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు కుక్కలాంటి జంతువులను, పేలుళ్లు తినిపించే ప్రాంతం నుంచి కాస్త శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి. వాటికి ఇష్టమైన బొమ్మలతో వాటిని ఆడిస్తూ, శబ్దాల నుంచి దృష్టి మళ్లించేలా చేయాలి. ఇక వాటికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. ► చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్‌ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీస్తే పిల్లపిట్టల ఉసురూ మనం పోసుకున్నట్లే! అందుకే గట్టిగా పేలిపోయే శబ్దాలు వచ్చే టపాసులు కాకుండా వెలుగులు చిమ్మే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. – డాక్టర్ ఎం.వంశీధర్, రీజనల్ మెడికల్, డైరెక్టర్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
చిన్న మార్పుతో.. ఇల్లంతా వెలుగుల వెన్నెలే..!
≈ ఇమిటేషన్ జువెలరీ, ఫ్యాషన్ జువెలరీ ఇక ధరించడానికి వీలు లేకుండా ఉన్నా, వాడి వాడి బోర్ కొట్టేసినా వాటిని ఏం చేస్తున్నారు? పండగ వేళకు ఇదిగో ఇలా మార్చేయండి. ఇంటికి, కంటికి కళ పెరుగుతుంది. ≈ ఎన్నో దీపాలతో అలంకరించే వెలుగుల దీపావళి ఇంకా అందంగా మెరవాలంటే.. దీపాలు పెట్టే అడుగు భాగం మీ పాత ఇమిటేషన్(గిల్టు) ఆభరణాలతో తీర్చిదిద్దండి. కొత్త కాంతితో మెరిసిపోతూ కనులకు విందు చేస్తాయి. ≈ రకరకాల రంగు పూసలు ఎన్నో ఉంటాయి. వాటిని కలిపి దండలా గుచ్చి గుమ్మానికి వేలాడదీస్తే! ఇలా అందంగా ఉంటుంది. లేదంటే ప్లెయిన్‌గా ఉండే గోడకు హ్యాంగ్ చేస్తే చాలు. ≈ ప్లెయిన్ చార్ట్ తీసుకొని పెద్ద చమ్కీలు, పూసలు, ముత్యాలు, కుందన్స్‌ను అతికించి వేలాడదీస్తే.. వాల్ హ్యాంగింగ్ ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా! ≈ పాతవైన ఎంబ్రాయిడరీ డ్రెస్సులు, చీరలు, లెహంగాలకు అందమైన డిజైన్స్ ఉంటాయి. వాటిని అలాగే పడేయకుండా జాగ్రత్తగా కట్ చేసి, పూలతో కలిపి రంగవల్లులను దిద్దితే.. పండగ కళ రెట్టింపు అవకుండా ఉండదు. ≈ ఇలాంటి ఎన్నో ఐడియాలను మీరూ చేయగలరు. ప్రయత్నించండి. పండగ ఆనందాన్ని వెయ్యింతలు చేయండి. -
దీపావళికే వెలుగులద్దిన పాటలు..
దీపావళి.. తెలుగు వారి గుమ్మం ముంగిట ఆనంద తోరణాలుగా ప్రమిదలు వెలుగులు కురిపిస్తుంటాయి. ఇంటి ముందు పేల్చే చిచ్చుబుడ్లు వారి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా నిలుస్తాయి. రాకెట్లు వారు అందుకోవాల్సిన గమ్యాలను గుర్తు చేస్తాయి. భూచక్రం మన మనసు చేసే పరిపరి ఆలోచనలకు ప్రతిబింబంగా మారుతాయి. ఇలా ఎన్నో పరమార్థాలు దాచుకున్న పండగే దీపావళి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. ఇక దీపావళి ప్రత్యేకతను, దాని విశిష్టతను చెప్పడానికి మాటలు సరిపోవనుకున్నారో ఏమో కానీ సినీ కవులు పాటల్లో దాని పరమార్థాన్ని ఇనుమడింపజేశారు. తెలుగునాట దీపావళిపై వచ్చిన పాటలు తక్కువే అయినప్పటికీ వాటి మహత్యం మాత్రం చిన్నపాటిది కాదు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో వచ్చిన పాటల వైభవం ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ.. విచిత్రబంధం సినిమాలో ఆచార్య ఆత్రేయ రాసిన ‘జీవితమే ఒక దీపావళి.. చీకటి వెలుగుల రంగేళీ’. ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని దీపావళి పాట ఇది. తరాలు మారుతున్నా ఆదరణ తగ్గని పాట అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీపావళిని ఇముడ్చుకున్న మరిన్ని పాటలు.. దీపావళి - వచ్చింది నేడు దీపావళి.. పరమానంద మంగళ శోభావళి షావుకారు - దీపావళి.. దీపావళి... ఇంటింట ఆనంద దీపావళి అంటూ సంతోషంలో పాడుకోగా.. దీపావళి, మా ఇంట శోకాంధ తిమిరావళి అంటూ ఇదే సినిమాలో బాధలోనూ పాడుకున్నారు. భలే రాముడు - ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా, ఆ భాగ్యము రాదా రుణానుబంధం - దీపాల పండుగ.. ఉన్నోళ్ళ డబ్బంతా దండుగ.. ఆ తరం నుంచి ముందుకు వస్తే.. మామగారు - వెయ్యేళ్ల నిత్యమైన దీపావళి.. ఏనాడూ వెళ్లిపోని దీపావళి.. ఇయ్యాలె అచ్చమైన దీపావళి పెళ్లికానుక - ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడ.. ఆనందం పొంగేనోయి దీపావళి.. అని సంతోషంలో పాడుకోగా, ఆడేపాడే పసివాడ.. అమ్మా లేని నినుచూడ కన్నీటి కథ ఆయె దీపావళి అంటూ బాధలోనూ మార్చి పాడుకున్నారు. విజయదశమి - దీపావళి.. రెబల్ - చెప్పలేని ఆనందం.. దివాళీ దడ - దీవాళీ.. దీపాళీ.. ఇవే కాకుండా దీపావళి పండగపై ప్రత్యేక ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. అదీగాక 'దివ్వి దివ్వి దీపావళి.. దిబ్బు దిబ్బు దీపావళి..' అంటూ పాడుకునే జానపద పాటలు మరెన్నో.. సినిమాల్లో దీపావళి.. ‘దీపావళి’ టైటిల్తోఇప్పటికి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటిది 1960లోఎన్టీఆర్,సావిత్రిలు కృష్ణుడు సత్యభామలుగా నటించిన చిత్రం ‘దీపావళి’. ఇది పండగ ప్రాశస్త్యాన్ని చెప్పే పురాణ కథ .మరొకటి 2008లో వేణు హీరోగా వచ్చిన దీపావళి. దీపావళి సీన్లతో గట్టెక్కిన సినిమాలు ఉన్నాయి. కథను మలుపు తిప్పడానికి దీవాళిని వాడుకున్న చిత్రాలూ ఉన్నాయి. జనతా గ్యారేజ్‌లోనూ దీపావళిని పర్యావరణహితంగా ఎలా జరుపుకోవాలో హీరో సందేశాన్నిస్తాడు. పసి పిల్లోడు నుంచి పడుచు పిల్ల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి పండగకు ప్రాణం పోసే పాటలు, చిత్రాలు మరెన్నో రావాలని ఆశిద్దాం. -
అసురుడి వరం.. తల్లి చేతిలో మరణం
ప్రతి ఇంటా దీపాల వెలుగులు నింపే పండుగ దీపావళి. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానం మీద జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీక ఈ పండుగ. దీపావళి పండుగ అంటే ప్రముఖంగా గుర్తొచ్చేవి పట్టుబట్టలు, పిండివంటలు, బాణాసంచా, దీపాల కాంతులు. దేశ ప్రజలు తమదైన శైలిలో పండుగను ఒక్కో చోట ఒక్కో విధంగా చేసుకుంటారు. ఉత్తర, దక్షిణ భారత ప్రజలు తమదైన సంప్రదాయాలతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. అయితే ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో పండుగ జరుపుకునే పద్ధతులలే కాదు అందుకు గల కారణాలు కూడా వేరు. పండుగ ఎందుకు జరుపుకుంటున్నారనే దానిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథ ప్రచారంలో ఉంది. ప్రముఖంగా ప్రచారంలో ఉన్న రెండు కథలు.. దక్షిణ భారతంలో.. అసురుడి వరం.. తల్లి చేతిలో మరణం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ఉండగా వరాహస్వామి, భూదేవిలకు అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మిస్తాడు. తప్పస్సుతో శివుడి చేత వరం పొంది దేవమానవులను చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. నరకాసురుడు తల్లి చేతుల్లోనే చంపబడాలనే వరం పొందిన కారణంగా ఎదురులేని వాడై లోకాలను ముప్పతిప్పలు పెడుతుంటాడు. దీంతో భయాందోళనకు గురైన దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణువేడుతారు. వారికి అభయమిచ్చిన విష్ణువు భూదేవీ సమేతంగా శ్రీ కృష్ణ సత్యభామలుగా భూలోకంలో జన్మిస్తారు. నరకుని దురాగతాలు పెచ్చుమీరిన అనంతరం శ్రీకృష్ణుడు నరకుడిపై యుద్ధం ప్రకటిస్తాడు. భార్య సత్యభామను వెంటతీసుకెళతాడు. అక్కడి ఇరు వర్గాలకు భీకర యుద్ధం జరుగుతుంది. చివరకు నరకుడి వరం కారణంగా తల్లి అయిన సత్యభామ చేతిలోనే అతడు మరణిస్తాడు. దీంతో అతడి చెరలో ఉన్న దేవమానవులకు విముక్తి దొరకుతుంది. నరకాసురుడు మరణించాడన్న ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి, బాణాసంచా పేల్చి పండుగ చేసుకున్నారు. ఉత్తర భారతంలో.. లంకను గెలిచి.. వనవాసం ముగిసి.. శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారమైన రామచంద్రుడు.. సీతను అపహరించిన రావణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో రావణుడు మరణిస్తాడు. అప్పటికే రాముడి 14 ఏళ్ల వనవాసం ముగుస్తుంది. దీంతో రాముడు.. సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా అయోధ్యకు తిరిగి వెళతాడు. అనంతరం రాముడు పట్టాభిషిక్తుడవుతాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకున్నారు. -
అందుకే ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు వెలిగిస్తారు
దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీమాతకు చాలా ప్రాశస్య్తం ఉంది. దీపావళి పండుగ మూడో రోజున లక్ష్మీదేవి తన భక్తుల ఇంటికి వెళుతుంది. అమ్మవారిని ఇంటిలోకి రమ్మనడానికి ప్రతీకగా భక్తులు తమ ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించి లోనికి ఆహ్వానిస్తారు. దేశంలో భిన్న రూపాలలో, అవతారాలలో కొలువుదీరిన లక్ష్మీమాతకు పూజ చేస్తారు. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లతో కూడా అమ్మవారిని పూజిస్తారు. సంపద, సుఖసంతోషాలు, సతానం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి సందర్భంగా దేశంలోని ప్రసిద్ధమైన లక్ష్మీదేవి ఆలయాలు ఇవి.. 1) లక్ష్మీ నారాయణ మందిరం( బిర్లా మందిరం), న్యూఢిల్లీ ఈ ఆలయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా మనకు దర్శనమిస్తారు. ప్రసిద్ధ మందిరంగానే కాక, ఢిల్లీలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పేరొందింది. ఈ మందిరంలో దీపావళితో పాటు శ్రీ కృష్ణుని జన్మష్టామి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాక గుడి చుట్టూ శివుడు, రామభక్త హనుమాన్, వినాయకుడు, దుర్గ మాత మందిరాలతో పాటు చిన్న బౌద్ధ మందిరం కూడా ఉంది. 2)శ్రీపురం గోల్డెన్ టెంపుల్, వెల్లూర్ ఈ మందిరం తమిళనాడులోని (వేలూరు) వెల్లూర్‌లో ఉంది. గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. మలైకుడి ప్రాంతానికి దగ్గర్లోని చిన్న కొండపై లక్ష్మీదేవి కొలువై ఉంది. గర్భగుడి బంగారంతో కప్పబడి, సువర్ణ రంగులో మిళితమై ఉండటం చేత దీనికి బంగారు గుడి అనే మరో పేరుంది. దేశంలోని అతిపెద్ద మందిరాలలో శ్రీపురం ఆలయం ఒకటి. 3)మహలక్ష్మీ మందిరం, కొల్హాపూర్ హిందువుల పవిత్ర 108 శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ ప్రముఖ తీర్ధ స్థలంగా ప్రసిద్ధిగాచింది. నవరాత్రుల సందర్భంగా అంబాదేవిగా కొనియాడబడే ఈ దేవి దర్శనానికి.. భక్తులు కొల్హాపూర్‌కు తండోపతండాలుగా క్యూ కడతారు. స్వయంగా లక్ష్మీదేవి నడియాడిన నేల కావడంతో... విష్ణుదేవునికి ఈ ఆలయక్షేత్రం అంటే చాలా ఇష్టమని భక్తుల నమ్మిక. చాలుక్యులు నిర్మించిన ఈ మందిరం మహారాష్ట్రలో పూనేకు సమీపంలో ఉంది. 4)అష్టలక్ష్మీ మందిరం, చెన్నె ఈ ఆలయంలో లక్ష్మీమాత ఎనిమిది రూపాలకు పూజ చేస్తారు. అష్టలక్ష్మి - ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అవతారాలలో దర్శనమిస్తుంది. అష్టలక్ష్మీ ఆలయం చెన్నెలోని ఇలియట్స్ బీచ్\ బీసెంట్ బీచ్‌కు సమీపంలో ఉంది. సంపద, జ్ఞాన దేవతయిన అష్టలక్ష్మి, భక్తుల కోర్కెలు నెరవేర్చే దేవతగా పేరొందింది. 5)లక్ష్మీదేవి మందిరం, హసన్ తొలితరం హోయసలుల నిర్మాణ శైలి ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. కర్ణాటకలోని హసన్ దగ్గర ఉన్న ఈ ఆలయంలో ప్రాచీన వాస్తుకళ మనకు కనిపిస్తుంది. 6)మహలక్ష్మీ మందిరం, ముంబై మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయం ముంబైవాసులకు అత్యంత ప్రీతి పాత్రమైంది. ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు దర్శనమిస్తాయి. హార్న్బీ వెల్లార్డ్ నిర్మాణం చేపడుతున్నపుడు, పాథారే ప్రభు అనే ఇంజనీరుకు వర్లి సమీపంలో దేవి విగ్రహం ఉందనే కల వస్తుంది. దీంతో అక్కడి పరిసరాల్లో తవ్వకాలు చేపట్టిన అతనికి లక్ష్మీమాత విగ్రహం దొరుకుతుంది. వెంటనే ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. -
మట్టే కదా అని నెట్టేయకండి.. చూస్తే ఫిదానే
భారత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా పండగలు విరాజిల్లుతున్నాయి. దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుతూ.. ఎన్నో అనురాగాలను, ఆప్యాయతలను పంచి పెడుతాయి ఈ పండగలు. అన్ని పండగల్లో దీపావళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుంగా ప్రపంచంలోనే ఎక్కువమంది జరుపుకునే పండగ దీపావళి. దీపావళి పేరు వినగానే అందరికీ గుర్తోచ్చేది దీపాల కాంతుల్లో వెలిగే జిగేలులు. ఆకాశమంతా విరజిల్లే సంబరాలు.. ఇంతటి వైభవంగా జరుపుకునే ఈ పండగలో మెయిన్ అట్రాక్షన్ మహిళలు. భక్తి, శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించడం ఈ పండడ ప్రత్యేక. అయితే అలాంటి మగువల అందాలకు మరింత వన్నే చేకూర్చేవి వారి అలంకరణ. ఈ అలంకరణలో మందుగా గుర్తొచ్చేవి ఆభరణాలు. జ్యువెల్లరీ లో ముఖ్యంగా బంగారం, వెండి, డైమండ్,ముత్యాలు వగైరా. వీటితో పాటు ఈ మధ్య కాలంలో థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఇవి కూడా పాతబడిపోయాయి. ప్రతీసారి ఇవే ధరించడం మహిళలకు కాసింత రోటీన్‌గా అనిపిస్తోంది. అయితే ప్రతి పండక్కి ఒకింత కొత్తగా, మరింత నూతనంగా అలంకరించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే ఈ సారి వీటికి భిన్నంగా మట్టితో తయారు చేసినవి ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారు. నగరానికి చెందిన కృష్ణలత గత కొంత కాలంగా వీటి పైనే దృష్టి పెట్టింది. మట్టితో ఒకటి కాదు రెండు ఏకంగా వందల రకాల వస్తువులను తయారు చేస్తుంది. అభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్, బొమ్మలు, గృహాలంకరణ వస్తువులతో పాటు ఏ పండగకైనా ఉపయోగించే వస్తు సామాగ్రిని ఇలా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. తన స్వహస్తాలతో తయారైన ఈ ఆభరణాలను చూసి ముచ్చటపడటమే కాక, ధరించి ఆహా అనాల్సిందే. పండగలకు ఉపయోగించే ప్రతి వస్తువులలో సాధారణంగా ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ పెనుభూతంగా తయారవుతూ మానవ మనుగడకు తీవ్ర ప్రమాదంగీ తయారవుతోంది. దీంతో ప్లాస్టిక్‌ను తగ్గించి పర్యావరణానికి మేలు జరిగేలా మట్టితో తయారు చేసిన వస్తువులను ఈ ప్రత్యేక పండగలో ఉపయోగిద్దాం. చెడుపై మంచి గెలిచినా విజయానికి దీపావళి జరుపుకుంటారన తెలిసిందే. అలాగే ప్రస్తతం ప్రపంచంలో చెడుగా వ్యాప్తి చెందుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మనం కూడా ఓ మంచి పనికి శ్రీకారం చుడుదాం. పరిచయం... అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కృష్ణలతకు మట్టితో వివిధ వస్తువులు తయారు చేయడం అలవాటు. అనంతరం అమెరికా నుంచి నగరానికి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా మళ్లీ మట్టితో అభరణాలు, తయారు చేయడం ప్రారంభించారు. తాను ఏం చేసిన పర్యావరణానికి హానీ కలగకుండ ఉండాలి. అంతేగాక కొత్తగానూ, అందరూ మెచ్చేలా ఉండాలని భావించారు. కేవలం తన అభిరుచితోనే ప్రారంభించిన ఈ పనిని 2014లో ఊర్వి పేరుతో ఓ బ్రాండ్‌ను స్థాపించి మట్టితో అనేక వస్తువులను తయారు చేసి బిజెనెస్ ప్రారంభించారు. మట్టి మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అనేక పదార్ధాలతో తయారు చేసే వస్తువులు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. తయారీ విధానం... అభణానికి కావల్సినంత మట్టిని తీసుకొని మొదట దానిని ఎండబెట్టాలి. ఆ తరువాత మట్టిని 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. అప్పుడు అది స్టోన్‌లా మారుతుంది. దానిని మనకు కావల్సిన కలర్స్ వేసుకొని నచ్చిన డిజైన్‌లో జ్యువెల్లరీ తయరు చేసుకోవచ్చు. ఏంటీ ప్రత్యేకత మట్టితో తయారు చేయడం. ఎలాంటి రసాయనాలను వాడకపోవడం ఫ్యాషన్‌కు తగ్గట్టుగా తయారు చేయడం పూర్తిగా పర్యావరణ హితమైనవి, కాలుష్యానికి ఆమడ దూరం వెండి,బంగారం వంటి అభరణాలతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం దీపావళికి ప్రత్యేకంగా నూతన వెరైటీలతో జ్యువెల్లరీ(నగలు, చెవి కమ్మలు) తయారీ. అదే విధంగా దీపావళికి ప్రతేక ఆకర్షణ ప్రమిదలు. సాధారణంగా వీటిని మట్టితోనే తయారు చేస్తారు. ఈ మట్టిలో సైతం అనేక ఆకృతులలో అంటే గణేష్ ప్రమిదలు, నెమలి ఆకార ప్రమిదలు, ఏనుగు ప్రమిదలు వంటివి చేస్తోంది. వీటితోపాటు గుమ్మానికి వేలాడదీసే ప్రమిదలు. ఆవు పేడ (కవ్ డంగ్)తో తయారు చేస్తుంది. అంతేగాక పండక్కి వచ్చే అతిథుల కోసం వాయినంగా ఇచ్చే కుంకుమ భరణిని మట్టితో తయారు చేయడం. తులసి కోట వంటివి ఈ దీపావళికి ప్రత్యేకం. ధరలు.. కృష్ణలత తయారు చేసిన ప్రతి వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్క దానికి ఒక్కో ధర ఉంటుంది. అధిక ధరలకు కాకుండా తయారీకి అయిన ఖర్చుతో కలిపి అందరికి అందుబాటులో ఉండే ధరకు వీటిని మనం కొనవచ్చు. ఆవు పేడ ప్రమిదలు- రూ.140 నుంచి రూ. 240....డిజైనర్ ప్రమిదలు-రూ. 320.... నగలు- రూ.450 నుంచి మొదలు... చెవి కమ్మలు రూ. 120 నుంచి ప్రారంభం. సో ఇంవేందుకు అలస్యం వెంటనే కొనేయండి. వీటిని మీ సొంతం చేసుకోవాలంటే అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో లాగిన్ అవ్వండి. లేదా నేరుగా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి.